Gold Purchase
-
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,900 (22 క్యారెట్స్), రూ.77,350 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,350 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.71,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,500 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. కానీ వెండి ధర(Silver Rate)ల్లో మాత్రం నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి రేటు రూ.98,900 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 పెరిగింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 పెరిగి రూ.77,600 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరగడంతోపాటు వెండి ధరల్లో మార్పులు జరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర రూ.1,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.99,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,400 (22 క్యారెట్స్), రూ.76,800 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.76,800 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 తగ్గి రూ.70,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 దిగజారి రూ.76,950 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. గురువారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.1,000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్‌జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠం ఎక్కనున్నారు. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నాట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు గురువారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,000 (22 క్యారెట్స్), రూ.78,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1650, రూ.1790 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1790 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1650 తగ్గి రూ.72,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1790 దిగజారి రూ.78,710 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. బుధవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.3,000 తగ్గి రూ.1,02,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..
బంగారం అంటే ఇష్టపడనివారు దాదాపు ఉండరు. పెళ్లి రోజు, పుట్టిన రోజు, పండగలు.. ఇలా ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనే ఆనవాయితీని చాలామంది పాటిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసా..? అదేంటి మన డబ్బులతో మనం బంగారం కొనుగోలు చేస్తున్నాం కదా. మరి దానికి ఎందుకు పరిమితులు అనుకుంటున్నారా? ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బంగారం దిగుమతి, ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే చట్టబద్ధమైన ధ్రువపత్రాలు కలిగి ఉంటే మాత్రం వ్యక్తులు కోరుకున్నంత బంగారాన్ని కలిగి ఉండవచ్చు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోతే ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసుకుందాం.ఇంట్లో దంపతులు, పిల్లలు ఉంటే ఒక్కొక్కరు ఎంతమేరకు బంగారం కలిగి ఉండాలో ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది.పెళ్లైన పురుషుడు: గరిష్ఠంగా 100 గ్రాములుపెళ్లైన మహిళ: గరిష్ఠంగా 500 గ్రాములుపెళ్లికాని పురుషుడు: గరిష్ఠంగా 100 గ్రాములుపెళ్లికాని మహిళ: 250 గ్రాములుఇదీ చదవండి: యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ మధ్య తేడా ఇదే..పైన తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో దంపతులు, ఇద్దరు పెళ్లికాని కూతుళ్లు ఉంటే ఆ కుటుంబం గరిష్ఠంగా 1,100 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. ఇందుకు ఎలాంటి ధ్రుపపత్రాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అంతకుమించి బంగారం ఇంట్లో ఉంటే మాత్రం ధ్రుపత్రాలు తప్పనిసరి. -
కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
‘మాఘమాసం’ వచ్చేసింది.. బంగారం ధరల్ని తగ్గించేసింది!
శుభ ముహూర్తాలకు మంచిరోజులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. దీంతో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 4 వరకు శుభకార్యాలు చేసుకునేందుకు గాను పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఈ తరుణంలో ఇన్ని రోజులు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. మాఘమాసం ప్రారంభం కావడంతో శుభకార్యాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్ దృష్ట్యా కస్టమర్లను ఆకట్టుకునేలా వ్యాపారులు బంగారం ధరల్ని తగ్గించి అమ్మకాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా ఫిబ్రవరి 10న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్లపై రూ.210 ధర తగ్గింది. ఇక దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. వైజాగ్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
ఏటీఎంలో బంగారం..!
నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్లో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. దీని ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఏటీఎంలో మాదిరిగానే నిర్దేశించిన ఆప్షన్లను పాటిస్తూ లావాదేవీ పూర్తి చేసిన వెంటనే కాయిన్లు బయటికి వస్తాయి. ఈ ఏటీఎం ద్వారా బంగారం, వెండి కాయిన్లు కొనుగోలు చేయొచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఏ కాయిన్ కావాలో స్క్రీన్‌పై ఎంచుకుని అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం.. ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. -
Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా? HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. BIS లోగో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. స్వచ్ఛత గ్రేడ్ ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID) బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం. పాత బంగారు ఆభరణాలు? ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు. -
బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టురట్టు
గన్నవరం: బంగ్లాదేశ్‌కు చెందిన దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా శుక్రవారం మీడియాకు చెప్పారు. బంగ్లాదేశ్ వాసులు ఆరుగురు ఈ నెల 5న జయంతిపూర్ బోర్డర్ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి రైలులో ఈ నెల 10న విజయవాడ చేరుకున్నారు. ఏటీఎంల్లో చోరీ నిమిత్తం మాచవరం డౌన్, రామ్‌గోపాల్ థియేటర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 14న గోవాకు మకాం మార్చారు. అక్కడ హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఎత్తుకుపోయి రూ.15 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీ చేరుకుని బంగారం కొనుగోలు చేశారు. ఈ నెల 19న విజయవాడకు చేరుకున్నారు. 21న గన్నవరంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ ఆటోను అపహరించి హైవే పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం చోరీకి యత్నించారు. బీట్ కానిస్టేబుల్ మణింద్రకుమార్, హోంగార్డు నాగరాజు అక్కడికి వెళ్లడంతో వారిపై దాడిచేసి పరారయ్యేందుకు యత్నించారు. మణీంద్ర ఇతర సిబ్బంది సహాయంతో ముఠాలోని నదీమ్‌ఖాన్, మహమ్మద్ జహంగీర్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.3 లక్షల నగదు, 32 కాసుల బంగారం, ట్రక్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నేరస్తులు సైమన్, బాద్షా, శరణ్‌సింగ్ సుమన్, కోకోన్ ముల్లా పరారీలో ఉన్నారు. మణీంద్ర ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఎంబసీ అధికారులకు సమాచారమిచ్చారు. మిగిలిన వారు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణీంద్ర, నాగరాజు, వీరికి సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుల్స్, సీఐ శివాజీ, ఎస్ఐలు శ్రీనివాస్, రమేష్‌బాబుకు ఎస్పీ రివార్డులను అందజేశారు. ఇదీ చదవండి: 30 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్‌గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి! -
బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లలో, భూములు, బంగారం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతారు. అయితే, స్టాక్ మార్కెట్లలో రాబడి అనేది చాలా స్థిరంగా ఉండదు. ఇక భూములపై పెట్టె పెట్టుబడులు వల్ల మంచి ఆదాయం వచ్చిన అందులో చాలా తలనొప్పులు ఉంటాయి. ఇక బంగారం మిగతా రెండింటితో పోలిస్తే ఆదాయం తక్కువగా ఉన్న స్థిరమైన రాబడి వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది బంగారాన్ని ఒక ఆభరణాలుగా మాత్రమే చూడకుండా దానిని ఒక పెట్టుబడిగా చూస్తారు. అందుకే, పెట్టుబడిదారులు బంగారాన్ని స్వర్గధామంగా భావించి పసిడికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. భౌతిక బంగారం అనేది బంగారం పురాతన రూపం. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక కొత్త మార్గాలు వచ్చాయి. డిజిటల్ బంగారం, భౌతిక బంగారం, పేపర్ బంగారం వంటివి ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న కొన్ని బంగారు పెట్టుబడుల రకాలు. ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భౌతిక బంగారం మీదనే కాకుండా మిగతా వాటి మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. (చదవండి: రూ. 100కే గోల్డ్..! సరికొత్త వ్యూహంతో గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీలు..!) బంగారం పెట్టుబడుల రకాలు: భౌతిక బంగారం: బంగారు ఆభరణాలు, నాణేలు, బార్లు మొదలైనవి డిజిటల్ బంగారం: పేటిఎమ్, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసే బంగారం పేపర్ బంగారం: గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల బంగారాలలో పెట్టుబడి పెడతారు. అయితే, వివిధ రకాల బంగారంపై వివిధ రకాల పన్నులు విధించబడతాయి. భౌతిక బంగారంపైనా, గోల్డ్ బాండ్లపైనా ఒకేరకంగా పన్ను ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టడానికి ముందు వివిధ బంగారు పెట్టుబడుల పన్నుల గురించి తెలుసుకోవడం అవసరం. భౌతిక బంగారం ఆభరణాలు లేదా నాణేలు వంటి భౌతిక బంగారంపై పన్ను విధించడం అనేది మీరు వాటిని ఎంతకాలం ఉంచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. భౌతిక బంగారు పెట్టుబడి మూలధన లాభాలపై దీర్ఘకాలం, స్వల్పకాలిక వ్యవధిని బట్టి పన్ను ఉంటుంది. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది, అయితే మీరు 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పడుతుంది. స్వల్పకాలిక మూలధన లాభాలను మొత్తం పన్ను పరిధిలోకి తీసుకొని వచ్చి అప్పుడు మొత్తం ఆదాయంపై ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. అదే దీర్ఘకాలిక మూలధన లాభం(ఎల్టిసిజి)పై 20శాతం + 4శాతం సెస్ పన్ను, అదనంగా సర్ఛార్జ్ వర్తిస్తే పన్ను విధిస్తారు. అలాగే మీరు ఆభరణాల విషయంలో భౌతిక బంగారం కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలపై 3% జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని విక్రయించేటప్పుడు టీడీస్ వర్తించదు. కానీ, మీరు ₹2 లక్షలకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే 1% టీడీస్ వర్తిస్తుంది.(చదవండి: భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?) డిజిటల్ బంగారం డిజిటల్ బంగారంపై కూడా భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు. అలాగే, పన్ను అనేది మీ పెట్టుబడి కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే ఎల్టీసిజిగా పరిగణించి 20శాతం పన్ను+సెస్, సర్‌చార్జ్‌లు విధిస్తారు. అయితే డిజిటల్ గోల్డ్‌లో స్వల్పకాల రాబడిపై డైరెక్ట్‌గా పన్ను విధించరు. అయితే, 3 సంవత్సరాల లోపు విక్రయిస్తే ఎటువంటి పన్ను ఉండదు. డిజిటల్ బంగారంపై పెట్టుబడులు అనేది చాలా తక్కువ మొత్తం నుంచి ప్రారంభించవచ్చు. అందుకే ఇది పెట్టుబడిదారులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. కాగితం బంగారం బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్, సార్వభౌమ బంగారు బాండ్లు(ఎస్జీబి) కలిగి ఉన్న కాగితపు బంగారం కిందకు వస్తాయి. వీటిలో బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్ పై భౌతిక బంగారంతో పాటు సమానంగా పన్ను ఉంటుంది. అయితే, ఎస్జీబిలపై పన్నులు కొంచెం భిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ 3 సంవత్సరాలకు పైగా మీ దగ్గర ఉన్నప్పుడు ఎల్టిసిజి వర్తిస్తుంది. రేటు కూడా ఒకేవిధంగా ఉంటుంది. 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఆ పెట్టుబడుల లాభాలను మీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చి ఐటి స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం లేదా ఆఫీస్.. ఇక మీ ఇష్టం!) ఒక ఎస్జీబిపై సంవత్సరానికి 2.5% వడ్డీ లభిస్తుంది. అందుకని దీనిని మీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చి మీ ప్రధాన ఆదాయంపై ఐటి స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే, 8 ఏళ్ల తర్వాత ఎస్జీబిల ద్వారా మీరు పొందే ఏవైనా లాభాలు పన్ను రహితం. ఎస్జీబిలకు 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అయితే, ముందస్తుగా ఉపసంహరించుకున్నట్లయితే, విభిన్న పన్ను రేట్లు వర్తిస్తాయి. ఐదేళ్ల తరువాత ఎనిమిదేళ్లకు ముందు విత్‌డ్రా చేసుకుంటే ఎల్టీసిజి పన్ను 20శాతం+4శాతం సెస్ వర్తిస్తుంది. గోల్డ్ డెరివేటీవ్ గోల్డ్ డెరివేటీవ్లపై వర్తించే పన్ను భిన్నంగా ఉంటుంది. గోల్డ్ డెరివేటీల నుంచి వచ్చే రాబడిని వ్యాపారంపై వచ్చే ఆదాయంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సంస్థ మొత్తం టర్నోవర్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉంటే 6 శాతం పన్ను విధిస్తారు. ఇది ఆయా సంస్థలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అయితే, టర్నోవర్ ₹2 కోట్లకు పైగా ఉంటే దానిని వ్యాపార ఆదాయంగా చేర్చలేము.(చదవండి: అమెజాన్ వెర్షన్ చిట్టి రోబో) బహుమతి బంగారంపై పన్ను తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా పిల్లల నుంచి బంగారం బహుమతిగా అందుకున్నట్లయితే, అది పన్ను రహితం. కానీ, మీరు వారి నుంచి కాకుండా ఎవరైనా బహుమతిగా పొందితే మొత్తం బహుమతి విలువ ₹50,000కు చేరుకుంటే ఐటి స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి నుంచి అయిన ₹50,000 కంటే తక్కువ బహుమతిగా బంగారం పొందితే అది పన్ను రహితం. అయితే, బంగారాన్ని విక్రయించేటప్పుడు భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు. -
దీపావళికి బంగారం కొందాం!
ముంబై: దీపావళి సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 28 శాతం మంది ప్రజలు పసిడి కొనుగోళ్ల ప్రణాళికతో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రత్నాలు ఆభరణాల పరిశ్రమకు తాజాగా మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ దీపావళి వ్యయ సర్వే సూచి ఊరటనిస్తోంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన సర్వే వివరాల్లో కొన్నిముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2020లో తీవ్ర సంక్షోభానికి గురయిన పరిశ్రమ 2021 జనవరి– మార్చి మధ్య కోలుకుంది. అయితే ఈ రికవరీపై సెకండ్‌వేవ్ దెబ్బపడింది. ► ప్రసుత పరిస్థితులపై పరిశ్రమలో ఆశాజనక వాతావరణం నెలకొంది. వినియోగ డిమాండ్ వేగంగా పుంజుకుంటుందని, పండుగల సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ► ప్రతి 10 మంది పట్టణ భారతీయుల్లో ముగ్గురు వచ్చే 3 నెలల్లో పసిడి కొంటామన్నారు. ► దేశ వ్యాప్తంగా ఆగస్టు 17–20 మధ్య 2,021 మందిని ఆన్లైన్ ద్వారా చేసిన ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ► ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు తెలిపిన ప్రతి ఐదుగురులో ముగ్గురు (58 శాతం మంది) వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు భౌలికంగా అలాగే సంఘటిత రిటైలర్ల గోల్డ్ స్కీమ్‌ల ద్వారా పసిడిని కొంటామని తెలిపారు. 38 శాతం మంది పెట్టుబడిగా పసిడి కొంటామని (గోల్డ్ ఫండ్స్ ద్వారా లేదా భౌతికంగా) వెల్లడించారు. ► పసిడి కొనుగోలు ఖాయమని పేర్కొన్న వారిలో 69% మంది ఇందుకు దీపావళి లేదా పండుగల సీజన్ సరైన సమయమని పేర్కొన్నారు. -
బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో!
Buying Gold On PhonePe: కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. టీ బిల్లు దగ్గరి నుంచి ఇంటి రెంట్ వరకు అంతా యూపీఐ పేమెంట్స్‌లోనే చేయడానికి జనం అలవాటు పడిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విలువైన బంగారాన్ని సైతం ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు జోరు మీదున్నారు. ఆన్లైన్లో కొనేస్తున్నారు పెళ్లిలు, పేరంటాలకే కాదు పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేయడం మన దగ్గర ఆనవాయితీ. దేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే రాష్ట్రంగా కేరళ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పటికీ కేరళలో బంగారం కొనుగోలు విషయంలో పాత పద్దతినే అనుసరిస్తున్నారు. వ్యాపారుల వద్దకే వెళ్లి స్వయంగా పరిశీలించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చే సరికి ఆన్లైన్లో బంగారం కొనుగోలుకు ఓకే అనేస్తున్నారు. ఇటీవల ఫోన్ పే సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ్యాప్తంగా ఫోన్‌పే యాప్ ద్వారా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటికంటే ముందు మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఫోన్‌పే యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ నంబర్ 1 ఫోన్‌పేకు తెలంగాణ ప్రజలు జై కొడుతున్నారు. ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇతర యాప్‌ల కంటే ఫోన్‌పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పే తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. ఆన్లైన్ ట్రాన్స్క్షన్స్కి సంబంధించి యూనైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఏ) ఆధారంగా అనేక యాప్స్ సేవలు అందిస్తున్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో 42 శాతం తమ యాప్ ద్వారానే జరుగుతున్నాయని ఫోన్ పే వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవా 36 శాతం, హర్యానాలో 35 శాతం ఫోన్‌పే ద్వారానే ట్రన్సాక్షన్స్ జరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ వినియోగదారుల సంఖ్యకు సంబంధించి ఫోన్‌పేను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నాటక తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫోన్‌పే యాప్ వినియోగం ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఫోన్ పే కస్టమర్ల సంఖ్య వంద శాతం పెరగగా లావాదేవీల సంఖ్య 150 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. టైర్ టూ సిటీల్లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి టైర్ 1 సిటీల్లో ఎక్కువగా వ్యాపార సంబంధమైన లావాదేలు జరుగుతున్నాయి. అదే టైర్ 3 సిటీస్‌కి వచ్చే సరికి వ్యాపార లావాదేవీల కంటే ఇంటి రెంటు, హోటల్ బిల్లు ఇలా వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధించి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. టైర్ 3 సిటీస్‌లో వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ఆర్థిక లావాదేవీల వాటా 49 శాతానికి చేరుకోగా వ్యాపార సంబంధమైన లావాదేవీలు 32 శాతానికి పరిమితమయ్యాయి. అదే టైర్ 1 విషయానికి వస్తే ఇక్కడ వ్యాపార లావాదేవీల వాటా 52 శాతంగా నమోదు అయ్యింది. ఇక్కడ వ్యక్తుల నుంచి వ్యక్తులకు 36 శాతం, రీఛార్జీలు, కరెంటు బిల్లులు చెల్లింపులు 11 శాతంగా నమోదు అయ్యాయి. పెరిగిన లావాదేవీలు ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో చేయడం మొదలైంది. అయితే 2020 మార్చిలో కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరిగింది. 2020 మార్చికి ముందు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో జరిగే ఆర్థిక లావాదేవీ విలువ ప్రతీరోజు సగటు 2 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది 6 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్లలో రాని మార్పు కేవలం 18 నెలల్లోనే మూడింతలు అయ్యింది. చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే? -
షేర్లను మించి పసిడి పరుగు తీస్తుంది!
న్యూయార్క్: గత ఆరు నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న బంగారం ధరలు సమీప భవిష్యత్‌లోనూ మరింతగా మెరుస్తాయంటున్నారు సుప్రసిద్ధ స్విస్ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్. రెండు దశాబ్దాల క్రితం చమురు, ఇతర కమోడిటీలలో బుల్ రన్ రానుందంటూ ఖచ్చితమైన అంచనాలను ప్రకటించడంతో ఫేబర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులయ్యారు. కాగా.. ఇటీవల జోరు చూపుతున్న పసిడి ధరలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఫేబర్ రూపొందించే గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ తాజా నివేదిక ఊహిస్తోంది. నివేదికలో వివరాలు చూద్దాం.. ఈక్విటీలను మించి.. 2011- 2015 మధ్య కరెక్షన్ల తదుపరి 2015 డిసెంబర్ నుంచీ బంగారం ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ పసిడి ధరలు డాలర్లలో చూస్తే 26 శాతం లాభపడ్డాయి. వెండి ధరలు మరింత అధికంగా 33 శాతం జంప్ చేశాయి. ఇందుకు ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు కారణమవుతున్నాయి. యూఎస్ ఫెడ్ అనేకాకుండా యూరోపియన్ కేంద్ర బ్యాంకులు సైతం చౌక వడ్డీ రేట్లతో నిధులను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. ఇవన్నీ పసిడి, వెండి ధరలకు జోష్ నిస్తున్నాయి. వెరసి కరెన్సీ విలువలు క్షీణించనున్నాయి. ఇది జరిగితే పసిడి ధరలు రాకెట్లా పరుగు తీస్తాయి. ఇటీవల పలు కేంద్ర బ్యాంకులు పసిడిలో కొనుగోళ్లను చేపడుతూ వస్తున్నాయి. ఈ అంశాలు ఇటీవల పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నమ్మకమైన పెట్టుబడి సమీప భవిష్యత్ లోనూ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు, కేంద్ర బ్యాంకులు బంగారంలో పెట్టుబడులను కొనసాగించే వీలుంది. యూఎస్ డాలరు భారీగా క్షీణించవచ్చని అంచనా వేస్తున్నాం. బంగారు ఆభరణాలకు సైతం కొంతమేర డిమాండ్ పెరిగే అవకాశముంది. ఈక్విటీలు, రుణ సాధనాలతో పోలిస్తే బంగారం మంచి రిటర్నులు ఇవ్వనుంది. 2000, 2015లలో కొద్ది సమయాలలో మినహాయిస్తే.. బంగారం, వెండి 2015 నుంచి భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాది పలు అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే పసిడి మంచి పురోగతిని సాధించింది. పసిడితో పోలిస్తే ఇకపై వెండి, ప్లాటినం మరింత లాభపడేందుకు అవకాశముంది. వీటిలో ప్లాటినం మరింత బలపడవచ్చు. -
అక్షయతృతీయపై కరోనా ఎఫెక్ట్
-
బంగారం కొనుగోళ్లపై కరోనా ఎఫెక్ట్
-
మలబార్ గోల్డ్ ‘బ్రైడ్ ఆఫ్ ఇండియా’
బెంగళూరు: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. ‘బ్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో తన నూతన కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పెళ్లిళ్ల సీజన్లో విభిన్న వివాహ ఆభరణాలను పరిచయం చేసే ఈ ప్రచార కార్యక్రమ 7వ ఎడిషన్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ.. ‘నూతన వధూవరులకు నచ్చే విధంగా కొత్త హంగులతో కూడిన ప్రత్యేక ఆభరణాలను ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంచాం. భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల వివాహ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి’ అని తెలిపారు. -
మొబీక్విక్‌తోనూ పసిడి కొనుగోళ్లు!
న్యూఢిల్లీ: ఇక వినియోగదారులు ఈ–వాలెట్ సంస్థ మొబీక్విక్ ద్వారా కూడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పేటీఎం తరువాత ఈ తరహా అవకాశాన్ని మొబీక్విక్ కల్పిస్తోంది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో టన్ను పసిడి అమ్మకాలు లక్ష్యంగా మొబీక్విట్ తాజా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేఫ్‌గోల్డ్‌తో మొబీక్విట్ జట్లుకట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు పసిడి కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. ఫిజికల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. ఈ తాజా చొరవలో భాగంగా మొబీక్విక్ తన యాప్‌పై ‘గోల్డ్’ పేరుతో ప్రత్యేక కేటగిరీనీ ఏర్పాటు చేసింది. ‘‘అన్ని రకాల ఆర్థిక సేవలూ అందించాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగానే తాజా చొరవను సంస్థ ప్రారంభించింది. రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ తర్వాత సంస్థ ప్రారంభించిన తాజా సేవలు ఇవి’’ అని మొబీక్విక్ తెలిపింది. రూపాయి విలువ నుంచీ... రూపాయి విలువ నుంచీ లేదా గ్రాముల్లో 99.5 శాతం ప్యూరిటీ, 24 క్యారెట్ గోల్డ్ కొనుగోలుకు అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. అలాగే వినియోగదారులు అప్పటికి కొద్ది వారాల నుంచీ పసిడి ధరల ధోరణి ఎలా ఉందో తెలుసుకోడానికీ వీలు కలుగుతుందని మొబీక్విక్ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఉపాసనా తాకు పేర్కొన్నారు. ఇది తమకు కీలక వాణిజ్య విభాగంగా మారుతుందన్న అభిప్రాయాన్నీ ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ భాగస్వామ్యంతో గత ఏడాది తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్ ప్రధాన వాటాలున్న పేటీఎం గత ఏడాది పసిడి విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
అక్షయ తృతీయ : ఆఫర్లతో జర జాగ్రత్త..!
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ నాడు తప్పక ఎంతో కొంత బంగారాన్ని కొంటే మంచిదని నమ్ముతుంటారు భారతీయులు. అంత పవిత్రంగా భావించే ఈ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆఫర్లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండాలంటే బంగారం కొనే ముందు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వారు చెబుతున్న జాగ్రత్తలేమిటో ఓసారి చూడండి... నాణ్యత పరిశీలన... బంగారాన్ని కొనే ముందు తప్పక దాని నాణ్యతను పరిశీలించి, దాని అసలు విలువను లెక్కించాలి. ప్రతి ఆభరణం మీద తప్పక బీఐఎస్ హాల్‌మార్క్ ముద్ర, స్టాంపు, అది ఎన్ని క్యారెట్లు ఉన్నది, హాల్‌మార్కింగ్ సంవత్సరాన్ని కూడా చూడాలంటున్నారు మేకింగ్ చార్జీలు... ఈ పర్వదినం సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి పరిమిత కాలం వరకు మేకింగ్ చార్జీల మీద ఎక్కువ మొత్తంలొ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి బంగారం దుకాణాలు. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. కొనుగోలు చేయబోయే ఆభరణాల ఖరీదును కూడా వేర్వేరు దుకాణాల ధరలతో ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కో దుకాణంలో ఒక్కో రకమైన మేకింగ్ చార్జీలు ఉండటం వల్ల ఈ తేడా వస్తుంది. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు రెండు, మూడు షాపుల్లో ఆభరణాల ధరలను వాకబు చేసిన తర్వాత కొనుగోలు చేయడం ఉత్తమమంటున్నారు. నాణాలు, బిస్కెట్లయితే మేలు... బంగారాన్ని కొనేవారిలో ఎక్కువ మంది దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం కొంటే మంచిది అని ఆలోచించి కొనడం మేలని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని పూర్తిగా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతోనే కొనాలనుకుంటున్నట్లయితే నాణేలు లేదా బిస్కెట్ రూపంలో కొనడం మంచిదని పేర్కొంటున్నారు. రాళ్లు వద్దు..సాదానే ముద్దు.. రాళ్లు పొదిగిని ఆభరణాలను కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమంటున్నారు. సాదా ఆభరణాలతో పోలిస్తే, రాళ్లు పొదిగిన ఆభరణాలకు ఖరీదు ఎక్కువ. మేకింగ్ చార్జీలు కూడా అధికమే. రాళ్లు పొదిగిన ఆభరణాలను అమ్మాలనుకున్నా, మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు రాళ్ల ఖరీదును తీసివేసి బంగారానికి మాత్రమే విలువ కడతారు. ఈ రాళ్లు ఎంత ఖరీదైనవి అయినా కూడా కేవలం బంగారానికి మాత్రమే విలువ కడతారు కాబట్టి రాళ్లు పొదిగిన ఆభరణాలను కొనకపోవడమే ఉత్తమం అని నిపుణులంటున్నారు. కాబట్టి ఈ సారి బంగారాన్ని కొనేముందు ఈ జాగ్రత్తలన్నింటని పాటిస్తే లాభాలన్నీ మీవే అంటున్నారు నిపుణులు. -
నోట్ల రద్దు రోజున ‘బ్లాక్’ అండ్ వైట్ గేమ్
సాక్షి, హైదరాబాద్ : సొంత డబ్బులనే ఇతర వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించారు.. వారు తమ వద్ద బంగారం కొన్నట్టు రికార్డుల్లో చూపారు.. తర్వాత వ్యాపారుల నుంచి ఆ సొమ్మునంతా రప్పించుకున్నారు.. ‘బ్లాక్’ను వైట్ చేయడంలో సహకరించినందుకు ఆ వ్యాపారులకు 30 శాతం కమీషన్ ముట్టజెప్పారు! పదులు.. వందల్లో కాదు.. గంటల వ్యవధిలోనే 5 వేల మంది తమ దుకాణాలకు వచ్చి ఏకంగా 340 కిలోల బంగారం కొన్నట్టు చూపి నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ కస్టమర్లలో కొందరిని పోలీసులు ఆరా తీస్తే తాము అసలు ఆ దుకాణానికే వెళ్లలేదని చెప్పారు! పెద్దనోట్ల రద్దు తర్వాత హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ముసద్దీలాల్ కేసులో లీలలివీ!! రూ.97.85 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్‌లో పక్కా ఆధారాలు సేకరించిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అభియోపత్రాలు దాఖలు చేసింది. కేసులో మొత్తం పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి బుధవారం వెల్లడించారు. రూ.97.85 కోట్ల నగదు మొత్తం ముసద్దీలాల్ యాజమాన్యానికి చెందినదే అని నిర్ధారణ అయినట్లు స్పష్టంచేశారు. రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య.. గతేడాది నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడింది. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న ముసద్దీలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కేంద్రంగా బంగారం ‘విక్రయాలకు’స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రశీదులు సృష్టించారు. ఆ మొత్తాన్ని పంజాగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సిస్ బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేశారు. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరు రూ.1.89 లక్షల బంగారం కొన్నారట! ముసద్దీలాల్ యాజమాన్యం రూపొందించిన బోగస్ బిల్లుల ప్రకారం... నవంబర్ 8 రాత్రి వచ్చిన ఒక్కో వినియోగదారుడు రూ.1.89 లక్షల విలువైన బంగారం కొన్నారు. ఈ రశీదులతో పాటు కస్టమర్లకు సంబంధించినవని పేర్కొంటూ యాజమాన్యం ఆధార్ కార్డు వంటి కొన్ని ధ్రువీకరణలను సైతం జత చేసింది. ఆ గుర్తింపు పత్రాల ఆధారంగా సంబంధీకుల్ని సీసీఎస్ పోలీసులు పిలిచి విచారించారు. ఇందులో ఆ బిల్లులన్నీ నకిలీవని స్పష్టమైంది. ఓ అడ్వాన్స్ పేమెంట్ రశీదుతోపాటు గుర్తింపు కార్డు ఆధారంగా ఓ మహిళను విచారించారు. తాను నెలకు రూ.15 వేల జీతానికి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నానని, నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు తన వద్ద కేవలం రెండు రూ.500 నోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. ఆ రోజు ఆ జ్యువెలరీ సంస్థల్లో బంగారం కొనలేదని స్పష్టం చేసింది. అనేక మంది నుంచి కూడా ఇలాంటి సమాధానమే వచ్చింది. దీంతో ముసద్దీలాల్ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నవంబర్ 8న రికార్డు అయిన ఫీడ్‌ను విశ్లేషించారు. ఆ రోజు ఈ సంస్థలకు కేవలం 67 మంది వినియోగదారులు మాత్రమే వచ్చినట్లు వెల్లడైంది. బిల్లులు సృష్టించిన కంప్యూటర్ను సీజ్ చేసిన అధికారులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దీన్ని విశ్లేషించిన నిపుణులు ఆ బిల్లులన్నీ నవంబర్ 8 తర్వాత నమోదు చేసినవిగా నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. అరెస్టు తప్పించుకునేందుకు యత్నాలు సీసీఎస్ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముసద్దీలాల్ యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డులను సైతం తారుమారు చేసింది. ముసద్దీలాల్ సంస్థలకు కైలాశ్ చంద్ గుప్తా, ఆయన కుమారులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, కోడలు నేహ గుప్తా తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఈ డైరెక్టర్ల పేర్లు మారుస్తూ రికార్డులు సృష్టించారు. వారి డబ్బునే పంచేసి.. బ్లాక్‌మనీని వ్యాపారం మార్గంలో డిపాజిట్ చేసేందుకు ముసద్దీలాల్ యాజమాన్యం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. సీసీఎస్ అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో జరిగిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. నగరంలోని కొందరు బంగారం వ్యాపారులకు ఈ ‘మార్పిడి’లో పాత్ర ఉన్నట్లు తేల్చారు. నగదును ఆయా బంగారం వ్యాపారులు ఖాతాల్లోకి మళ్లించిన ముసద్దీలాల్ యాజమాన్యం.. వారు తమ వద్ద బంగారం కొన్నట్టు రికార్డులు సృష్టించింది. తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ తమ ఖాతాల్లోకి తెప్పించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు సహకరించినందుకు వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఎలాంటి డెలివరీ, రిసీవ్డ్ రశీదులు లేవని నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కైలాశ్ చంద్ గుప్తా, నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, మరో ఏడుగురితో కలిపి మొత్తం 10 మందిపై అధికారులు అభియోగాలు మోపారు. ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్లపై అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ముసద్దీలాల్ సంస్థల ఖాతాల్లో ఉన్న రూ.12 కోట్లను స్తంభింపచేశారు. ఇది మనీ లాండరింగ్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సమాచారం ఇచ్చారు. చార్జ్‌షీట్ కూడా దాఖలు కావడంతో దాని ఆధారంగా ఈడీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆస్తుల ఎటాచ్మెంట్ కూడా ఉంటుందని సమాచారం. -
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: జ్యూవెలర్లు, కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. రూ 50,000కు మించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే పాన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్త జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో జ్యూవెలర్లు యాభైవేలకు మించి బంగారం కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదించాల్సిన అవసరం లేదు. మనీల్యాండరింగ్ చట్ట నిబంధనలు బంగారు ఆభరణాల కొనుగోలుకు వర్తింపచేస్తే కేవైసీ నిబంధనల కారణంగా బంగారం సేల్స్ భారీగా తగ్గుతాయని జ్యూవెలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారంలో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆగస్ట్ 23న జెమ్స్, జ్యూవెలరీ రంగానికీ మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనలను వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆదాయ పన్ను చట్టం కేవైసీతో నిమిత్తం లేకుండా రూ2 లక్షల వరకూ నగదు అమ్మకాలకు అనుమతించినా మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనల కింద పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారాలు లేకుండా రూ 50,000కు మించి నగదు లావాదేవీలు జరిపేందుకు వెసులుబాటు లేదు. -
‘బిల్లులు లేకుండా చేతులు మారుతోంది’
సాక్షి,ముంబయి: పండుగ సీజన్లో దేశంలో పసిడికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సీజన్లో పన్ను బెడదను తప్పించుకునేందుకు, నూతన నిబంధనలను పక్కదారి పట్టించేందుకు బంగారం కొనుగోలుదారులు ప్రయత్నించే క్రమంలో గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది.ఈ ఏడాది ఆగస్ట్‌లో బంగారం విక్రయాలను మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం కిందకు తేవడంతో రూ 50,000కు మించి బంగారం కొనుగోలు చేసే కస్టమర్ల ఐడీ నెంబర్లు, లావాదేవీల సంబంధిత ట్యాక్స్ కోడ్ నెంబర్ల రికార్డును జ్యూవెలర్లు నిర్వహించాల్సి ఉంది. అయితే బంగారం కొనుగోళ్లపై మనీల్యాండరింగ్ చట్ట నిబంధనల అమలు గురించి ప్రభుత్వం ప్రచారం చేయకపోవడంతో కస్టమర్లకు వీటిపై అవగాహన కొరవడింది. దీంతో అవసరమైన వివరాలు అందించేందుకు కస్టమర్లు నిరాకరిస్తున్నారని జ్యూవెలరీ ట్రేడర్లు చెబుతున్నారు. కొందరు కస్టమర్లు బిల్లులు లేకుండా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో పండగ సీజన్లో బ్లాక్ సేల్స్ పెరుగుతాయని ఇండియన్ బులియన్ జ్యూవెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ మెహతా పేర్కొన్నారు. నూతన నిబంధన నేపథ్యంలో కస్టమర్లు అవసరమైన వివరాలు ఇవ్వకపోగా, పన్నుపోటు నుంచి తప్పించుకునేందుకు సరైన రసీదులు లేకుండానే బంగారం కొనుగోలు చేస్తున్నారని కోల్‌కతాకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి, జేజే గోల్డ్ హౌస్ అధినేత హర్షద్ అజ్మేరా చెప్పారు.జీఎస్టీలో భాగంగా బంగారంపై అమ్మకం పన్నును 1.2 నుంచి 3 శాతానికి పెంచిన విషయం విదితమే. ఇక ప్రభుత్వ పన్ను, ఇతర నిబంధనల నేపథ్యంలో జ్యూవెలర్లు నగదు రాయితీపై స్మగుల్డ్ గోల్డ్‌ను కొని, ఆభరణాలను తయారు చేసి వాటిని రసీదులు లేకుండా విక్రయిస్తున్నారని చెన్నైకి చెందిన బులియన్ వ్యాపారి దమన్ ప్రకాష్ రాథోడ్ తెలిపారు.