సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న పారిశ్రామిక విధానం ప్రత్యేకతలు వివరించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న విస్తృత వ్యాపార, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. తొలుత టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాల యం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో టాటా గ్రూప్ విస్తరణకు ఉన్న అవకాశాలను వివరిస్తూ సంస్థ విస్తరణ ప్రణాళికల్లో రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలని కేటీఆర్ కోరారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ ప్రగతిని ప్రస్తావించడంతోపాటు టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో సానుకూల వాతావరణాన్ని వివ రిస్తూ పెట్టుబడులతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో పురోగతిలో ఉన్న టాటా సంస్థ హైదరాబాద్‌లో నిర్వహణ, మరమ్మ తు, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని కోరారు. తెలంగాణలో తమ సంస్థ కార్యకలపాలపై నటరాజన్‌చంద్రశేఖరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉందనే విషయం తమ అనుభవంలో తేలిందన్నారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, పెట్టుబడి అవకాశాల వంటి అనేక అంశాలపై ఇద్దరు చర్చించారు.
ఎఫ్‌ఎంసీజీలో పెట్టుబడులు
తెలంగాణ ప్రజల తలసరి ఆదాయంతోపాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా వృద్ధి చెందు
తున్నాయని హిందుస్తాన్ యూనిలీవర్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో జరిగిన భేటీలో కేటీఆర్ చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ రంగంలో తెలంగాణను పెట్టుబడు ల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవ కాశమని తెలిపారు. పామాయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహి స్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్తాన్ యూనిలీవర్ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని సూచించారు.
ఫార్ములా–ఈ రేసింగ్ కౌంట్‌డౌన్ షురూ..
హైదరాబాద్‌లో జరగనున్న ‘ఫార్ములా–ఈ’ ఎలక్ట్రానిక్ కార్ల రేసింగ్ 30 రోజుల కౌంట్‌డౌన్‌ను ముంబైలోని ఇండియాగేట్ వద్ద ప్రారంభించారు. మహారాష్ట్ర సీఎం షిండే, కేంద్ర మంత్రి గడ్కరీ, మంత్రి కేటీఆర్, గ్రీన్‌కో– ఏస్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
బయ్యారంతోపాటు పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్క డ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లించాలని ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్ డబ్ల్యూ ఎండీ సజ్జన్ జిందాల్‌ను కేటీఆర్ కోరారు. సజ్జన్ జిందాల్‌తో ఆయన జేఎస్‌డబ్ల్యూ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు పెట్టుబడులతో రావాలని ఆహా్వనించారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకు వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విద్య, క్రీడలు తదితర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని జిందాల్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment