నాలుగు రోజుల క్రితం స్వల్ప దగ్గుదలను నమోదు చేసి.. ఆ తరువాత స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసింది. నేడు బంగారం ధరలు రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగి తులం ధరలు రూ. 65000కు చేరువలో ఉన్నాయి. బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు రూ. 200 నుంచి రూ. 270 వరకు పెరిగి తులం ధరలు రూ. 58,900 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 64,240 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
చెన్నైలో నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 మాత్రమే పెరిగింది. దీంతో నిన్న రూ. 59100గా ఉన్న 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 59200కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64580కి చేరింది.
ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా..
విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో పసిడి ధరలు రూ.58750 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.64090 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ.220 పెరిగినట్లు తెలుస్తోంది.
వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు రూ. 300 వరకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment