
‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేస్తున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలను నా భార్య ఐశ్వర్యా రాయ్ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఆ విషయంలో తనకు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని హీరో అభిషేక్ బచ్చన్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘కుటుంబం విషయంలో ఐశ్వర్య ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఆమె వల్లే నేను సినిమాలపై పూర్తీగా దృష్టి పెడుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.
నేను పుట్టిన తర్వాత మా అమ్మ జయా బచ్చన్ సినిమాలు మానేశారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న అమితాబ్ బచ్చన్ సినిమాలతో బిజీగా ఉండి రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా స్కూల్‌లో జరిగే ప్రతి ఫంక్షన్ కు, నా బాస్కెట్ బాల్ cటీలకు నాన్న వచ్చేవారు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి ప్రేరణ ΄పొందాలి. ప్రపంచంలోని తల్లిదండ్రులపై నాకు అమితమైన గౌరవం ఉంది.
తల్లి బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యతలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని చె΄్పారు అభిషేక్. కాగా అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ మాటలతో ఆ వార్తలకు చెక్ పడిందని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment