కెనడాలో తొలి తెలుగు సాహితి సదస్సు | Telugu Sahithi Sadassu Held In Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో తొలి తెలుగు సాహితి సదస్సు

Published Sat, Sep 25 2021 6:16 PM | Last Updated on Sat, Sep 25 2021 6:22 PM

Telugu Sahithi Sadassu Held In Canada - Sakshi

కెనడా : సెప్టెంబర్ 25, 26 తేదిల్లో కెనడా ప్రధాన కేంద్రంగా మొదటి కెనడా తెలుగు సాహితి సదస్సు, 12వ అమెరికా సాహితి సదస్సులను నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా జరగనున్న ఈ వేడుకల్లో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సాహితీ సదస్సు నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా  బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, భువన చంద్ర, సుద్దాల అశోక్ తేజ, బలభద్రపాత్రుని రమణి తదితరులు హాజరుకానున్నారు.


ఈ సదస్సు నిర్వాహాణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి (కెనడా)లతో పాటు మొత్తం ఎనిమిది  సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సదస్సులో, సుమారు 100 మంది వక్తలూ పాల్గొంటున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంకి ఈ సదస్సుని అంకితమిచ్చారు.  

చదవండి : అక్కినేనికి ఘన నివాళి అర్పించిన ప్రవాస భారతీయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement