
2024 ప్రారంభంలోనే షాకిచ్చిన బంగారం ధరలు, గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతి దగ్గరపడుతున్న సమయంలో తగ్గుతున్న పసిడి ధరలు కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినట్లైంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో పసిడి ధరలు ఈ రోజు రూ.58000 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63270 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 తగ్గినట్లు తెలుస్తోంది.
చెన్నైలో నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 మాత్రమే తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నిన్న రూ. 58700గా ఉన్న 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 58600కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63930కి చేరింది.
ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్
ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 130 వరకు తగ్గి తులం ధరలు రూ. 58,150 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63400 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. నిన్న వరుసగా రూ. 400, రూ. 440 తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మళ్ళీ స్వల్ప తగ్గుదలను మాత్రమే నమోదు చేశాయి.
వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మొదలైన ప్రాంతాల్లో బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్న ఏకంగా రూ. 2000 తగ్గిన ధరలు ఈ రోజు మాత్రం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.