Counterpoint Research report
-
స్మార్ట్‌ఫోన్స్ ఆదాయాల్లో యాపిల్ టాప్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గతేడాది (2023) అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తొలిసారిగా ఆదాయాలపరంగా అగ్రస్థానం దక్కించుకుంది. అమ్మకాల పరిమాణంపరంగా శాంసంగ్ నంబర్‌వన్‌గా ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నెలవారీ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ..దాదాపు అంతక్రితం ఏడాది స్థాయిలోనే 15.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. కొరియన్ దిగ్గజం శాంసంగ్, చైనా మొబైల్స్ తయారీ సంస్థలు వివో, ఒప్పో తమ మార్కెట్ వాటాలను పెంచుకోగలిగాయి. భారత్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా యాపిల్‌కి కలిసి వస్తోందని కౌంటర్‌పాయింట్ తమ నివేదికలో తెలిపింది. స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా గతేడాది ప్రథమార్ధం సవాళ్లతో గడిచిందని, డిమాండ్ పడిపోయి, నిల్వలు పెరిగిపోయాయని పేర్కొంది. 5జీ అప్గ్రేడ్లు, పండుగ సీజన్ అమ్మకాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో ద్వితీయార్ధంలో మార్కెట్ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టిందని వివరించింది. మొత్తం ఫోన్ల మార్కెట్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 52 శాతం దాటిందని, వార్షిక ప్రాతిపదికన 66 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మరోవైపు, 2023 నాలుగో త్రైమాసికంలో దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 25 శాతం వృద్ధి చెందినట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. మరిన్ని విశేషాలు.. ► స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు ప్రీమియం ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2023లో రూ. 30,000 పైన రేటు ఉన్న ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ స్కీములు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ఫైనాన్స్ మీదే కొన్నారు. ► ప్రీమియం సెగ్మెంట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు మరింతగా ఆదరణ పెరగవచ్చు. వాటి అమ్మకాలు 2024లో 10 లక్షలు దాటవచ్చని అంచనా. ► స్మార్ట్ఫోన్లలో ఆడియో–వీడియోపరంగా డాల్బీ అటా్మస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు మరింతగా పెరగవచ్చు. -
డిమాండ్ వీటికే! దేశంలో ఎలాంటి టీవీలు కొంటున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల దిగుమతులు (షిప్మెంట్) ప్రస్తుత ఏడాది మొత్తం మీద 7 శాతం వరకు తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల కాలంలో స్మార్ట్ టీవీల షిప్మెంట్ 5 శాతం తగ్గినట్టు పేర్కొంది. పండుగల సీజన్ ఉన్నందున ద్వితీయ ఆరు నెలల కాలంలో దిగుమతులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేసింది. ఓఈఎంలు కొత్త పెట్టుబడుల రూపంలో అదనపు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందున దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీ పెరుగుతున్నట్టు వివరించింది. భారత మార్కెట్లో కొత్త ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు)లు కూడా ప్రవేశిస్తున్నాయని, ప్రముఖ బ్రాండ్లతో టైఅప్ అయ్యి టీవీల తయారీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. పెద్ద టీవీలకు డిమాండ్ స్మార్ట్ టీవీల షిప్మెంట్ తగ్గినప్పటికీ, పెద్ద తెరల టీవీలకు డిమాండ్ బలంగానే ఉందని, బ్రాండెడ్ టీవీలకు ప్రాధాన్యత (ప్రీమియమైజేషన్) పెరుగుతున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 55 అంగుళాలు, అంతకుమించిన పెద్ద స్మార్ట్ టీవీల షిప్మెంట్ మొదటి ఆరు నెలల్లో 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. భారత్‌లో అమ్ముడయ్యే అధిక శాతం స్మార్ట్ టీవీల్లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఆడియో సపోర్ట్ ఉంటున్నట్టు తెలిపింది. జనవరి–జూన్ కాలంలో మొత్తం టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 91 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణం ప్రతికూలం.. ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో ప్రజలు కనీస కొనుగోళ్లకే పరిమితం కావాల్సి వచ్చిందని.. టీవీ దిగుమతులు తగ్గడానికి దీన్ని కారణంగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మధ్య శ్రేణి విభాగంలో (రూ.30–50వేల మధ్య) క్యూఎల్ఈడీ టీవీలు మరింత ఆదరణకు నోచుకుంటున్నట్టు తెలిపింది. ‘‘మొదటి ఆరు నెలల్లో క్యూఎల్ఈడీ టీవీల షిప్మెంట్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం పెరిగింది. మొత్తం టీవీల మార్కెట్లో వీటి వాటా ఇక ముందు కూడా పెరుగుతుంది’’అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మొదటి ఆరు నెలల్లో స్మార్ట్ టీవీల షిప్మెంట్లో షావోమీ 10 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. శామ్సంగ్ రెండో స్థానంలో ఉండగా, వన్‌ప్లస్, ఎల్జీ, టీసీఎల్, ఏసర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏసర్, శాన్సుయ్ వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లుగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఇవి విడుదల చేసే కొత్త బ్రాండ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు వివరించింది. -
స్మార్ట్ఫోన్ల మార్కెట్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు (తయారీ సంస్థల నుంచి రిటైలర్లకు సరఫరా) 3.1 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. రూ. 30,000 లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు గణనీయంగా పడిపోగా, ప్రీమియం.. అల్ట్రా ప్రీమియం కేటగిరీ ఫోన్లు 60–66 శాతం ఎగిశాయి. డిమాండ్ తగ్గుదల, 2022 నుంచి నిల్వ లు పెరిగిపోవడం, వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటం, మార్కెట్ నిరాశావహంగా కనిపిస్తుండటం తదితర అంశాలు క్యూ1లో విక్రయాలు మందగించడానికి కారణమైనట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. దీనితో షిప్మెంట్ల తగ్గుదల వరుసగా మూడో త్రైమాసికంలోనూ కొనసాగగా, క్యూ1లో అత్యధికంగా క్షీణత నమోదైనట్లు వివరించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో 5జీ ఫోన్ల వాటా ఏకంగా 43 శాతానికి చేరింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. టాప్ 5జీ బ్రాండ్‌గా కూడా కొనసాగుతోంది. ఏ సిరీస్ 5జీ ఫోన్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాయి. మొత్తం షిప్మెంట్లలో వీటి వాటా 50 శాతం దాకా నమోదైంది. ఎస్23 సిరీస్ ఆవిష్కరణతో మార్చి క్వార్టర్లో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ (ధర రూ. 45,000 పైగా) 247 శాతం వృద్ధి చెందింది. ► యాపిల్ షిప్మెంట్లు 50 శాతం పెరగ్గా మార్కెట్ వాటా 6 శాతంగా నమోదైంది. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 30,000 స్థాయి) 36 శాతం, అల్ట్రా–ప్రీమియం సెగ్మెంట్లో 62 శాతం వాటా దక్కించుకుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి కొత్తగా ఫైనాన్స్ స్కీమును ప్రారంభించడం, లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను ఆఫ్‌లైన్‌లోను గణనీయంగా ప్రమోట్ చేస్తుండటం ఇందుకు దోహదపడింది. ► మార్చి త్రైమాసికంలో షిప్మెంట్లు 3 శాతం క్షీణించినప్పటికీ 17 శాతం మార్కెట్ వాటాతో వివో రెండో స్థానంలో కొనసాగుతోంది. షావో మీ షిప్ మెంట్లు 44 శాతం పడిపోగా, 16 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. ► వన్‌ప్లస్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. క్యూ1లో 72 శాతం వృద్ధి చెందింది. ► స్థానిక బ్రాండ్లలో రూ. 10,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో లావా మెరుగ్గా రాణించింది. 29 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న మూడో బ్రాండ్‌గా నిల్చింది. ► రూ. 20,000 – 30,000 ధర పలికే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు 33 శాతం క్షీణించగా, రూ. 10,000 – 20,000 సెగ్మెంట్ 34 శాతం తగ్గింది. ఇక రూ. 10,000 లోపు ఫోన్లు 9 శాతం క్షీణత నమోదు చేశాయి. ► వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్లు నడిచే సమయంలో డిమాండ్ గణనీయంగా ఉంటోంది. రిపబ్లిక్ డే సమయంలో డిమాండ్ బాగా కనిపించింది. అయి తే సేల్స్ వ్యవధి ముగిసిపోగానే భారీగా పడిపోయింది. విక్రేతలు ప్రస్తుతం కొత్త మోడల్స్‌ను తెచ్చిపెట్టుకోవడం కంటే ఉన్న నిల్వలను వదిలించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ► 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. వినియోగదారులు అప్‌గ్రేడ్ అవుతుండటంతో 5జీ ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో 43 శాతం వాటాను దక్కించుకున్నాయి. ► రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 5జీకి అప్‌గ్రేడేషన్ వేగవంతం అవుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, పండుగల సీజన్ మొదలైన వాటి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా. -
ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల్లో దుమ్మురేపుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్ రీసెర్చ్' ప్రతి నెల ప్రపంచ వ్యాప్తంగా ఏఏ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయనే విషయాల్ని వెల్లడిస్తుంది. అయితే తాజాగా ఏప్రిల్ నెలలో ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్లు ఇవేనంటూ డేటా విడుదల చేయగా..అందులో కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే విషయంలో యాపిల్ ఐఫోన్ ఉన్నట్లు తేలింది.ఇక మిగిలిన సంస్థల ఫోన్లు ఎక్కువగా అమ్ముడు పోయాయనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే... ♦కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు భారీగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫోన్ అమ్మకాల్లో ప్రతి 10 మంది కొనుగోలు దారుల్లో ఒకరు ఐఫోన్‌ను కొనుగోలు చేశారు. ♦ఇక వరల్డ్ వైడ్‌గా అమ్ముడైన టాప్-10 ఫోన్ల జాబితాలో యాపిల్, శాంసంగ్ ఫోన్లు మార్కెట్‌ను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ♦యాపిల్ సంస్థకు చెందిన స్టాండడ్ ఐఫోన్లలో వనిల్లా ఐఫోన్ 13 అగ్రస్థానంలో నిలవగా.. ఏప్రిల్ నెలలో 5.5శాతంతో ఎక్కువగా అమ్ముడు పోయి టాప్‌లో నిలిచింది. ♦యాపిల్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అత్యధికంగా అమ్ముడు పోయి 3.4 మార్కెట్ షేర్‌ను నమోదు చేసింది. ♦యాపిల్ ఐఫోన్ 13 ప్రో 1.8శాతం మార్కెట్ షేర్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ♦ఐఫోన్ 12 సైతం మార్కెట్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. ఏప్రిల్ నెలలో 1.6శాతం ఫోన్లు అమ్ముడుపోయి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ♦యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 1.4శాతం మార్కెట్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్ల జాబితాలో 5వస్థానం దక్కించుకుంది. ♦ఇక యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను మినహాయించి మిగిలిన స్మార్ట్ సంస్థలకు చెందిన ఏఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడు పోయాయో ఒక్కసారి పరిశీలిస్తే.. 1.5శాతం మార్కెట్ షేర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ♦మోస్ట్ అఫార్డబుల్ ఫోన్ల అమ్మకాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ13..1.4శాతం మార్కెట్‌ను దక్కించుకుంది. ♦అఫార్డబుల్ గో ఎడిషన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ ఎక్కువగా అమ్ముడు పోయి 1.4శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకుంది. ♦మిడ్ రేంజ్ డివైజ్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్ ఫోన్ నిలిచింది. 1.3శాతం మార్కెట్‌తో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంది. ♦యాపిల్, శాంసంగ్ సంస్థ మినహాయిస్తే రెడ్ మీ నోట్ 11 ఎల్టీఈ ఫోన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోయింది. 1.3 మార్కెట్ షేర్‌తో యాపిల్, శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరి 26న విడుదలైన సమయంలో రెడ్ మీ నోట్ 11 ఎల్టీఈ ఫోన్ ధర రూ.12,929గా ఉంది. ♦చివరిగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడవుతున్న జాబితాలో 5జీ ఫోన్ల సంఖ్య పెరుగుతున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడైంది. గతేడాది 5జీ ఫోన్లు 4మోడళ్లు అమ్ముడుపోతే..ఈ ఏడాది అనూహ్యంగా వాటి సంఖ్య 7కి చేరింది. ♦ఒక్క 5జీ ఫోన్ల విషయానికొస్తే అమ్మకాల్లో 5జీ ఫోన్లు 3 వస్థానంలో నిలిచాయి. కొనుగోలు దారుడి ఆర్ధిక స్థితి గతులకు (లోయర్ ప్రైస్ బ్యాండ్స్) అనుగుణంగా తక్కువ ధరకే లెటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లో విడుదలవుతున్న ఫ్లాగ్షిప్ ఫోన్లను కొనుగులో చేసేందుకు ఆసక్తి చూపే యూజర్ల సంఖ్య పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన డేటాలో హైలెట్ చేసింది. చదవండి👉గతేడాది హాట్‌కేకుల్లా అమ్ముడైన ఫోన్లు ఇవే! ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయంటే? -
దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు.. !
జనవరిలో తొలిసారిగా 5జీ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ అమ్మకాలు 4జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను అధిగమించినట్లు మార్కెట్ ఎనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. చైనా, ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాలలో 5జీ స్మార్ట్ఫోన్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు కౌంటర్ పాయింట్ పేర్కొంది. అలాగే, ఈ మొబైల్ మన దేశంలో కూడా ఊపందుకున్నాయి. "5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2021(భారతదేశంలో) మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 16 శాతంగా ఉన్నాయి. 2020లో 3 శాతంగా ఉన్న అమ్మకాలు 2021 నాటికి 16 శాతానికి పెరిగాయి. 2022లో 5జీ అమ్మకాలు సుమారు 40%కి చేరుకుంటుందని మేము అంచనా వేస్తాము" అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు కర్ణ్ చౌహాన్ చెప్పారు. 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు ₹12,000కు తగ్గితే 2022 క్యూ4లో 50 శాతానికి చేరే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. మార్చి 15న ప్రచురితమైన నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో లేనప్పటికీ 10 మిలియన్ వినియోగదారులు 5జీ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినట్లు తెలిపింది. 5జి స్మార్ట్ ఫోన్లు జనవరిలో చైనాలో మొత్తం అమ్మకాల్లో 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 84% వాటాను కలిగి ఉన్నాయి. క్వాల్ కామ్, మీడియాటెక్ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సపోర్ట్ గల చిప్స్ అందుబాటులోకి తీసుకొని రావడంతో అమ్మకాల పెరిగినట్లు కౌంటర్ పాయింట్ తెలిపింది. మొత్తం మొబైల్ ఫోన్ అమ్మకాల్లో పశ్చిమ ఐరోపాలో 76%, ఉత్తర అమెరికాలో 73% 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు వాటాను కలిగి ఉన్నాయి. పశ్చిమ ఐరోపాలో మొత్తం 5జీ అమ్మకాల్లో 30%, ఉత్తర అమెరికాలో 50% వాటా యాపిల్ కంపెనీకే ఉంది. ఇక మన దేశంలో 5జీ నెట్వర్క్ లేకపోవడంతో ఆ మొబైల్స్ అమ్మకాలు తక్కువగానే ఉన్న ఈ ఏడాది నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. దేశీయ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) ఈ ఏడాది ఎప్పుడైనా 5జీ స్పెక్ట్రం కోసం వేలం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ప్రధాన టెల్కోలు భారతదేశం అంతటా 5జీ ట్రయల్స్ నిర్వహించాయి. (చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా..?) -
2.83 లక్షల కోట్ల వ్యయం..16.90 కోట్ల ఫోన్ల కొనుగోలు
న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ (కంపెనీల నుంచి మార్కెట్‌కు సరఫరా/ఎగుమతులు) 2021లో 11 శాతం పెరిగి 169 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. వార్షికంగా చూసుకుంటే ఇది 27 శాతం వృద్ధిగా పేర్కొంది. 2021 డిసెంబర్ త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం షిప్మెంట్ తగ్గినా కానీ, పూర్తి ఏడాదికి 11 శాతం వృద్ధి చెందినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వివరించింది. డిసెంబర్ త్రైమాసికంలో సరఫరా సమస్యలు తయారీపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. ‘‘భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2021లో మంచి వినియోగ డిమాండ్‌ను చూసింది. సరఫరా సమస్యలు, సెకండ్ వేవ్ తీవ్రత, అంతర్జాతీయంగా విడిభాగాల కొరత, ధరల పెంపు ఉన్నా కానీ, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెరుగైన పనితీరు నమోదైంది’’ అని కౌంటర్ పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ తెలిపారు. 2021 షిప్మెంట్ గణాంకాలు - మధ్య, అధిక ధరల విభాగంలో ప్రమోషన్లు, డిస్కౌంట్లతో ధరలు అందుబాటులో ఉన్నందున రీప్లేస్మెంట్ (పాత ఫోన్ తీసేసి కొత్తది కొనుగోలు చేయడం) డిమాండ్ జోరందుకుంది. - దీనికితోడు రుణాలకు సంబంధించి మంచి ఆప్షన్లు ఉండడం 11 శాతం వృద్ధికి మద్దతుగా నిలిచింది. - 2021 చివరి రెండు నెలల్లో డిమాండ్ సరఫరాను మించింది. - 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలో వార్షికంగా స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 8 శాతం క్షీణించాయి. 2022 మొదటి మూడు నెలల్లో సరఫరా మెరుగుపడొచ్చు. - దేశీయంగా షావోమీ 24 శాతం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం ఫోన్ల (రూ.30వేలకు పైన) విభాగంలో వార్షికంగా 2021లో 258 శాతం వృద్ధి నమోదు చేసింది. - శామ్సంగ్ 18 శాతం షిప్‌మెంట్‌తో రెండో స్థానంలో ఉంది. రూ.20,000–45,000 ధరల విభాగంలో 28 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. - వివో 15 శాతం, రియల్మీ 14 శాతం, ఒప్పో 10 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. - రియల్మీ వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న బ్రాండ్‌గా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. - వన్‌ప్లస్ భారత్ మార్కెట్లోనే అత్యధిక షిప్‌మెంట్‌ను 2021లో నమోదు చేసింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో 19 శాతంతో రెండో స్థానంలో ఉండగా, అందుబాటు ధరల్లోని ప్రీమియం విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. - 2021లో యాపిల్ సైతం వార్షికంగా 108 శాతం వృద్ధిని చూపించింది. ప్రీమియం విభాగంలో 44 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. - 5జీ ఫోన్ల షిప్మెంట్ 2021లో 555 శాతం పెరిగింది. వివో 19 శాతంతో మార్కెట్ లీడర్‌గా ఉంది. - ఫ్యూచర్ ఫోన్ల విభాగలో 86 మిలియన్ యూనిట్ల సరఫరా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా ఉంది. - ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత మొబైల్ తయారీకి ఎంతో మద్దతునిచ్చి నట్టు, యాపిల్, శామ్సంగ్ కంపెనీలు భారత్‌లో తయారీని పెంచేందుకు దోహదపడినట్టు కౌంటర్‌పాయింట్ తెలిపింది. చదవండి:మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికాం సంస్థలకు షాక్! -
ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో అమ్ముడవుతున్న అన్నీ ఫోన్లలో కంటే యాపిల్ ఐఫోన్లు చాలా ఖరీదు. ఇదే విషయం ఆ ఫోన్ల అమ్మకాల్లో తేలింది. కానీ ట్రెండ్ మారింది. తాజాగా విడుదలైన క్యూ3 ఫలితాల్లో ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల విడుదలైన 2021 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరిగాయని, ఈ విషయంలో యాపిల్ సంస్థ అరుదైన ఘనతను సాధించిందని కొనియాడారు. అయితే భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 13 తో దశ తిరిగింది. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ సంస్థ ఐఫోన్ 13 విడుదల ముందు వరకు భారత్‌లో గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఎందుకంటే మిగిలిన టెక్ కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు,గాడ్జెట్స్ ధరలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేవి. కానీ యాపిల్ విడుదల చేసే ఐఫోన్లలో ఫీచర్లు బాగున్నా ధరలు ఆకాశాన్నంటేవి. అందుకే ఐఫోన్ అమ్మకాలు ఆశాజనకంగా లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 సిరీస్ విడుదలతో భారత్‌లో యాపిల్ ఐఫోన్ అమ్మకాల దశ తిరిగింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఏం తేల్చింది మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ క్యూ3 ఫలితాల్లో యాపిల్ సంస్థ 212 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని పేర్కొంది. యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (రూ. 30,000 కంటే ఎక్కువ ఉన్న ఫోన్లు) 44 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతుందని తెలిపింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో 74 శాతం మార్కెట్ వాటాతో (రూ. 45,000 పైన ఉన్న ఫోన్లు) ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. అయితే ఇలా సేల్స్ పెరగడానికి యాపిల్ తెచ్చిన ఫీచర్లేనని తెలుస్తోంది. పెద్ద ఐఫోన్ స్క్రీన్లు 2017 నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ల స్క్రీన్ సైజ్‌ను పెంచుతూ వచ్చింది.ఇక తాజాగా స్క్రీన్ సైజ్ పెరిగిన ఫోన్లలో ఐఫోన్ 11,ఐఫోన్ 12, ఐఫోన్ 13 ఫోన్లు ఉన్నాయి. దీంతో పాటు మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్ లతో పోలిస్తే యాపిల్ ఇప్పుడు 6 అంగుళాల డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తద్వారా ఐఫోన్ వినియోగదారులు ఈజీగా సినిమాలు, గేమ్స్, నెట్ బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం యాపిల్ విడుదల చేస్తున్న ఐఫోన్లలో 4.7 అంగుళాల స్క్రీన్ నుండి 6.7 అంగుళాల వరకు ఐఫోన్లను అమ్ముతుంది. ఐఓఎస్ అప్డేట్లు ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లు చాలా అవసరం. అందుకే అప్డేట్ విషయంలో ఆలస్యం చేసే యాపిల్ సంస్థ గత కొంత కాలంటే సాఫ్ట్వేర్ల విషయంలో అప్డేట్గా ఆలోచిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్‌ను ఆవిష్కరించిన కొన్ని రోజుల తర్వాత ఐఓస్ 15 అప్డేట్ చేసింది. 2015లో విడుదలైన ఐఫోన్ 6ఎస్ లో ఓఎస్ అప్డేట్లు చేస్తూ వస్తోంది. ఐఫోన్‌కు మరో అడ్వాంటేజ్ చిప్ సెట్ లు డిస్ప్లే ,సాఫ్ట్వేర్ అప్డేట్లు కాకుండా ఐఫోన్ సేల్స్ పెరగడానికి మరో కారణం చిప్సెట్. యాపిల్ బయోనిక్ చిప్సెట్లను వినియోగిస్తుంది. 2019నుంచి ఈ బయోనిక్ చిప్సెట్ల వినియోగం ప్రారంభమైంది. ఈ బయోనిక్ చిప్ ఉన్న ఐఫోన్ల వినియోగం సులభంగా ఉన్నట్ల ఐఫోన్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజూవారి పనులే కాకుండా గేమింగ్, బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!
మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రముఖ ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ ఫలితాలు కేక పెట్టించాయి.యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌ను మార్కెట్లో విడుదల చేసినా షావోమీని అధిగమించలేకపోయింది. కానీ ఈ త్రైమాసికంలో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ఏమంటోంది.. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం.. మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్మీ 9, రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్‌మెంట్‌తో శాంసంగ్ భారత్‌లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక ఈ నివేదిక ప్రకారం నార్డ్ సిరీస్ 3 మిలియన్ యూనిట్లు భారత్‌లో డెలివరీ అయినట్లు తేలింది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ క్యూ3 భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లపై కౌంటర్‌పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్, వివో, రియల్మీ, ఒప్పో ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉంది. కొత్తగా విడుదలై.. ఆకట్టుకుంటున్న ఫోన్లు ఇవే భారతదేశంలో 19 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్ అమ్మకాల మార్కెట్ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం42, శాంసంగ్ గెలాక్సీ ఎం 52, శాంసంగ్ గెలాక్సీ ఏ 22, శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ మోడళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లో భారత స్మార్ట్ ఫోన్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది. క్యూ3లో వివో షేర్ ఎంతంటే క్యూ3 2021లో 15 శాతం మార్కెట్ షేర్‌తో వివో 3వ స్థానంలో నిలిచింది. రియల్మీ 14 శాతం మార్కెట్ వాటా, ఒప్పో10 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచాయి. ఆపిల్ మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 212 శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ పేర్కొంది. క్యూ3 55 శాతం వృద్ధిని నమోదు చేయడంతో వన్ ప్లస్ నార్డ్ సిరీస్‌కు భారతదేశంలో మంచి ఆదరణ లభించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన వన్ ప్లస్ నార్డ్2, నార్డ్ సీఈ 5జీలు వన్ ప్లస్ మార్కెట్లో రాణించడానికి కారణమైనట్లు వెల్లడించింది. క్యూ3 లో మొదటిసారిగా 5G స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 10 మిలియన్ల మార్కును అధిగమించాయని నివేదికలో చెప్పింది. వివో 5జీలో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా చెప్పబడింది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ 5జీ ఫోన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
బీభత్సం, స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సెమి కండక్టర్ల కొరతే అయినా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ ప్రకారం..ఈ పండుగ సీజన్లో దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 7.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,858 కోట్లు) చేరువలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ రిటైల్ సగటు అమ్మకపు ధర 14 శాతం వృద్ధితో 230 డాలర్ల (దాదాపు రూ. 17,200)కు చేరింది. మిడ్,ప్రీమియం విభాగాలలోని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని తాజాగా విడుదలైన కౌంటర్ పాయింట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్‌పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ..దసరా,దీపావళి ఫెస్టివల్ సీజన్లో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉందని, అందుకే భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం ఉండడంతో $200 కంటే (ఇండియన్ కరెన్సీలో రూ.14,974.98) ఎక్కువ ధర ఉన్న ఫోన్ అమ్మకాలు పెరగడానికి కారణమైందన్నారు. ఈ సేల్స్ ఇలాగే కొనసాగితే పండుగ సీజన్లో దాదాపు 7.6 బిలియన్ డాలర్ల విలువైన, లేదంటే అంతకంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు అమ్మకాలు జరుగుతాయనే అంచనా వేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. 2021 పండుగ సీజన్లో మార్కెట్ విలువలో 1శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ..యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం సంవత్సరానికి 14 శాతం పెరిగిందని చెప్పారు. ఇక ఈ పండగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందన్నారు. చాలా మంది వినియోగదారులు చేసిన సేవింగ్స్‌లో వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ ధోరణి పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుపడిందని అన్నారు. చదవండి: అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్ -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
భారత్ భారీవాటా: మొబైల్స్ ఆన్‘లైన్’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. మొబైల్స్ విషయంలోనూ 2020లో అదే జోరు కనపడింది. గతేడాది దేశవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్స్‌లో ఆన్లైన్ వాటా 45 శాతం నమోదైందని పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా 26 శాతం మొబైల్స్ ఆన్లైన్ ద్వారా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఆన్లైన్ వాటా యూకేలో 39 శాతం, చైనా 34, బ్రెజిల్ 31, యూఎస్ 24, దక్షిణ కొరియాలో 16 శాతం కైవసం చేసుకుంది. ఆన్లైన్ జోరు క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. ఈ ఏడాది 2020 ఏడాది మాదిరిగా లేదా స్వల్పంగా తగ్గుదల ఉండొచ్చని నివేదిక తెలిపింది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు విస్తరిస్తున్నందున భారత్‌లో 2022 తర్వాత ఆన్లైన్ వాటా క్షీణిస్తుందని వెల్లడించింది. లాక్డౌన్లో తగ్గిన ఆన్లైన్.. సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా రవాణా పరిమితులు విధించడంతో ఈ-కామర్స్ కంపెనీలకు డెలివరీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రభావం స్మార్ట్ఫోన్ల విక్రయాలపైనా పడింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారం తర్వాతగానీ కస్టమర్లకు గ్యాడ్జెట్స్ చేరకపోవడంతో.. చాలా మంది వినియోగదార్లు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సమయానికి కస్టమర్‌కు ఉత్పత్తులను చేర్చలేని పరిస్థితి తలెత్తడంతో అటు విక్రేతలు సైతం ఈ-కామర్స్‌లో లిస్టింగ్‌కు వెనుకడుగు వేశారు. దీంతో రెండు నెలలుగా ఆన్లైన్ జోరు తగ్గింది. ఈ పరిణామాలన్నీ ఆఫ్‌లైన్ రిటైలర్లకు కలిసొచ్చిందని బిగ్-సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండు గంటల్లోనే డెలివరీ.. ఈ-కామర్స్ కంపెనీలకు దీటుగా మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్లు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను పటిష్టం చేసుకున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ అందుకున్న 2 గంటల్లోనే ఈ సంస్థలు డెలివరీ చేస్తున్నాయి. బిగ్–సి మొబైల్స్, లాట్ మొబైల్స్, సంగీత, బి-న్యూ మొబైల్స్, హ్యాపీ మొబైల్స్, సెలెక్ట్ మొబైల్స్, సెల్ పాయింట్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. దీంతో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోవడం వీటికి సులభం అయింది. మొబైల్స్ విషయంలో ఈ-కామర్స్ కంపెనీల నుంచి ఆఫ్‌లైన్‌కు రెండు నెలల్లో 25 శాతం కస్టమర్లు మళ్లారని మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రత్యక్షంగా ఎంచుకోవడానికి విస్తృత శ్రేణి మొబైల్స్ డిస్ప్లేలో ఉంటాయని బి-న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. అమెజాన్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్ యాప్స్ భాగస్వామ్యంతో మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు కస్టమర్లను డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి. -
స్మార్ట్‌ఫోన్‌కు ‘కరోనా’ ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోనుంది. ఇది సుమారు 2 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్‌లో విక్రయాలు గణనీయంగా మందగించడం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. మార్చి మధ్య దాకా కరోనా మహమ్మారి ప్రభావం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విజృంభిస్తుండటంతో లాక్డౌన్ అనివార్యమైందని వివరించింది. దీని ఫలితంగా 2020లో స్మార్ట్ఫోన్ల విక్రయం గతేడాది నమోదైన 15.8 కోట్లతో పోలిస్తే 3 శాతం తగ్గి 15.3 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మార్చిలో 27 శాతం తగ్గనుండగా, ఏప్రిల్ 14 దాకా లాక్డౌన్ కొనసాగితే ఈ నెలలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి మూలకేంద్రమైన చైనా నుంచి విడిభాగాల సరఫరా దెబ్బతినడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి. లాక్డౌన్ పెంచితే మరింతగా నష్టాలు.. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగించిన పక్షంలో నష్టాలు మరింత పెరగవచ్చని పాఠక్ చెప్పారు. మొత్తం సరఫరా వ్యవస్థ, ఆదాయాలు, చెల్లింపులు మొదలైనవన్నీ దెబ్బతినడమే ఇందుకు కారణమన్నారు. పైపెచ్చు వినియోగదారులు ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యమిచ్చి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల డిమాండ్ పడిపోవచ్చని పాఠక్ వివరించారు. భారత్‌ను ఎగుమతుల హబ్‌గా చేసుకున్న ఫ్యాక్టరీలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగైతే ఉత్పత్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాక్టరీలు.. ఉద్యోగాల్లో కోతలు విధించడానికి మొగ్గు చూపకపోవచ్చన్నారు. పండుగల సీజన్ దాకా ఇంతే.. ఈ ఏడాది ద్వితీయార్థానికి గానీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఉండకపోవచ్చని పాఠక్ చెప్పారు. ‘ఈ ఏడాది మధ్య నాటికి పరిస్థితి మెరుగుపడినా కూడా.. పండుగల సీజన్ దాకా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగొస్తే .. ఆన్లైన్ విక్రయాలూ మెరుగుపడొచ్చన్నారు. ఆఫ్‌లైన్ విక్రేతలకు ఆకర్షణీయ ఆఫర్లివ్వడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ స్టాక్స్ సత్వరం అందుబాటులో ఉంచేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయని చెప్పారు. -
దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్
న్యూఢిల్లీ : ఇన్ని రోజుల భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్(రూ.30,000 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్)లో టాప్ లీడర్లు ఎవరూ అంటే.. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ పేర్లే చెప్పేవారు. కానీ ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసి, భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త లీడర్ దూసుకొచ్చింది. అదే చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. మొట్టమొదటిసారి వన్‌ప్లస్ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 2018 రెండో క్వార్టర్లో 40 శాతం మార్కెట్ షేరుతో వన్‌ప్లస్ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 బలమైన అమ్మకాలు.. వన్‌ప్లస్‌ను టాప్ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. వన్‌ప్లస్ 6 రికార్డు షిప్మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే దిగ్గజ కంపెనీలైన ఆపిల్, శాంసంగ్ షిప్మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 34 శాతం షేరుతో శాంసంగ్ ఈ సెగ్మెంట్లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8 కంటే, గెలాక్సీ ఎస్9 షిప్మెంట్లు 25 శాతం పడిపోయాయి. షిప్మెంట్లు పడిపోయినప్పటికీ, ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ప్రమోషన్లు బలంగానే ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. మరోవైపు ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ లకు డిమాండ్ ఈ క్వార్టర్లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆపిల్ మార్కెట్ షేరు భారీగా పడిపోయింది. కేంద్రం డ్యూటీలను పెంచడంతో, ఆపిల్ కూడా తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. దీంతో ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ సిరీస్ షిప్మెంట్లు క్షీణించాయి. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ షేరు కూడా ప్రీమియం సెగ్మెంట్లో భారీగా పడిపోయి కేవలం 14 శాతం మాత్రమే నమోదైంది. అయితే మొత్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ఈ క్వార్టర్లో వార్షికంగా 19 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్లోకి హువావే(పీ20), వివో(ఎక్స్21), నోకియా హెచ్ఎండీ(నోకియా 8 సిరోకో), ఎల్జీ(వీ30 ప్లస్) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్తగా వచ్చి చేరాయి. శాంసంగ్, వన్‌ప్లస్, ఆపిల్ టాప్-3 బ్రాండ్లు మొత్తం మార్కెట్ షేరు 88 శాతంగా ఉంది. ఇది ముందు క్వార్టర్లో 95 శాతంగా నమోదైంది. -
భారత్‌లో ఆపసోపాలు పడుతున్న టెక్ దిగ్గజం
న్యూఢిల్లీ : భారత్‌లో ఐఫోన్లను విక్రయించడానికి టెక్ దిగ్గజం ఆపిల్ ఆపసోపాలు పడుతోంది. ఇటీవల వారాల్లో ముగ్గురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటంతో ఆపిల్ ఈ క్లిష్టతర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిసింది. భారత్‌లో ఆపిల్, తన వైభవాన్ని కోల్పోతుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు వెల్లడించింది. చైనాలో నెలకొన్న మాదిరి భారత్‌లోనూ పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాతో, ఆపిల్ తన దేశీయ సేల్స్ టీమ్‌ను పునర్వ్యస్థీకరించే పనిలో పడింది. ఆపిల్ ఇండియా నేషనల్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ చీఫ్, కమర్షియల్ ఛానల్స్, మిడ్-మార్కెట్ బిజినెస్ అధినేత, టెలికాం క్యారియర్ సేల్స్ హెడ్ అందరూ కంపెనీని వీడినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్టు పేర్కొంది. అయితే వీరందరూ ఎందుకు కంపెనీని వీడారో మాత్రం ఇంకా క్లారిటీ తెలియరాలేదు. అయితే భారత్ మార్కెట్లో ఆపిల్ ప్రదర్శనే వీరి రాజీనామాల రియాక్షన్ అని రిపోర్టు చెబుతోంది. ప్రస్తుతం భారత సేల్స్ టీమ్‌ను ఆపిల్ పునర్వ్యస్థీకరిస్తోంది. కాగ, భారత్ రెండింతలు మేర టారిఫ్‌లను పెంచడంతో, ఆపిల్ కంపెనీ సైతం తన ధరలను పెంచేసింది. ఈ ప్రభావంతో భారత్ మార్కెట్లో ఆపిల్ తన షేరును కోల్పోతుంది. ఆపిల్ కిందకి పడిపోతుంటే, చైనీస్ దిగ్గజం షావోమి, కొరియా దిగ్గజం శాంసంగ్‌లు మాత్రం భారత మార్కెట్ షేరును అంతకంతకు పెంచుకుంటూ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. 2018 ప్రథమార్థంలో కూడా ఐఫోన్ ఇండియా విక్రయాలు కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. ఒకవేళ ద్వితీయార్థంలో జంప్ చేసినా.. గతేడాది కంటే తక్కువ విక్రయాలనే నమోదు చేయవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం దేశీయంగా పాత ఐఫోన్ల తయారీ ప్రారంభించింది. ఓ వైపు దేశీయంగా తయారీ చేపట్టినా.. దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆపిల్ మరింత కృషిచేయాలని విశ్లేషకులంటున్నారు. -
శాంసంగ్‌ను బీట్ చేసి మరీ జియో సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్లో సునామీ సృష్టించిన రిలయన్స్ ..ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లోకూడా దూసుకుపోతోంది. తాజా నివేదికల ప్రకారం జియో లాంచ్ చేసిన ఇండియా కా స్మార్ట్‌ఫోన్ టాప్ ప్లేస్ కొట్టేసింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ను బీట్ చేసి మరీ ఫీచర్‌ఫోన్ మార్కెట్లో అదరగొట్టింది. 27శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ ‘జియోఫోన్’ బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2017 నాలుగో త్రైమాసికంలో తయారీ సంస్థల నుంచి సరఫరా (షిప్మెంట్)లను పరిగణనలోకి తీసుకుని, ఈ నివేదికను సంస్థ రూపొందించింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొంది. అంతేకాదు సౌత్ కొరియన్ బ్రాండ్ శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది. శాంసంగ్ మార్కెట్వాటా 17శాతంతో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 9శాతంతో మైక్రోమాక్స్ మూడవ స్థానంలో నిలిచింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం చివర్లో రూ.1,500 విలువైన జియో 4జీ ఫీచర్ ఫోన్ల విక్రయాలు అధికంగా జరిగాయని, గిరాకీ-సరఫరాల మధ్య అంతరాయాన్ని నివారించగలిగిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఫోన్‌కు 60 లక్షల ముందస్తు బుకింగ్‌లు లభించాయని నివేదించింది. ముఖ్యంగా సాధారణ ఫీచర్‌ఫోన్ వాడే వినియోగదారులు, ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్ ద్వారా 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ కావాలని భావించడమే జియోఫోన్ గ్రోతఖ్‌కు కారణాలని కౌంటర్‌పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. నగదు వాపసు పొందడం ద్వారా, జియోఫోన్‌ను ఉచితంగా వినియోగించుకునే వీలు దక్కడం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే జియో 4జీ ఫీచర్ ఫోన్లో 153 రూపాయల రీచార్జ్ ప్లాన్‌లో 1 జీబీ డేటాను ఆఫర్ చేయడం కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుందని తెలిపారు. -
2017లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబాయి : స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ ఏ దేశమంటే. ఠక్కున అందరికీ గుర్తొచ్చేంది భారత్ మార్కెటే. దీంతో దేశీయ మార్కెట్లో ఎలాగైనా తమ పాగా వేసుకోవాలని ఒక్కటేమిటి అన్ని దేశాల స్మార్ట్‌ఫోన్ కంపెనీల చూపు మనవైపే నిలిచింది. కుప్పలు తెప్పలుగా స్మార్ట్ఫోన్లు మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోటీ తీవ్రతరమైంది. ఈ పోటీని తట్టుకుని నిల్చోవాలంటే మార్కెట్లో తమ ముద్ర వేసుకుని తీరాల్సిందే. అలా లేదంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయి వారి దేశాలకు తరలి వెళ్లాలి. 2017 ఆర్థికసంవత్సరంలో అదే జరగబోతుందట. 2017లో మన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ కంపెనీల కంటే ఇక్కడి నుంచి బయటపడే కంపెనీలే ఎక్కువగా ఉండబోతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం భారత్‌లో పోటీ తీవ్రతరం కావడమేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గత రెండేళ్లుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఆశించిన స్థాయిలో రెవెన్యూలు ఆర్జించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ నుంచి వైదొలగడమే మంచిదని ఆ కంపెనీలు భావిస్తున్నాయట. 2017లో ఏడు కంపెనీలు భారత్‌లోకి ప్రవేశిస్తే, తొమ్మిది కంపెనీల మేర ఇక్కడి నుంచి వైదొలుగుతాయని అంచనావేస్తున్నట్టు కౌంటర్ పాయింట్ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 100కు పైగా స్మార్ట్‌ఫోన్ ప్లేయర్స్ ఉండగా.. వాటిలో టాప్ 15 కంపెనీల చేతిలోనే 90 శాతం మార్కెట్ షేరు ఉంది. మార్కెట్ నుంచి వైదొలిగే ట్రెండ్‌కు సంకేతంగా మైక్రోసాప్ట్, ఏషర్, ఫికామ్ కంపెనీలు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయని వివరించింది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదుచేసిన మార్కెట్, 2016లో 6 శాతం వృద్ధినే నమోదుచేసిందని తెలిపింది.