ఐశ్వర్య కూతురేనా? గుర్తుపట్టలేకుండా ఉందే.. | Aaradhya Bachchan Flaunts New Hairstyle for Ambanis Bash; Looks Gorgeous | Sakshi
Sakshi News home page

Aaradhya Bachchan: లుక్కు మార్చిన ఆరాధ్య.. అచ్చం తల్లిలాగే.. ఎంత క్యూట్‌గా ఉందో!

Published Mon, Mar 4 2024 1:31 PM | Last Updated on Mon, Mar 4 2024 2:35 PM

Aaradhya Bachchan Flaunts New Hairstyle for Ambanis Bash; Looks Gorgeous - Sakshi

అందాల తార ఐశ్వర్యరాయ్‌- బాలీవుడ్‌ స్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌ దంపతుల గారాలపట్టి.. ఆరాధ్య. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. అటు ఐష్‌ కూడా కూతురి స్కూల్‌ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఇక అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్‌ తారలు హాజరైన సంగతి తెలిసిందే! అందులో బచ్చన్‌ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్‌, ఐష్‌, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్‌ను తెగ ఎంజాయ్‌ చేశారు.

గెటప్‌ మార్చింది..
అయితే ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్‌కట్‌ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్‌ లీవ్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరాధ్య గెటప్‌ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ నుదుటి మీద కురులు(బ్యాంగ్స్‌) లేకపోతే ఆరాధ్య ఎంత బాగుందో.. ఈ పిల్ల అచ్చం ఆమె అమ్మలాగే ఉంది.'

అచ్చం తల్లిలాగే..
'యవ్వనంలో ఐశ్వర్య ఎలా ఉండేదో.. సేమ్‌ టు సేమ్‌.. అలాగే ఉంది. ఇంత క్యూట్‌గా ఉన్న పాప ఎందుకని అలా బ్యాంగ్స్‌తో తన ముఖాన్ని దాచుకుందో..', 'ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్‌స్టైల్‌ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది' అని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది.

చదవండి: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement