సాక్షి ఫ్యామిలీ మహిళ పురస్కారాలు | sakshi family Woman Award's | Sakshi
Sakshi News home page

సాక్షి ఫ్యామిలీ మహిళ పురస్కారాలు

Published Mon, Jan 19 2015 12:24 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి ఫ్యామిలీ మహిళ పురస్కారాలు - Sakshi

సాక్షి ఫ్యామిలీ మహిళ పురస్కారాలు

సాక్షి ఫ్యామిలీ అందిస్తోంది మార్చి 8 మహిళ పురస్కారాలు
మీ ఎంట్రీలు పంపడానికి గడువు తేదీ జనవరి 31
4 కేటగిరీలలో 8 అవార్డులు

 
అమ్మ అమృతమూర్తి
ప్రతి అమ్మ బెస్ట్ మదరే. అయితే మీకు తెలిసిన బెస్ట్ మదర్ ఎవరో మాకు రాసి పంపండి. మీ సొంత మదర్ అయినా పర్వాలేదు. కానీ ఎందుకు బెస్ట్ మదరో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి.
 
అర్ధాంగి జీవన సహచరి
మీ జీవిత భాగస్వామిని మీరు మీ బెస్ట్ బెటర్ హాఫ్ అనుకుంటున్నారా? అయితే ఆవిడ ఎందుకు అంత బెస్ట్ అయ్యారో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి.
 
యువతి శక్తి స్వరూపిణి
మీ కాలేజీలోనైనా, మీ చుట్టు పక్కలైనా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన యువతి ఉన్నారా?  ఉంటే ఆ యువతి ఎవరో, ఆ సాహసం ఏమిటో మాకు రాసి పంపండి.
 
 మహిళారైతు భూదేవి
మీ ప్రాంతంలో ఆదర్శప్రాయురాలైన మహిళా రైతు ఉన్నారా? ఆమె గురించి రాస్తూ, ఎందుకు ఆదర్శమయ్యారో రాసి పంపండి.
 
సూచనలు: ఈ నాలుగు కేటగిరీలలో మీరు దేనిలోనైనా పాల్గొనవచ్చు. (2వ కేటగిరీలో భర్త మాత్రమే పాల్గొనాలి. రుజువుగా భార్యాభర్తలు కలిసి దిగిన ఫొటోను పంపించాలి. నిర్థారణ కోసం దంపతుల ఇద్దరి ఫోన్ నెంబర్లను ఇవ్వాలి.) గడువులోపు వచ్చిన ఎంట్రీలన్నిటినీ పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత పొందిన వాటిలో కేటగిరీకి 8 చొప్పున ఎంపిక చేసి, మొదట వాటిని ఫ్యామిలీలో ప్రచురిస్తాం. ఆ 8 మందిలో ఇద్దరిని ప్రత్యేక జ్యూరీ ద్వారా అవార్డుకు ఎంపిక చేస్తాం. అలా నాలుగు కేటగిరీలలో ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటిస్తాం. వారిని మార్చి 8న హైదరాబాదులో సాక్షి సన్మానిస్తుంది. అవార్డులను బహుకరిస్తుంది. ప్రతి ఎంట్రీకి ఫొటో తప్పనిసరి.
 
ఎంట్రీలను పంపవలసిన చిరునామా:
ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, ‘ఫ్యామిలీ’, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్‌‌స, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500 034.
 e-mail : march8family@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement