puskara ghats
-
పుష్కర ఘాట్లు.. ఇక ఫుడ్‌కోర్టులు
కృష్ణానది ఒడ్డున ఉన్నవారికి మళ్లీ తిప్పలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నంలో ప్రభుత్వం సీతానగరం (తాడేపల్లి రూరల్): కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు త్వరలోనే ఫుడ్ కోర్టులుగా మారనున్నాయి. కృష్ణానదికి దిగువ ప్రాంతంలో విజయవాడ, సీతానగరం ప్రాంతాలలో నిర్మించిన ఈ ఘాట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి 24 గంటలూ ఫుడ్ కోర్టులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గ వారధి వరకు వివిధ రకాల బోట్లు ఏర్పాటు, నీటిలో విన్యాసాలు, ప్యారాచూట్ లాంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని నిమిత్తం కనకదుర్గ వారధి వద్ద 12 అడుగుల మేర ఫైబర్ గేటును ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దాని నిమిత్తమే కనకదుర్గ వారధి వద్ద ప్రస్తుతం పది అడుగులమేర క్రాస్ బండ ఏర్పాటు చేసి, నీటినిల్వను కూడా పరిశీలించారు. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం తీసుకుంటే విజయవాడ, మహానాడు ప్రాంతాల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న ఇళ్లు కూడా తొలగిస్తారనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇళ్లు తొలగించిన ప్రాంతంలో మినీ పార్కులు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ బాధ్యతలను బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేటు పర్యాటక సంస్థకు అప్పగించనున్నట్లు సమాచారం. సదరు సంస్థ నిర్వహించేందుకు సుముఖం వ్యక్తం చేసినప్పటికీ స్థానికంగా ఉన్న ఇద్దరు మంత్రులు తమకు కూడా వాటాలు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు, సదరు సంస్థకు చెందిన వ్యక్తులు ఇందుకు నిరాకరించడంతో కొంతమేర ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. ఏదేమైనా పర్యాటక రంగం పేరుతో ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొంతమంది అధికారులు దీనిని ఏపీ టూరిజానికి అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సలహాలు అందజేసినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. -
పున్నమిఘాట్లో ప్రముఖుల పుష్కర స్నానం
విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగుస్తుండటంతో పుష్కరఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువైంది. మంగళవారం చివరి రోజున ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు, మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, నటుడు సాయికుమార్, సినీ నిర్మాత అశోక్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పున్నమిఘాట్లో పుణ్యస్నానమాచరించారు. -
భక్తజనంతో కోలాహలం
-
పుష్కర ఘాట్లకు ఆధ్యాత్మిక శోభ
-
ఆరోగ్యం జాగ్రత్త సుమా ?
విస్తరిస్తున్న విరేచనాలు గుంటూరు, బెజవాడల్లో భారీగా కేసులు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లబ్బీపేట: పుష్కర యాత్రికలు డయోరియా (విరేచనాలు) బారిన పడుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నారు. గుంటూరుజిల్లాలో 700లకు పైగా డయేరియా కేసులు నమోదు కాగా, విజయవాడలో సైతం పలువురు భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. వారికి పుష్కర వార్డుల్లో చికిత్స చేసి పంపిస్తున్నారు. కలుషితనీరు. ఆహారం, పారిశుద్ధ్య సమస్యకారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్న తరుణంలో అధికారులు ఇప్పటికైన అప్రమత్తం కాకుంటే వ్యాధుల చుట్టుముట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. కలుషిత జలాల వల్లే మన తాగే నీరు , తీసుకునే ఆహారం కలుషితమైనప్పుడు డయోరియా సోకుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం Mýృష్ణానదిలో తక్కువ నీటి మట్టం ఉండటం, పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. దీంతో మల మూత్రాలు, ఇతరత్రా వ్యర్థాలతో కలుషితమైన నీటిని స్నానం చేసేసమయంలో పొరపాటు నోట్లోకి వెళ్లినప్పుడు మింగేస్తే డయేరియా, టైఫాయిడ్, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రవాహం తక్కువుగా ఉన్న Mýృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో స్నానం చేసే వారికి ఇలాంటి సమస్యలు వచ్చినట్లు ్ల చెపుతున్నారు. చర్మ సమస్యలు, కంటి, గొంతు, చెవి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముంది. పుష్కర నగర్లలో పారిశుధ్య లేమి యాత్రికులకు పుష్కరనగర్లలో ఉచితంగా అందజేస్తున్న అల్పాహారం, భోజనాలు కలుషితమైనా జబ్బులు వ చ్చే ప్రమాదముంది. అక్కడే పెద్దఎ తు ్తన టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, స మీపంలోనే భోజనాలు వడ్డించడంతో ఆహారం కలుషితమవుతున్నట్లు చెపుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి ఆరోగ్య వంతమైన పుష్కర స్నానం కోసం,.. నదిలో మునిగే సమయంలో నోట్లోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. నదిలో స్నానమయ్యాక మరోసారి మంచినీటితో స్నానం చేయడం ఉత్తమం. పుష్కర నగర్లో పెట్టే ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో చూడాలి. ఆ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా, దుర్గం« దం వస్తున్నా అక్కడ ఆహారం తీసుకోరాదు. వీలయినంత వరకూ మినరల్ వాటర్‌నే తీసుకోవాలి. -
హరహర మహాదేవా శంభో శంకరా ..
ఘాట్లలో జంగమదేవరుల సందడి కొల్లిపర: పుష్కరాల్లో జంగమదేవరలు సందడి చేస్తున్నారు. కొల్లిపరలోని కృష్ణానది రేవు వద్ద పుణ్నస్నానాలు ఆచరించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జంగమదేవరలు తమ సంప్రదాయ వేషధారణతో శంఖం పూరిస్తు, గంటను మోగిస్తూ ఈశ్వరున్ని కీర్తిస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. జంగమదేవరలు చేస్తున్న సందడితో నదీప్రాంతం మరింత భక్తిభావంతో నిండింది. -
చిన్నారుల చిద్విలాసం
-
పనులన్నీ పూర్తి కావాల్సిందే
– సోమశిల పుష్కరఘాట్ల పరిశీలన కొల్లాపూర్ రూరల్ : జిల్లాలో బుధవారంలోగా అన్ని పుష్కరఘాట్ పనులు పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్ మండలం సోమశిలలోని పుష్కరఘాట్ పనులను వారు పరిశీలించారు. వీఐపీ ఘాట్‌లో పనులు నత్తనడకన ఉన్నాయని మండిపడ్డారు. అనంతరం సోమేశ్వరాలయంలో సోమేశ్వరున్ని దర్శించుకుని పూజలు చేసి ఆవరణలో మొక్కలు నాటారు. పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేసిన ప్లాట్‌ఫామ్‌ను పరిశీలించారు. అనంతరం వీఐపీఘాట్ వద్ద కృష్ణానీటిని తలపై పోసుకుని ఆనందం వ్యక్తంచేశారు. సోమశిల దగ్గర కృష్ణానదిలో టూరిజం లాంచీలో మంత్రులు ప్రయాణం చేసి నల్లమల అందాలను వీక్షించారు. ఈ కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సర్పంచ్ వెంకటస్వామి, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, టీఆర్ఎస్ నాయకులు నర్సింహారావు, రాజేష్; మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు
రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ కోడూరు : పుష్కరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుష్కర ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. హంసలదీవి, పవిత్ర కృష్ణాసాగర సంగమ ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. దుర్గాఘాట్, పవిత్ర సంగమం, కృష్ణా సాగర సంగమం వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి తదితర ఘాట్ల వద్ద కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పౌరాణిక, కూచిపూడి, భారతనాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వీటి నిర్వహణకు స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యదర్శి వై.సుబ్రహ్మణ్యం వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వికాస సమితి మండల అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, సర్పంచి కె.సముద్రాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.