ఎనిమిది రోజుల తరువాత బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ.100 ఎక్కువ. నేడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి, వెండి ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ.57800 (22 క్యారెట్స్), రూ.63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు తులం ధరలు రూ. 100 రూపాయలు ఎక్కువ. ఇదే ధరలు విజయవాడ,గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కొనసాగుతాయి.
ఢిల్లీలో ఈ రోజు తులం బంగారం ధర రూ.100 పెరిగింది. కాబట్టి 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 57950 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63200 గా ఉంది.
చెన్నైలో మాత్రం గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ.50 పెరిగింది. దీంతో ఈ రోజు చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 58450 (22 క్యారెట్స్), రూ. 63760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు ఈ రోజు రూ. 200 వరకు పెరిగింది. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఈ రోజు దేశం మొత్తం మీద స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment