
ముంబైకి పన్నీరు సెల్వం!
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో పరిణామాణాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ అధినేత్రి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన పన్నీర్ సెల్వం ముంబైకి పయనం కానున్నారు. గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావుతో ఆయన భేటీ కానున్నారు. తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు.
తనతో బలవంతంగా రాజీనామా చేయించారని... ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని పన్నీరు సెల్వం మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి పయనం కావాలని నిర్ణయించడం కీలకంగా మారింది. గవర్నర్ తో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన నివాసంలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగిపోయారు. శశికళను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు.