గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న గోల్డ్, సిల్వర్ ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల వైపు అడుగులు వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు.. చెన్నైలో కొంతమేర తగ్గాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, చెన్నై, ఢిల్లీలలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయి, వాటి వివరాలు ఏంటనేది ఈ కథనంలో చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 వరకు పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57400 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62620గా ఉంది. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల వైపు అడుగులు వేస్తుండటంతో పసిడి ప్రియులు ఒకింద భయపడుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నైలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5785 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6311గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 57850, రూ. 63110గా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యం
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 వరకు పెరిగాయి. దీంతో ఒక గ్రామ్ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5755 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 6277గా ఉంది. ఈ లెక్కన ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57550, రూ. 62770గా ఉన్నాయి.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా అటు తెలుగు రాష్ట్రాలు.. ఇటు చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు రూ. 300 వరకు పెరిగాయి. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈ రోజు పెరగడంతో.. కొత్త సంవత్సరం రాకముందే ధరలు పెరుగుతున్నాయని కొనుగోలుదారులు కొంత ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment