ఎంట్రీలు అదుర్స్ | Sakshi Excellence Awards -2014 entries superb | Sakshi
Sakshi News home page

ఎంట్రీలు అదుర్స్

Published Fri, Apr 24 2015 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

ఎంట్రీలు అదుర్స్

ఎంట్రీలు అదుర్స్

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులను సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2014’ ప్రక్రియ కొనసాగుతోంది. సంగీతం-నృత్య రంగాలకు సంబంధించి ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిన ఎంట్రీలను... షార్ట్‌లిస్ట్ జ్యూరీ సభ్యులు- నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, అల్లాణి  శ్రీధర్,  నృత్యకారిణి  స్వాతి సోమనాథ్ శుక్రవారం పరిశీలించి స్కోర్ ఇచ్చారు. ఈ స్కోర్ ఆధారంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ఐదు బెస్ట్ నామినీలను ఫైనల్ జ్యూరీకి పంపనుంది.

తుది విజేతను ఫైనల్ జ్యూరీ ఎంపిక చేయనుంది. ‘ఎంట్రీలలో దాదాపు 70 శాతం బాగున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ఎంట్రీలు రావడం శుభపరిణామం’ అని సినీ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు సాక్షి మీడియా
 చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అద్భుతమైన కళాకారులు వెలుగులోకి వస్తార’ని రంగస్థల దర్శకుడు, నటుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆకాంక్షించారు.

సాక్షి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటానన్నారు నృత్యకారిణి స్వాతి సోమనాథ్. ఈరోజు ‘ఎన్‌జీవో ఆఫ్ ది ఇయర్’ విభాగ ఎంట్రీలను జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. మే ఐదు, ఆరు తేదీల్లో ఆయా విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement