ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? | Today Gold And Silver Prices Dec 24th In Hyderabad And Other Cities, See Details Inside - Sakshi
Sakshi News home page

Gold And Silver Prices Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Published Sun, Dec 24 2023 2:55 PM | Last Updated on Wed, Dec 27 2023 11:38 AM

Gold And SIlver Price Today - Sakshi

న్యూ ఇయర్ సమీపిస్తోంది, పండుగలు కూడా రానున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకుండా.. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు బంగారం ధరలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

ఈ రోజు విజయవాడ, హైద‌రాబాద్‌ల‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ రేటు రూ. 5820 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 6319గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58200, రూ. 63190గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5835.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6364గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58350, రూ. 63640గా ఉంది.

ఇదీ చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!

చెన్నైలో నేడు గోల్డ్ రేటు ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5875 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6409గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58750, రూ. 64090గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.

వెండి ధరలు
ఈ రోజు కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి, నేడు నిన్నటి ధరలతోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement