
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. నేడు తులం ధరల మీద రూ. 350 నుంచి రూ. 380 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం ప్రాంతల్లో 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 5855, కాగా 24 క్యారెట్ల ధర రూ. 6387గా ఉంది. ఈ లెక్కన ఒక తులం బంగారం ధరలు వరుసగా రూ. 58550, రూ. 63870గా ఉన్నాయి. నిన్న రూ.400 నుంచి రూ.430 పెరిగిన పసిడి ధరలు నేడు రూ.350 నుంచి రూ.380 వరకు తగ్గాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉంటాయి.
చెన్నైలో కూడా బంగారం ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. నేడు చెన్నైలో బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే రూ.350 నుంచి రూ.380 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59100 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64470 వద్ద ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 5870 (22 క్యారెట్ల ఒక గ్రామ్), రూ. 6397 (24 క్యారెట్ల ఒక గ్రామ్)గా ఉన్నాయి. ఈ లెక్కన తులం బంగారం ఢిల్లీలో రూ. 58700, రూ. 63970గా ఉన్నట్లు సమాచారం. నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 430 తక్కువ.
వెండి ధరలు
గత కొన్ని రోజులుగా పడిలేస్తున్న వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఒక కేజీ బంగారం ధర మీద రూ.1300 తగ్గినట్లు తెలుస్తోంది.