దీపావళి పండగను పురస్కరించుకుని ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రిలయన్స్ గ్రూప్ అవకాశం కల్పిస్తోంది. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. ముదుపర్లు, వినియోగదారులు నేరుగా ఈ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్మార్ట్ గోల్డ్ ఫీచర్‌తో డిజిటల్ రూపంలో కేవలం రూ.10తో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
నేరుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి జియో ఫైనాన్స్ యాప్ ద్వారా 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా. బరువుగల బంగారం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన బంగారం అందిస్తామని తెలిపింది. గోల్డ్‌లో మదుపు చేసేందుకు మరో మార్గాన్ని కూడా జియో ఫైనాన్స్ అందుబాటులో ఉంచింది.
ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
కస్టమర్లు రూ.10 అంతకంటే ఎక్కువ పెట్టుబడితో డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలం మదుపు చేసిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment