ముంబై పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బృందం | KCR team to tour mumbai today | Sakshi
Sakshi News home page

ముంబై పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బృందం

Published Mon, Mar 7 2016 9:23 PM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

ముంబై పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బృందం - Sakshi

ముంబై పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బృందం

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం సోమవారం ముంబై పర్యటనకు వెళ్లింది. ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, డీ శ్రీనివాసరావు, అధికారుల బృందం ముంబై వెళ్లింది. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ రావుతో కేసీఆర్ బృందం సమావేశం అయినట్టు తెలిసింది.

ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మంగళవారం మహారాష్ట్ర సర్కార్ తో చర్చించి తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిసింది. అనంతరం ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, అధికారుల బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement