శుభ ముహూర్తాలకు మంచిరోజులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. దీంతో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 4 వరకు శుభకార్యాలు చేసుకునేందుకు గాను పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఈ తరుణంలో ఇన్ని రోజులు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.
మాఘమాసం ప్రారంభం కావడంతో శుభకార‍్యాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్ దృష్ట్యా కస్టమర్లను ఆకట్టుకునేలా వ్యాపారులు బంగారం ధరల్ని తగ్గించి అమ్మకాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఫలితంగా ఫిబ్రవరి 10న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్లపై రూ.210 ధర తగ్గింది.
ఇక దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
వైజాగ్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600గా ఉంది
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment