
నిఖిల్ నందా (Nikhil Nanda).. ఈ పేరు బహుశా ఎవరికీ తెలుసుండకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు 'అమితాబ్ బచ్చన్' అల్లుడు అంటే కొంతమందికి, ఎస్‌కార్ట్స్ కుబోటా లిమిటెడ్ చైర్మన్ అంటే మరికొందరికీ తెలిసే ఉంటుంది. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన నందా గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
1974 మార్చి 18న జన్మించిన నిఖిల్ నందా.. డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక డూన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని.. వార్టన్ స్కూల్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. ఆ తరువాత ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్న నైపుణ్యంతో.. ఎస్‌కార్ట్స్ కుబోటా లిమిటెడ్‌లో పగ్గాలు చేపట్టాడు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో.. నందా నాయకత్వంలో కంపెనీ ఉన్నత శిఖరాలను చేరింది.

నిఖిల్ నందా.. దిగ్గజ నటుడు & చిత్రనిర్మాత రాజ్ కపూర్ కుమార్తె అయిన రీతు నందా కుమారుడు. దీంతో అతను రిషి కపూర్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్ వంటి ప్రముఖులకు మేనల్లుడు అయ్యాడు. కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్ కూడా ఇతనికి బంధువులే. నటులకు దగ్గర బంధువు కావడం చేత నందాకు చలనచిత్ర పరిశ్రమలో కూడా సంబంధాలు ఉన్నాయి.

అమితాబ్ బచ్చన్ & జయా బచ్చన్ కుమార్తె 'శ్వేతా బచ్చన్'ను నిఖిల్ నందా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవ్య నవేలి నందా, అగస్త్య నందా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్య తన పాడ్‌కాస్టింగ్ వెంచర్‌లతో తనదైన ముద్ర వేసినప్పటికీ, అగస్త్య ఇటీవల జోయా అక్తర్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం "ది ఆర్చీస్"తో వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
నిఖిల్ నందా.. ఎస్‌కార్ట్స్ కుబోటా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈ కంపెనీ రూ. 42,141 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దూసుకెళ్తోంది. ఈ సంస్థ వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ యంత్రాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్, రైల్వే పరికరాలను తయారు చేస్తూ.. ఈ విభాగంలోని అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment