చాలా మందికి రిటైర్డ్ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కొందరు సముద్రానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడితే మరికొందరు ప్రశాంతంగా ఏ కొండ ప్రాంతంలోనో లేదా ఊళ్లోనో ఉండాలనుకుంటారు. మన దేశంలో రిటైర్మెంట్ పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి.
పదవీ విరమణ అంటే పరిమితమైన అవసరాలతో ప్రశాంతమైన జీవనమనే రోజులు పోతున్నాయి. నేటి రిటైరీలు ఉద్యోగానంతరం కూడా జీవితాన్ని చురుగ్గా సాగించాలనుకుంటున్నారు. ప్రయాణాలు, హాబీలు, సోషల్ ఎంగేజ్‌మెంట్ మొదలైన వాటితో సందడిగా గడపాలనుకుంటున్నారు. అయితే, పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ కల సాకారం కాగలదు. చాలా మందికి తాము సరైన ప్రణాళికనే వేసుకున్నామా, తాము దాచుకుంటున్నది రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోతుందా అనే సందేహాలు ఉంటాయి.
ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాల కారణంగా ప్రస్తుతం మనిషి జీవితకాలం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకో రూ. 1 లక్ష (ఏడాదికి రూ. 12 లక్షలు) అవసరమవుతాయని, 60 ఏళ్ల తర్వాత మరో 15 ఏళ్ల పాటు జీవిస్తారనుకుంటే మొత్తం రూ. 1.8 కోట్లు (రూ. 12 లక్షలు గీ 15) అవసరమవుతాయి. 85 ఏళ్ల వరకు జీవిస్తే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇలా అదనపు సంవత్సరాల కోసం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థిక వనరుల సమీకరణకు కృషి
రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం నిశ్చింతగా సా గేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించండి. వాస్తవ గణాంకాలను పరిగణన లోకి తీసుకోండి. మీ నెలవారీ జీవన వ్యయాలను లెక్కేయండి. ముందుగా చెప్పినట్లు జీ విత కాలం 85 ఏళ్లనుకుంటే, 60 ఏళ్ల వ్యక్తికి అప్పటివరకు అయ్యే జీ వన వ్యయాల కోసం రూ. 3 కోట్ల వర కు ని ధి అవసరమవుతుంది. వార్షిక ద్రవ్యోల్బణానికి సమాన స్థాయిలో రాబడులు ఉంటాయన్న అంచనా లతో ఈ మేరకు లెక్క వేశాం. మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్క వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.
దేశీయంగా పెరుగుతున్న హెల్త్‌కేర్ ఖర్చులను ఒకసారి చూద్దాం. హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం సుమారు 14 శాతంగా ఉంటోంది. కొత్త టెక్నాలజీలు, చికిత్సల వల్ల బిల్లుల భారం మరింతగా పెరుగుతుంది. వైద్య చికిత్సల ఖర్చులు పెరిగే కొద్దీ ఎమర్జెన్సీల కోసం మరింత నిధిని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు మీరేం చేయాల్సి ఉంటుందంటే..
పెద్ద మొత్తంలో కవరేజీ ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి
బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పరిమాణాన్ని పెంచుకునేందుకు టాప్–అప్ తీసుకోవాలి
మేజర్ అనారోగ్యం బైటపడినప్పుడు ఏకమొత్తంగా డబ్బునందించే క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ను పరిశీలించాలి
జీవితకాలానికి మించే రిటైర్మెంట్ ఫండ్‌ను సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే..
1. భారీ రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం: పొదుపు చేయాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి.
2. ఆర్థిక సాధనాలు ఉపయోగించుకోవాలి: మీ రిటైర్మెంట్ ఫండ్‌ను పెంచుకునేందుకు జీవిత బీమా సాధనాలను పరిశీలించండి. ఏ ఆర్థిక ప్రణాళికైనా, ముఖ్యంగా రిటైర్మెంట్‌లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి విజయవంతం కావాలంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీలు తగినంతగా ఉండటం ముఖ్యం.
3. పన్ను ప్రయోజనాలు: బీమా పథకాలు సాధారణంగా పన్నులపరమైన ప్రయోజనాలు కల్పించేవిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment