Mother In ICU Son Stranded In USA seeking KTR To Help For Urgent Visa - Sakshi
Sakshi News home page

ఐసీయూలో తల్లి.. కెనడాలో కొడుకు.. ప్లీజ్‌ హెల్ప్‌

Published Thu, Jan 27 2022 3:24 PM | Last Updated on Thu, Jan 27 2022 4:45 PM

Mother In ICU Son Stranded In USA seeking KTR To Help For Urgent Visa - Sakshi

ఐసీయూలో క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్న కన్నతల్లిని చూసేందుకు కరోనా ఆంక్షలు ఆ కొడుక్కి అడ్డంకిగా మారాయి. దీంతో దేశం కాని దేశం నుంచి మాతృదేశంలో కన్నతల్లిని చేరుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఓ యువకుడు మంత్రి కేటీఆర్‌ను విన్నపం చేసుకున్నాడు. వరంగల్‌ నగరానికి చెందిన ఎం వినయ్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని కరోలినాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కెనడా సిటిజన్‌షిప్‌ ఉంది. ఇటీవల ఇండియాలో ఉన్న అతనికి తల్లికి అనారోగ్య సమస్యలు తలెత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ప్రస్తుతం కెనడియన్‌ సిటిజన్స్‌కి ఈవీసాలను రద్దు చేశారు. దీంతో అమెరికాలో ఉన్న వినయ్‌ ఇండియాకి రావడం వీలుపడటం లేదు. దీంతో ఆస్పత్రి వర్గాలు అందించిన సర్టిఫికేట్‌ని జత చేస్తూ తనకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరాడు వినయ్‌. వినయ్‌ ట్వీట్‌కి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వినయ్‌ అర్జంటుగా ఇండియా వచ్చేలా సాయం చేయాలంటూ యూఎస్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబీసీ, ఇండియా వీసా వాషింగ్టన్‌ డీసీలతో పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లను ట్విట్టర్‌లో కోరారు. వినయ్‌ త్వరగా వీసా రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

చదవండి: ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు అలర్ట్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement