2017లో స్మార్ట్ఫోన్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
2017లో స్మార్ట్ఫోన్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
Published Sat, Dec 24 2016 8:46 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM
ముంబాయి : స్మార్ట్ఫోన్ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ ఏ దేశమంటే. ఠక్కున అందరికీ గుర్తొచ్చేంది భారత్ మార్కెటే. దీంతో దేశీయ మార్కెట్లో ఎలాగైనా తమ పాగా వేసుకోవాలని ఒక్కటేమిటి అన్ని దేశాల స్మార్ట్ఫోన్ కంపెనీల చూపు మనవైపే నిలిచింది. కుప్పలు తెప్పలుగా స్మార్ట్ఫోన్లు మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోటీ తీవ్రతరమైంది. ఈ పోటీని తట్టుకుని నిల్చోవాలంటే మార్కెట్లో తమ ముద్ర వేసుకుని తీరాల్సిందే. అలా లేదంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయి వారి దేశాలకు తరలి వెళ్లాలి. 2017 ఆర్థికసంవత్సరంలో అదే జరగబోతుందట. 2017లో మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే స్మార్ట్ఫోన్ కంపెనీల కంటే ఇక్కడి నుంచి బయటపడే కంపెనీలే ఎక్కువగా ఉండబోతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం భారత్లో పోటీ తీవ్రతరం కావడమేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
గత రెండేళ్లుగా భారత్లోకి ప్రవేశిస్తున్న స్మార్ట్ఫోన్ కంపెనీలకు ఆశించిన స్థాయిలో రెవెన్యూలు ఆర్జించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ నుంచి వైదొలగడమే మంచిదని ఆ కంపెనీలు భావిస్తున్నాయట. 2017లో ఏడు కంపెనీలు భారత్లోకి ప్రవేశిస్తే, తొమ్మిది కంపెనీల మేర ఇక్కడి నుంచి వైదొలుగుతాయని అంచనావేస్తున్నట్టు కౌంటర్ పాయింట్ పేర్కొంది. భారత్లో ప్రస్తుతం 100కు పైగా స్మార్ట్ఫోన్ ప్లేయర్స్ ఉండగా.. వాటిలో టాప్ 15 కంపెనీల చేతిలోనే 90 శాతం మార్కెట్ షేరు ఉంది. మార్కెట్ నుంచి వైదొలిగే ట్రెండ్కు సంకేతంగా మైక్రోసాప్ట్, ఏషర్, ఫికామ్ కంపెనీలు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయని వివరించింది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదుచేసిన మార్కెట్, 2016లో 6 శాతం వృద్ధినే నమోదుచేసిందని తెలిపింది.
Advertisement
Advertisement