Entries
-
Sakshi Excellence Awards: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం. అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతి భావంతులను గుర్తించి 'సాక్షి'ఎ క్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. 'సాక్షి' వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన 'జ్యూరీ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా 'సాక్షి' ఎక్స లెన్స్ అవార్డుల కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2022కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 15, 2023 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించ అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సం స్థల తరపున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి జ్యూరీ ప్రత్యేక ప్రశంస' కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించ డం, సేవలను కొనియాడటం, సాధనను అభి. సందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని 'సాక్షి' అభిలషిస్తోంది. 'సాక్షి' చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23256134 నంబర్‌పై గాని మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com (చదవండి : సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం) కేటగిరీలు ఇలా: ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– NGO యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– ఎడ్యుకేషన్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– సోషల్ సర్వీస్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – NGO -
తెలుగు సాహితి సదస్సు.. వక్తలకి ఆహ్వానం
కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి. కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి పెద్ద ఎత్తున టొరాంటో వేదికగా 2021 సెప్టెంబరు 25, 26 తేదీల్లో తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10:00 (EST) నుంచి సాయంత్రం 6:00 (EST) వరకు ఈ సదస్సు జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ సదస్సును వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా దేశాల వక్తల ప్రసంగ ఎంట్రీలను 2021 జులై 31 లోగా ఈ కింది ఈమెయిట్స్కి పంపాల్సి ఉంటుంది. sadassulu@gmail.com , vangurifoundation@gmail.com . ఈ సదస్సు నిర్వహాణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక (కెనడా), టొరంటో తెలుగు టైమ్స్ పత్రిక, ఆటవా తెలుగు సంఘం, తెలుగు వాహిని (సాహిత్య వేదిక, టొరంటో), అంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు కల్చురల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, కేల్గరీ తెలంగాణా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సదస్సు ఈ సందర్భంగా అమెరికా, కెనడా దేశాల నుంచి ఎంపిక అయిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారం అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సులో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) 2017–18 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఫారెస్ట్రీ) నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు గుర్తించిన ఇంటర్మీడియెట్ లేదా తత్సమానమైన విద్యలో బయోలజీ (వృక్ష, జంతుశాస్త్రం), భౌతిక, రసాయనశాస్త్రాల ప్రయోగాల్లో పొందిన మార్కులను ఆధారంగా చేసుకొని మెరిట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే కళాశాల రూపొందించిన దరఖాస్తు ఫారంను వెబ్సైట్ ఠీఠీఠీ.జఛిటజ్టీట.జీnలో నింపి కావలసిన సర్టిఫికెట్ కాపీలు అప్‌లోడ్‌చేయాలని, జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.250 రుసుం ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15 కాగా, రూ.1000 ఫైన్‌తో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ ఫోన్ 8332975516/8333924137 లేదా ఈ మెయిల్ ్టటజఛిటజీ2016ఃజఝ్చజీl. ఛిౌఝను సంప్రదించవచ్చని ఎఫ్సీఆర్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. -
2017లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబాయి : స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ ఏ దేశమంటే. ఠక్కున అందరికీ గుర్తొచ్చేంది భారత్ మార్కెటే. దీంతో దేశీయ మార్కెట్లో ఎలాగైనా తమ పాగా వేసుకోవాలని ఒక్కటేమిటి అన్ని దేశాల స్మార్ట్‌ఫోన్ కంపెనీల చూపు మనవైపే నిలిచింది. కుప్పలు తెప్పలుగా స్మార్ట్ఫోన్లు మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోటీ తీవ్రతరమైంది. ఈ పోటీని తట్టుకుని నిల్చోవాలంటే మార్కెట్లో తమ ముద్ర వేసుకుని తీరాల్సిందే. అలా లేదంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయి వారి దేశాలకు తరలి వెళ్లాలి. 2017 ఆర్థికసంవత్సరంలో అదే జరగబోతుందట. 2017లో మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ కంపెనీల కంటే ఇక్కడి నుంచి బయటపడే కంపెనీలే ఎక్కువగా ఉండబోతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం భారత్‌లో పోటీ తీవ్రతరం కావడమేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత రెండేళ్లుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఆశించిన స్థాయిలో రెవెన్యూలు ఆర్జించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ నుంచి వైదొలగడమే మంచిదని ఆ కంపెనీలు భావిస్తున్నాయట. 2017లో ఏడు కంపెనీలు భారత్‌లోకి ప్రవేశిస్తే, తొమ్మిది కంపెనీల మేర ఇక్కడి నుంచి వైదొలుగుతాయని అంచనావేస్తున్నట్టు కౌంటర్ పాయింట్ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 100కు పైగా స్మార్ట్‌ఫోన్ ప్లేయర్స్ ఉండగా.. వాటిలో టాప్ 15 కంపెనీల చేతిలోనే 90 శాతం మార్కెట్ షేరు ఉంది. మార్కెట్ నుంచి వైదొలిగే ట్రెండ్‌కు సంకేతంగా మైక్రోసాప్ట్, ఏషర్, ఫికామ్ కంపెనీలు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయని వివరించింది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదుచేసిన మార్కెట్, 2016లో 6 శాతం వృద్ధినే నమోదుచేసిందని తెలిపింది. -
మీరూ కావచ్చు 'నేషనల్ జియోగ్రాఫిక్' విజేత
రకరకాల ప్రాంతాల్లో పర్యటించడం మీకు అలవాటా? అయితే వెంటనే వాటికి సంబంధించిన ఫొటోలను ఓసారి చెక్ చేయండి. అందులో సెల్ఫీలు, సొంత ఫొటోలు కాకుండా మీరు వెళ్లిన ప్రాంత విశిష్టతను తెలిపే మంచి ఫొటోలు ఉంటే అదృష్టాన్ని పరీక్షించుకోండి. 'నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్- 2016' మీకు స్వాగతం పలుకుతోంది. ఫొటోతోపాటు ఆ పర్యటన అనుభవాలను కూడా పంపాల్సి ఉంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఏటా నిర్వహించే ఈ పోటీలో విజేతలుగా నిలిచేవారికి మంచి బహుమతులు ఇస్తారు. అంతకంటే గొప్ప పేరుకూడా లభిస్తుంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి ఎంట్రీలు వస్తున్నాయని, మే 27, 2016 వరకు వాటిని స్వీకరిస్తామని ఆ తర్వాత నిర్ణాయక కమిటీ విజేతను ఎంపిక చేస్తుందని సంస్థ పేర్కంది. పూర్తి వివరాల కోసం http://travel.nationalgeographic.com/photographer-of-the-year-2016 లింక్ ను క్లిక్ చేయండి. ఇప్పటివరకు పోటీదారులు పంపిపన ఫొటోల్లో కొన్ని బెస్ట్ ఫొటోస్ మీ కోసం.. -
గ్రామాన్ని మింగేసింది.. అవార్డు గెలిచింది!
ఇండోనేషియాలోని సినబంగ్ అగ్నిపర్వతం బద్దలై.. ఆకాశమంత ఎత్తుకు బూడిదను, లావాను వెదజల్లినప్పుడు.. అవి జెరాయా అనే గ్రామాన్ని మింగేయడానికి వస్తున్నప్పుడు క్లిక్‌మనిపించిన చిత్రమిది. ఈ ఫొటో ఇంత అద్భుతంగా ఉంది కాబట్టే 13వ స్మిత్సోనియన్ ఫొటో కాంటెస్ట్‌లో ఓవరాల్ గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. ఈ పోటీకి మొత్తం 168 దేశాల నుంచి 46 వేల ఎంట్రీలు రాగా.. ఫొటోగ్రాఫర్ ఆల్బర్ట్ ఇవాన్ తీసిన ఈ చిత్రం అన్ని విభాగాలు కలిపి మొదటి బహుమతిని గెలుచుకుంది. 2015 జూన్ 26న ఈ ఫొటోను తీశారు. -
ఎంట్రీలు అదుర్స్
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులను సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2014’ ప్రక్రియ కొనసాగుతోంది. సంగీతం-నృత్య రంగాలకు సంబంధించి ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిన ఎంట్రీలను... షార్ట్‌లిస్ట్ జ్యూరీ సభ్యులు- నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, అల్లాణి శ్రీధర్, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ శుక్రవారం పరిశీలించి స్కోర్ ఇచ్చారు. ఈ స్కోర్ ఆధారంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ఐదు బెస్ట్ నామినీలను ఫైనల్ జ్యూరీకి పంపనుంది. తుది విజేతను ఫైనల్ జ్యూరీ ఎంపిక చేయనుంది. ‘ఎంట్రీలలో దాదాపు 70 శాతం బాగున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ఎంట్రీలు రావడం శుభపరిణామం’ అని సినీ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు సాక్షి మీడియా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అద్భుతమైన కళాకారులు వెలుగులోకి వస్తార’ని రంగస్థల దర్శకుడు, నటుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. సాక్షి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటానన్నారు నృత్యకారిణి స్వాతి సోమనాథ్. ఈరోజు ‘ఎన్జీవో ఆఫ్ ది ఇయర్’ విభాగ ఎంట్రీలను జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. మే ఐదు, ఆరు తేదీల్లో ఆయా విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు. -
సాక్షి ఫ్యామిలీ మహిళ పురస్కారాలు
సాక్షి ఫ్యామిలీ అందిస్తోంది మార్చి 8 మహిళ పురస్కారాలు మీ ఎంట్రీలు పంపడానికి గడువు తేదీ జనవరి 31 4 కేటగిరీలలో 8 అవార్డులు అమ్మ అమృతమూర్తి ప్రతి అమ్మ బెస్ట్ మదరే. అయితే మీకు తెలిసిన బెస్ట్ మదర్ ఎవరో మాకు రాసి పంపండి. మీ సొంత మదర్ అయినా పర్వాలేదు. కానీ ఎందుకు బెస్ట్ మదరో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి. అర్ధాంగి జీవన సహచరి మీ జీవిత భాగస్వామిని మీరు మీ బెస్ట్ బెటర్ హాఫ్ అనుకుంటున్నారా? అయితే ఆవిడ ఎందుకు అంత బెస్ట్ అయ్యారో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి. యువతి శక్తి స్వరూపిణి మీ కాలేజీలోనైనా, మీ చుట్టు పక్కలైనా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన యువతి ఉన్నారా? ఉంటే ఆ యువతి ఎవరో, ఆ సాహసం ఏమిటో మాకు రాసి పంపండి. మహిళారైతు భూదేవి మీ ప్రాంతంలో ఆదర్శప్రాయురాలైన మహిళా రైతు ఉన్నారా? ఆమె గురించి రాస్తూ, ఎందుకు ఆదర్శమయ్యారో రాసి పంపండి. సూచనలు: ఈ నాలుగు కేటగిరీలలో మీరు దేనిలోనైనా పాల్గొనవచ్చు. (2వ కేటగిరీలో భర్త మాత్రమే పాల్గొనాలి. రుజువుగా భార్యాభర్తలు కలిసి దిగిన ఫొటోను పంపించాలి. నిర్థారణ కోసం దంపతుల ఇద్దరి ఫోన్ నెంబర్లను ఇవ్వాలి.) గడువులోపు వచ్చిన ఎంట్రీలన్నిటినీ పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత పొందిన వాటిలో కేటగిరీకి 8 చొప్పున ఎంపిక చేసి, మొదట వాటిని ఫ్యామిలీలో ప్రచురిస్తాం. ఆ 8 మందిలో ఇద్దరిని ప్రత్యేక జ్యూరీ ద్వారా అవార్డుకు ఎంపిక చేస్తాం. అలా నాలుగు కేటగిరీలలో ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటిస్తాం. వారిని మార్చి 8న హైదరాబాదులో సాక్షి సన్మానిస్తుంది. అవార్డులను బహుకరిస్తుంది. ప్రతి ఎంట్రీకి ఫొటో తప్పనిసరి. ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, ‘ఫ్యామిలీ’, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500 034. e-mail : march8family@gmail.com