మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా? | Gold and Silver rates today on market in Telugu states | Sakshi
Sakshi News home page

మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?

Dec 21 2024 11:46 AM | Updated on Dec 21 2024 11:50 AM

Gold and Silver rates today on market in Telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 పెరిగింది.

చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 పెరిగి రూ.77,600 వద్దకు చేరింది.

సిల్వర్ ధరలు

బంగారం ధరలు పెరగడంతోపాటు వెండి ధరల్లో మార్పులు జరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర రూ.1,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.99,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement