సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,900 (22 క్యారెట్స్), రూ.77,350 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున తగ్గింది.
చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,350 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 తగ్గి రూ.71,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,500 వద్దకు చేరింది.
సిల్వర్ ధరలు
బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. కానీ వెండి ధర(Silver Rate)ల్లో మాత్రం నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి రేటు రూ.98,900 వద్ద స్థిరంగా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Comments
Please login to add a commentAdd a comment