Retirement Planning
-
రిటైర్మెంట్ ప్లానింగ్‌లో అక్కడివాళ్లే టాప్
కోల్‌కతా: విశ్రాంత జీవనం (రిటైర్మెంట్ తర్వాత) కోసం సన్నద్ధతతో తూర్పు భారత్ ప్రజలు ఇతర ప్రాంతాల వారితో పోల్చితే ముందున్నారు. ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్‌లో సున్నా నుంచి నూరు వరకు స్కేల్‌పై ఉత్తర భారత్ 54 పాయింట్ల వద్ద ఉంది. అదే దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలు రిటైర్మెంట్ జీవితానికి సన్నద్ధతలో 48 పాయింట్ల వద్దే ఉన్నాయి. పశ్చిమ భారత్ 49 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు 49 పాయింట్లుగా ఉంది. కాంటార్‌తో కలసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం’ నాలుగో ఎడిషన్ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. పట్టణ వాసుల్లో రిటైర్మెంట్ సన్నద్ధత ఎలా ఉంది, దీనిపై వారిలో ఉన్న అవగాహన, ఆకాంక్షలు, రిటైర్మెంట్ సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, ప్రణాళికల గురించి ఈ అధ్యయనం తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 పట్టణాల్లో 25–65 ఏళ్ల వయసులోని వారి అభిప్రాయాలు తెలుసుకుంది.అధ్యయనం వివరాలు.. తూర్పు భారత్‌లో 72 శాతం మంది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతేడాది ఇది 67 శాతంగా ఉంది. ఇదే ప్రాంతంలో 82 శాతం మంది ఆరోగ్యం కాపాడుకుంటామని నమ్మకంగా చెప్పారు. 67 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్‌ను రిటైర్మెంట్ భద్రత కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఎన్పీఎస్ ఖాతా ఉంది. ఈ ప్రాంతంలో జీవిత బీమాపై 97 శాతం మందికి, హెల్త్ ఇన్సూరెన్స్‌పై 90 శాతం మందికి అవగాహన ఉంది.పశ్చిమ భారత్‌లో 66 శాతం మంది, ఉత్తర భారత్‌లో 60 శాతం, దక్షిణ భారత్‌లో 58 శాతం మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు.తూర్పు భారత్‌లో 56 శాతం మంది 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టడాన్ని సమర్థించారు. 50 ఏళ్లకు పైబడిన వారిలో 94 శాతం మంది ముందుగా రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు ప్రారంభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కనీస అవసరాలను తీర్చుకునే విషయంలో 62 శాతం మంది, పిల్లల భవిష్యత్ విషయమై 64 శాతం మందిలో ఆందోళన కనిపించింది. 94 శాతం మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం విషయంలో విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, 64 శాతం మంది ఒంటరితనం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పర్యావరణం పట్ల 76 శాతం మందిలో ఆందోళన కనిపించింది. తూర్పు భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు వైద్య అవసరాలు, పిల్లల భవిష్యత్‌కూ తమ ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.పెరుగుతున్న ప్రాధాన్యత..జీవనకాలం పెరుగుతుండడంతో భారతీయులకు రిటైర్మెంట్ ప్రణాళిక అత్యంత కీలకంగా మారుతోంది. మా అధ్యయనంలో గుర్తించిన అంశాలు మారుతున్న రిటైర్మెంట్ అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ విషయమై సమగ్రమైన విధానాన్ని అనుసరించేందుకు ఈ అధ్యయనం స్ఫూర్తినిస్తుంది.– ఈవీపీ రాహుల్ తల్వార్,మ్యాక్స్‌లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ -
నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..
చాలా మందికి రిటైర్డ్ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కొందరు సముద్రానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడితే మరికొందరు ప్రశాంతంగా ఏ కొండ ప్రాంతంలోనో లేదా ఊళ్లోనో ఉండాలనుకుంటారు. మన దేశంలో రిటైర్మెంట్ పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి.పదవీ విరమణ అంటే పరిమితమైన అవసరాలతో ప్రశాంతమైన జీవనమనే రోజులు పోతున్నాయి. నేటి రిటైరీలు ఉద్యోగానంతరం కూడా జీవితాన్ని చురుగ్గా సాగించాలనుకుంటున్నారు. ప్రయాణాలు, హాబీలు, సోషల్ ఎంగేజ్మెంట్ మొదలైన వాటితో సందడిగా గడపాలనుకుంటున్నారు. అయితే, పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ కల సాకారం కాగలదు. చాలా మందికి తాము సరైన ప్రణాళికనే వేసుకున్నామా, తాము దాచుకుంటున్నది రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోతుందా అనే సందేహాలు ఉంటాయి.ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాల కారణంగా ప్రస్తుతం మనిషి జీవితకాలం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకో రూ. 1 లక్ష (ఏడాదికి రూ. 12 లక్షలు) అవసరమవుతాయని, 60 ఏళ్ల తర్వాత మరో 15 ఏళ్ల పాటు జీవిస్తారనుకుంటే మొత్తం రూ. 1.8 కోట్లు (రూ. 12 లక్షలు గీ 15) అవసరమవుతాయి. 85 ఏళ్ల వరకు జీవిస్తే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇలా అదనపు సంవత్సరాల కోసం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరుల సమీకరణకు కృషిరిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం నిశ్చింతగా సా గేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించండి. వాస్తవ గణాంకాలను పరిగణన లోకి తీసుకోండి. మీ నెలవారీ జీవన వ్యయాలను లెక్కేయండి. ముందుగా చెప్పినట్లు జీ విత కాలం 85 ఏళ్లనుకుంటే, 60 ఏళ్ల వ్యక్తికి అప్పటివరకు అయ్యే జీ వన వ్యయాల కోసం రూ. 3 కోట్ల వర కు ని ధి అవసరమవుతుంది. వార్షిక ద్రవ్యోల్బణానికి సమాన స్థాయిలో రాబడులు ఉంటాయన్న అంచనా లతో ఈ మేరకు లెక్క వేశాం. మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్క వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. దేశీయంగా పెరుగుతున్న హెల్త్‌కేర్ ఖర్చులను ఒకసారి చూద్దాం. హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం సుమారు 14 శాతంగా ఉంటోంది. కొత్త టెక్నాలజీలు, చికిత్సల వల్ల బిల్లుల భారం మరింతగా పెరుగుతుంది. వైద్య చికిత్సల ఖర్చులు పెరిగే కొద్దీ ఎమర్జెన్సీల కోసం మరింత నిధిని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు మీరేం చేయాల్సి ఉంటుందంటే..పెద్ద మొత్తంలో కవరేజీ ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలిబేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పరిమాణాన్ని పెంచుకునేందుకు టాప్–అప్ తీసుకోవాలిమేజర్ అనారోగ్యం బైటపడినప్పుడు ఏకమొత్తంగా డబ్బునందించే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్‌ను పరిశీలించాలిజీవితకాలానికి మించే రిటైర్మెంట్ ఫండ్‌ను సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే.. 1. భారీ రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం: పొదుపు చేయాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. 2. ఆర్థిక సాధనాలు ఉపయోగించుకోవాలి: మీ రిటైర్మెంట్ ఫండ్‌ను పెంచుకునేందుకు జీవిత బీమా సాధనాలను పరిశీలించండి. ఏ ఆర్థిక ప్రణాళికైనా, ముఖ్యంగా రిటైర్మెంట్లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి విజయవంతం కావాలంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీలు తగినంతగా ఉండటం ముఖ్యం. 3. పన్ను ప్రయోజనాలు: బీమా పథకాలు సాధారణంగా పన్నులపరమైన ప్రయోజనాలు కల్పించేవిగా ఉంటాయి. -
పదవీ విరమణకు పెరుగుతున్న ప్రాధాన్యత
న్యూఢిల్లీ: భారతీయుల్లో విశ్రాంత జీవనం పట్ల అవగాహన పెరుగుతోంది. గతంలో జీవిత లక్ష్యాల్లో పదవీ విరమణ ప్రణాళికకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, పీజీఐఎం ఇడియా నిర్వహించిన ‘రిటైర్మెంట్ రెడీనెస్ సర్వే, 2023’ పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది తాము రిటైర్మెంట్ ప్రణాళిక కలిగి ఉన్నట్టు చెప్పడం గమనార్హం. 2020లో నిర్వహించిన సర్వేలో వ్యక్తుల ఆర్థిక ప్రాధాన్యతల్లో రిటైర్మెంట్ (పదవీ విరమణ)కు 8వ స్థానం ఉంటే, అది ఈ ఏడాది సర్వేలో 6వ స్థానానికి చేరుకుంది. రిటైర్మెట్ అనేది కుటుంబ బాధ్యతల్లో భాగమని గతంలో భావించేవారు. కానీ, కొన్నేళ్ల కాలంలో దీనికి నిర్వచనంలో మార్పు వచి్చంది. వ్యక్తిగత సరక్షణ, స్వీయ గుర్తింపునకు రిటైర్మెంట్ను కీలకంగా ఇప్పుడు ఎక్కువ మంది భావిస్తున్నారు. తమ కోరికల విషయంలో రాజీ పడకుండా ఆర్థిక అంశాలపై నియంత్రణను కోకుంటున్నారు. ‘‘కరోనా మహ మ్మారి కొన్ని ముఖ్యమైన అశాలను ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. స్వీయ గుర్తింపు, స్వీయ సంరక్షణ, స్వీయ విలువ అనేవి కుటుంబ బాధ్యతల నిర్వహణతోపాటు వ్యక్తుల ప్రాధాన్య అంశాలుగా అవతరించాయి’’అని పీజీఐఎం మ్యూచువల్ ఫండ్ సీఈవో అజిత్ మీనన్ పేర్కొన్నారు. సర్వేలోని అంశాలు ► రూ.20–50వేల మధ్య ఆదాయం కలిగిన వారిలో, రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2020లో 49 శాతంగా ఉంటే.. 2023 సర్వే నాటికి 67 శాతానికి పెరిగారు. ► రిటైర్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020 నాటికి రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారిలో 14 శాతం మందే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే, తాజాగా అది 24 శాతానికి పెరిగింది. ► పదవీ విరమణ తర్వాత జీవనానికి పెద్ద మొత్తంలో నిధి అవసరమని ఎక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. 2020లో సగటున రూ.50 లక్షలకు ప్రణాళిక రూపొందించుకుంటుంటే, అది రూ.73.44 లక్షలకు పెరిగింది. ► కరోనా మహమ్మారి మిగిలి్చన జ్ఞాపకాల నేపథ్యంలో మరింతగా ఇన్వెస్ట్ చేస్తూ, ఆర్థిక భద్రత కలి్పంచుకోవాల్సిన అవసరాన్ని మూడింట రెండొంతుల మంది గుర్తిస్తున్నారు. ► ఆర్థిక ప్రణాళిక కలిగిన వారిలో 50 శాతం మంది పదవీ విరమణ తర్వాత ఆర్థిక మదగమనం ఏర్పడితే ఎలా అన్న ఆందోళనతో ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, జీనవ వ్యయం ఆందోళన కలిగించే ఇతర అంశాలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం గురించి 56 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. -
పదేళ్ల పాటు ప్రతి నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేయాలంటే..! ఏది బెస్ట్?
నేను విశ్రాంత జీవనం కోసం కావాల్సిన నిధిని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. రిటైర్మెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలమేనా? – వర్షిల్ స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటీ సరిపోదు. పెట్టుబడులు పెట్టిన తర్వాత స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి కనిపించే నష్టాలకు, యూనిట్ల విలువ క్షీణతకు తట్టుకోగలిగి ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. అయినప్పటికీ స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు అంత సులభమేమీ కాదు. అవి అదే పనిగా నిర్ణీత సమయాల్లో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, అదే సమయంలో స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే సామాన్య ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా ఉండడం కష్టం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే నయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారిందనడానికి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ కూడా ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కాదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది. దీర్ఘకాంలో చిన్న కంపెనీలు సంపదను సృష్టించగలవు. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు. సాధారణంగా చిన్న కంపెనీలను ఎక్కువ మంది అనుసరించరు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చాలా చిన్న కంపెనీలకు దూరంగా ఉంటారు. ప్రతి స్మాల్‌క్యాప్ ఫండ్ భిన్నంగా పనిచేస్తుంటుంది. వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. సిప్ ద్వారా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువగా ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేర్ల ధరలు భారీగా నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా డైనమిక్‌గా ఉండేవి తక్కువే. ముఖ్యంగా చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారు? (సహేతుక వ్యాల్యూషన్ వద్ద) అన్నది రాబడులకు కీలకం అవుతుంది. నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – ఆశిష్ అథాలే రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. నెలవారీ సిప్ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ కోసం ఫిక్స్ డ్ ఇన్కమ్ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గి నప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి. -ధీరేంద్ర కుమార్ - సీఈవో వాల్యూ రీసెర్చ్ -
ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే
నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్ అయితే, అప్పటి నుంచి తమ అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా జీవించొచ్చనే కాన్సెప్ట్ ఆదరణకు నోచుకుంటోంది. తోటి వారిని చూసి దీనికి ఆకర్షితులయ్యే వారూ ఉంటున్నారు. కానీ, ఇది ఎలా సాధ్యం? ఇదే ఎక్కువ మందికి ఎదురయ్యే ప్రశ్న. దీనిపై స్పష్టత తెచ్చుకోలేక, తర్వాత చూద్దాంలే.. అని అనుకుని కెరీర్లో సాగిపోయేవారూ ఉన్నారు. ఉద్యోగ, వృత్తి బాధ్యతలకు ముందస్తుగా విరమణ పలికి, నచ్చినట్టు జీవించడం అంటే వినడానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, దీన్ని చేరుకోవాలంటే సరైన లెక్కలు, ప్రణాళికలు కావాలి. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు లక్ష్యం సఫలమవుతుంది. ఇందుకు ఏం చేయవచ్చన్నది అవగాహన కల్పించే కథనం ఇది. రిటైర్మెంట్ అన్నది అన్నింటిలోకి చివరి లక్ష్యం అవుతుంది. దీనికంటే ముందు జీవితంలో నెరవేర్చాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు తదితరాలు. వీటిని సాధించేందుకు సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారా? రిటైర్మెంట్ కంటే ముందుగా ఎదురయ్యే లక్ష్యాలకు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అవసరం. వీటిని చేరుకునేందుకు కావాల్సినంత, సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లేకపోతే జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల విషయంలో ఏ మాత్రం లెక్కలు తప్పినా, రిటైర్మెంట్ లక్ష్యం విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. ఎవరైనా కానీ, ముందుగా ఎదురుపడే అవసరం గురించే ఆలోచిస్తారు. అందుకే ముందే రిటైర్మెంట్ తీసుకోవాలంటే, దానికంటే ముందు ఎదురయ్యే వాటి గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో కీలకమైన లక్ష్యాలు సాధించలేకపోతే రిటైర్మెంట్ సాధ్యం కాదన్న సూక్ష్మాన్ని గుర్తించాలి. ‘‘సురక్షితమైన భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత మీ జీవన శైలి పదవీ విరమణ తర్వాత దిగజారిపోకూడదు. వైద్య చికిత్సలకు అవసరమైనంత నిధి ఉండాలి. పిల్లల విద్య, వారి వివాహాలు, కారు కొనుగోలు, సెలవుల్లో పర్యటనలు వీటన్నింటికీ ఏర్పాట్లు ఉండాలి’’అని హమ్ ఫౌజీ సీఈవో సంజీవ్ గోవిలా సూచించారు. ఎంత కావాలి..? విశ్రాంత జీవనం కోసం సమకూర్చుకోవాల్సిన నిధి విషయంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే సమకూర్చుకున్న నిధి ఏ మూలకూ చాలకపోవచ్చు. అదే జరిగితే పేరుకే రిటైర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఖర్చులకు చాలక మళ్లీ ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకుని రిటైర్మెంట్ కోసం కావాల్సిన నిధిని పక్కా అంచనా వేయాలి. ఈ విషయంలో నిపుణుల సాయం ఎంతో అవసరం పడుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి కావాల్సిన నిధిని అంచనా వేయడం అత్యంత ముఖ్యమైనదని రైట్ హారిజాన్స్ ఫండ్ మేనేజర్ అనిల్ రెగో పేర్కొన్నారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం నెలవారీ ఖర్చులు రూ.25,000 ఉన్నాయని అనుకుందాం. అతడు ఏ వయసులో రిటైర్ అయితే ఆ తర్వాత జీవనానికి ఎంత మొత్తం కావాలన్నది ఇక్కడి పట్టికలో చూడొచ్చు. ప్రస్తుత నెలవారీ వ్యయాలకు ఏటా సగటున 5 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం పరిగణనలోకి తీసుకుని రిటైరయ్యే నాటికి ఎంత కావాలో వేసిన అంచనాలు ఇవి. పట్టికలోని నెలవారీ పెట్టుబడిని ఏడాదికోసారి 8 శాతం పెంచుతూ వెళ్లాలి. పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి వస్తుందన్న అంచనా. రిటైర్మెంట్ నాటికి సమకూరిన ఫండ్‌పై ఆ తర్వాత ఏటా 7 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, ఇంత మొత్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవసరాలు వేర్వేరు.. రిటైర్మెంట్కు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ మొత్తం అవసరపడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన జీవనశైలి, అవసరాలు, ఖర్చులు ఉంటుంటాయి. కనుక నెలవారీ ఎంత మొత్తం, ఏడాదికి ఎంత చొప్పున కావాలన్నది ఎవరికి వారు అంచనాకు రావాలి. ఏడాదికి తమ ఖర్చులు, తమ ఆరోగ్య అవసరాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నాయా? పిల్లలు ఎంత మంది? వారికి ఏ స్థాయి ఖర్చులో విద్య చెప్పించాలని అనుకుంటున్నారు? సొంతింటి ప్రణాళిక, వాహనం ఇత్యాది అవసరాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు లేదంటే పెట్టుబడి సలహాదారును సంప్రదించాలి. వారు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నెలవారీగా దేనికి ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి, ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక రూపొందించి ఇస్తారు. దీనికోసం ద్రవ్యోల్బణం, జీవిత కాలం తదితర అంశాలను వారు విశ్లేషిస్తారు. వారిచ్చిన ప్రణాళిక ప్రకారం సాగిపోవాలి. 30 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.30,000 ఉన్నాయని అనుకుంటే ఏ వయసులో రిటైర్మెంట్ అయితే ఎంత మొత్తం కావాలో ఇక్కడి టేబుల్లో చూడొచ్చు. పైన టేబుల్ మాదిరే జీవిత కాలం 90 ఏళ్లకు అనుకుని, ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి అంచనా ప్రకారం, ఏటా పెట్టుబడి 8 శాతం పెంచుతూ వెళ్లే విధంగా, రిటైర్మెంట్ తర్వాత 7 శాతం రాబడి కోసం సమకూర్చుకోవాల్సిన నిధి అంచనాలు ఇవి. అప్రమత్తత రిటైర్మెంట్కు మరో ఐదేళ్లు ఉందనగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తం కావాలి. ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వారు మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని అమల్లో పెట్టాలి. ఉదాహరణకు 2008 మార్కెట్ పతనం, 2020 మార్కెట్ పతనం గుర్తుండే ఉంటాయి. 2020 మార్కెట్ పతనం తర్వాత స్టాక్స్ రికవరీకి ఏడాది సమయం పట్టింది. కొన్ని స్టాక్స్ పూర్తిగా కోలుకుని కొత్త గరిష్టాలకు చేరుకుంటే, కొన్ని ఆలస్యంగా రికవరీ అయ్యాయి. అందుకుని రిటైర్మెంట్కు మరో మూడు–ఐదేళ్లు ఉందనగా, మార్కెట్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. భారీ దిద్దుబాటు వచ్చి దిద్దుబాటు వచ్చి చాలా ఏళ్లు అయ్యిందా? మార్కెట్ల వ్యాల్యూషన్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో చలిస్తున్నాయా? ఇలాంటి అంశాలపై నిపుణుల సాయంతో అంచనాకు రావాలి. మూడు ఐదేళ్ల ముందు నుంచి ఏటా నిర్ణీత శాతం చొప్పున ఈక్విటీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు అవసరంపడతాయి. ఎందుకంటే ముందుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కనీసం 25 ఏళ్ల నుంచి 35–40 ఏళ్ల పాటు జీవించి ఉండే వారికి ఈక్విటీలు తప్పనిసరి. అప్పుడే కార్పస్ కరిగిపోకుండా ఉంటుంది. అందుకుని నిపుణులు సూచించిన మేర ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించి, మిగిలిన మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఊహించని విధంగా రిటైర్మెంట్ నాటికి మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురైతే అప్పుడు రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఏడాది నుంచి మూడేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అందుకుని సాధ్యమైన మేర లక్ష్యం వాయిదా పడకూడదంటే ముందస్తు జాగ్రత్తలు తప్పదు. అవరోధాలు.. ముందుగా పదవీ విమరణ తీసుకునే వారికి సంపాదించే కాలం ఇతరులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలంలో సమకూర్చుకోవాల్సినంత 20–25 ఏళ్లకే సాధించాలి. రిటైర్మెంట్ తర్వాత ఇతరులపై ఆధారపడకూడదు. పైగా ముందస్తు రిటైర్మెంట్ అంటే ఉదాహరణకు 55 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుందాం. అక్కడి నుంచి కనీసం 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, 35 ఏళ్ల కాలానికి అవసరాలు తీర్చేంత ఫండ్ కావాలి. 25–30 ఏళ్లకు కెరీర్ ఆరంభిస్తే.. అక్కడి నుంచి ముందస్తు రిటైర్మెంట్కు 30–25 ఏళ్లే మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ కాలానికి ఫండింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదన్నది గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణతో, ఎటువంటి దుబారాకు చోటు ఇవ్వకుండా సంపాదనలో అధిక భాగం భవిష్యత్తుకు పొదుపు చేసుకున్నప్పుడు లక్ష్యం సాకారం అవుతుంది. ఉదాహరణకు పిల్లల విద్య కోసం బడ్జెట్ వేసుకుంటే, ఆ బడ్జెట్ మించకుండా దాన్ని అధిగమించాలి. లేదంటే వేరే లక్ష్యం కోసం ఉద్దేశించిన మొత్తం నుంచి దానికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గొలుసుకట్టు మాదిరి ఒకదాని కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. లేదంటే రుణం తప్పదు. రాబడి రేటు కీలకం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) ఇన్వెస్ట్ చేసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, పెట్టుబడుల విధానంలో చిన్న మార్పుతోనూ మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే మొత్తానికి అనుగుణంగా సిప్ పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికోసారి ఆర్జన పెరిగినప్పుడు పెట్టుబడిని పెంచుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఖర్చులు కూడా ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగాయని పెట్టుబడుల విషయంలో రాజీ పడితే లక్ష్యం సాకారం కాదు. అనవసర ఖర్చులను తగ్గించుకుని అయినా అనుకున్న మేర, ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఏటా ఆదాయం అనుకున్న మేర పెరగకపోతే ఎలా? దీనికి సంబంధించి కూడా ప్లాన్–బి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రస్తుత జీవనశైలిలో పూర్తి రాజీ పడకూడదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రెండింటినీ సమన్వయం చేసుకునే విధంగా ఆచరణ ఉండాలి. అలాగే, ఏటా పెట్టుబడిని పెంచడం ఒక్కటి కాకుండా, పెట్టుబడి సాధనాల మధ్య సమతూకం కూడా ఉండాలి. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాల్సిందే. పెట్టుబడులకు కనీసం 20 ఏళ్లు అంతకుమించి కాలం ఉంటే అగ్రెస్సివ్ ప్రణాళిక వేసుకోవచ్చు. ఈక్విటీలకు 75 శాతం నుంచి 100 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ ప్లాన్‌లోనూ 75 శాతం ఈక్విటీ పెట్టుబడులకు ఆప్షన్ ఉంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంపౌండింగ్ వల్ల అంత పెద్ద మొత్తం సమకూరుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి అధిక రిస్క్ తీసుకునే వారికి సాధారణంగా 70–80 శాతం ఈక్విటీలు, మిగిలిన 20 శాతం మేర స్థిరాదాయ (డెట్) పథకాలను నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి చాలా మంది విషయంలో గమనిస్తే అన్నింటికంటే ఆలస్యంగా మొదలు పెట్టేది రిటైర్మెంట్ కోసమే అవుతోంది. ఎక్కువ మంది చేసే పెద్ద తప్పిదం ఇదే. ఆర్జన మొదలైన మొదటి నెల నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించిన వారు చాలా సులభంగా కావాల్సిన నిధిని సమకూర్చుకోగలరు. అంతేకాదు, కాంపౌండింగ్ పవర్‌తో ముందస్తు రిటైర్మెంట్ వీరికి చాలా సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ ఈ లక్ష్యం భారంగా మారుతుంది. రిస్క్‌లు–రక్షణ ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యం పెట్టుకున్న వారు రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణాలు తీసుకున్నా, రిటైర్మెంట్ పెట్టుబడుల ప్రణాళికకు అవరోధంగా లేకుండా ఉండాలి. రిటైర్మెంట్ నాటికి తీర్చేలా ఉండాలి. మరీ ముఖ్యంగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకునే వారు ఉద్యోగం భద్రత అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రుణాలపై మారటోరియం ఆప్షన్ తీసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైతే ప్రణాళిక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విధమైన రిస్క్‌లను ఎదుర్కొనే ప్రణాళిక కూడా కావాలి. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి వైకల్యం పాలై ఆర్జన ఆగిపోయే పరిస్థితి వస్తే..? అనుకున్నదంతా తలకిందులైపోతుంది. దీనికి సంబంధించి బీమా కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. అలాగే, మనకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమా, ఆస్పత్రిలో వైద్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకుని చాలా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ----------------------------------------------------------------------------------------------------------------------------- గమనిక: ఇక్కడ పట్టికల్లో ఇచ్చిన అంచనాలు అన్నీ కూడా పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి ప్రకారం వేసిన అంచనాలు. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వార్షిక రాబడి సాధ్యమే. కనుక ఆ ప్రకారం చూస్తే చేయాల్సిన నెలావారీ పెట్టుబడి 10 శాతం తక్కువైనా అనుకున్న కార్పస్‌ను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. -
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతనిచ్చే 3 బకెట్ స్ట్రాటజీ వివరాలు
పదవీ విరమణ తర్వాత సమకూర్చుకున్న నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు 3బకెట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? – అనురాగ్ వివిధ కాలాల్లోని అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడమే మూడు బకెట్ల విధానం. రానున్న ఏడాది, ఏడాదిన్నర కాలం పాటు క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం పొందేందుకు సరిపడా నిధిని ఒక బకెట్‌గా ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్వల్పకాలం కోసం కనుక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ రాబడులు అన్నది ద్వితీయ ప్రాధాన్యమే అవుతుంది. కనుక ఈ బకెట్‌కు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక వచ్చే మూడు, నాలుగేళ్ల కోసం ఉద్దేశించినది రెండో బకెట్ అవుతుంది. ఈ నిధి క్రమం తప్పకుండా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాబడులు మోస్తరుగా ఉంటే చాలు. అనవసర రిస్క్‌లు తీసుకోవడం సరికాదు. కనుక అధిక నాణ్యత డెట్ సాధనాలైన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక దీర్ఘకాలం నిధికి ఉద్దేశించినదే మూడో బకెట్. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే రాబడులు అవసరం అవుతాయి. కనుక డెట్‌తోపాటు కొంత పెట్టుబడిని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపినదే 3బకెట్ స్ట్రాటజీ అవుతుంది. మొదటి ఏడాదిన్నర అవసరాల కోసం ఉద్దేశించిన నిధిని రెండు నాణ్యమైన లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ఫండ్స్ నుంచి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవాలి. దాంతో ప్రతీ నెలా అవసరమైనంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తమ రిటైర్మెంట్ నిధిలో ఒక వంతును ఒకటి లేదా రెండు నాణ్యమైన మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడులను ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడిన షార్ట్ డ్యురేషన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా చక్కగా సరిపోతుంది. ఇలాంటి స్ట్రాటజీతో రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్ణీత కాలానికోసారి కేటాయింపులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏడాది ఆరంభంలో మొత్తం నిధిలో ఈక్విటీ పెట్టుబడుల వాటాను మూడింట ఒక వంతుకు మించకుండా మార్పులు చేసుకోవాలి. అంతకుమించి ఈక్విటీ పెట్టుబడుల విలువ ఉంటే ఆ మేరకు వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఆరంభంలో తమ నిధిపై వార్షికంగా 4–5% మించి ఉపసంహరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుమించితే మీ నిధి తొందరగా తరిగిపోతుంది. పదేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. ఇందుకు ఇండెక్స్ఫండ్ లేదా ఈటీఎఫ్ లేదా యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ ఫండ్ వీటిల్లో దేనిని ఎంపిక చేసుకోవాలి? పదేళ్ల కాలానికి ఎక్స్పెన్స్ రేషియో పాత్ర ఏ మేరకు ఉంటుంది? – రవి రిటైల్ ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని నేను అయితే ప్రోత్సహించను. దీనికి కారణం ఇది వినియోగపరంగా అంత అనుకూలమైనది కాదు. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ విధానం మరింత సౌకర్యమైనది. ప్రతీ నెలా ఫలానా తేదీన రూ.10,000 మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు. సరిగ్గా ప్రతీ నెలా అదే రోజున ఎంపిక చేసుకున్న పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. విశ్వసనీయమైన ఇండెక్స్ ఫండ్స్ అన్నవి ప్రస్తుతానికి లార్జ్‌క్యాప్ విభాగంలోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నవి వాటి పనితీరును నిరూపించుకుంటే అప్పుడు వాటిని పరిశీలించొచ్చు. కానీ, ఇప్పటికైతే యాక్టివ్‌గా నిర్వహించే ఫ్లెక్సీక్యాప్ అనుకూలమైనది. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఒక పథకం 50 శాతం రాబడి ఇచ్చి, 2 శాతం ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తున్నట్టయితే.. అదే సమయంలో 50 శాతం రాబడిని అందించే మరో పథకం 1 శాతం ఎక్స్పెన్స్ రేషియోను రాబడుతున్నట్టయితే.. అప్పుడు ఒక శాతం రాబడి పథకమే మెరుగైనది అవుతుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే -
ఫండ్స్ నుంచి ఎప్పుడు వైదొలగాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్... మనకు ఎన్నో ఆర్థిక లక్ష్యాలుంటాయి. రిటైర్మెంట్ ప్లాన్, పిల్లల చదువు, అమ్మాయి పెళ్లి ఇలా ఎన్నో అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. లక్ష్యాల సాకారానికి చాలా మంది వీటిల్లో పెట్టుబడులు పెడుతుం టారు. ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి బాగా తెలిసిన వారు వాటిల్లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టకపోయినా మంచి రాబడి పొందొచ్చు. ఇక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేశామనే దాని కన్నా .. ఎలాంటప్పుడు (మార్కెట్ పరిస్థితులు) ఇన్వెస్ట్ చేశావనే అంశానికి ప్రాధాన్యమివ్వాలి. లక్ష్యాలపై దృష్టి అవసరం సాధారణంగా అయితే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు రావాలి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలానికి ప్రణాళికలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ తొలినాళ్లలోనే ఈక్విటీ ఫండ్స్‌కి అధిక ప్రాధాన్యతనివ్వాలి. కొద్ది కాలం తర్వాత పోర్ట్‌ఫోలియోను రీ–బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అంటే రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇక ఒక్కొక్కసారి నిర్దేశిత కాలం కన్నా ముందుగానే ఫండ్స్ నుంచి వైదొలగాల్సి వస్తుంటుంది. అంటే మన ఫండ్ మంచి పనితీరు కనబరచనప్పుడు, ఫండ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు మారినప్పుడు మనం ఫండ్ నుంచి బయటకు వచ్చేయాలని యోచి స్తాం. మనకు ఏది మంచో ఏది చెడో మనకే తెలుస్తుంది. అందుకే ఇలాంటప్పుడు మనకు అనువైన నిర్ణయాన్నే తీసుకోవాలి. ప్రశ్నలకు సమాధానాలుండాలి ఇన్వెస్ట్మెంట్ల నుంచి వైదొలగాలి అని అనుకున్నప్పుడు ఒకే ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకు వైదొలుగుతున్నాం అనే ప్రశ్నకు మన వద్ద సరైన సమాధానం ఉండేలా చూసుకోవాలి. ఫండ్ నుంచి బయటకు రావడానికి ముందే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశోధించాలి. అంటే స్థిరం గా ఉండి, దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తే.. ఎలాంటి ప్రతిఫలం పొందొచ్చు ఊహించగలగాలి. దీర్ఘకాలంలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అలాగే కాంపౌండింగ్ అంశం వల్లా లబ్ధి పొందొచ్చు. -
ఆర్థిక భరోసాకు 6 సూత్రాలు
పెద్ద మొత్తాలొస్తాయని ఎదురు చూడొద్దు ఆదాయ, వ్యయాలపై అంచనా అవసరం అనవసర రుణాల జోలికి వెళ్లొద్దు మీరెంత రిస్కు భరించగలరో తెలుసుకోండి పొదుపు, రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా అవసరం జీవితంలో బోలెడన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలని కొందరు, కష్టపడి పనిచేయాలని కొందరు... ఇల్లు, కారు కొనుక్కోవాలని కొందరు... ఇలా అనేకానేకం ఉంటాయి. అయితే కొన్ని లక్ష్యాలు ఆర్థికాంశాలతో ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా మనం బలంగా ఉంటేనే ఇవి సాకారమవుతాయి. సంతోషాన్నిస్తాయి. పటిష్టమైన ప్రణాళికంటూ లేకపోతే ఆర్థికంగా బలపడటం అనేది కుదిరే పని కాదు. ఇందుకోసం మనకు మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన తీర్మానాలు, సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఇవి చాలా చిన్నవే. కానీ ఆర్థిక పురోగతికి ఇవి బంగారు బాటలు వేస్తాయి. పెద్ద మొత్తం కోసం ప్లానింగ్‌ను వాయిదా వేయొద్దు నిజజీవితంలో ఊహించని విధంగా ఆస్తులో, డబ్బో వచ్చి పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. చాలామంది రెగ్యులర్‌గా వచ్చే ఆదాయాలపై ఆధారపడాల్సిన వారే. కాబట్టి, ఒక్కసారిగా బోలెడంత డబ్బు చేతికొస్తే ప్లానింగ్ చేద్దామని వాయిదా వేస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే, అది ఎన్నటికీ జరగకపోవచ్చు. కాబట్టి, చిన్న మొత్తం అయినా సరే.. ఫిక్సిడ్ డిపాజిట్లు, జీవిత బీమా పాలసీలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. పక్కాగా ఆదాయ, వ్యయాల లెక్కలు పాటించాలి డబ్బుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నది మనకు తెలియని విషయం కాదు. కానీ, ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. లేదా ఆదాయంలో ఎంత మొత్తాన్ని లక్ష్య సాధనకు కేటాయించాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. దీనికి సింపుల్ పరిష్కార మార్గం ఒకటుంది. అదేంటంటే.. వ్యక్తిగత ఆదాయ, వ్యయాల ఖాతాను నిర్వహించుకోవడమే. దీని ద్వారా ప్రతి మూడు నెలలకోసారి మీ ఆదాయాలను, అవసరాలను, ఖర్చులను ట్రాక్ చేయండి. తద్వారా ఆదాయంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. డబ్బు ఊరికే ఖాతాల్లో మగ్గిపోకుండా ప్రతీ ఒక్కరూ కూడా తమ లక్ష్యాలకు అనుగుణమైన సాధనాల్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇందుకోసం రికరింగ్ డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాలు, ఫండ్స్, ఇన్సూరెన్స్ మొదలైన వాటితో ప్రారంభించవచ్చు. రిస్కు సామర్థ్యంపై అంచనాకు రావాలి మీరు ఎంత మొత్తం పొదుపు చేయగలరన్న దానిపై అవగాహన వచ్చిన తర్వాత.. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఏయే ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చన్నది కూడా ఆలోచించాలి. అన్ని ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే ఏకైక సాధనం అంటూ ఏదీ లేదు. మీరు ఏ సాధనాన్ని ఎంచుకోవాలన్నది మీరు ఎంత వరకూ రిస్కును భరించగలరు, లక్ష్య సాధనకు ఎన్నేళ్లు నిర్దేశించుకున్నారు అన్న వాటిపై ఆధారపడి ఉంటుంది. భారీ రిస్కు తీసుకోగలరు, పదేళ్ల లక్ష్యం అయితే ఎక్కువగా స్టాక్ మార్కెట్లకు అనుసంధానమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరీ ఎక్కువగా రిస్కు ఇష్టపడని వారు డెట్ సాధనాలు ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్స్ వంటివి కూడా అనువైనవే. అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలిక అవసరాల కోసం స్వల్పకాలిక సాధనాల్లోనూ.. స్వల్ప కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక సాధనాలను ఎంచుకోకండి. ఆర్థిక భరోసా కోసం పొదుపు ఆర్థిక భద్రత అంటే పొదుపు చేయడం మాత్రమే కాదు. డబ్బనేది ఎరువుల్లాంటివి. సరిగ్గా ఉపయోగిస్తేనే ఫలాలు దక్కుతాయి. మీకు, మీ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తం కేటాయించి ఉంచండి. రుణం తీసుకునేముందే ఆలోచన.. ప్రస్తుతం అంతా ఆర్భాటాలకు ప్రాధాన్యమిస్తున్నారు. క్రెడిట్ కార్డులు, సులభ రుణాలు మొదలైన వాటితో మనం కోరుకునే కార్లు, విదేశీ టూర్లు, విలాసవంతంగా ఫంక్షన్లు మొదలైనవి ఇట్టే సాధ్యపడుతున్నాయి. కానీ, రుణాల మీద ఈ కలల్ని సాకారం చేసుకున్న తర్వాత మళ్లీ ఆ అప్పును తీర్చగలిగే సత్తా ఉంటోందా అంటే.. చాలా మందికి ఉండటం లేదు. కనుక, సలహా ఏమిటంటే.. రుణాలు, క్రెడిట్ కార్డుల విషవలయంలో చిక్కుకోవద్దు. దానికి బదులుగా మీ అవసరాలు, మీ లక్ష్యాలను మదింపు చేసుకోండి. దానికి తగ్గట్లుగా నెలవారీ, త్రైమాసికాల వారీగా బడ్జెట్లు వేసుకోండి. ఏది పడితే అది కొనేయడం కాకుండా.. అవసరమైనవి, భవిష్యత్‌లోనూ ఉపయోగపడగలిగేవి లేదా రాబడులు అందించగలిగేవి అనుకుంటేనే లోన్‌పై కొనండి. మీకు, మీ కుటుంబ శ్రేయస్సు కోసం జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు అవసరం. అలాగే, పిల్లల చదువుల కోసం కొంత మొత్తం, మీ రిటైర్మెంట్కి మరికాస్త నిధి అవసరమవుతుంది. తక్షణ సంతోషం కలిగించే లగ్జరీ కార్లు మొదలైన వాటికన్నా దీర్ఘకాలికమైన ఈ అవసరాలకోసం జాగ్రత్త పడటం ముఖ్యం. రిటైర్మెంట్ కోసం ప్లానింగ్.. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదీ పెద్దగా లెక్క చేయం. మంచి జీతం, ఏ బాదరబందీ లేని జీవితం అంతా బాగానే ఉంది.. రిటైర్మెంట్ గురించి ఇప్పట్నుంచే ఆలోచించడం ఎందుకు అనిపిస్తుంది. కానీ, ఇది అపోహ. రాబోయే రోజుల కోసం ముందునుంచే ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే రోజు రోజుకీ జీవన వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పొదుపును ఎంత వాయిదా వేస్తే ఆ తర్వాత అంత బాధపడాల్సి రావొచ్చు. రిటైర్మెంట్ తర్వాత మరొకరి మీద ఆధారపడి జీవించాల్సి వస్తే బాధగానే ఉంటుంది. ఇలా జరగకూడదంటే సాధ్యమైనంత ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత కూడా దర్జాగా ఉండొచ్చు. యవ్వనంలో ఉన్నప్పుడు మన బాధ్యతలు తక్కువగా ఉంటాయి. కనుక మరింతగా పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలి. ‘ఒకవేళ జీవితంలో ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా అనే ఆందోళన ఇటు మనస్సులోనూ, అటు మెదడులోనూ లేకుండా ఉండటమే ఆర్థిక స్వేచ్ఛ’ అన్నారెవరో మేధావి. కనుక, ఇలాంటి తీర్మానాలతో అలాంటి ఆర్థిక స్వేచ్ఛ సాధించే దిశగా అడుగులు వేయండి. ఆల్ ది బెస్ట్. -
ఇరవైల నుంచే విరమణ ప్రణాళిక!
* ముందు నుంచి ఆరంభిస్తే కాంపౌండింగ్ లాభాలు * పొదుపు మొత్తాన్ని బట్టి ముందుగానే రిటైర్మెంట్ * ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచన కష్టపడి పనిచేసి సాధ్యమైనంత ఎక్కువగా ఆర్జించేందుకు చేసే ప్రయత్నాలన్నింటి వెనుక ప్రధాన కారణం ఒకటే.. అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏ బాదరబందీ లేకుండా జీవితాన్ని హాయిగా గడపడం. ఇంత కీలకమైన రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ముందుగా ఎప్పుడు రిటైరవబోతున్నాం? ఆ తర్వాత ఎలాంటి జీవన విధానాన్ని కోరుకుంటున్నాం? ఇందుకోసం ఎంత మొత్తం అవసరమవుతుంది? ఇలాంటివన్నీ లెక్కేసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల, వైద్యం ఖర్చులు మొదలైనవన్నీ కూడా ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే భారీ మొత్తమే అవసరమవుతుంది. అంత నిధి ఒక్కసారిగా వచ్చి పడదు గనుక.. కొద్దికొద్దిగా కూడబెట్టక తప్పదు. ముప్ఫయ్యేళ్లు వచ్చిన తర్వాత ప్లానింగ్ మొదలుపెట్టే కంటే ఇరవైలలో కెరియర్ ప్రారంభంలోనే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే కాంపౌండింగ్ మహిమతో రిటైర్మెంట్ నాటికి గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయొచ్చు. రిటైర్మెంట్ అవసరాల కోసం చేసే పెట్టుబడులు ఎలక్ట్రానిక్ విధానంలో (ఈసీఎస్) ఆటోమేటిక్‌గా ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటే.. ఇతరత్రా తలెత్తే ఖర్చుల వల్ల రిటైర్మెంట్ ప్రణాళిక దెబ్బతినకుండా చూసుకోవచ్చు. లక్ష్యాలు రాసిపెట్టుకోవాలి.. పదవీ విరమణ తర్వాత మనం చేయాలనుకున్న లక్ష్యాలను రాసిపెట్టుకోవడం ముఖ్యం. ఇవి నిర్దిష్టంగా ఉండటం మంచిది. ఉదాహరణకు విదేశీ పర్యటన చేయాలనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏమేం చూడాలనుకుంటున్నారు? వగైరాలాంటివన్నమాట. అలాగే పదవీ విరమణ తర్వాత వైద్య అవసరాలకు కూడా సరిపడేంత బీమా ఉండేలా చూసుకోవాలి. తద్వారా చికిత్స ఖర్చుల భారం మీ మీద పడకుండా ఉంటుంది. ముందుకు సాగుతున్న కొద్దీ కెరియర్, లైఫ్‌స్టయిల్, ఆరోగ్యం అన్నీ మారుతుంటాయి కనుక పదవీ విరమణ తర్వాత ఖర్చులు ఒకింత ఎక్కువగానే ఉంటాయన్న అంచనాలతోనే ప్రణాళిక వేసుకోవాలి. ఈలోగా కొత్త ఇల్లో, కారో కొనుక్కోవడమో లేదా విహారయాత్రలకు వెళ్లడమో లాంటి ఆలోచనలు ఉంటే ఆ వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడులను సమీక్షించుకోవాలి.. మీకున్న ఆస్తులు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలను సమీక్షించుకోవాలి. రిస్కు సామర్థ్యం, రాబడుల అంచనాలను బట్టి అవసరమైతే పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మధ్యమధ్యలో సవరించాలి. ఉదాహరణకు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్కుతో కూడుకున్న షేర్ల పెట్టుబడులే ఎక్కువగా ఉంటే .. రిటైర్మెంట్ దశలో భరోసాగా ఉండేలా స్థిరమైన ఆదాయం ఇచ్చే సాధనాల్లోకి సింహభాగాన్ని మార్చవచ్చు. పదవీ విరమణ తర్వాత రుణభారం ఉండకుండా అప్పులేవైనా ఉంటే సాధ్యమైనంత ముందుగానే తీర్చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మీ రిటైర్మెంట్ బడ్జెట్లో వీటిని కూడా చేర్చి ప్రణాళిక వేసుకోవాల్సి వస్తుంది. ఇక, స్థలం, ఇల్లు తదితర స్థిరాస్తులు సైతం తదుపరి సంవత్సరాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. పాతతరం నాటి వస్తువులు, కళాఖండాలు.. ఆఖరికి వైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు కూడా తరచూ కాకపోయినా సందర్భాన్ని బట్టి మంచి రాబడులే ఇవ్వగలవు. స్థూలంగా చెప్పాలంటే మనం చేసిన పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడులు.. మన ఖర్చులకు మించి ఉన్న తరుణంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఎంత ముందుగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలిగితే అంత త్వరగా రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవచ్చు. పొదుపు చేసిన అసలును కదల్చాల్సిన పని లేకుండా దానిపై వచ్చే రాబడులే.. మన ఖర్చులకు సరిపోయేట్లుగా ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్‌లో మరీ అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆదుకునేందుకు ఈ అసలు మొత్తం ఉపయోగపడగలదు. ఒక్క ముక్కలో.... * రిటైర్మెంట్ ప్రణాళికను సాధ్యమైనంత ముందుగా ప్రారంభించాలి. ముఫ్ఫై ఏళ్ల వయస్సులోనైనా ఫర్వాలేదు. * జీవన విధానం, పదవీ విరమణ వయస్సు, భారీ కొనుగోళ్లు మొదలైనవన్నీ కూడా ప్రణాళిక వేసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి. * కంపెనీపరంగా, ప్రభుత్వపరంగా వచ్చే పింఛను ప్రయోజనాలు, రివర్స్ మార్టిగేజ్ మొదలైన మార్గాలను పరిశీలించుకోవాలి. * వైద్య చికిత్స ఖర్చులు భారీగా పెరుగుతాయి కనుక తగినంత కవరేజి ఉండేలా చూసుకోవాలి. * రిటైర్మెంట్కి ఎంత ఎక్కువ మొత్తం ప్లానింగ్ చేసుకుంటే అంత మంచిది. * పొదుపు చేసిన అసలును కదల్చాల్సిన పని లేకుండా దానిపై వచ్చే రాబడులే ఖర్చులకు సరిపోయేలా చూసుకోవాలి. - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
ముందే ఆరంభిస్తే మంచిది..
వీలైనంత త్వరగా ప్లానింగ్ ప్రారంభించండి మీ ప్లానింగ్ అన్ని అవసరాలను తీర్చగలగాలి ఆదాయ పన్ను నిబంధనలు తెలుసుకోండి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనా వేయండి రిటైర్మెంట్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఉద్యోగస్తులందరికీ రిటైర్మెంట్ తప్పదు. ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో ఎన్నోకలలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఇలా ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న వారికి, వారి జీవితాన్ని సంతోషంగా జీవించడానికి అవసరమైన విశ్రాంతి సమయం రిటైర్మెంట్ తర్వాతే దొరుకుతుంది. రిటైర్మెంట్ అనంతర జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, దానికి అనువైన ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి రిటైర్మెంట్ ప్లానింగ్ తప్పనిసరి. రిటైర్మెంట్ ప్లానింగ్ సమయంలో ఈ విషయాలను గుర్తించుకోండి! ముందే ప్లానింగ్ చేయండి... రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? అనే ప్రశ్న సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్‌లో అత్యంత ప్రధానమైన అంశం.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్లానింగ్‌ను ప్రారంభించడం. అంటే సంపాదన ప్రారంభించిన తొలినాళ్ల నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ త్వరగా ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతిలో ఉంటాయి. ఆదాయ పన్ను సంగతేంటి... ఏ ఆర్థిక ప్రణాళికల్లోనైనా ఆదాయ పన్ను(ఐటీ) నిర్వహణ చాలా ముఖ్యమైన అంశం. అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్‌కు ఆదాయ పన్నుతో సంబంధం ఉంటుంది. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్‌చేసే మొత్తానికి ప్రస్తుతం మనం ఒక నిర్ణీత పరిధి వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రిటైర్మెంట్ తీసుకున్న సమయంలో పొందే వార్షిక మొత్తంపై మాత్రం పన్ను చెల్లించాలి. రిటైర్మెంట్ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు.. తప్పకుండా ఆదాయ పన్ను నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యం కూడా ముఖ్యం ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఆరోగ్యకరంగా లేవు. పర్యావరణం కలుషితమౌతోంది.. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. అందువల్ల వాటికి వెచ్చించే వ్యయం కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. లక్ష్యాలను నిర్దేశించుకోండి రిటైర్మెంట్ ప్లానింగ్ సమయంలో మీరు రిటైర్మెంట్ అనంతర కాలంలో ఎలాంటి వ్యయాలు ఉంటాయో ముందుగానే ఆలోచించి, ఒక నిర్ణయానికి రావాలి. అంటే కూతురి పెళ్లి, పిల్లల చదువు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు వంటి అంశాలు. వీటిని ముందుగానే అంచనా వేస్తే రిటైర్మెంట్ సమయంలో ఎంత సొమ్ము అవసరమౌతుందో తెలుస్తుంది. రిటైర్మెంట్ ప్లాన్ ఎంపికలో జాగ్రత్త వహించండి రిటైర్మెంట్ తర్వాత ఆనందంగా జీవించాలంటే ఆర్థిక స్వాతంత్య్రత ఉండాలి. రిటైర్మెంట్ ప్లాన్ ఎంపికలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎంపిక చేసుకోవాలని భావించే రిటైర్మెంట్ ప్లాన్ మీ అవసరాలన్నింటినీ తీర్చగలిగేలా ఉండాలి. రిటైర్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్‌చేసే ముందు ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించి, వారి సలహాలను తీసుకోవడం మంచిది. ద్రవ్యోల్బణాన్ని మరువద్దు మన జీవన వ్యయం పెరుగుతూనే ఉంటుంది. తగ్గే పరిస్థితి ఉండదు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని అశ్రద్ధ చేయవ ద్దు. రిటైర్మెంట్ సమయంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులను ఇప్పుడే అంచనా వేయాలి. సీనియర్ సిటిజన్లు ఆహార పదార్థాలపై వెచ్చించే వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ.. వారి మెడికల్ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఇవి రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. -
నిశ్చింతగా రిటైర్ కావాలంటే..
జీతం మీదే ఆధారపడిన వారికి .. పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. ఖర్చులు మాత్రం పెరిగిపోతుంటాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తుం టాయి. రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి సమస్యల వలయంలో చిక్కుపడకూడదంటే .. కాస్త ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే సరి. పదవీ విరమణ తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. ఈ దిశగా తోడ్పడే కొన్ని అంశాలు మీకోసం.. వైద్యానికీ కొంత కేటాయించాలి .. రిటైర్మెంట్ తర్వాత ఒడిదుడుకుల్లేకుండా జీవించడానికి ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ద్రవ్యోల్బణం, మరొకటి వయసు పైబడుతున్న కొద్దీ పెరిగే వైద్యం ఖర్చులు. ఆసుపత్రి వ్యయాలు ఏటా 18-20% పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంత అవసరమో లెక్క వేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి.. సాధారణంగా 58-60 సంవత్సరాలకు రిటైరవుతుంటాం. అయితే, ఏదైనా కారణంతో ఒకవేళ 50 ఏళ్లకే రిటైరవ్వాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? అందుకే ఈ రెండు అంశాలకూ పనికొచ్చే విధంగా రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలుగా విడగొట్టాలి. ఒక భాగం సాధారణ రిటైర్మెంట్కి కేటాయించాలి. రెండోది ముందస్తు రిటైర్మెంట్ వయసు నుంచి సాధారణ పదవీ విరమణ వయసు దాకా (58-60) గడిపే సంవత్సరాల కోసం కేటాయించాలి. అత్యాశకు పోవద్దు.. సాధ్యమైనంత ఎక్కువ నిధిని కూడబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధిక రాబడులు అందిస్తామనే మోసపూరిత పథకాల వలలో పడకుండా ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటే రిస్కు కూడా ఎక్కువే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మార్కెట్లంటే భయపడొద్దు .. రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది దీర్ఘకాలికమైనది. కనుక, సురక్షితంగా, స్థిరమైన రాబడులు ఇచ్చే పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలి. అలాగని మరీ రక్షణాత్మకంగా కాకుండా పోర్ట్‌ఫోలియోలో అన్ని పథకాలు ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో మిగతా సాధనాల కన్నా అధిక రాబడులు అందిస్తుంటాయి. కనుక, ముందస్తుగా పదవీ విరమణ చేయదల్చుకున్న వారు రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన యులిప్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరింత పొదుపు చేయాలి.. తగినంత నిధితో రిటైర్ కావాలంటే.. సాధ్యమైనంత వరకూ వ్యయాలు తగ్గించుకోవాలి, పొదుపు చర్యలు పాటించాలి, తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. పన్నులపరంగా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తే.. మరింత డబ్బు పొదుపు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆదాయం పెంచుకోవాలి.. కాలం చాలా విలువైనది. కనుక దీన్ని వృథా చేయకుండా ఆదాయం తెచ్చిపెట్టే పనులపై ఇన్వెస్ట్ చేయాలి. కేవలం జీతమే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను కూడా అన్వేషించుకోవాలి. -
వాయిదా వేయొద్దు..
ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన.. పాట తరహాలోనే మనం చాలా విషయాలను వాయిదావేసేస్తుంటాం. ఆ తర్వాత ఆఖరు నిమిషంలో ఆదరాబాదరాగా పరుగెడుతుంటాం. ఆర్థికపరమైన ప్లానింగ్ విషయాల్లో ఇలాంటి ధోరణి మరింతగా ఉంటుంది. దీనికి తోడు .. కొన్ని అంశాల్లో స్థిరమైన అభిప్రాయాన్ని పెట్టేసుకుని.. విపరీతమైన కాన్ఫిడెన్సుతో రావాల్సిన ప్రయోజనాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. అలాంటి కొన్ని అపోహలు.. వాటికి పరిష్కార మార్గాల సమాహారమే ఈ కథనం.. రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే ఎందుకు పదవీ విరమణ తర్వాత ఆదాయం గణనీయంగా తగ్గి ఖర్చులు పెరుగుతుంటాయి. ఇందుకోసం కెరియర్ ప్రారంభం నుంచే ప్రణాళిక వేసుకుంటే అప్పుడు కంగారు పడనక్కర్లేదు. కానీ, రిటైర్మెంట్ ఎప్పుడో వస్తుంది.. ఇప్పట్నుంచి ప్లానింగ్ ఎందుకు అని మనలో చాలా మంది పక్కన పెడుతుంటారు. ఏడాదంతా ఆటల్లో గడిపేసి సరిగ్గా పరీక్షల ముందు రోజు పుస్తకం తీసినట్లుగా.. రేపో ఎల్లుండో రిటైర్ అవుతున్నామనగా అప్పుడు హడావుడి పడుతుంటారు. కానీ ఒక్కరోజులోనో లేదా అయిదేళ్లలోనో రిటైర్మెంట్ అవసరాలకు కావాల్సినంత డబ్బును సమకూర్చుకోవడం సాధ్యం కాదు కదా. కాబట్టి, పెరిగే ధరలు, వైద్యం ఖర్చు లు, పదవీ విరమణ చేసిన తర్వాత ఎదురయ్యే అనిశ్చితి పరిస్థితులను ధీమాగా ఎదుర్కొనేందుకు ఎంత ముందు నుంచి ప్రణాళిక వేసుకుంటే అంత మంచిది. ఇప్పటి లైఫ్‌స్టయిల్‌నే రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలంటే ఎంత డబ్బు పోగు చేసుకోవాలన్నది లెక్కలు వేసుకుని, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలి. దీన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే తప్ప నిశ్చింతగా రిటైర్మెంట్ సాధ్యం కాదు. ఇప్పుడప్పుడే ఇన్వెస్ట్ చేయలేను భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే ఠక్కున సమాధానం చెప్పగలిగే వారు ఏ కొందరో ఉంటారు. మిగతా వారంతా ఇంటి ఖర్చులు, ఈఎంఐలు మొదలైన సమస్యల గురించి చెప్పుకొస్తారు. ఇవన్నీ తీరితే గానీ ఇన్వెస్ట్మెంట్ల వైపు చూడలేమంటారు. ఈలోగా సమయం కాస్తా గడిచిపోతుంది. అలా కాకుండా.. అవసరమైతే వినోదం, టూర్లు వంటి ఖర్చుల్లో కొంత కోత పెట్టుకునైనా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం మంచిది. ఎంత ఇన్వెస్ట్ చేశామన్నదాని కన్నా ఎంతో కొంతైనా దాచిపెట్టగలగడం మంచిదని గుర్తుంచుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు చాల్లే .. సరే.. ఇన్వెస్ట్ చేయాలని బలంగా అనుకున్న తర్వాత మనం పెట్టుబడి అత్యంత సురక్షితంగా ఉండాలనే కోరుకుంటాం. షేర్లు వగైరా లాంటి రిస్కీ సాధనాల్లోకి వెడితే అసలుకే మోసం వస్తుందని... సురక్షితంగా ఉంటుందని ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు చూస్తుంటాం. ఈ జాగ్రత్తల్లో పడి పన్నులు పోగా ఎఫ్డీలపై ఎంత రాబడి వస్తుంది, పెరిగిపోతున్న ధరలను ఆ రాబడితో ఎదుర్కొనగలమా లేదా అన్నది అంతగా లెక్కలు కట్టుకోము. కాబట్టి, దీర్ఘకాలానికి సంబంధించిన ఎఫ్డీలనే నమ్ముకుని కూర్చోకుండా ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్ సాధనాలవైపు కూడా చూడాలి. మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పోతుంది సర్వసాధారణంగా వినిపించే మరో విషయం ఇది. వాహనం నడపడం నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు కింద పడిపోయామని నేర్చుకోవడమూ మానేయము.. నడపడమూ మానేయం. ఇదీ అలాంటిదే. ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఎంతో కొంత రిస్కు ఉంటుంది. దీర్ఘకాలిక అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పరిస్థితులను బట్టి కొన్ని సార్లు పెట్టుబడుల విలువ హెచ్చుతగ్గులకు లోను కావొచ్చు. అంత మాత్రం చేత అసలు దాని జోలికే వెళ్లకూడదనుకుంటే అధిక రాబడులు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. షేర్లలోనూ, డెట్ సాధనాల్లో .. ఈ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలూ ఉన్నాయి. మన రిస్కు సామర్థ్యం, లక్ష్యాన్ని చేరడానికి కావాల్సిన సమయం లాంటివి అంచనా వేసుకుని తగిన పథకాన్ని ఎంచుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ దండగ వ్యవహారం.. పైసా పెట్టుబడి పెడుతున్నామంటే... దానిపై ఎంతో కొంత రావాలని ఆశిస్తాం. ఆఖరికి జీవిత బీమా విషయంలో కూడా అలాగే అనుకుంటాం. జీవితానికి భరోసా కల్పించే బీమా వేరు .. రాబడులు అందించే పెట్టుబడి సాధనాలు వేరు అన్న సంగతి మర్చిపోతుంటాం. రెండింటినీ ఒకే గాటన కట్టేసి బీమా కోసం కట్టే డబ్బు సైతం తిరిగిరావాల్సిందే అని భావిస్తాం. కానీ, బీమా ఫీచర్లతో రాబడులు కూడా అందించే ఇతర పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి. కట్టిన ప్రీమియం తిరిగి రాకపోయినా.. ఇతర పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీలు అత్యంత తక్కువ ఖర్చుతో అత్యధిక రక్షణ కల్పిస్తాయని గుర్తెరగాలి. నాకెవ్వరూ సలహాలివ్వక్కర్లేదు.. ఆర్థిక విషయాలకు సంబంధించి చాలా సందర్భాల్లో మనకు మనం ఇలా సర్ది చెప్పుకుంటూ ఉంటాం. డబ్బు విషయాలను మేనేజ్ చేసుకోవడం చాలా సులభమైన విషయం.. ఇందుకోసం ఫైనాన్షియల్ ప్లానర్ల సహాయమో లేదా మరొకరి సలహాలో అనవసరం అనుకుంటాం. ఏముందీ.. పన్నులు గట్రా చూసుకోవడం, పీఎఫ్, ఎఫ్డీలు మొదలైనవి చేసుకుంటే సరిపోతుందని భావిస్తాం. కానీ, ఆరోగ్య సమస్య వస్తే డాక్టరు దగ్గరికి, చట్టపరమైన సమస్యలు వస్తే లాయర్ల దగ్గరికి ఎలా వెళ్లక తప్పదో ఆర్థిక అంశాల విషయంలోనూ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఖర్చులను అదుపు చేసుకోగలం.. ప్రత్యేకంగా బడ్జెట్ వేసుకోనక్కర్లేదు.. ఖర్చులను అదుపు చేసుకునే సామర్ధ్యం మనకి ఉంది అను కుంటాం. అదే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులనూ తీసుకుంటాం. అవసరమైనప్పుడే వాటిని వాడుతున్నామనీ సర్ది చెప్పుకుంటాం. కానీ అప్పు ఏదైనా అప్పే. క్రెడిట్ కార్డులతో రివార్డు పాయింట్లని కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. సరైన సమయానికి బిల్లు కట్టకపోతే కష్టమే. కాబట్టి సరైన బడ్జెట్ వేసుకుని, దానికి కట్టుబడి ఉంటేనే పురోగమించగలం. ఎమర్జెన్సీకి వ్యక్తిగత రుణం.. అత్యవసర పరిస్థితి తలెత్తిందంటే అర్జెంటుగా పర్సనల్ లోన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికేస్తాం. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లపైనా, బంగారం పైనా, బీమా పాలసీలపైనా, ప్రావిడెంట్ ఫండ్‌పైనా లోన్ తీసుకునే అవకాశం ఉందన్న సంగతి ఠక్కున గుర్తుకురాదు. ఇవి వ్యక్తిగత రుణాల కన్నా తక్కువ వడ్డీ రేటుకే లభిస్తాయి కూడా. అయితే, అత్యవసర పరిస్థితుల్లో రుణాల కోసం తిరగాల్సిన పరిస్థితి లేకుండా ముందునుంచే ఇలాంటి సందర్భాల కోసం కొంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఆఫీసు ఇచ్చే వైద్య బీమా చాలు.. ఉద్యోగం చేసే కంపెనీ ఎలాగూ వైద్య బీమా సదుపాయం కల్పిస్తోంది కాబట్టి.. వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకోవడం దండగ అనుకుంటాం. కానీ ఇది నిజంగా సరిపోతుందా అంటే కచ్చితంగా సరిపోదు. సదరు కంపెనీలో పనిచేసినంత కాలం మాత్రమే కవరేజి లభిస్తుంది. మరో కంపెనీకి మారినా, ఉద్యోగం మానేసినా ఆ కవరేజి పోయినట్లే. కాబట్టి, కంపెనీ మెడి క్లెయిమ్ పాలసీ ఇచ్చినప్పటికీ ముందునుంచి వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది. -
ఇపుడైతే రెండో జీతం-రిటైరైతే అదే పింఛన్!
ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. జీతం తక్కువే. పెద్దగా ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశం లేదు. అయినా సరే ఉన్నంతలో కొంత ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఇపుడదే ఆయన్ను కాపాడుతోంది. ఒకదశలో ఇన్వెస్ట్మెంట్ మానేసినా కూడా... జీవితాంతం తరగని నిధిలా పింఛన్ మాదిరి డబ్బు చేతికొచ్చే అవకాశం కూడా ఆయనకు కలిగింది. ఆ ఇన్వెస్టర్ కథనం... ఆయన మాటల్లోనే. ‘‘నా పేరు మల్లిఖార్జున్ గౌడ్. ఉండేది హైదరాబాద్‌లో. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. డబ్బు పొదుపు చేయటంపై బాగా ఆలోచించాక... 1995లో ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ పథకాన్ని ఎంచుకున్నా. ప్రతి నెలా రూ.3,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ఇన్వెస్ట్ చేశాను. ఇలా మొత్తం పది సంవత్సరాలు అంటే 2005 వరకు ఈ పథకంలో మొత్తం రూ.3.60 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఈ పదేళ్లలో నా పెట్టుబడి విలువ రూ.11.91 లక్షలకు చేరింది. అంటే దాదాపుగా 23% వార్షిక రాబడి పొందాను. ఇక చాల్లే... రాబడి బాగానే వచ్చింది కాబట్టి మొత్తాన్ని విత్ డ్రా చేసుకుందామనుకున్నాను. కానీ అదే సమయంలో నా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ పి.సతీష్ నాకొక బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. డబ్బు మొత్తం ఒకేసారి తీసేయకుండా... ప్రతి నెలా పింఛన్ మాదిరి కొంత మొత్తాన్ని తీసుకోమన్నాడు. అలా చేస్తే మిగిలిన డబ్బు పెరుగుతూ ఉంటుందని, జీవితాంతం తరగని నిధిలా ఉంటుందని చెప్పాడు. ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇన్వెస్ట్ చేశారు కనక ఇప్పుడు ప్రతి నెలా రూ.6,000 చొప్పున వెనక్కి తీసుకోమని సూచించాడు. ఆ ఏడాదే నేను హౌసింగ్ లోన్ తీసుకొని ఇంటిని కట్టుకోవడంతో జీతం డబ్బులు చాలేవి కావు. దీంతో రెండో జీతంలా ఉండటమే కాకుండా ఈఎంఐ భారం దాదాపు సగం తగ్గిపోతోందన్న భావనతో సరే అన్నాను. ఎనిమిది సంవత్సరాలుగా నేను ప్రతి నెలా రూ.6,000 చొప్పున తీసుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేసింది మొత్తం రూ.3.60 లక్షలు అయితే ఇప్పటి వరకు నేను రూ.4.98 లక్షలు తీసేసుకున్నాను. కాని ఇప్పటికీ నా ఇన్వెస్ట్మెంట్ విలువ ఏ మాత్రం తగ్గలేదు. సరికదా భారీగా పెరిగింది. ప్రస్తుతం నా ఫండ్ విలువ రూ.34.17 లక్షలుగా ఉంది. అంటే ఇప్పటికే తీసుకున్న మొత్తంతో కలిపితే నా ఇన్వెస్ట్మెంట్ విలువ దాదాపు రూ.40 లక్షలు దాటినట్లు. ఈ 18 ఏళ్లలో చూస్తే నా పెట్టుబడిపై సగటున 17 శాతం వార్షిక రాబడిని పొందినట్లు లెక్క. ఈ మధ్యకాలంలో అన్ని ధరలు బాగా పెరిగిపోవడంతో నెలవారీ బడ్జెట్ నిర్వహణ కాస్త కష్టంగా ఉం టోంది. దీంతో వచ్చే నెల నుంచి నేను ప్రతి నెలా రూ.10 వేలు తీసుకోవా లనుకుంటున్నాను. ఇలా తీసుకున్నా... నేను జీవించినంత కాలం ఇలా పెన్షన్ కింద వస్తుందనే భావిస్తున్నా. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేశాక ఇలా నెలనెలా వెనక్కి తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంది. - పి.మల్లిఖార్జున్ గౌడ్, హైదరాబాద్