Aamir Khan Drunk with Salman Khan, Wake Up Next Day with His Bracelet - Sakshi
Sakshi News home page

Salman Khan: పార్టీలో మందు తాగిన స్టార్స్‌.. తెల్లారేసరికి ఆమిర్‌ చేతికి సల్మాన్‌ బ్రేస్‌లెట్‌.. ఇచ్చేద్దామన్నా..

Published Sun, Jul 9 2023 1:16 PM | Last Updated on Sun, Jul 9 2023 5:07 PM

Aamir Khan Drunk with Salman Khan, Wake up Next Day with His Bracelet - Sakshi

ఈ ఏడాది ఈద్‌ పండగను బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఎంతో ఘనంగా నిర్వహించాడు. సెలబ్రిటీలను వేడుకకు పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో సల్మాన్‌.. ఆమిర్‌ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అయితే ఈ పార్టీ ముగిసిన తెల్లారి సల్మాన్‌ చేతికి ఉండాల్సిన బ్రాస్‌లెట్‌ ఆమిర్‌ చేతికి ఉందట. యూట్యూబర్‌ జబి కోయ్‌ ఆ పార్టీలో జరిగిన ఆసక్తికర సంఘటనను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.

ఆమిర్‌ ఖాన్‌తో మీటింగ్‌ అనే వ్లాగ్‌లో యూట్యూబర్‌ జబి కోయ్‌ మాట్లాడుతూ.. "ఆమిర్‌ ఖాన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు ఆయన చేతికి సల్మాన్‌ ధరించే బ్రేస్‌లెట్‌ ఉండటం చూశాను. అది తన చేతికి ఎలా వచ్చిందని అడిగాను. అందుకు ఆమిర్‌ మాట్లాడుతూ.. 'రాత్రంతా సల్మాన్‌, నేను హుషారుగా తిరుగుతూ ఉన్నాం. అతడి సినిమా చూసి ఎంజాయ్‌ చేశాం. పార్టీలో తను మందు తాగాడు, నేను కూడా తాగాను. తాగిన మైకంలో అతడి బ్రేస్‌లెట్‌ నాకు ఇచ్చాడు.

మనం ఒకరికొకరం ఎంతోకాలంగా తెలుసు. నువ్వు నా బ్రోవి. అందుకే దీన్ని నీకు అప్పగిస్తున్నా, ఎప్పటికీ దాన్ని అలాగే భద్రంగా ఉంచుకో.. అంటూ నా చేతికిచ్చాడు. కానీ మరుసటి రోజు నిద్ర లేచాక ఆ బ్రేస్‌లెట్‌ ఇంకా నా చేతికే ఉండేసరికి కంగారుపడ్డాను. పొరపాటున దీన్ని ఎక్కడైనా పడేసుకుంటే దానికి నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే తిరిగిచ్చేదామనుకున్నా, కానీ అలా చేయలేకపోతున్నాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ఎక్కడికి వెళ్లినా అందరూ అదే బ్రాస్‌లెట్‌ గురించి అడుగుతుండటంతో ఆమిర్‌ కాస్త ఇబ్బందిపడుతున్నాడు" అని చెప్పాడు జబి కోయ్‌. సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌- ఆయుష్‌ శర్మ ఇచ్చిన ఈద్‌ పార్టీలో ఆమిర్‌ తన చేతికి బ్రేస్‌లెట్‌తో హాజరయ్యాడు.

చదవండి: మా నాన్న మమ్మ​ల్ని టార్చర్‌ పెడుతున్నాడు, ఇప్పటికైనా నమ్ముతారా?: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement