భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మళ్ళీ.. | Gold, Silver Price Today Details | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మళ్ళీ..

Published Fri, Dec 15 2023 2:37 PM | Last Updated on Fri, Dec 15 2023 4:26 PM

Gold Silver Price Today Details - Sakshi

భారతీయ మార్కెట్లో గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. నిన్న ఒక్కసారిగా రూ.1000 పెరిగి పసిడి ప్రియులకు పెద్ద షాకిచ్చింది. ఈ రోజు కూడా స్వల్ప పెరుగుదలతో దూసుకెళ్తున్న గోల్డ్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5775, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6300గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 57750, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 62300గా ఉంది. నిన్న రూ. 1000 నుంచి రూ. 1090 వరకు పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు రూ. 100 నుంచి రూ. 110 వరకు పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి.

నిన్న చెన్నైలో రూ.1200 నుంచి రూ.1310 వరకు పెరిగిన బంగారం ధరలు, ఈ రోజు కూడా రూ. 100 నుంచి రూ. 110 వరకు పెరిగి బంగారం కొనేవారికి షాకిచ్చింది. నేడు ఒక గ్రామ్ బంగారం గోల్డ్ ధర రూ. 5830 (22 క్యారెట్స్), రూ. 6360 (24 క్యారెట్).

ఇదీ చదవండి: ట్రైన్లలో మాయమైపోతున్న దుప్పట్లు, దిండ్లు.. రెండు నెలల్లో రూ. 4 లక్షలు..

ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5790, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6315గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. కొత్త ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 5790 (22 క్యారెట్స్), రూ. 63150కి (24 క్యారెట్స్) చేరింది.

వెండి ధరలు
వెండి ధరలు కూడా ఈ రోజు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలతో పాటు.. చెన్నై, ఢిల్లీలలో రూ. 1000 పెరిగింది. మొత్తం మీద కొత్త సంవత్సరం రాకముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement