సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్
డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్
టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్
బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్
దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డి
పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్
ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్
42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్‌ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్
సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్
కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్
మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్
అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డి
బిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..
కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్
కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డి
మేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డి
బ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్
మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డి
చేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్
డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్
మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి
- వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment