
గత కొన్ని రోజులుగా ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న బంగారం ధరలు, ఈ రోజు కూడా పెరుగుదలవైపే అడుగులు వేసాయి. న్యూ ఇయర్ లేదా సంక్రాంతికి బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం ప్రాంతల్లో 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 5850, కాగా 24 క్యారెట్ల ధర రూ. 6382గా ఉంది. ఈ లెక్కన ఒక తులం బంగారం ధరలు వరుసగా రూ. 58500, రూ. 63820గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 100, రూ. 110 ఎక్కువని స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉంటాయి.
చెన్నైలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు చెన్నైలో బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 50 ఎక్కువని తెలుస్తోంది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64360 వద్ద ఉన్నట్లు స్పష్టమవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 5865 (22 క్యారెట్ల ఒక గ్రామ్), రూ. 6396 (24 క్యారెట్ల ఒక గ్రామ్)గా ఉన్నాయి. ఈ లెక్కన తులం బంగారం ఢిల్లీలో రూ. 58650, రూ. 63960గా ఉన్నట్లు సమాచారం. నిన్నటి కంటే ఈ రోజు ధరలు రూ.100 ఎక్కువ.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
వెండి ధరలు
ఈ రోజు కేవలం బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి, నేడు రూ. 300 తగ్గుదలను నమోదు చేసింది. రానున్న రోజుల్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.