
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లకు సైతం ఎదురైంది.
ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు.
నేను పబ్లిక్ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment