
బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ 2 అనే కొత్త రిటైర్మెంట్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ను పదవీవిరమణ సమయంలో నిర్దిష్టమైన రాబడులు వచ్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్‌లో ఈ తరహా రిటైర్‌మెంట్ ప్లాన్లు చాలా కంపెనీలు అందిస్తున్నాయి. ఇటువంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసేముందు పాలసీదారులు అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బజాన్ కొత్త పథకంలోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.
దీర్ఘకాల వాయిదా: ఈ ప్రత్యేక ఫీచర్ 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న వ్యక్తులు తమ ఆర్థిక భవిష్యత్తును ముందుగానే నిర్ణయించుకునేందుకు తోడ్పడుతుంది. వాయిదా వ్యవధిని 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఇది పొదుపు పెరగడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది.
మల్టిపుల్ యాన్యుటీ పేఅవుట్ ఆప్షన్లు: ఈ ప్లాన్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ (ఆర్ఓపీ) ఎంపికలతో సహా వివిధ యాన్యుటీ చెల్లింపు సదుపాయాలను అందిస్తుంది. ఇవి వ్యక్తిగత రిటైర్మెంట్ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉంటాయి.
కస్టమైజబుల్ ఆర్ఓపీ: పాలసీదారులు కొనుగోలు ధర 50% నుంచి 100% రాబడిని ఎంచుకోవచ్చు. ఇది యాన్యుటీ చెల్లింపులను పెంచుతుంది.
గ్యారంటీడ్ లైఫ్ టైమ్ ఇన్ కమ్: రిటైర్‌మెంట్ సమయంలో స్థిరమైన ఆదాయాన్ని ఇది నిర్ధారిస్తుంది.
ఇదీ చదవండి: అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్‌ఈసీ
ఈ సందర్భంగా బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈఓ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పదవీ విరమణ తర్వాత చాలాఏళ్లు జీవిస్తున్నారని చెప్పారు. కానీ సరైన ప్రణాళికలేక రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా రిటైర్‌మెంట్ ప్లాన్‌ను తీసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment