Infosys Narayana Murthy Success Story: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పారిశ్రామిక వేత్తల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి.. జీవితాన్ని విజయ పథంలో తీసుకెళ్లి ఎంతో మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' (NR Narayana Murthy). చదువుకునే రోజుల్లోనే అనేక ఉద్యోగ ఆఫర్లను వదులుకుని సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడు.
నిజానికి నారాయణ మూర్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసారు. ఆ సమయంలోనే ఆయనకు ఎయిర్ ఇండియా, టెల్కో (Telco), టిస్కో (Tisco) వంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ వచ్చిన అన్ని ఉద్యోగాలను వదిలేసి.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అహ్మదాబాద్‌లో చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.
(ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?)
సగం జీతానికే పని చేసారు..
వచ్చిన మంచి ఉద్యోగాలను వదిలిపెట్టి నారాయణ మూర్తి మాదిరిగా నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ భారతదేశంలో మొదటి సారి షేరింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయాలనే ఆలోచన ఉన్న మూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16 మంది విద్యార్థులున్న బ్యాచ్‌లో సిస్టం గురించి, తెలివైన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభించింది. కంప్యూటర్ ఉపయోగించి చాలా ఇంటరాక్టివ్ పాఠాలను రూపొందించే అవకాశం గురించి తెలుసుకోవాలనే తపనతో సగం జీతం తీసుకున్న ఏకైక వ్యక్తి నేనే అని నారాయణ మూర్తి ఒక సందర్భంలో అన్నారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కూడా వెల్లడించారు.
(ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!)
1981లో నారాయణ మూర్తి ఆరుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పట్లో ఈ కంపెనీ స్థాపించడానికి పెట్టిన పెట్టుబడి కేవలం రూ. 10,000 మాత్రమే. ఈ రోజు కంపెనీ విలువ ఏకంగా రూ. 5,25,000 కోట్లు . నారాయణ మూర్తి నికర ఆస్తుల విలువ సుమారు రూ. 33,800 కోట్లు అని తెలుస్తోంది. వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకుని ఉండి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించి ఉండేవాడు కాదు. కావున అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నెన్నో సాహసాలు చేయాల్సి ఉంటుందని నారాయణ మూర్తి జీవితమనే మనకు చెబుతుంది.
Comments
Please login to add a commentAdd a comment