సవాల్‌ ఉంటేనే సక్సెస్‌... తగ్గేదేలే! | Women in business and their success stories | Sakshi
Sakshi News home page

సవాల్‌ ఉంటేనే సక్సెస్‌... తగ్గేదేలే!

Dec 7 2024 11:14 AM | Updated on Dec 7 2024 3:02 PM

Women in business and their success stories

‘గృహిణిగా బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి ఇంక వ్యాపారాలు ఏం చేస్తారు?’ అనుకునేవారికి  ‘చేసి చూపుతాం..’  అని నిరూపిస్తోంది నేటి మహిళ.  ‘ఒకప్పుడు మేం గృహిణులమే ఇప్పుడు వ్యాపారులం కూడా’ అంటున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా,  నచ్చిన పని చేస్తూ అందరూ మెచ్చేలా విజయావకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు కలిశారు. సవాళ్ళను ఎదుర్కోవడమే తమ సక్సెస్‌ మంత్ర అని చెప్పారు. ఆ వివరాలు వారి మాటల్లో... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

స్ట్రాంగ్‌గా ఉంటే.. వింటారు 
సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. నాకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటీరియర్‌ అడ్వాన్స్‌ కోర్స్‌ 2018లో పూర్తి చేశాను. గేటెడ్‌ కమ్యూనిటీలు, సెలబ్రిటీ హౌజ్‌లు డిజైన్‌ చేశాను. కస్టమర్‌ బడ్జెట్, ఆలోచనలు తీసుకొని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకు 200లకు పైగా ్ర΄ాజెక్ట్స్‌ పూర్తి చేశాను. ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో మహిళలు రాణించలేరు అనుకుంటారు. కానీ, నేను డామినేటింగ్‌గా ఉంటాను. స్ట్రాంగ్‌గా ఉంటే ఎవ్వరైనా మన మాట వింటారు. – అనూష

 మేకప్‌ ఒక ఆర్ట్‌ 
మేకప్‌ ఆర్ట్‌ నాకు చాలా ఇష్టమైన వర్క్‌. అందుకే, ప్రొఫెషనల్‌ కోర్స్‌ తీసుకొని, ముందు మా కమ్యూనిటీలోనే స్టార్ట్‌ చేశాను. ఇంటివద్దకే వచ్చి మేకప్‌ చేయించుకునేవారు. రెండేళ్ల క్రితం స్టూడియో ఏర్పాటు చేశాను. 7–8 రాష్ట్రాలలో మా స్టూడియో ద్వారా మేకప్‌ సర్వీస్‌ అందిస్తున్నాను.  చాలా మంది మేకప్‌ అనగానే ఫౌండేషన్, కాజల్‌.. బ్యుటీషియన్‌ వర్క్‌ అనుకుంటారు. అలాగే మేకప్‌ అనేది చాలా మందికి పెళ్లి వంటి ప్రత్యేకమైన సందర్భం తప్పితే అంతగా అవసరం లేనిదిగా చూస్తారు. కానీ, పెళ్లి, వెస్టర్న్‌ పార్టీలు, బర్త్‌ డే పార్టీలు... ఇలా సందర్భానికి తగినట్టు మేకప్‌ స్టైల్స్‌ ఉన్నాయి. మేకప్‌ ఆర్టిస్టులకి మార్కెట్లో చాలా పెద్ద పోటటీ ఉంటుంది. కానీ, వారి నెట్‌వర్క్‌తో  ప్రొఫెషనల్‌గా చేసే మేకప్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.  – శ్రీలేఖ, మేకప్‌ సెంట్రల్‌


 

నిరూపించుకోవాలనుకుంటే సాధించగలం
లక్సస్‌ డిజైన్‌ స్టూడియోస్పెషల్‌గా బ్రైడల్‌ వేర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ ఇద్దరికీ డిజైన్‌ చేస్తాను. కార్పొరేట్‌ యూనిఫార్మ్స్, ఫస్ట్‌ బర్త్‌డే పార్టీలకు డ్రెస్‌ డిజైన్‌ చేస్తాను. 2013లో చెన్నైలో మొదటి బ్రాంచ్‌ స్టార్ట్‌ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. సెలబ్రిటీలకు దాదాపు 50 తమిళ సినిమాలకు, 50 తెలుగు సినిమా స్టార్స్‌కి డిజైన్‌ చేశాను. ఫ్యాబ్రిక్‌ ఎంపికలో, ఉద్యోగుల విషయంలోనూ, డిజైనింగ్‌లోనూ.. ప్రతిదీ సవాల్‌గా ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే ఏమైనా సాధించగలం. - అమూల్య,  అమూల్య అండ్‌ కృష్ణ కొచర్‌ 

పనిలో ప్రత్యేకత  చూపాలి
కేక్‌ బేకింగ్‌ తయారు చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నవారు ‘ఇప్పటికే మార్కెట్లో చాలామంది హోమ్‌ మేకర్స్‌ ఉన్నారు, నీవేం సక్సెస్‌ అవుతావు’ అన్నారు. కానీ, వారి మాటలు పట్టించుకోలేదు. నా హార్డ్‌ వర్క్‌నే నమ్ముకున్నాను. కస్టమైజ్డ్‌ కేక్స్‌ హాఫ్‌ కేజీవి కూడా తయారు చేస్తాను. ఎగ్‌లెస్‌ డిజర్ట్స్‌ కేక్స్‌ మా ప్రత్యేకత. మొదట మా కమ్యూనిటీలోని వారికే చేసేదాన్ని. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్‌ చేయడం, ఆ తర్వాత ఒక్కో ఆర్డర్‌ రావడం మొదలయ్యింది. టైమ్‌ ప్రకారం డెలివరీ చేసేదాన్ని. ఒకసారి ఒక జంటకు వారి బేబీ షవర్‌కి బహుమతులు ఆర్డర్‌పై అందించాను. ఇటీవల వారి రెండవ బేబీ షవర్‌ కోసం అతిథులకు ప్రత్యేకమైన కేక్‌ వర్క్‌షాప్‌ నిర్వహించాను. దాదాపు 400 మంది కస్టమర్లు ఆర్డర్స్‌ ఇస్తుంటారు. ఫైనాన్స్‌ సబ్జెక్ట్‌లో మాస్టర్స్‌ చేశాను. నాదైన సొంత ఆలోచనతో స్టార్టప్‌ నడ΄ాలని బేకింగ్‌ తయారీ మొదలుపెట్టాను. సక్సెస్‌ అవుతుందా అనే ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా రుచికరమైన కేక్స్‌ తయారుచేసివ్వడంలోనే దృష్టిపెట్టాను.  – రాధిక,  ఆర్బేక్‌ హౌజ్‌

ఇదీ చదవండి: 13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ : ఎవరీ శ్రద్ధా


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement