ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్ రీసెర్చ్' ప్రతి నెల ప్రపంచ వ్యాప్తంగా ఏఏ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయనే విషయాల్ని వెల్లడిస్తుంది. అయితే తాజాగా ఏప్రిల్ నెలలో ఏ ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌లు ఇవేనంటూ డేటా విడుదల చేయగా..అందులో కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే విషయంలో యాపిల్ ఐఫోన్ ఉన్నట్లు తేలింది.ఇక మిగిలిన సంస్థల ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడు పోయాయనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే...
♦కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌లు భారీగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫోన్ అమ్మకాల్లో ప్రతి 10 మంది కొనుగోలు దారుల్లో ఒకరు ఐఫోన్‌ను కొనుగోలు చేశారు.
♦ఇక వరల్డ్ వైడ్‌గా అమ్ముడైన టాప్-10 ఫోన్‌ల జాబితాలో యాపిల్, శాంసంగ్ ఫోన్‌లు మార్కెట్‌ను శాసిస్తున్నట్లు తెలుస్తోంది.
♦యాపిల్ సంస్థకు చెందిన స్టాండడ్ ఐఫోన్‌లలో వనిల్లా ఐఫోన్ 13 అగ్రస్థానంలో నిలవగా.. ఏప్రిల్ నెలలో 5.5శాతంతో ఎక్కువగా అమ్ముడు పోయి టాప్‌లో నిలిచింది.
♦యాపిల్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అత్యధికంగా అమ్ముడు పోయి 3.4 మార్కెట్ షేర్‌ను నమోదు చేసింది.
♦యాపిల్ ఐఫోన్ 13 ప్రో 1.8శాతం మార్కెట్ షేర్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్‌ల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది.
♦ఐఫోన్ 12 సైతం మార్కెట్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. ఏప్రిల్ నెలలో 1.6శాతం ఫోన్‌లు అమ్ముడుపోయి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
♦యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ 2022 1.4శాతం మార్కెట్‌తో ఎక్కువగా అమ్ముడు పోయిన ఐఫోన్‌ల జాబితాలో 5వస్థానం దక్కించుకుంది.
♦ఇక యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌లను మినహాయించి మిగిలిన స్మార్ట్ సంస్థలకు చెందిన ఏఏ ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడు పోయాయో ఒక్కసారి పరిశీలిస్తే.. 1.5శాతం మార్కెట్ షేర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
♦మోస్ట్ అఫార్డబుల్ ఫోన్‌ల అమ్మకాలతో శాంసంగ్ గెలాక్సీ ఏ13..1.4శాతం మార్కెట్‌ను దక్కించుకుంది.
♦అఫార్డబుల్ గో ఎడిషన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ ఎక్కువగా అమ్ముడు పోయి 1.4శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకుంది.
♦మిడ్ రేంజ్ డివైజ్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్ ఫోన్ నిలిచింది. 1.3శాతం మార్కెట్‌తో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంది.
♦యాపిల్, శాంసంగ్ సంస్థ మినహాయిస్తే రెడ్ మీ నోట్ 11 ఎల్‌టీఈ ఫోన్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడు పోయింది. 1.3 మార్కెట్ షేర్‌తో యాపిల్, శాంసంగ్ ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరి 26న విడుదలైన సమయంలో రెడ్ మీ నోట్ 11 ఎల్‌టీఈ ఫోన్ ధర రూ.12,929గా ఉంది.
♦చివరిగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడవుతున్న జాబితాలో 5జీ ఫోన్‌ల సంఖ్య పెరుగుతున‍్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడైంది. గతేడాది 5జీ ఫోన్‌లు 4మోడళ్లు అమ్ముడుపోతే..ఈ ఏడాది అనూహ్యంగా వాటి సంఖ్య 7కి చేరింది.
♦ఒక్క 5జీ ఫోన్‌ల విషయానికొస్తే అమ్మకాల్లో 5జీ ఫోన్‌లు 3 వస్థానంలో నిలిచాయి. కొనుగోలు దారుడి ఆర్ధిక స్థితి గతులకు (లోయర్ ప్రైస్ బ్యాండ్స్) అనుగుణంగా తక్కువ ధరకే లెటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్‌లో విడుదలవుతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనుగులో చేసేందుకు ఆసక్తి చూపే యూజర్ల సంఖ్య పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన డేటాలో హైలెట్ చేసింది.
చదవండి👉గతేడాది హాట్‌కేకుల్లా అమ్ముడైన ఫోన్‌లు ఇవే! ఏ ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడయ్యాయంటే?
Comments
Please login to add a commentAdd a comment