దేశీయ మార్కెట్లో గత కొన్ని బంగారం నేలచూపులు చూస్తోంది. సుమారు నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు డిసెంబర్ 12) కూడా 10 గ్రాముల బంగారం ధరలు రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గింది. ఈ కథనంలో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకుందాం.
👉 హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు బంగారం ధర రూ. 5675 (ఒక గ్రామ్ 22 క్యారెట్స్), రూ. 6191 (ఒక గ్రామ్ 24 క్యారెట్స్)గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల పసిడి ధర రూ. 56750 & రూ. 61910. అంటే నిన్నటికంటే కూడా ఈ రోజు బంగారం ధర రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. వైజాగ్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.
👉 చెన్నైలో ఒక గ్రామ్ 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5720 & రూ. 6240. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం రూ. 57200 (22క్యారెట్స్) రూ. 6240 (24 క్యారెట్స్)గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గినట్లు తెలుస్తోంది.
👉 దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5690 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 6206గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 56900 (22 క్యారెట్) రూ. 62060 (24 క్యారెట్). నిన్నటి పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 150 నుంచి రూ. 220 తగ్గినట్లు స్పష్టపమవుతోంది.
వెండి ధరలు
👉 ఈ రోజు హైదరాబాద్, విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా వెండి ధర రూ. 200 తగ్గుముఖం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment