జామ్‌నగర్‌లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.
ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు.
బాలీవుడ్‌లో త్రీ ఖాన్స్‌గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు ఒకే ఫ్రేమ్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment