రకరకాల ప్రాంతాల్లో పర్యటించడం మీకు అలవాటా? అయితే వెంటనే వాటికి సంబంధించిన ఫొటోలను ఓసారి చెక్ చేయండి. అందులో సెల్ఫీలు, సొంత ఫొటోలు కాకుండా మీరు వెళ్లిన ప్రాంత విశిష్టతను తెలిపే మంచి ఫొటోలు ఉంటే అదృష్టాన్ని పరీక్షించుకోండి. 'నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్- 2016' మీకు స్వాగతం పలుకుతోంది. ఫొటోతోపాటు ఆ పర్యటన అనుభవాలను కూడా పంపాల్సి ఉంటుంది.
నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఏటా నిర్వహించే ఈ పోటీలో విజేతలుగా నిలిచేవారికి మంచి బహుమతులు ఇస్తారు. అంతకంటే గొప్ప పేరుకూడా లభిస్తుంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి ఎంట్రీలు వస్తున్నాయని, మే 27, 2016 వరకు వాటిని స్వీకరిస్తామని ఆ తర్వాత నిర్ణాయక కమిటీ విజేతను ఎంపిక చేస్తుందని సంస్థ పేర్కంది. పూర్తి వివరాల కోసం http://travel.nationalgeographic.com/photographer-of-the-year-2016 లింక్ ను క్లిక్ చేయండి. ఇప్పటివరకు పోటీదారులు పంపిపన ఫొటోల్లో కొన్ని బెస్ట్ ఫొటోస్ మీ కోసం..