ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు | Bajaj Auto has recently launched the updated Chetak EV 35 series in India | Sakshi
Sakshi News home page

ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు

Published Sat, Dec 21 2024 12:42 PM | Last Updated on Sat, Dec 21 2024 2:54 PM

Bajaj Auto has recently launched the updated Chetak EV 35 series in India

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్‌ ఆటో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చేతక్‌ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

కొత్త చేతక్‌ రూ.1.2 లక్షల ధరతో మిడ్‌ వేరియంట్‌ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్‌–ఎండ్‌ వేరియంట్‌ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్‌ స్పీడ్‌ గంటకు 73 కిలోమీటర్లు. బేస్‌ వేరియంట్‌ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్‌ టాప్‌ స్పీడ్‌ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్‌ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?

నావిగేషన్, మ్యూజిక్‌ కంట్రోల్, కాల్స్‌ అందుకునేలా స్మార్ట్‌ టచ్‌స్క్రీన్‌ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్‌ ఏర్పాటు ఉంది. స్టోరేజ్‌ స్థలం పరంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్‌ ఇమ్మొబిలైజేషన్, గైడ్‌ మీ హోమ్‌ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్‌ డిటెక్షన్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్‌ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్‌ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement