gold market
-
నేటి బంగారం ధర ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.73,400 (22 క్యారెట్స్), రూ.80,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.73,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.80,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర(Gold Price) రూ.100 పెరిగి రూ.73,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 ఎగబాకి రూ.80,220 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగినట్లే వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర(Silver rates) కేజీకి రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 పెరిగింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 పెరిగి రూ.77,600 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరగడంతోపాటు వెండి ధరల్లో మార్పులు జరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర రూ.1,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.99,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,400 (22 క్యారెట్స్), రూ.76,800 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.76,800 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 తగ్గి రూ.70,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 దిగజారి రూ.76,950 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. గురువారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.1,000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కొండెక్కిన బంగారం ధరలు..
-
బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్
దీపావళి పండగను పురస్కరించుకుని ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రిలయన్స్ గ్రూప్ అవకాశం కల్పిస్తోంది. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. ముదుపర్లు, వినియోగదారులు నేరుగా ఈ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్మార్ట్ గోల్డ్ ఫీచర్‌తో డిజిటల్ రూపంలో కేవలం రూ.10తో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది.నేరుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి జియో ఫైనాన్స్ యాప్ ద్వారా 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా. బరువుగల బంగారం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన బంగారం అందిస్తామని తెలిపింది. గోల్డ్‌లో మదుపు చేసేందుకు మరో మార్గాన్ని కూడా జియో ఫైనాన్స్ అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!కస్టమర్లు రూ.10 అంతకంటే ఎక్కువ పెట్టుబడితో డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలం మదుపు చేసిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చని చెప్పింది. -
ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధర!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా బంగారం ధరలు పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కనకం ధర పాతికేళ్ల కాలంలో ఊహించని స్థాయిలో పెరిగి కొండెక్కింది. గురువారం మార్కెట్లో మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.79 వేల మార్కును దాటింది. 2000 సంవత్సరంలో తులం బంగారం రూ. 4,400 ఉండగా ఇప్పుడు రూ.79 వేలకు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో ఏ వస్తువుగానీ, లోహం ధరగానీ ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు. భారతీయులకు బంగారమంటే మక్కువ ఎక్కువ. శుభకార్యాలలో ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు ఆభరణాలను ధరిస్తుంటారు. కానుకలుగా బంగారం ఇస్తుంటారు.పెళ్లిళ్లలో అయితే తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5 తులాల బంగారం కట్నంగా పెట్టాల్సిందే. ఐదు తులాలు అంటే ప్రస్తుతం రూ. 4 లక్షలు అవుతుంది. ధర భారీగా పెరగడంతో సామాన్యులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. చాలామంది బంగారు ఆభరణాలను కొనలేని పరిస్థితిలో ఇమిటేషన్ జ్యువెలరీని ఆశ్రయిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలపై కామారెడ్డికి చెందిన మూడు తరాలవారితో ‘సాక్షి’ మాట్లాడింది. ఒక తరంలో ఉన్న ధరకు, తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.నూరు రూపాయలుండే..నా పెళ్లి 1954 సంవత్సరంలో అయ్యింది. అప్పుడు బంగారం తులం నూరు రూపాయలు ఉండేది. అప్పుడు ధర తక్కువే అయి నా సంపాదన కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు ధరలు చాలా పెరిగి పోయాయి. బంగారం ధర వింటేనే భయమేస్తుంది.– పొగాకు నర్సుబాయి, కామారెడ్డితులానికి రూ. 1400 ఉండేది..నా పెళ్లి 1980 లో జరిగింది. అప్పట్ల తులం బంగారం ధర రూ. 1,400 ఉండేది. ఆ ధర ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ అప్పటిది అప్పుడు, ఇçప్ప టిదిప్పుడు అన్నట్టుగా నే ఉంది. బంగారం ధరలు బాగా పెరిగి, సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి చేరింది.– మైలారపు అంజలి, పొగాకు నర్సుబాయి కూతురు, కామారెడ్డితులానికి రూ.5,500 ఎక్కువ అనుకున్నం...నా వివాహం 2003 సంవత్సరంలో జరిగింది. అప్పుడు తులం బంగారం ధర రూ.5,500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ అనుకున్నం. తరువాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రూ.79 వేలు అంటుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇరవై ఏళ్లల్లో ధర అడ్డగోలుగా పెరిగింది. – ముప్పారపు అపర్ణ, పొగాకు నర్సుబాయి మనవరాలు, కామారెడ్డి -
బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..
బంగారాన్ని కొందరు ఆభరణంగా వినియోగిస్తే, ఇంకొందరు పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దాంతో పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనుగోలు చేస్తూంటారు. అయితే రిటైల్ షాపుల్లో తీసుకునే బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? అయినా అంత పెద్దషాపు నిర్వహిస్తున్నవారు ఎందుకు మోసం చేస్తారని అనుకుంటున్నారా? నిబంధనల ప్రకారం నడుపుతున్న షాపుల్లో ఈ మోసాలు తక్కువే. సరైన నిబంధనలు పాటించనివారు మాత్రం బంగారం స్వచ్ఛత విషయంలో వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో బంగారం నాణ్యతను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం.బంగారం నాణ్యతను క్యారట్లలో కొలుస్తారు. బంగారం కొనేందుకు షాపులోకి వెళ్లిన వెంటనే నచ్చిన ఆభరణాలు ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు షాపు సిబ్బంది 24, 22, 18 క్యారట్ల బంగారం అని చెబుతూ తక్కువ నాణ్యత కలిగిన ఆభరణాలు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు 18 క్యారట్ నాణ్యత కలిగిన బంగారం చూపుతూ..అది 22 క్యారట్ గోల్డ్ అని చెబుతుంటారు. అది నమ్మి చివరకు 22 క్యారట్ బంగారం ధర చెల్లిస్తుంటారు. అయితే ఇలాంటి మోసాలు ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న బంగారు ఆభరణాలపై ముందుగా ప్రభుత్వ అధీనంలోని బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సంస్థ హాల్‌మార్క్ ఉందో పరిశీలించాలి. దీంతోపాటు ఆభరణంపై కొన్ని నంబర్లు కూడా ఉంటాయి. వాటిని బట్టి అది ఎంత స్వచ్ఛమైన బంగారమో నిర్ధారించుకోవచ్చు.24 క్యారట్ బంగారం: 999 అనే సంఖ్య ఉంటుంది.22 క్యారట్: 91618 క్యారట్: 75014 క్యారట్: 58310 క్యారట్: 417 అనే నంబర్ ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!24 క్యారట్ బంగారం వందశాతం స్వచ్ఛమైంది. 22 క్యారట్ బంగారంలో 8.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. 18 క్యారట్ బంగారంలో 25 శాతం ఇతర పదార్థాలతో కల్తీ చేస్తారు. 14 క్యారట్-41.7 శాతం, 10 క్యారట్-58.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. -
సోనేకా ఠేట్.. నారాయణపేట్
నారాయణపేట: మగువల మనసు దోచే అందమైన, అద్భుతమైన మన్నికకు మారుపేరుగా నిలిచే బంగారు అభరణాలకు నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి. దాదాపు 128 ఏళ్లుగా పేట బంగారానికి చెక్కుచెదరని ఖ్యాతి ఉంది. ఇక్కడి బంగారం నాణ్యత చూసిన నిజాం ప్రభువు నారాయణపేట్ సోనేకా ఠేట్ (స్వచ్చమైన బంగారం) అని కితాబిచ్చినట్లు ప్రచారం ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని విక్రయించడంలో స్థానిక స్వర్ణకారులు నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అందుకే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. బంగారు విక్రయానికి 128 ఏళ్లు నారాయణపేటలో 1898వ సంవత్సరం నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వ్యాపారులు బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజాం కాలంలో లహోటికి చెందిన వారు వ్యాపారం భారీగా చేసేవారు. ఆ కాలంలో రాజస్తాన్ నుంచి నారాయణపేటకు వచ్చిన రాంచందర్ మెగరాజ్ భట్టడ్ ఇక్కడ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా స్థానికంగా బంగారం వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆరంభంలో అసరం భట్టడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర ఎనిమిది బంగారు దుకాణాలుంటే.. ప్రస్తుతం 100పైగా దుకాణాలకు విస్తరించాయి. హాల్‌మార్క్.. మోనోగ్రామ్ స్థానికంగా దుకాణాల్లో తయారు చేసిన అభరణాలపై చిన్న సైజులో తమ దుకాణం పేరు ముద్రను (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలు చేసిన వారు విక్రయించేందుకు వెళ్తే.. గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లను వ్యాపారులు బంగారం ప్రియుల కోసం అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబై, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పది రోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. హాల్‌మార్క్‌తో కూడిన వివిధ రకాల డిజైన్లలో నగలను హైదరాబాద్, నారాయణపేటలోని బెంగాలీ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మీ నెక్లెస్, లక్ష్మీలాంగ్ చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల అభరణాలు లభిస్తాయి. శుభకార్యం వస్తే చాలు.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేట సరాఫ్ బజార్ కిటికిటలాడుతుంది. రాష్ట్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, జనగాంలతో పాటు నారాయణపేటలో బంగారం ఎంతో నాణ్యత, మన్నికతో ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగారం కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని యాద్గిర్, సేడం, గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు ఎక్కువ వస్తుంటారు. స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచే కొనుగోళ్లు దేశంలోని బంగారు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌తో పాటు సెంట్రల్ బ్యాంకుల్లో డీడీలను కట్టి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంకులు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ల నుంచి కిలోల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ఆరంభంలో డాలర్ విలువపై హెచ్చుతగ్గు ధరలు కావాల్సిన వారు.. బంగారం కోసం ఆన్లైన్లో ధరను కోట్ చేసి ఉంచితే వారికి అదే ధరకు బంగారం కేటాయిస్తారు. సరాఫ్ బజార్ ఏ ఊళ్లోనైనా కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్, కిరాణా మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండడం సహజం. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 100 దుకాణాలు వరుసగా ఉండడంతో సరాఫ్ బజార్ అని పేరుపెట్టారు. పెద్ద పెద్ద నగరాల స్థాయిలో పేటలో బులియన్ అండ్ జువెల్లర్స్గా వ్యాపారం కొనసాగుతోంది. తేజాప్తో నాణ్యత ఆభరణాలు నాణ్యతగా ఉన్నాయా?, డూప్లికేటా? అనేది తేజాప్తోనే పరిశీలిస్తారు. డూప్లికేట్ బంగారు నగలైతే వెంటనే అది కాలిపోతూ నల్లగా మారుతుంది. ఒరిజినల్ బంగారాన్ని తేజాప్లో వేసి కరిగించినా ఎలాంటి మార్పు రాదు. తేజప్లో పాత బంగారాన్ని కరిగించి నగల నాణ్యతను గుర్తిస్తారు. టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారాన్ని పరీక్షిస్తున్నారు. నారాయణపేటలో 24 క్యారెట్లతో నగలు తయారు చేస్తారు. అందుకే అత్యవసర సమయాల్లో అభరణాలను విక్రయిస్తే.. పేట బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గదు.30 ఏళ్లుగా వ్యాపారం నేను 30 ఏళ్లుగా బంగారు వ్యాపారం చేస్తున్నా. ముంబై, పుణే, హైదరాబాద్ నగరాల్లో 18, 19 క్యారెట్లతో బంగారు అభరణాలు విక్రయిస్తుంటారు. కానీ ఒక్క నారాయణపేటలోనే ఇప్పటికి 24 క్యారెట్లతో నగలు తయారు చేసి విక్రయిస్తున్నాం. – సరాఫ్ నాగరాజు, వ్యాపారి, నారాయణపేటనాణ్యతకు మారుపేరు.. నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు మారుపేరు నారాయణపేట బంగారు అభరణాలు. 24 క్యారెట్లతో నాణ్యత కూడిన బంగారు అభరణాల విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కొన్న అభరణాలు రీసేల్ చేస్తే 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారాన్ని కొనేందుకు అసక్తి చూపుతారు. – హరినారాయణభట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నారాయణపేటఅంతా ‘చొక్క’బంగారమే నారాయణపేటలో స్వర్ణకారులు తయారు చేసేది.. వ్యాపారస్తులు అమ్మేదంతా చొక్క బంగారమే. అభరణాల్లో కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డాణాలు, నానులు తదితర ఆభరణాలను నాణ్యత, మన్నికతో తయారు చేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. వందశాతం నాణ్యతగా ఉంటుంది. – శ్రీనివాస్ చారి, స్వర్ణకారుడు, నారాయణపేటచొక్క బంగారు అభరణాలివే నాను, పుస్తెలతాడు, గొలుసు, రెండు, మూడు వరసల పెద్దగొలుసులు, జిలేబీ చైను, చుట్టూ ఉంగరాలను 24 క్యారెట్లతో తయారు చేస్తారు. చంద్రహార, బోర్మాల్ గుండ్లు, కొలువులు, టెక్కీలు, ఐదారుటెక్కీలు, నెక్లెస్, లాంగ్‌చైన్, వడ్డాణం, వంకీలు, గాజులు, చెవుల కమ్మలు, జుంకీలు, మకరకురందనాలు, గెంటీలు, తార్కాస్ కమ్మలు, కరివేపూలు, ఏడురాళ్ల కమ్మలు, బ్రాస్లెట్లు, లాకెట్లు తదితర ఆభరణాలను కూడా తయారు చేస్తారు. -
బంగారం కొనడానికి ఇదే మంచి అవకాశం..
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. .. దిగి వచ్చిన బంగారం ధర
-
గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం.. నేటి ధరలు ఇవే..!
-
హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 29) మోస్తరుగా తగ్గాయి. నిన్నటి రోజున స్థిరంగా బంగారం ధరలు ఈరోజు తగ్గి ఉపశమనం కలిగించాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ. 72,600 లకు తగ్గింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.72,750 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 తగ్గి రూ.73,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది. -
కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
గత కొద్ది రోజులుగా పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండో రోజుల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో పెరిగిపోతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ అంశాలు,పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి విపరీమైన డిమాండ్ పెరుగుతోంది. ఒకానొక దశలో 10 రోజుల వ్యవధిలో రూ.10 వేలు పెరగడంపై బంగారం వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగే కొద్ది కొనుగోలు శక్తి తగ్గిపోవడం..ఫలితంగా వ్యాపారం సైతం కుంటుపడుతుందని అంటున్నారు. ఈ తరుణంలో పసిడి ధరలు స్థిరంగా ఉండడం కొనుగోలు, అమ్మకం దారులకు ఊరటనిచ్చినట్లైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్త చేస్తున్నారు. అంతేకాదు ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది -
బాబోయ్ బంగారం.. ఇలాగైతే గోల్డ్ కొనడం కష్టమే!
బంగారం ధరలు తారా జువ్వ లాగా పైపైకి చేరుతున్నాయి. 2024 ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం రేటు ఏప్రిల్ ప్రారంభంలో ఏకంగా రూ. 70వేలుకు చేరువయ్యింది. నేటి (ఏప్రిల్ 1) పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా నేడు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63750 (22 క్యారెట్స్), రూ.69530 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 850, రూ. 930 పెరిగింది. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 930 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 69530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63750 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 69530 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు రూ. 850, రూ. 930 పెరిగింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 1) వెండి ధర రూ. 600 పెరిగి రూ. 78600 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బంగారం & వెండి చికెన్ ధరలు
-
బంగారం ధర గరిష్ఠానికి చేరనుందా..?
బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింత పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీని ధర రికార్డు స్థాయిల్లోకి చేరుకుంటుంది. ఈ ఏడాది ఆల్‌టైమ్‌హైకి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరంలోనే 10 గ్రాములు రూ.72వేలు పలుకుందని అంచనాలు వస్తున్నాయి. దేశీయ, విదేశీ స్టాక్‌మార్కెట్లు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్‌తోపాటు భారత్‌సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,050 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,600గా ఉంది దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,880గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,730గా ఉంది. -
నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మాఘమాసం ముందు వరకు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పెళ్లి సీజన్ ప్రారంభంతో మార్కెట్ లో బంగారంపై డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇక, ఫిబ్రవరి 21న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10లు తగ్గింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పడిసి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,840 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది -
వరుసగా తగ్గి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన బంగారం ధరలు
-
World Gold Council 2023: పడినా... పసిడిది పైచేయే..!
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2023లో 3 శాతం క్షీణించి 747.5 టన్నులకు చేరుకుంది. అయితే ధరలు తగ్గుముఖం పట్టి, అస్థిర పరిస్థితులు తొలగిపోయిన పక్షంలో డిమాండ్ రానున్న కాలంలో 800–900 టన్నుల మధ్య ఉండవచ్చు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన 2023 ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 2022లో భారత్ మొత్తం పసిడి డిమాండ్ 774.1 టన్నులు. నివేదికలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే... ► పెరుగుతున్న బంగారం ధరలకు తోడు ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు 2023 డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. కొనుగోళ్లపట్ల వినియోగదారుల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాణిజ్య సెంటిమెంట్ బలహీనంగా ఉంది. 2023 మే 4వ తేదీన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర కొత్త గరిష్టం రూ.61,845కు చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,083 డాలర్లకు ఎగసింది. ఇక దేశీయ మార్కెట్లో ధర నవంబర్ 16న మరో కొత్త గరిష్టం రూ.61,914కు చేరింది. ► 2019 నుండి బంగారం డిమాండ్ 700–800 టన్నుల శ్రేణిలోనే ఉంటోంది. తగ్గిన డిమాండ్, నిరంతర ధరలు అలాగే సుంకాల పెరుగుదల, స్టాక్ మార్కెట్ పనితీరు, సమీప కాల ఎన్నికల ఖర్చు ప్రభావం దీనికి కారణం. అయితే భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ధరలు అధిక స్థాయిలోనే ఉంటాయన్న విషయాన్ని మార్కెట్ జీరి్ణంచుకుంటుండడం ఈ సానుకూల అంచనాలకు కారణం. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ 6 శాతం తగ్గి 562.3 టన్నులకు పడింది. 2022లో ఈ పరిమాణం 600.6 టన్నులు. ► పెట్టుబడుల డిమాండ్ మాత్రం 7 శాతం పెరిగి 173.6 టన్నుల నుంచి 185.2 టన్నులకు ఎగసింది. దిగుమతులు 20 శాతం అప్ కాగా మొత్తం పసిడి దిగుమతులు 2023లో 20 శాతం పెరిగి 650.7 టన్నుల నుంచి 780.7 టన్నులకు ఎగశాయి. 2024లో డిమాండ్‌కన్నా పసిడి దిగుమతులు అధికంగా ఉండే అవకాశం ఉందని అవుట్‌లుక్ ఆవిష్కరణ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) పీఆర్ సోమశేఖర్ పేర్కొన్నారు. భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) దీనికి కారణం అవుతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో 26.7 శాతం పెరిగి 35.95 బిలియన్ డాలర్లకు పసిడి దిగుమతులు చేరుకున్నట్లు నివేదిక వివరించింది. భారీ డిమాండ్ దీనికి కారణం. ప్రపంచ డిమాండ్ కూడా 5 శాతం డౌన్ ఇదిలావుండగా, 2023లో ప్రపంచ పసిడి డిమాండ్ 5 శాతం తగ్గి 4,448.4 టన్నులకు పడినట్లు నివేదిక పేర్కొంది. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) భారీ ఉపసంహరణలు దీనికి కారణం. నివేదిక ప్రకారం ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది మూడవ సంవత్సరం. ఈటీఎఫ్‌ల ఉపసంహరణల పరిమాణం 2022లో 109.5 టన్నులు. అయితే 2023లో ఈ పరిమాణం ఏకంగా 244.4 టన్నులకు ఎగసింది. కాగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 2022లో 1,082 టన్నులు అయితే 2023లో ఈ పరిమాణం 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు పడింది. అయితే సెంట్రల్ బ్యాంకుల అత్యధిక కొనుగోళ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాలూ రికార్డుగా నిలిచాయి. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ తన పసిడి నిల్వలను 2022లో 32 టన్నులు పెంచుకుంటే, 2023లో 16.2 టన్నులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్ దాదాపు 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా 48 బిలియన్ డాలర్లు. -
పెరిగిన బంగారం, వెండి - హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎనిమిది రోజుల తరువాత బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ.100 ఎక్కువ. నేడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి, వెండి ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ.57800 (22 క్యారెట్స్), రూ.63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు తులం ధరలు రూ. 100 రూపాయలు ఎక్కువ. ఇదే ధరలు విజయవాడ,గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కొనసాగుతాయి. ఢిల్లీలో ఈ రోజు తులం బంగారం ధర రూ.100 పెరిగింది. కాబట్టి 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 57950 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63200 గా ఉంది. చెన్నైలో మాత్రం గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ.50 పెరిగింది. దీంతో ఈ రోజు చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 58450 (22 క్యారెట్స్), రూ. 63760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు ఈ రోజు రూ. 200 వరకు పెరిగింది. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఈ రోజు దేశం మొత్తం మీద స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. -
ఏటీఎంలో బంగారం..!
నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్లో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. దీని ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఏటీఎంలో మాదిరిగానే నిర్దేశించిన ఆప్షన్లను పాటిస్తూ లావాదేవీ పూర్తి చేసిన వెంటనే కాయిన్లు బయటికి వస్తాయి. ఈ ఏటీఎం ద్వారా బంగారం, వెండి కాయిన్లు కొనుగోలు చేయొచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఏ కాయిన్ కావాలో స్క్రీన్‌పై ఎంచుకుని అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం.. ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. -
మదుపర్లను ఆకర్షించని గోల్డ్ ఈటీఎఫ్‌లు
ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్‌ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్‌ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్న పోర్ట్‌ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?, పెరిగాయా? తగ్గాయా?
దేశంలో బంగారం ధరలు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,900 ఉండగా ఆదివారం రూ.10 పెరిగి రూ.54,910కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 59,890 ఉండగా.. అదే ధర ఈ రోజు రూ.59,900గా ఉంది. ఇక దేశంలో ఆయా ప్రాంతాల వారీగా బంగారం ధరల్ని ఒక్కసారి పరిశీలిస్తే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,310 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330గా ఉంది ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,910 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,900గా ఉంది న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,060 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,050గా ఉంది కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,910 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,900గా ఉంది బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.54,910 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,900గా ఉంది హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,910 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,900గా ఉంది విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,910 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,900గా ఉంది వైజాగ్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,910 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,900గా ఉంది -
తగ్గిన బంగారం ధరలు - తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇలా!
దేశీయ మార్కెట్లో ఈ రోజు (2023 సెప్టెంబర్ 11) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,840కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధర రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి రూ. 59,830కు చేరింది. ఒక గ్రామ్ 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 5484 & రూ. 5983గా ఉన్నాయి. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54990 కాగా 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రూ. 59830గా ఉంది. ముంబై, పూణే, కేరళలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, కడపలలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,840 కాగా 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) ప్రైస్ రూ. 59,830 వద్ద ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55320 కాగా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,340 వద్ద ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలలో హెచ్చు తగ్గులకు కారణమవుతుందని తెలుస్తోంది. వెండి ధరలు.. వెండి ధరలు ఈ రోజు కొంత పెరిగినట్లు తెలుస్తుంది. 100 గ్రాముల వెండి ధర రూ. 7750 కాగా 1 కేజీ వెండి ధర రూ. 77500గా ఉంది. నిన్న ఒక కేజీ వెండి ధర రూ. 77000 కావడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడలో కేజీ సిల్వర్ ధర రూ. 77500గా ఉంది. బెంగళూరులో కేజీ వెండి రూ. 73000 కావడం గమనార్హం. -
బంగారం -వెండి ధరలు
-
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే!
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా..వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 22 కర్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా 10గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది విశాఖలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060గా ఉంది. -
బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్!
బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో బంగారం ధరల పెరగుదలకు కారణమని తెలుస్తోంది. అలాగే భారత్‌లో సైతం బంగారం ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం రోజు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390కి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,190 ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,600 ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600గా ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,020గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,020గా ఉంది. వైజాగ్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600ఉండగా ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,020గా ఉంది. -
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త!
రష్యా - ఉక్రెయిన్ మధ్య నాలుగు రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధం ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడడంతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. అయితే గత రెండు మూడురోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.500 తగ్గి మార్కెట్లో రూ.46,350 ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.50,570కి చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయ్ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,570గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,570 ఉంది. -
బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లలో, భూములు, బంగారం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతారు. అయితే, స్టాక్ మార్కెట్లలో రాబడి అనేది చాలా స్థిరంగా ఉండదు. ఇక భూములపై పెట్టె పెట్టుబడులు వల్ల మంచి ఆదాయం వచ్చిన అందులో చాలా తలనొప్పులు ఉంటాయి. ఇక బంగారం మిగతా రెండింటితో పోలిస్తే ఆదాయం తక్కువగా ఉన్న స్థిరమైన రాబడి వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది బంగారాన్ని ఒక ఆభరణాలుగా మాత్రమే చూడకుండా దానిని ఒక పెట్టుబడిగా చూస్తారు. అందుకే, పెట్టుబడిదారులు బంగారాన్ని స్వర్గధామంగా భావించి పసిడికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. భౌతిక బంగారం అనేది బంగారం పురాతన రూపం. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక కొత్త మార్గాలు వచ్చాయి. డిజిటల్ బంగారం, భౌతిక బంగారం, పేపర్ బంగారం వంటివి ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న కొన్ని బంగారు పెట్టుబడుల రకాలు. ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భౌతిక బంగారం మీదనే కాకుండా మిగతా వాటి మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. (చదవండి: రూ. 100కే గోల్డ్..! సరికొత్త వ్యూహంతో గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీలు..!) బంగారం పెట్టుబడుల రకాలు: భౌతిక బంగారం: బంగారు ఆభరణాలు, నాణేలు, బార్లు మొదలైనవి డిజిటల్ బంగారం: పేటిఎమ్, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసే బంగారం పేపర్ బంగారం: గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల బంగారాలలో పెట్టుబడి పెడతారు. అయితే, వివిధ రకాల బంగారంపై వివిధ రకాల పన్నులు విధించబడతాయి. భౌతిక బంగారంపైనా, గోల్డ్ బాండ్లపైనా ఒకేరకంగా పన్ను ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టడానికి ముందు వివిధ బంగారు పెట్టుబడుల పన్నుల గురించి తెలుసుకోవడం అవసరం. భౌతిక బంగారం ఆభరణాలు లేదా నాణేలు వంటి భౌతిక బంగారంపై పన్ను విధించడం అనేది మీరు వాటిని ఎంతకాలం ఉంచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. భౌతిక బంగారు పెట్టుబడి మూలధన లాభాలపై దీర్ఘకాలం, స్వల్పకాలిక వ్యవధిని బట్టి పన్ను ఉంటుంది. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది, అయితే మీరు 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పడుతుంది. స్వల్పకాలిక మూలధన లాభాలను మొత్తం పన్ను పరిధిలోకి తీసుకొని వచ్చి అప్పుడు మొత్తం ఆదాయంపై ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. అదే దీర్ఘకాలిక మూలధన లాభం(ఎల్టిసిజి)పై 20శాతం + 4శాతం సెస్ పన్ను, అదనంగా సర్ఛార్జ్ వర్తిస్తే పన్ను విధిస్తారు. అలాగే మీరు ఆభరణాల విషయంలో భౌతిక బంగారం కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలపై 3% జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని విక్రయించేటప్పుడు టీడీస్ వర్తించదు. కానీ, మీరు ₹2 లక్షలకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే 1% టీడీస్ వర్తిస్తుంది.(చదవండి: భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?) డిజిటల్ బంగారం డిజిటల్ బంగారంపై కూడా భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు. అలాగే, పన్ను అనేది మీ పెట్టుబడి కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే ఎల్టీసిజిగా పరిగణించి 20శాతం పన్ను+సెస్, సర్‌చార్జ్‌లు విధిస్తారు. అయితే డిజిటల్ గోల్డ్‌లో స్వల్పకాల రాబడిపై డైరెక్ట్‌గా పన్ను విధించరు. అయితే, 3 సంవత్సరాల లోపు విక్రయిస్తే ఎటువంటి పన్ను ఉండదు. డిజిటల్ బంగారంపై పెట్టుబడులు అనేది చాలా తక్కువ మొత్తం నుంచి ప్రారంభించవచ్చు. అందుకే ఇది పెట్టుబడిదారులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. కాగితం బంగారం బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్, సార్వభౌమ బంగారు బాండ్లు(ఎస్జీబి) కలిగి ఉన్న కాగితపు బంగారం కిందకు వస్తాయి. వీటిలో బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్ పై భౌతిక బంగారంతో పాటు సమానంగా పన్ను ఉంటుంది. అయితే, ఎస్జీబిలపై పన్నులు కొంచెం భిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ 3 సంవత్సరాలకు పైగా మీ దగ్గర ఉన్నప్పుడు ఎల్టిసిజి వర్తిస్తుంది. రేటు కూడా ఒకేవిధంగా ఉంటుంది. 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఆ పెట్టుబడుల లాభాలను మీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చి ఐటి స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం లేదా ఆఫీస్.. ఇక మీ ఇష్టం!) ఒక ఎస్జీబిపై సంవత్సరానికి 2.5% వడ్డీ లభిస్తుంది. అందుకని దీనిని మీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చి మీ ప్రధాన ఆదాయంపై ఐటి స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే, 8 ఏళ్ల తర్వాత ఎస్జీబిల ద్వారా మీరు పొందే ఏవైనా లాభాలు పన్ను రహితం. ఎస్జీబిలకు 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అయితే, ముందస్తుగా ఉపసంహరించుకున్నట్లయితే, విభిన్న పన్ను రేట్లు వర్తిస్తాయి. ఐదేళ్ల తరువాత ఎనిమిదేళ్లకు ముందు విత్‌డ్రా చేసుకుంటే ఎల్టీసిజి పన్ను 20శాతం+4శాతం సెస్ వర్తిస్తుంది. గోల్డ్ డెరివేటీవ్ గోల్డ్ డెరివేటీవ్లపై వర్తించే పన్ను భిన్నంగా ఉంటుంది. గోల్డ్ డెరివేటీల నుంచి వచ్చే రాబడిని వ్యాపారంపై వచ్చే ఆదాయంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సంస్థ మొత్తం టర్నోవర్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉంటే 6 శాతం పన్ను విధిస్తారు. ఇది ఆయా సంస్థలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అయితే, టర్నోవర్ ₹2 కోట్లకు పైగా ఉంటే దానిని వ్యాపార ఆదాయంగా చేర్చలేము.(చదవండి: అమెజాన్ వెర్షన్ చిట్టి రోబో) బహుమతి బంగారంపై పన్ను తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా పిల్లల నుంచి బంగారం బహుమతిగా అందుకున్నట్లయితే, అది పన్ను రహితం. కానీ, మీరు వారి నుంచి కాకుండా ఎవరైనా బహుమతిగా పొందితే మొత్తం బహుమతి విలువ ₹50,000కు చేరుకుంటే ఐటి స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి నుంచి అయిన ₹50,000 కంటే తక్కువ బహుమతిగా బంగారం పొందితే అది పన్ను రహితం. అయితే, బంగారాన్ని విక్రయించేటప్పుడు భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు. -
బంగారం ధరలు: మరింత ప్రియం!
Gold Rates Increase: బంగారం ధర ఆకాశాన్నంటింది. దీంతో కొనుగోళ్లు లేక అమ్మకందారులు గత 6 నెలల నుంచి అందోళన చెందుతున్నారు. దీనికి తోడు వివిధ షాపింగ్ మాల్స్‌లో రెడిమెడ్ బంగారు అభరణాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. శ్రావణమాసంలో అనేక పెండ్లిళ్లు శుభకార్యాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయని ఊహించిన అమ్మకందారులు నిరాశ చెందుతున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా, లాక్డౌన్, ఆన్‌సీజన్ తదితర కారణాలతో బంగారు అమ్మకాలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గత ఐదు రోజుల నుంచి జిల్లా బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 ఉంది. వెండి రూ. కిలో 64,100 నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడిరేటు పైకి చేరడంతో దేశీయ మార్కెట్లోను ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బులియన్‌మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులు బంగారంపై తక్కువ రేటుకు రుణాలుస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు రూ. తులం 50వేలు చేరుకునే అవకాశం ఉందని అమ్మకందారులు చెబుతున్నారు. తగ్గిన అమ్మకాలు 2020 మార్చిలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధి కోల్పొగా... కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు తనాఖ పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. మరికొంత మంది శుభకార్యాల కోసమని తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారు. దీంతో అమ్మకాలు ఆశించిన విధంగా జరుగక వ్యాపారులు అందోళన చెందుతున్నారు. పెరిగే అవకాశం ఉంది బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో రానున్న దసరా, దీపావళి పండుగకు 10గ్రాముల, 24 క్యారెట్ల బంగారం రూ. 50వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. పండుగలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ బాగా ఉంది. – చిలుక ప్రకాష్, బంగారం వ్యాపారి, కుమార్గల్లి అవసరానికే కొనుగోళ్లు కరోనా, ఈ మధ్య కాలంలో శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. షాపింగ్‌మాల్స్‌లలో రెడిమెడ్ బంగారు అభరణాలు లభిస్తుండటంతో అవసరానికి అక్కడ అభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ వృత్తిని నమ్ముకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – శ్రీనివాస్, బంగారం అమ్మకందారుడు రెడీమేడ్ ఆర్నమెంట్స్‌పై మక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి అభరణాలను తయారుచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది ఆర్నమెంట్ బంగారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడం అందోళన కలుగజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రిచాలి. పెరుగుతున్న ధరలను తగ్గించాలి. – శారద, గృహిణి, ప్రగతినగర్ చదవండి : యస్.. మేం ఆన్లైన్ బానిసలం -
తగ్గిన బంగారం ధరలు.. వారం రోజులుగా!
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. జులై 29, 30 తేదీల్లో పెరిగిన బంగారం.. జులై 31నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల్లో బంగారం ధర మరింత తగ్గడంతో ఔత్సాహికులు బంగారం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.ఇండియన్ మార్కెట్లో శుక్రవారం 22క్యారెట్ల బంగారం ధర పై రూ.200 తగ్గగా, అదే 22 క్యారెట్ల బంగారం శనివారానికి రూ.750కి తగ్గడంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇక శనివారం రోజు మార్కెట్ లో బంగారం, వెండిధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు 22 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.4,570 ఉండగా.. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.4,670 గా ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.36,560 ఉండగా.. 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.37,360గా ఉంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని బంగారం ధరలు ♦హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,570 గా ఉంది. ♦విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,570గా ఉంది. ♦విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,570 గా ఉంది. ♦ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 గా ఉంది. ♦బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,660 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,570గా ఉంది. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని వెండి ధరలు ♦ హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700గా ఉంది ♦ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ♦ చెన్నైలో కిలో వెండి ధర రూ.71,700 ♦ ముంబైలో కిలో వెండి ధర రూ.66,600 ♦ కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.66,600 ♦ బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,600 ♦ హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700 ♦ విజయవాడలో కిలో వెండి ధర రూ.71,700 -
Gold Rate: ఈరోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు
దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం బాండ్ల కొనుగోళ్లపై ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశానికి ముందే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశానికి ముందే ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,800 డాలర్ల కంటే తక్కువగా నమోదు అవుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.4,666 ఉండగా.. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.4,766గా ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.37,328 ఉండగా.. 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.38,128గా ఉంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,660 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,660 గా ఉంది. ఇక దేశంలో వివిధ రాష్ట్రాల్లోని బంగారం ధరలు ♦హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది. ♦విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది. ♦విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది. ♦ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ♦బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,660 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది. దేశంలో 1 గ్రాము వెండి ధర రూ.67.10గా ఉంది. 8 గ్రాముల వెండి ధర రూ.536.80గా ఉంది. 10 గ్రాముల వెండి ధర 671గా ఉంది. 100 గ్రాముల వెండి ధర రూ.6,710గా ఉంది. 1కిలో వెండి ధర రూ.67,100గా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వెండి ధరలు ♦హైదరాబాద్ లో 10గ్రాముల వెండి ధర రూ.719 ఉండగా, 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900గా ఉంది. ♦విజయవాడలో 10గ్రాముల వెండి ధర రూ.719 ఉండగా 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900 గా ఉంది. ♦విశాఖలో 10గ్రాముల వెండి ధర రూ. 719 ఉండగా 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900గా ఉంది. ♦చెన్నైలో 10గ్రాముల వెండి ధర రూ. 719 ఉండగా 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900గా ఉంది. ♦ముంబైలో 10గ్రాముల వెండి ధర రూ. 671 ఉండగా 100 గ్రాములు రూ.6,710, కిలో రూ.67,100గా ఉంది. చదవండి : కరోనా 3వ వేవ్ : బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక వ్యాఖ్యలు -
వెయ్యి టన్నులా, బంగారం కొనుగోళ్లపై సెంట్రల్ బ్యాంక్‌ల ఫోకస్
న్యూఢిల్లీ: వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి కొనుగోలు ప్రణాళికల్లో ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల వల్ల అంతర్జాతీయంగా పసిడి ధర పటిష్ట స్థాయిలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఏడాది కాలంలో బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తిరిగి యల్లో మెటల్‌పై ఆసక్లి చూపుతున్నట్లు సమాచారం. సెర్బియా నుంచి థాయ్‌లాండ్ వరకూ సెంట్రల్ బ్యాంకులు తాజాగా తమ విదేశీ మారకపు నిధుల్లో పసిడి వాటా పెంపుపై దృష్టి పెడుతున్నాయి. పసిడికి కొనుగోలు చేయనున్నట్లు ఘనా ఇటీవల ప్రకటించింది. దీర్ఘకాలికంగా ప్రయోజనం ద్రవ్యోల్బణం ఒత్తిడులకు దీర్ఘకాలంలో పసిడి మంచి ప్రయోజనాలను అందిస్తుందని, ఆర్థిక పరమైన గట్టు స్థితి నుంచి గట్టెక్కిస్తుందని నేషనల్ బ్యాంక్ ఆఫ్ సెర్బియా ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం తమ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న 36.3 టన్నుల పసిడిని 50 టన్నులకు పెంచుకోనున్నట్లు కూడా సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వూసిక్ పేర్కొన్నారు. క్రూడ్ ధరల పెరుగుదల వల్ల కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి చమురు ఎగుమతిదేశాలు పసిడి కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ మెటల్స్ చీఫ్ విశ్లేషకులు జేమ్స్ స్టీల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రతి ఐదు సెంట్రల్ బ్యాంకుల్లో ఒకటి పసిడి కొనుగోలు చేసే ప్రణాళికలో ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవలి నివేదిక ఒకటి పెరిగింది. ప్రపంచ రికవరీ బులిష్ పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు 2021లో 500 టన్నులు, 2022లో 540 టన్నుల పసిడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా. -
Gold Demand : ఆషాఢంలో ఆఫర్లు హోరెత్తుతాయా ?
ముంబై: త్వరలో బంగాంరం ధరలు తగ్గుతాయా ? కష్టమర్లను ఆకట్టుకునేందుకు జ్యూయల్లరీ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయా అంటే అవుననే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. బంగారానికి తిరిగి డిమాండ్ తీసుకువచ్చేందుకు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పడిపోయిన డిమాండ్ కరోనా సెకండ్ వేవ్‌తో బంగారం ధరలు పడిపోయాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌ల మధ్య కాలంలో అంటే 2020 నవంబరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740లుగా ఉంది. దాదాపుగా నాలుగు వేల వరకు బంగారం ధర పడిపోయింది. స్వచ్ఛమైన బంగారం ధరల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఫస్ట్ వేవ్‌లో కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కనిష్టంగా కేవలం 12 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా గత మేలో అంతకంటే తక్కువ బంగారం దిగుమతి అయ్యింది. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గిపోయాయి. హోల్‌సేల్ ఆఫర్లు ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నిబంధనల నుంచి సడలింపులు మొదలయ్యాయి. దీంతో బంగారం మార్కెట్లో చలనం తెచ్చేందుకు దిగుమతి సుంకం, స్థానిక పన్నులు కలుపకుని ఒక ఔన్సు బంగారంపై దాదాపు 800 నుంచి 900ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫస్ట్ ముగింపు దశలో గత సెప్టెంబరులో బంగారం అమ్మకాలు పెంచేందుకు ఈ స్థాయిలో డిస్కౌంట్లు ఇచ్చారు. మరోసారి అదే పద్దతిని బంగారం డీలర్లు అనుసరిస్తున్నారు. కొనుగోళ్లు ఉంటాయా లాక్డౌన్ సెకండ్ వేవ్ తర్వాత బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనే దానిపై నగల వర్తకుల్లో అనేక సంశయాలు ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లపై వారు తర్జనభర్జనలు పడుతున్నారు. అందువల్లే డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చైనా, జపాన్, సింగపూర్లలో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఆషాఢం ఆఫర్లు హోల్‌సెల్ డీలర్లు ప్రకటిస్తున్న ఆఫర్లు రిటైర్లరు కూడా ప్రకటిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రాబోయే ఆషాఢం మాసం ఎలాగు ఆఫర్లు ప్రకటించేందుకు అనువైనదే. చదవండి : బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత? -
గోల్డ్ పెట్టుబడులపై తగ్గని ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(గోల్డ్ ఈటీఎఫ్‌ల)లో పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నారు. ఫిబ్రవరి నెలలో రూ.491 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు రావడం దీన్నే సూచిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి చారిత్రక గరిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు 15 శాతానికి పైనే తగ్గాయి. ఇది కూడా ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించి ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.625 కోట్ల మేర పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరిలో ఈ వేగం తగ్గింది. 2020 డిసెంబర్ నెలలోనూ ఈ సాధనాల్లోకి రూ.431 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక అంతకుముందు కాలంలో 2020 నవంబర్‌లో రూ.141 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. 2020 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.6,657 కోట్ల మేర ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. మార్చి, నవంబర్ మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నికరంగా పెట్టుబడులు వచ్చాయి. తక్కువ ధరల సానుకూలత ‘‘2021లో ఇప్పటి వరకు బంగారం ధరలు 9 శాతం తగ్గాయి. ధరలు తగ్గినందున ఇన్వెస్టర్లు పరిణతితో తమ పోర్ట్‌ఫోలియోకు అదనంగా జోడిస్తున్నారు’’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి బలపడడం వల్ల దేశీయంగా కనిష్ట ధరలను ఇన్వెస్టర్లు అవకాశంగా తీసుకుంటున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక బలహీన పరిస్థితులు, కనిష్ట వడ్డీ రేట్లు, ద్రవ్యపరమైన విస్తరణ, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారంలో పెట్టుబడులు మధ్య కాలానికి అనుకూలమేనన్నారు. చదవండి: ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు సింగిల్ ఛార్జ్ తో 240 కి.మీ ప్రయాణం -
ఆకాశమే హద్దుగా..
కరోనా వైరస్ దెబ్బతో 2020లో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా కుదేలైన దేశీ మార్కెట్లు.. ఆ తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా ఎగిశాయి. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకునేందుకు ఆపసోపాలు పడుతున్నా.. స్టాక్స్ మొదలుకుని బంగారం దాకా అన్నీ కొంగొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ అదే జోరు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలతో పాటు ఆకర్షణీయమైన స్టాక్‌లు, పసిడి పరుగులపై నెలకొన్న అంచనాలపై కథనం... కరెక్షన్లు ఉన్నా.. మార్కెట్లు ముందుకే.. కొత్త సంవత్సరంలోనూ బుల్ పరుగు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యమధ్యలో కొంత కరెక్షన్ వచ్చినా.. మొత్తం మీద మార్కెట్లు మరింతగా పెరగడం ఖాయమని మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే 2021 డిసెంబర్ నాటికి నిఫ్టీ 15,000 మార్కును దాటగలదని జేపీ మోర్గాన్ వర్గాలు తెలిపాయి. ఇక వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరమని నొమురా అభిప్రాయపడింది. మార్కెట్లు బుల్ రన్‌లోనే ఉన్నాయని, మూడేళ్ల కన్సాలిడేషన్ బ్రేకవుట్‌ను బట్టి చూస్తే 2021లో 16,200 టార్గెట్ సాధించవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ తెలిపింది. పడితే కొనుగోళ్లకు అవకాశం.. సాధారణంగా బుల్ పరుగులో 15–20 శాతం కరెక్షన్కు అవకాశాలు లేకపోలేదని, అయితే దీన్ని ప్రతికూలాంశంగా భావించాల్సిన పని లేదని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. 11,400 కీలక మద్దతుగా .. ఈ కరెక్షన్లను కొనుగోళ్లకు అవకాశాలుగా మల్చుకోవచ్చని తెలిపింది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా చూస్తే.. అమెరికా ఎన్నికలు జరిగిన మరుసటి సంవత్సరం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు సానుకూల రాబడులే అందిస్తూ వస్తున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్ తన నివేదికలో వివరించింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, రంగాలవారీగా చూస్తే ఫైనాన్షియల్స్, టెలికం రంగాలపై దృష్టి పెట్టొచ్చని సిటీ రీసెర్చ్ సూచిస్తోంది. ఇక ఆర్డర్లు భారీగా ఉండటం, ప్రాజెక్టుల అమలు మెరుగుపడుతుండటం తదితర అంశాల కారణంగా నూతన సంవత్సరంలో ఇన్ఫ్రా రంగం ఆశావహంగా ఉండగలదని యస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. కాస్త రిస్కులు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్స్, టెలికం రంగాలవైపు చూడొచ్చని సిటీ రీసెర్చ్ సూచిస్తోంది. గణనీయంగా పడిపోయిన ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), విద్యుత్, రియల్ ఎస్టేట్‌తో పాటు ఎఫ్ఎంసీజీ రంగ సంస్థల షేర్లను పరిశీలించవచ్చన్నది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సూచన. అనిశ్చితిలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటోంది. తాజాగా కరోనా వైరస్ సంక్షోభ కాలంలోనూ అది రుజువైంది. 2020 తొలినాళ్లలో దేశీయంగా పుత్తడి గ్రాముల రేటు రూ. 39,100 దగ్గర, అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 1,517 డాలర్ల దగ్గర ప్రారంభమైంది. కరోనా వైరస్ పరిణామాలతో ప్రారంభంలో రూ. 38,400 రేటుకు పడిపోయినా ఆ తర్వాత ఒక్కసారిగా ఎగిసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీ (ఎంసీఎక్స్)లో ధర రూ. 56,191 స్థాయిని, అంతర్జాతీయంగా ఔన్సు రేటు (31.1 గ్రాములు) 2,075 డాలర్ల రికార్డు స్థాయిలను తాకింది. కొత్త సంవత్సరంలోనూ పసిడి జోరు కొనసాగే అవకాశాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా రికవరీ మందకొడిగా సాగుతున్నందున కొత్త సంవత్సరంలో ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ. 57,000 నుంచి రూ. 63,000 దాకా చేరొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. ప్యాకేజీ, డాలర్ బలహీనత ఊతం.. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ బలహీనతల ఊతంతో బంగారం రేట్లు మరోసారి పెరగవచ్చని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సరీ్వసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. ‘‘భారత్, చైనాలో పసిడికి డిమాండ్ బాగా పెరగవచ్చు. రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ఉంటే 2021లో పుత్తడి రేటు దేశీయంగా రూ. 60,000, అంతర్జాతీయంగా 2,200 డాలర్లు తాకొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పసిడి రేట్లకు కొనుగోలుదారులు అలవాటుపడుతుండటం, పేరుకుపోయిన డిమాండ్, తక్కువ వడ్డీ రేట్లు, అసాధారణ స్థాయిలో నిధుల ప్రవాహం మొదలైన అంశాలన్నీ బంగారం రేట్లు పెరగడానికి దోహదపడగలవని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు గతంలో ఎన్నడూ చూడని అసాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పరిశ్రమవర్గాలతో సమాలోచనల సందర్భంగా ఔషధాలు, బయోటెక్నాలజీ, వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రస్తుతం భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగాలకు ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. మరోవైపు, 2021 బడ్జెట్.. ఇన్వెస్టర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం నిధుల కోసం నానా తంటాలు పడుతోందని.. గతేడాది కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించినప్పటికీ..కొత్తగా కోవిడ్–19 సర్‌చార్జీలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. టీకాల నుంచి ద్రవ్యోల్బణం దాకా... కొత్త సంవత్సరంలో మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు కార్పొరేట్ల ఫలితాలు కంపెనీల ఆదాయాలు ఏడాది వ్యవధిలోనే దాదాపు కరోనా పూర్వ స్థాయికి చేరగలవని ఈక్విటీల నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ల ఆదాయాల అంచనాల వృద్ధి 6, 8 శాతం పైగా ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. మెటల్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇప్పటికే మెరుగైన రాబడులు అందిస్తుండగా.. రిటైల్, ఆటో మొదలైనవి కూడా అదే బాటలో ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక రికవరీ కరోనా దెబ్బతో ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా క్షీణించింది. అయితే లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేతతో క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు మళ్లీ రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటుతున్నాయి. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం భారత ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.3 శాతం క్షీణించే అవకాశమున్నా, వచ్చే ఆర్థిక సంవత్సరం 8.8 శాతం స్థాయిలో వృద్ధి సాధించవచ్చు. కోవిడ్–19 వ్యాప్తి ట్రెండ్, టీకాలు కరోనా వైరస్ టీకాల సమర్థత, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నూతన సంవత్సరంలో అన్నింటికన్నా కీలకంగా ఉండనున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో టీకాలు వేస్తుండగా.. భారత్‌లోనూ జనవరిలో దీన్ని చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫైజర్–బయోఎన్‌టెక్, ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ టీకాలపై అందరి దృష్టి ఉంది. ఇక సెకండ్ వేవ్ కట్టడీ కీలక అంశమే కావడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ రేట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనాల ప్రకారం భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. ఇది ఇప్పుడప్పుడే దిగి వచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి 2021 మొత్తం మీద రిజర్వ్ బ్యాంక్ .. వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా మధ్యకాలికంగా చూస్తే ద్రవ్యోల్బణం ఎగియవచ్చని, 2022లో ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టాల్సి రావొచ్చని నొమురా భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కాస్త దిగి వచ్చినా .. కమోడిటీల రేట్లకు రెక్కలు రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం తదితర అంశాల కారణంగా ఇతరత్రా ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా. ఇవే కాకుండా అమెరికాలో కరోనా వైరస్‌పరమైన ఆర్థిక ప్యాకేజీ, బ్రెగ్జిట్, అమెరికా–చైనా మధ్య సంబంధాలు, ఇతరత్రా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనవి మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. -
పసిడి, వెండి ధరల నేలచూపు
న్యూయార్క్/ ముంబై : ముందురోజు బౌన్స్‌బ్యాక్ అయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మందగమన బాట పట్టాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లో అక్కడక్కడే అన్నట్లుగా కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో వెనకడుగుతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడంతో సోమవారం విదేశీ మార్కెట్లో పసిడి ధరలు 5 శాతంపైగా కుప్పకూలిన విషయం విదితమే. కాగా.. ఎంసీఎక్స్‌లో మంగళవారం పసిడి రూ. 700 పుంజుకోగా.. వెండి సుమారు రూ. 2,000 జంప్ చేసింది. వివరాలు చూద్దాం.. వెనకడుగులో.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 75 తక్కువగా రూ. 50,426 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,463 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,350 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 244 క్షీణించి రూ. 62,800 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,044 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,998 వరకూ నీరసించింది. అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఫ్లాట్‌గా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో1,878 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ స్వల్పంగా 0.16 శాతం బలపడి 1,880 డాలర్లకు చేరింది. వెండి దాదాపు యథాతథంగా ఔన్స్ 24.45 డాలర్ల వద్ద కదులుతోంది. -
పసిడి.. జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభన, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక దశలో 1,941.65 డాలర్లనూ తాకిన ఔన్స్ ధర (శుక్రవారంతో పోల్చితే 41 డాలర్లు పెరుగుదల) ఈ వార్త రాసే సమయం రాత్రి 8 గంటల సమయంలో 1,935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో అసలే దూకుడుమీద ఉన్న పసిడి ధరకు అమెరికా రెండవ ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నదన్న సంకేతాలు మరింత బలాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికాసహా పలు దేశాల ఉద్దీపన చర్యలతో పసిడిలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ, ఈ చర్యలు బంగారాన్ని 2,000 డాలర్ల దిశగా తీసుకువెళతాయనీ విశ్లేషణలు ఉన్నాయి. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. దేశంలో ఒకేరోజు రూ.వెయ్యి అప్! ఇక దేశీయంగా పసిడి పరుగుకు అంతర్జాతీయ ధోరణులకు తోడు, దేశీయ కరెన్సీ బలహీనతలూ దోహదపడుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.83 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). దేశీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువకూడా భారీగా బలపడే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక పక్క రూపాయి బలహీన ధోరణి, మరోవైపు అంతర్జాతీయంగా పసిడి దూకుడు నేపథ్యంలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర వేగంగా రూ.60,000వైపు పయనించే అవకాశాలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. నిజానికి దేశంలోని స్పాట్ మార్కెట్లలో ఈ ధర ఇప్పటికే రూ.52,000 పైన ట్రేడవుతుండగా, సోమవారం ఆభరణాల బంగారం కూడా పలు పట్టణాల్లో రూ.50,000 దాటేయడం గమనార్హం. ఈ వార్త రాస్తున్న సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,000 లాభంతో (2 శాతం పైగా) రూ.52,033 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని వెండి కూడా అనుసరిస్తోంది. కేజీ ధర ఇక్కడ రూ.3,711 పెరిగి (6 శాతం పైగా) రూ.64,934 వద్ద ట్రేడవుతోంది. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి స్వచ్ఛత ధర రూ.905 పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి రూ.52,960కు చేరింది. వెండి కేజీ ధర రూ.3,347 పెరిగి రూ.65,670కు ఎగసింది. మంగళవారమూ ధరల స్పీడ్ కొనసాగే వీలుంది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే. హాల్‌మార్కింగ్ గడువు పెంపు ఇదిలావుండగా, బంగారం ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలన్న గడువును కేంద్రం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ వరకూ పెంచింది. నిజానికి ఈ గడువు 2021 జనవరి 15. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో ఆభరణ వర్తకుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. -
పండుగ సీజన్లో గోల్డ్ బాండ్ ధమాకా
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్మెంట్గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 7వ తేదీన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019–20– సిరీస్ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్ అందుబాటులో ఉంటుందన్నమాట. భౌతికపరమైన పసిడి డిమాండ్ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీల విషయంలో ఈ పరిమాణం 20 కేజీలుగా ఉంది. -
నగరంలో దారికిరాని జ్యువెలరీస్.. క్యా'రేట్' మోసం
ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్ భార్గవ్ పంజగుట్టలోని ఓ నగల షాపులో బంగారు నగలు కొనుగోలు చేశారు. రోజు బంగారం ధర ప్రకారం విలువకడితే కొన్న నగలకు మొత్తం రూ.86,000 వసూలు చేయాలి. కానీ, షాపులో మాత్రం బంగారంతో పాటు మరికొన్ని ఖర్చుల పేరుతో రూ.95,000 వసూలు చేశారు. అంటే మార్కెట్ ధర కంటే అదనంగా రూ.9000 తీసుకున్నారు. బిల్లులో బంగారం నాణ్యత పేర్కొనలేదు. ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువుతో కలిపి ధర వేసి వసూలు చేశారు. ఇది మహానగరంలోని బంగారు షాపుల్లో వినియోగదారులకు ఎదురవుతున్న సమస్య. సాక్షి,సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా, ప్రత్యేక పండగలు వచ్చినా బంగారం కొనడం సంప్రదాయం. నమ్మకం ఆధారంగానే బంగారం వ్యాపారం విరజిల్లుతుంది. పసిడి కొనుగోళ్లు సీజన్‌ను బట్టి ఉపందుకుంటాయి. అయితే, ప్రజల ఈ బలహీనతనే వ్యాపారులు సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. కళ్ల ముందే మాయ చేస్తున్నా ఏమాత్రం గుర్తించలేని వినియోగదారులు చేతి చమురు వదిలించుకొంటున్నారు. ఇక వజ్రాభరణాల్లో మేలిమి బంగారం నేతిబీరలో నెయ్యి చందంగానే మారింది. సాధారణంగా దుకాణదారుడిపై ఉన్న నమ్మకంతోనే వినియోగదారులు బంగారం కొంటుంటారు. అయితే, ఇక్కడే సదరు వ్యాపారులు వారికి శఠగోపం పెడుతున్నారు. ఆఫర్ల పేరుతో ఆకర్షించి, ‘తరుగు లేదు’ అంటూనే నిలువునా ముంచుతున్నారు. ఈ అక్రమాలను కట్టడిచేయాల్సిన తూనికల కొలతల శాఖ లక్షలాది రూపాయల మోసాలకు నామమాత్రపు జరిమానాతో సరిపెడుతున్నాయి. స్వచ్ఛత, తూకం మోసాలపై నమోదు చేసే కేసులు జరిమానాలకే పరిమితమవుతున్నాయి. ‘స్వచ్ఛత’లో మోసం ఇలా.. నగరంలోని ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని విక్రయిస్తుంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తో ఉంటుంది. వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేస్తుంటారు. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.700 వరకు తేడా ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగానికి దాదాపు రూ.7 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ♦ బంగారం దుకాణాల్లో వినియోగదారులు కొనే నగలకు సంబంధించిన బిల్లులో ఖచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువు, ధర విడివిడిగా పేర్కొనాలి. ♦ వస్తువు కొన్న రోజు బంగారం ధరతో పాటు 22 క్యారెట్, లేదా 24 క్యారెట్ అని స్పష్టంగా పేర్కొనాలి. ♦ మేకింగ్ చార్జీలు, వేస్టేజ్‌లను పన్నుల్లో కలపడం నిబంధనలకు విరుద్ధం. నికర బరువు (నెట్ వెయిట్) ప్రకారమే ధర వేయాలి. ఉదాహరణకు ఒక ఆభరణం 100 గ్రాములు ఉంటే ఆ రోజు మార్కెట్లో ఉన్న బంగారం ధర ప్రకారమే వినియోగదారుల నుంచి తీసుకోవాలి. అలా కాకుండా వ్యాపారులు వేస్టేజ్ పేరుతో 15 నుంచి18 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మోసాలకు సూచికలు ♦ బంగారం నాణ్యతను తెలిపే ‘క్యారెక్టరైజేషన్ మిషన్’ లేక పోవడం ♦ ఒక మిల్లీ గ్రాము వరకు తూచే ఎలక్ట్రానిక్ త్రాసు వినియోగించక పోవడం ♦ స్టోన్ తూకం తీయక పోవడం, సరైన బిల్లు ఇవ్వక పోవడం ♦ స్వచ్ఛతను తెలిపే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వక పోవడం ♦ ఎలక్ట్రానిక్ కాటాల వెనుక త్రాసును నియంత్రించే వీల్స్ బేరింగ్ మార్పచడం ♦ త్రాసుపై డిపార్ట్మెంట్ సీల్ లేకపోవడం.. ఉంటే ట్యాంపరింగ్ జరిగినట్లు కనిపించడం మోసంపై ఫిర్యాదు చేయాలంటే.. బంగారం స్వచ్ఛత, తూకం, ధరపై అనుమానం ఉంటే తూనికల కొలతల శాఖ హెల్ప్‌లైన్ 1800 425 00333కు ఫోన్ చేయవచ్చు. లేదా 94901 65619 నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మేలిమి బంగారానికే ‘హాల్‌మార్క్’ బిస్కెట్ రూపంలో విక్రయించే మేలిమి బంగారం స్వచ్ఛతతో ఉంటుంది. బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ ముద్రణ తప్పనిసరి. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిర్దేశించిన మేరకు ఆభరణాలు తయారు చేస్తేనే హాల్ మార్క్ చిహ్నం లభిస్తుంది. స్వచ్ఛమైన, హాల్ మార్క్ ముద్ర ఉన్న ఆభరణాలు విక్రయించేందుకు బీఐఎస్ అనుమతి అవసరం. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. బీఐఎస్ గుర్తించిన కేంద్రాలు జంటనగరాల్లో ఐదు ఉన్నాయి. వినియోగదారులు నష్టపోకుండా ఉండాలంటే హాల్ మార్కు ఆభరణాలే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ లేని అభరణాలను కొనుగోలు చేసినవారు వాటి నాణ్యతపై అనుమానం ఉంటే అభరణాన్ని పరీక్షించువచ్చు. స్వచ్ఛతపై దృష్టి అవసరం బంగారం నగలకు సంబంధించిన బిల్లులో ఖచ్చితంగా నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువు, ధర విడివిడిగా ఉండాలి. ధరతో పాటు క్యారెట్ స్పష్టంగా పేర్కొనాలి. మేకింగ్ చార్జీలు, వేస్టేజీలను పన్నుల్లో కలపడం నిబంధనలకు విరుద్ధం. షాపుల్లో నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేషన్ మిషన్ వినియోగించడం లేదు. వినియోదారుడు చాల జాగ్రత్త వహించాలి. బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి.– విమల్‌బాబు, డిప్యూటీ కంట్రోలర్, తూ.కొ.శాఖ -
కొందామా.. ఆగుదామా!
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా మార్కెట్లో బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోయూయి. పుత్తడి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో అంతర్జాతీయ పరిస్థితులు, షేర్ మార్కెట్ గమనాలు విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో అమ్మకం, కొనుగోలుదారుల్లో అయోమయం నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పతనం కావడమే దీనికి కారణమైంది. రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గుతాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, గత అనుభవాలను బట్టిచూస్తే బంగారం ధరలు తగ్గినా.. తిరిగి పుంజుకున్న పరిస్థితులే అధికంగా ఉన్నాయి. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని మా ర్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో కొత్తగా బంగారం కొనాలనుకునే వారు రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయన్న ఉద్దేశంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కడం లేదు. జిల్లాలో పుత్తడికి ప్రధాన మార్కెట్ అరుున నరసాపురంలో అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో సాగటం లేదు. ప్రస్తుత పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావటంతో సాధారణ రోజుల్లో సాగే అమ్మకాలతో పోలిస్తే నాలుగైదు రెట్లు అధికంగా ఉండాలి. కానీ.. 20 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయని బులియన్ వ్యాపారి అజిత్కుమార్జైన్ ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. మూడేళ్ల కనిష్టానికి... ప్రస్తుతం బంగారం ధరలు మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. బుధవారం నరసాపురం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.27,900 పలికింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.25,950కు ట్రేడ్ అయింది. వారం రోజులుగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇటీవల కాలంలో ధరలు ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. 2012 చివరిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 వేలకు పైగా చేరుకుని రికార్డు సృష్టించింది. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.35 వేల మార్కును చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏడాది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల అనూహ్యంగా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, దేశీయంగా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం వంటి పరిస్థితులే ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.25 వేల దిగువకు వస్తుందని అంచనా కడుతున్నారు. భారీగా నష్టాలు మూడేళ్ల నుంచి బంగారంపై మదుపుచేసే వ్యక్తులు ధరల తగ్గడంతో భారీగా నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో బంగారంపై పెట్టుబడిని సురక్షితమైన మార్గంగా మదుపరులు భావించారు. పుత్తడిపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం అవసరానికి ఆదుకుం టుందనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలోనే కాసు బంగారం (8గ్రాములు) ధర రూ.2,500 వరకు తగ్గింది. దీంతో వారు భారీగా నష్టపోయినట్లైంది. ఇదిలావుంటే బంగారంపై అప్పులు ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు కూడా ఆందోళనలో ఉన్నా యి. గ్రాముపై రూ.2 వేల వరకు ఆయూ సంస్థలు అప్పులు ఇచ్చాయి. జాతీయ బ్యాంకులు మాత్రం గ్రాముకు రూ.1,700 వరకు ఇచ్చాయి. ప్రైవేట్ వ్యాపారులు, కార్పొరేట్ బ్యాంకులు అధిక వడ్డీపై రూ.2,200 వరకూ అప్పులిచ్చారుు. ప్రస్తుతం ఆభరణాల బంగారు గ్రాము ధర రూ.2,580గా ఉంది. దీంతో అప్పుల వసూళ్లపై ఆయా బ్యాంకులు, సంస్థలు దృష్టిపెట్టాయి. ఖాతాదారులకు డిమాండ్ నోటీసులు పంపిస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.