mumbai tour
-
పెట్టుబడులతో ముందుకు రండి
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న పారిశ్రామిక విధానం ప్రత్యేకతలు వివరించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న విస్తృత వ్యాపార, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. తొలుత టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాల యం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో టాటా గ్రూప్ విస్తరణకు ఉన్న అవకాశాలను వివరిస్తూ సంస్థ విస్తరణ ప్రణాళికల్లో రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలని కేటీఆర్ కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ ప్రగతిని ప్రస్తావించడంతోపాటు టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో సానుకూల వాతావరణాన్ని వివ రిస్తూ పెట్టుబడులతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో పురోగతిలో ఉన్న టాటా సంస్థ హైదరాబాద్‌లో నిర్వహణ, మరమ్మ తు, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని కోరారు. తెలంగాణలో తమ సంస్థ కార్యకలపాలపై నటరాజన్‌చంద్రశేఖరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉందనే విషయం తమ అనుభవంలో తేలిందన్నారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, పెట్టుబడి అవకాశాల వంటి అనేక అంశాలపై ఇద్దరు చర్చించారు. ఎఫ్ఎంసీజీలో పెట్టుబడులు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయంతోపాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా వృద్ధి చెందు తున్నాయని హిందుస్తాన్ యూనిలీవర్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో జరిగిన భేటీలో కేటీఆర్ చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ రంగంలో తెలంగాణను పెట్టుబడు ల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవ కాశమని తెలిపారు. పామాయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహి స్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్తాన్ యూనిలీవర్ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని సూచించారు. ఫార్ములా–ఈ రేసింగ్ కౌంట్‌డౌన్ షురూ.. హైదరాబాద్‌లో జరగనున్న ‘ఫార్ములా–ఈ’ ఎలక్ట్రానిక్ కార్ల రేసింగ్ 30 రోజుల కౌంట్‌డౌన్‌ను ముంబైలోని ఇండియాగేట్ వద్ద ప్రారంభించారు. మహారాష్ట్ర సీఎం షిండే, కేంద్ర మంత్రి గడ్కరీ, మంత్రి కేటీఆర్, గ్రీన్కో– ఏస్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి బయ్యారంతోపాటు పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్క డ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లించాలని ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్ డబ్ల్యూ ఎండీ సజ్జన్ జిందాల్‌ను కేటీఆర్ కోరారు. సజ్జన్ జిందాల్‌తో ఆయన జేఎస్‌డబ్ల్యూ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు పెట్టుబడులతో రావాలని ఆహా్వనించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకు వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విద్య, క్రీడలు తదితర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని జిందాల్ ప్రశంసించారు. -
ఆయనే అత్యంత అనుభవం ఉన్న నేత.. త్వరలోనే మా అజెండాను ప్రకటిస్తాం
-
జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
-
ఉద్దవ్ ఠాక్రేతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
-
ముంబైకి పన్నీరు సెల్వం!
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో పరిణామాణాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ అధినేత్రి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన పన్నీర్ సెల్వం ముంబైకి పయనం కానున్నారు. గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావుతో ఆయన భేటీ కానున్నారు. తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని... ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని పన్నీరు సెల్వం మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి పయనం కావాలని నిర్ణయించడం కీలకంగా మారింది. గవర్నర్ తో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన నివాసంలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగిపోయారు. శశికళను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. -
పెట్టుబడులతో రండి..
హైదరాబాద్: ముంబైలో ఒకరోజు పర్యటనలో ఉన్న మున్సిపల్, పంచాయితీరాజ్ , ఐటి శాఖమంత్రి కే తారక రామారావు బిజీబిజీగా గడిపారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వనిస్తూ మహీంద్రా గ్రూప్ అధిపతులతోపాటు, సుజ్లాన్ కంపెనీ ఉన్నతాధికార బృందంతో చర్చలు నిర్వహించారు. సుజ్లాన్ సీఎండీ తులసి తంతితో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో త్వరలోనే తెలంగాణలో 3000 మెగావాట్ల సోలార్ , విండ్, హైబ్రీడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే బృహత్తర ప్రణాళికను సుజ్లాన్ సంస్ధ ప్రకటించింది. ఇందుకోసం మెత్తం 1200 కోట్ల రూపాయాల పెట్టుబడిగా పెట్టనున్నట్లు సంస్ధ తెలిపింది. ప్రభుత్వం తరపున పూర్తిస్దాయి మద్దతు సుజ్లాన్ కు ఉంటుని మంత్రి తెలిపారు. ఆ తర్వతా కోటక్ గ్రూప్ యండి, ఉపాద్యక్షుడైన ఉదయ్ కోటక్ తో సమావేమయ్యారు. తెలంగాణకి మరిన్ని ఉద్యోగాలు, పెట్టుబడులు పెట్టేందుకు కోటక్ గ్రూప్ హమీ ఇచ్చింది. మహింద్ర గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రాతోనూ మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో గ్రూప్ పెట్టుబడులు, విస్తరణపైన వీరు చర్చించారు. వీసీ సర్కిల్ పార్ట్నర్స్ సమ్మిట్‌లో కేటీఆర్ ప్రసంగం బుధవారం ఉదయం ముంబైలో జరిగిన వీసీ సర్కిల్ పార్ట్నర్స్ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. భారతదేశంతోపాటు కొత్త రాష్ర్టం తెలంగాణలో వివిధరంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను , ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. దేశంలోని రెండువేలకి పైగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పంఢింగ్ సంస్ధల ప్రతినిధులు ఈ సదస్సుకు హజరయ్యారు. కేటీఆర్ ప్రసంగంలోని కీలక అంశాలు... ప్రపంచంలో అత్యదిక లాభాలు అందించ గలిగే దేశాల్లో భారత దేశం ఒకటి. అందుకే ప్రపంచ ప్రసిధ్ద వెంచర్ క్యాపిటలిస్టులు భారతదేశంలో విసృతంగా పెట్టుబడులు పెడుతున్నారు. నిర్ణయాత్మక ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ముందుకెళుతున్నది. అందుకే గత రెండు సంవత్సరాల్లో తెలంగాలోకి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా పెరుగుతున్న రియాల్టీ , హోటళ్ళ ధరలే ఇందుకు కారణం. నగరంలో వ్యాపారాభివృద్దితోపాటు, పరిశోధనల కోసం అనేక నూతన వసతులు ఏర్పాడ్డాయి. టిహబ్ ని పరిశీలిస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుందన్నారు. త్వరలోనే టీ ఫండ్ ని ఏర్పాటు చేయబోతున్నాం. పాశ్చాత్య దేశాల్లో విజయాలు సాధించిన పలు సంస్ధలు, వ్యక్తులు ఇందులో పెట్టుబడి పెట్టెందుకు ఆస్తకి చూపిస్తున్నారు. ఇది సూమారు 125 కోట్ల ఏర్పాటు కాబోతున్నది. ఇలాంటి ఫండ్ దేశంలోనే మెదటిది. ఈ పంఢ్ ద్వారా హెల్త్ టెక్, ఐవోటీ, అగ్రిటెక్, Thematic B2B రంగాల్లో పరిశోధనలకి ఊతం ఇవ్వనున్నాం తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాలకు పరిశ్రమలు విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. పెట్టుబడిదారులకి అత్యంత పారదర్శకమైన, ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ పారిశ్రామిక విధానం ద్వారా అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమ శాఖ, ఐటీ శాఖ కార్యదర్శులు అరవింద్ కూమార్, జయేష్ రంజన్ పాల్గొన్నారు. -
ముంబై పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బృందం
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం సోమవారం ముంబై పర్యటనకు వెళ్లింది. ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, డీ శ్రీనివాసరావు, అధికారుల బృందం ముంబై వెళ్లింది. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ రావుతో కేసీఆర్ బృందం సమావేశం అయినట్టు తెలిసింది. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మంగళవారం మహారాష్ట్ర సర్కార్ తో చర్చించి తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిసింది. అనంతరం ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, అధికారుల బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవనున్నట్లు తెలిసింది.