బంగారం అంటే ఇష్టపడనివారు దాదాపు ఉండరు. పెళ్లి రోజు, పుట్టిన రోజు, పండగలు.. ఇలా ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనే ఆనవాయితీని చాలామంది పాటిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసా..? అదేంటి మన డబ్బులతో మనం బంగారం కొనుగోలు చేస్తున్నాం కదా. మరి దానికి ఎందుకు పరిమితులు అనుకుంటున్నారా? ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బంగారం దిగుమతి, ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే చట్టబద్ధమైన ధ్రువపత్రాలు కలిగి ఉంటే మాత్రం వ్యక్తులు కోరుకున్నంత బంగారాన్ని కలిగి ఉండవచ్చు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోతే ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసుకుందాం.
ఇంట్లో దంపతులు, పిల్లలు ఉంటే ఒక్కొక్కరు ఎంతమేరకు బంగారం కలిగి ఉండాలో ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది.
పెళ్లైన పురుషుడు: గరిష్ఠంగా 100 గ్రాములు
పెళ్లైన మహిళ: గరిష్ఠంగా 500 గ్రాములు
పెళ్లికాని పురుషుడు: గరిష్ఠంగా 100 గ్రాములు
పెళ్లికాని మహిళ: 250 గ్రాములు
ఇదీ చదవండి: యూజ్‌బై, ఎక్స్‌పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ మధ్య తేడా ఇదే..
పైన తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో దంపతులు, ఇద్దరు పెళ్లికాని కూతుళ్లు ఉంటే ఆ కుటుంబం గరిష్ఠంగా 1,100 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. ఇందుకు ఎలాంటి ధ్రుపపత్రాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అంతకుమించి బంగారం ఇంట్లో ఉంటే మాత్రం ధ్రుపత్రాలు తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment