నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. దీని ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు కాయిన్లను కొనుగోలు చేయొచ్చు.
ఏటీఎంలో మాదిరిగానే నిర్దేశించిన ఆప్షన్లను పాటిస్తూ లావాదేవీ పూర్తి చేసిన వెంటనే కాయిన్లు బయటికి వస్తాయి. ఈ ఏటీఎం ద్వారా బంగారం, వెండి కాయిన్లు కొనుగోలు చేయొచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఏ కాయిన్ కావాలో స్క్రీన్‌పై ఎంచుకుని అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం..
ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment