Ch Vidyasagar Rao
-
వేములవాడలో బీజీపీ నేతల మధ్య టికెట్ ఫైట్
సిరిసిల్ల జిల్లా: తెలంగాణాలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గేరు మార్చి స్పీడును పెంచేశాయి. ఇదిలా ఉండగా వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వివాదాస్పద పోస్టర్లు.. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో టికెట్య్ కోసం దరఖాస్తు చేసుకున్న తుల ఉమ వేములవాడలో పాగా వేసే క్రమంలో 'సాలు దొర - సెలవు దొర' అంటూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పోస్టర్స్ ద్వారా అభ్యర్ధించారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. సాలు దొర - సెలవు దొర పోస్టర్ల పేరిట తుల ఉమ ఓవైపు కేసీఆర్ పాలనను లక్ష్యం చేసుకుని మరోవైపు వేములవాడలో చెన్నమనేని వంశీయుల పాలనపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో వేములవాడలో బీజేపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్ధంకాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. టికెట్ వార్.. వేములవాడలో బీజేపీ టికెట్ బీసీలకే కేటాయిస్తారని ఆ ప్రకారం చూస్తే తమకే టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎర్రం మహేష్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా చెన్నమనేని వికాస్ ఎంట్రీతో వేములవాడ బీజేపీలో రసాభాస మొదలైంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
రాష్ట్ర రక్షణకు మేధావులు బీజేపీలోకి రావాలి..
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేత్తో ఆసరా పెన్షన్ ఇచ్చి, మరో చేతిలో మద్యం బాటిల్ పెట్టి కేసీఆర్ సర్కారు డబ్బులు లాగేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో భూములు, మద్యం అమ్మనిదే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ చార్జీలు, ఆరీ్టసీ, భూముల రిజిస్ట్రేషన్, ఇంటిపన్ను ఇలా.. అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలపై ప్రభు త్వం తీరని భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ సమక్షంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కుమారుడు డా.చెన్నమనేని వికాస్‌రావు, ఆయన భార్య డా. దీప బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కూడా.. భూముల వేలం ద్వారా డబ్బు సమకూర్చుకుంటోన్న దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు బీజేపీలోకి రావాలని ఆహా్వనిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. ఏ బాధ్యతనిచ్చినా స్వీకరిస్తాం: డాక్టర్ వికాస్ బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి పెద్దల ప్రభావం తనపై ఉందని పారీ్టలో చేరిన డాక్టర్ వికాస్ తెలిపారు. తాను, తన భార్య డా.దీప ప్రజలకు మరింత సేవ చేసేందుకు బీజేపీలో చేరామని, రాబోయే రోజుల్లో అప్పగించే బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ గెలుపు తథ్యం : బండి సంజయ్ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారనీ, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డా.వికాస్, దీపల చేరికతో రాజన్న సిరిసిల్లలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి: డా. కె. లక్ష్మణ్ దేశంలో మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు ఆకర్షితులై, ప్రజలకు మరింత సేవా చేయాలనే సంకల్పంతో డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు ముఖ్యంగా యువత రాజకీయ రంగంలోకి రావాలని విలువలతో కూడిన రాజకీయాలు, జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు వారితోనే సాధ్యమన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం: ఎంపీ అర్వింద్ వేములవాడ ప్రాంతంలో సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్న డాక్టర్ దీప, వికాస్ దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి చెప్పారు. -
భావి తరాలకు చరిత్ర తెలియాలి
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో యాటా సత్యానారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకర్’. ఈ సినిమా ΄ోస్టర్ లాంచ్ ఈవెంట్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంగా ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బలంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్స్ సైన్యంగా ఏర్పడి, ఆకృత్యాలు చేశారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఇలాంటి చరిత్రతో రూ΄÷ందిన ‘రజాకర్’ చిత్రాన్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు. ‘‘ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్‌కు వచ్చింది సెప్టెంబరు 17న. ఈ చరిత్ర తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్. ‘‘రజాకార్’ సినిమా చూడక΄ోతే మన బతుక్కే అర్థం లేదు’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘తెలంగాణవాదిగా నా హక్కుగా, భారతీయుడిగా భావించి ఈ సినిమా చేశాను’’ అన్నారు నారాయణ రెడ్డి. -
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: సీహెచ్ విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా ఇదే చెప్పారు అని అన్నారు. కాగా, సీహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండో రాజధానిపై పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలి. బంగారు తెలంగాణ ఆకాంక్షకు రెండో రాజధాని తోడ్పడుతుంది. భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని.. రాజ్యాంగంలో కూడా ఈ అంశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, బేగంపేట్, రాజ్‌భవన్ రూట్లలో.. -
తెలుగు భాష ఉన్నంతకాలం సినారె ఉంటారు: విద్యాసాగర్‌రావు
గన్‌ఫౌండ్రీ: తెలుగు భాష ఉన్నంత కాలం డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) చిరస్థాయిగా నిలిచిపోతారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్ థియేటర్స్, శుభోదయం, సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సినారె 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు వంశీ–సినారె–శుభోదయం జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణం ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినారె రచనలపై పరిశోధనలు చేసే అవకాశం కల్పించాలని సినారె కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటితరానికి తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ సినారె జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో సినారెకు మంచి అనుబంధం ఉందని, తనకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ గురువారెడ్డి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్, వంశీ సంస్థ వ్యవస్థాపకుడు వంశీరామరాజులతో పాటు సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణ, ఏపీకి బీజేపీ కొత్త అధ్యక్షులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు చెప్పారు. ‘తెలంగాణ, ఏపీలో బీజేపీ ద్విగుణీకృతమైన ఉత్సా హంతో ముందుకు సాగే అవకాశం ఉంది. మొన్న జరిగిన తెలంగాణ మున్సి పల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడమే కాకుండా.. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని స్పష్ట మైన సంకేతాలు వెలువడ్డాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా తొందరగా మార్పులు వచ్చే అవకాశం ఉంది..’అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన అనంతరం విద్యాసాగర్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఏఏతో నష్టం లేకున్నా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. ‘సీఏఏలో ఎలాంటి నష్టదాయక చర్యలు లేకున్నప్పటికీ దానిపై తుపాకీ పెట్టి నరేంద్రమోదీ, బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏపై మజ్లిస్, టీఆర్ఎస్ల ఆలోచన ప్రమాదకరమైనది. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణచాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం. ముస్లిం సోదరుల పౌరసత్వం తిరస్కరణకు గురవుతుందన్న ఆలోచన సరికాదు. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే హోంశాఖ ఇస్తుంది. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతికి పౌరసత్వం ఇచ్చాను. అందువల్ల మీ ఆలోచన సరికాదు. జాతి సమైక్యతకు ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అవసరం ఎంతో ఉంది. ముస్లిం యువత జాతీయ జెండాలతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమన ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా..? తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తాం. సెప్టెంబర్ 17కు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా అమలు చేయాలని నిరసనలు చేపడతాం..’అని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తాను..’అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ ఆపండి
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ముస్లింలకు ఇవ్వనున్న ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందుకు మరో దెబ్బ తగిలింది. ఆరెస్సెస్ నాయకులే ఈ విందును అడ్డుకునే యత్నం చేస్తున్నారు. మలబార్‌హిల్స్‌లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆరెస్సెస్ ‘గ్రాండ్ ఇఫ్తార్’ విందు ఏర్పాటు చేయనున్నసంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు నిర్వహించొద్దని ఆరెస్సెస్ ముస్లిం విభాగం (ముస్లిం రాష్ట్రీయ మంచ్) కార్యకర్తలు అదిల్ ఖత్రీ, షకీల్ అహ్మద్ షేక్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2015 జూలై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్ మీటింగ్‌లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉత్తర్వులపై స్పందించాలనీ, ఆరెస్సెస్ ఇఫ్తార్ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లింలకు దగ్గరవుదామని ఆరెస్సెస్ భావిస్తోందనీ, ముస్లిం వ్యతిరేక చర్యలు ఆపనంత వరకు ఎలాంటి విందుల్లో పాల్గొనబోమని వివిధ ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సోమవారం నాటి గ్రాండ్ ఇఫ్తార్‌లో పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. కాగా, ఆరెస్సెస్ ఇవ్వనున్న ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో ‘గుజరాతీ’ కలకలం
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వం సోమవారం వివాదంలో చిక్కుకుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఉభయసభలను ఉద్దేశించి ఆంగ్లంలో మాట్లాడగా, సభ్యుల హెడ్ఫోన్లలో ఆ ప్రసంగ అనువాదం మరాఠీకి బదులు గుజరాతీ భాషలో వచ్చింది. ఈ ఘటనతో సభలో కలకలం చెలరేగింది. వెంటనే స్పందించిన సీఎం ఫడ్నవీస్.. ఈ ఘటనపై సభ్యులందరికీ క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. బాధ్యులపై వీలైతే సోమవారం సాయంత్రంలోపే చర్య తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే దాని అనువాదం గుజరాతీలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. అయితే ఈ ఘటన సాంకేతిక సమస్య వల్ల జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు. మరాఠీ భాషా దినోత్సవానికి(ఫిబ్రవరి 27) ఒక్కరోజు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది
నందిగామ (షాద్‌నగర్): భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని.. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం వెతికే స్థాయినుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని సింబయోసిస్ విశ్వవిద్యాలయంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ బ్లాక్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ దేశంలోని భారత దేశం యువశక్తితో ముందుకు దూసుకెళ్తుంటే , ప్రపంచంలోని ఎన్నో దేశాలు వృద్ధ తరంతో సతమతమవుతున్నాయన్నారు. దీంతో భారత యువతకు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో అవకాశాలు రానున్నాయన్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, హాస్పిటాలిటీ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఇటీవల మహిళలకు ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన సింబయోసిస్ తెలంగాణ రాష్ట్ర విద్యాముఖ చిత్రాన్ని మార్చేసిందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటిలో చదవడం దీని గొప్పదనాన్ని తెలియచేస్తుందని అన్నారు. అనంతరం ఆయన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలను నాటారు. అంతకు ముందు యూనిర్సిటీలో పనిచేసే కార్మికులు, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, సింబయోసిస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్బీ ముజుందార్, సంజీవని ముజుందార్, డాక్టర్ విద్యాయెరవెకర్, వైస్ చాన్సలర్ డాక్టర్ రజనీ, డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడుకు కొత్త గవర్నర్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. ఆదివారం తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో తమిళనాడుకు ఏడాది తర్వాత పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించినట్లయింది. ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అలాగే అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న జగదీశ్ ముఖిని పురోహిత్ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్ఎస్జీలో పని చేసిన రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్ అడ్మైరల్ మాజీ చీఫ్ దేవేంద్ర కుమార్ జోషి.. అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న తమిళనాడుకు ఏడాది కాలంగా పూర్తిస్థాయి గవర్నర్ లేని విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుంచి మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త గవర్నర్ల గురించి క్లుప్తంగా... బన్వారీలాల్ పురోహిత్: మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వ్యక్తి. సామాజిక, రాజకీ య, విద్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలు గా క్రీయాశీలంగా ఉన్నారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ‘ది హితవాద’ ఇంగ్లిష్ దినపత్రికను పునరుద్ధరించారు. సత్యపాల్ మాలిక్: ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది. గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నిక య్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు. జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా∙పతకం అందుకున్నారు. బీడీ మిశ్రా: ఎన్ఎస్జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. -
'సీఎం పళనిస్వామి, స్పీకర్ రాజీనామా చేయాలి'
సీఎం, గవర్నర్, స్పీకర్ తమ పదవులను దుర్వినియోగ పరుస్తున్నారు మా కార్యాచరణ ఏంటో రేపు ప్రకటిస్తాం: డీఎంకే సాక్షి, చెన్నై: తమిళనాట తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం సమావేశమైంది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలను ఆమోదించారు. రాజకీయాలకు ప్రభుత్వాన్ని వాడుకోవడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని, స్పీకర్, గవర్నర్, ముఖ్యమంత్రి తీరును వ్యతిరేకిస్తూ మరో తీర్మానాన్ని చేశారు. స్పీకర్, సీఎం, గవర్నర్ అధికార, రాజ్యాంగ పదవులను దుర్వినియోగం చేస్తున్నారని డీఎంకే ఈ సందర్భంగా మండిపడింది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటువేసి అడ్డదారిలో మెజారిటీ నిరూపించుకోవాలని పళనిస్వామి సర్కారు ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపించింది. సీఎం పళనిస్వామి, స్పీకర్ ధనపాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ భేటీ అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వమే ఆడిస్తోందని, అందుకే తాము బలపరీక్ష కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రంపై స్పందిస్తూ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 'తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు , సీఎం పళనిస్వామి, స్పీకర్ ధనపాల్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సీఎం పళనిస్వామి బలనిరూపణ చేసుకోవాలని కోసం డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్షాలు గవర్నర్‌ను కోరాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేసిన రోజే పళనిస్వామి సర్కార్ అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయింది' అని డీఎంకే ఓ ప్రకటనలో పేర్కొంది. మా వ్యూహాలు మాకున్నాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు ప్రజలతో ఆడుకుంటున్నాయని డీఎంకే సీనియర్ ఎమ్మెల్యే శేఖర్‌బాబు విమర్శించాయి. పళని సర్కారు బలపరీక్ష డిమాండ్, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపథ్యంలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయని, తమిళనాడు అసెంబ్లీలో వెంటనే అవిశ్వాస తీర్మానం అంశంపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దినకరన్ వర్గంపై వేటు నేపథ్యంలో డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100మంది ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే కార్యాచరణ ఏవిధంగా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. -
ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయం!
చెన్నైకి చేరుకున్న గవర్నర్..మరికాసేట్లో సీఎంతో భేటీ సాక్షి, చెన్నై: పళనిస్వామికి బలపరీక్ష ముప్పు.. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మంగళవారం చెన్నైకి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన సీఎం పళనిస్వామితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం అవిశ్వాస తీర్మానంపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాజకీయ ఉత్కంఠకు తెరదించేవిధంగా బలపరీక్ష విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం తర్వాత గవర్నర్ విద్యా సాగర్‌రావు చెన్నైకి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షకు సీఎం పళనిస్వామి గవర్నర్ ఆదేశాలు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు స్పీకర్ ధనపాల్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ.. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా స్పీకర్ తమపై అనర్హత వేటు వేశారని వారు ఆరోపించారు. ఇక తాజా రాజకీయ ఉత్కంఠ నేపథ్యంలో డీఎంకే కూడా పావులు కదుపుతోంది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు నేపథ్యంలో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం 5గంటకు భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100మంది ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేయనున్నట్టు వినిపిస్తోంది. పళనిస్వామి సర్కారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే రాజీనామా అస్త్రాన్ని సంధించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే శాసనసభా భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తసికరంగా మారింది. దినకరన్ వర్గం తిరుగుబాటుతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు మైనారిటీలో పడ్డ విషయం తెలిసిందే. దినకరన్‌కు మద్దతుగా 21 మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండడంతో సీఎం పళనిస్వామి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలో ఉన్న పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. బల పరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. -
రాజ్‌నాథ్‌తో తమిళనాడు గవర్నర్ భేటీ
-
రాజ్‌నాథ్‌తో తమిళనాడు గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఇక్కడ జరిగిన ఈ సమావేశంలో మిళనాడు రాజకీయలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విద్యాసాగర్‌రావు నిన్న కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రితో వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. ముఖ్యమంత్రి పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
మైసూరుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మరోసారి మకాం మార్చారు. నిన్న ఉదయం తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలుసుకున్న తరువాత మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రే వారిని మైసూరుకు పంపించేశారు. ఈనెల 12న ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పుదుచ్చేరి నుంచి మైసూరులోని గుడగుమలై లగ్జరీ రిసార్టుకు మకాం మార్చారు. ఇదిలా ఉండగా, దినకరన్ వర్గ ఎమ్మెల్యేలంతా ఈనెల 14వ తేదీన తనను నేరుగా కలవాలని స్పీకర్ ధనపాల్ శుక్రవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడటంతో ఆగష్టు 24న ఒకసారి, సెప్టెంబర్ 1 మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అధికార అన్నాడీఎంకే పార్టీలో గొడవలు శ్రుతి మించాయి. ఇప్పటివరకు నాయకుల మధ్య మాటల యుద్ధం జరగగా ఇప్పుడు ఏకంగా కొట్లాటకు దిగారు. మధురైలో పన్నీరుసెల్వం, దినకరన్ వర్గాల మధ్య గొడవ జరిగింది. మధురై విమానాశ్రయంలో ఇరు వర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. రెండు వర్గాలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కలబడ్డాయి. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు. -
ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు దినకరన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. పుదుచ్చేరి క్యాంపులో ఉన్న తిరుగుబాటు శాసనసభ్యులు వెంటబెట్టుకుని ఆయన ఇవాళ రాజ్‌భవన్‌కు వచ్చారు. తగిన సంఖ్యాబలం లేని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని దినకరన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం దినకరన్ మాట్లాడుతూ...పళనిస్వామిని విశ్వాస పరీక్షకు ఆదేశించాలని కోరామన్నారు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, పదవిలో కొనసాగే నైతికత పళనిస్వామికి లేదని అన్నారు. ఈపీఎస్, ఓపీఎస్లను తక్షణమే పదవుల నుంచి తొలగించాలన్నారు. కాగా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, తదుపరి చర్యలకు సమయం కావాలని గవర్నర్ అన్నారని దినకరన్ తెలిపారు. కాగా గత నెలలో గవర్నర్ వద్దకు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లగా ఈసారి దినకరనే వారిని వెంటపెట్టుకుని వెళ్లారు. గవర్నర్‌ను తొలిసారి కలిసినపుడు కంటే ఈసారి ఆయన ఎమ్మెల్యేల సంఖ్యా బలం 19 నుంచి 21కి పెరిగింది. అంతేగాక తన మద్దతుదారులైన ఆరుగురు ఎంపీలను కూడా తీసుకెళ్లారు. -
మన పథకాలను పొరుగుకు విస్తరిద్దాం
గవర్నర్ విద్యాసాగర్‌రావును కలసిన బీసీ సంఘం నేతలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిల్స్ లాంటి కార్యక్రమాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆ రాష్ట్రాల గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించగా, గవర్నర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికో గురుకులాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీంతో పేదలకు ఉచిత విద్య మరింత చేరువవుతుందని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నట్లు బీసీ సంఘ ప్రతినిధులు తెలిపారు. గవర్నర్‌ను కలసిన వారిలో సంఘ ప్రతినిధులు ఆర్.అరుణ్, నందగోపాల్, మారేశ్ తదితరులున్నారు. -
రైతుగా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాణ్ని: గవర్నర్
సిరిసిల్ల: దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్రంగా స్పందించారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా కాకుండా రైతుగానే ఉండి ఉంటే అనేకసార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చి ఉండేదని తెలిపారు. విద్యాసాగర్ రావు శనివారం ఆయన తన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో పర్యటించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా సొంతూరుకు వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు గ్రామంలోని తన కుటుంబ సభ్యులను, బంధువులను, గ్రామస్తులను పేరుపేరునా గుర్తు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గవర్నర్ పదవీకాలం పూర్తయ్యాక, ప్రధానమంత్రి మోదీ గనుక వదిలిపెడితే స్వగ్రామం నాగారంలోనే స్థిరపడలానన్నారు. నాగారంలో ఉన్న తన భూమి హైదరాబాద్‌లోని గుంట భూమితో సమానం కాకపోవచ్చు.. కానీ తన గుండె మాత్రం ఇక్కడే ఉందని ఉద్వేగానికి లోనయ్యారు. మూడు వందల ఏళ్ల క్రితమే మనది ధనిక దేశమని, కానీ ఇప్పుడు గ్రామాల్లో ఇంకా అభివృద్ది జరగాల్సి ఉందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రజలు ఎంత పేదరికంలో ఉన్న ఆత్మగౌరవాన్ని మాత్రం విడిచిపెట్టరని అన్నారు. పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ది జరగాల్సి ఉందన్నారు. ఎన్నికల తరువాత రాజకీయాలకతీతంగా అందరూ కలిసి అభివృద్దికి కృషి చేయాలన్నారు. దేశాభివృద్దికి పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు.. వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి అనుసంధానం చేస్తే ఫలితాలుంటాయన్నారు. కాగా గ్రామంలో ఏర్పాటు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కాగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ రావుతో పాల్గొనే అవకాశం రావడం సంతోషమన్నారు. మహారాష్ట్ర నుంచి గోదావరి జలాలు తెలంగాణకు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేసారన్నారు. పుట్టిన ఊరిపై ఆయనకు ఎంతో మమకారం ఉందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విద్యాసాగర్ రావు చాలా రిస్క్ తీసుకంటారన్నారు. అదే విధంగా మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నాగరంలో శ్రీ కోదండరాం ఆలయంను త్వరగా పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప భక్తి భావాలున్నవ్యక్తి అని తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రం లాగా త్వరలోనే యాదాద్రి, రాజన్న ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. -
రొంబ సస్పెన్స్ !
-
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
-
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
ఆ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నారు వారి డిమాండ్ మేరకు బలపరీక్ష నిర్వహించలేం ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన గవర్నర్ విద్యాసాగర్‌రావు సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపలను రేపుతూనే ఉంది. దాదాపు 20మందికిపైగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతలు గురువారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ కోరారు. అయితే, ప్రతిపక్షాల విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని, కాబట్టి రెబల్స్ డిమాండ్ మేరకు తాను నడుచుకోలేనని ఆయన షాక్ ఇచ్చారు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారని ప్రతిపక్ష వీసీకే పార్టీ నేత తిరుమవలవాన్ తెలిపారు. ప్రస్తుతం దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు రిసార్ట్‌లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్‌రావు అసెంబ్లీని సమావేశపరిచి.. బలపరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారా అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పట్లో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా బలపరీక్ష ఉండబోదనే సంకేతాలు తాజాగా గవర్నర్ ఇచ్చినట్టయిందని, ఇది దినకరన్ వర్గానికి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అవిశ్వాసం తీర్మానం కోసం గవర్నర్ చెంతకు
సాక్షి, చెన్నై: దినకరన్ వర్గం తిరుగుబాటుతో మైనారిటీలో పడిన పళనిస్వామి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష డీఎంకే ప్రయత్నిస్తోంది. పళని సర్కారు వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు ఆదివారం గవర్నర్ సీ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన స్టాలిన్ వెంట డీఎంకే నేతలతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల నేతలు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. శశికళ వర్గంలో ఇప్పటికీ 21మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరారు. మరింతమంది అన్నాడీంఎకే ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుకునే అవకాశముందని దినకరన్ వర్గం చెప్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా బలపరీక్ష జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? పళనిస్వామికి ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ వేటు వేస్తారా? పళనిస్వామి-పన్నీర్ సెల్వం ద్వయం బలపరీక్ష గట్టెక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ముందు పళని బలం తేలాల్సిందే!
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ సీ విద్యాసాగర్ రావును ప్రతిపక్ష నేత స్టాలిన్ కోరారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన డీఎంకే అధినేత తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచాలని విజ్నప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిపిన స్టాలిన్ పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డారంటూ 19మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైన విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా పళని ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని వివరించారు. గతంలో సభలో బలనిరూపణ సందర్భంగా వ్యతిరేకంగా ఓటేసిన పన్నీర్ సెల్వం అండ్ గ్రూప్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధన్పాల్ ఇప్పుడు పార్టీ విప్ ఆదేశాలతో దినకరన్ వర్గానికి నోటీసులు పంపటం ఆశ్చర్యంగా ఉందని స్టాలిన్ తెలిపారు. -
మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు
-
గవర్నర్ ఏం చేస్తారో?
♦‘రాజ్’భవన్‌కు చేరిన రాజకీయం ♦నేడు కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గవర్నర్ చర్చలు ♦పుదుచ్చేరిలో పన్నీర్, దిష్టిబొమ్మల దహనం ♦ఎవరి జాగ్రత్తల్లో వారు అన్నాడీఎంకే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రాష్ట్రప్రభుత్వ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరుకున్నాయి. సీఎం ఎడపాడి బంతి గవర్నర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి నిర్ణయం తీసుకునేనో, బంతిని ఎవరివైపు విసిరేనో అనే ఉత్కంఠ బయలుదేరింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి, పన్నీర్వర్గాల విలీనమైన ముచ్చట తీరకముందే దినకరన్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఎడపాడి ప్రభుత్వాన్ని ఏకంగా మైనార్టీలోకి నెట్టివేసింది. పలు రాజకీయ పక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. అవిశ్వాస తీర్మానం పెడతానని ఒకవైపు, బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌పై ఒత్తిడి తెస్తూ మరోవైపు స్టాలిన్ పట్టుదలతో ఉన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ (బీజేపీ మినహా) స్టాలిన్‌తో గొంతు కలిపాయి. 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించినట్లు దినకరన్ చెబుతుండగా, ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో కొనసాగుతున్నారని స్టాలిన్ చెబుతున్నారు. బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కూడగట్టుకోకుంటే ఎడపాడి ప్రభుత్వం ఐదు నిమిషాల్లో కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంమంత్రితో గవర్నర్ భేటీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు గురువారం ఢిల్లీలో కేంద్రహోంమంత్రి రాజ్నా«థ్ సింగ్‌ను కలుస్తున్నారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన తమిళనాడు రాజకీయాలపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. ఎడపాడి ప్రభుత్వానికి బలపరీక్ష అవకాశం ఇవ్వడమా.. మైనార్టీలో పడిపోయినట్లు స్పష్టంగా తెలుస్తున్నందున ప్రభుత్వాన్ని రద్దుచేసి మరలా ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియకు ఆదేశాలు జారీచేయడమా.. అనే విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర మంత్రితో జరుపుతున్న చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. పది రోజుల్లోగా అసెంబ్లీని సమావేశపరచడం తప్పనిసరి అని అసెంబ్లీ మాజీ కార్యదర్శి సెల్వరాజ్ బుధవారం మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వెంటనే ఆదేశించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యేలే కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దిష్టిబొమ్మల దహనం ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వం, దినకరన్ వర్గాలు పుదుచ్చేరిలో పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. పన్నీర్‌సెల్వం మద్దతుదారులు ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహించి రిసార్టును ముట్టడించారు. ఆ తరువాత దినకరన్ దిíష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే దినకరన్ వర్గం కార్యకర్తలు బు«ధవారం సాయంత్రం రిసార్టు వద్దకు చేరుకుని పన్నీర్‌సెల్వం, ఎంపీ వైద్యలింగం పొటోలను, దిష్టిబొమ్మలను తగులబెట్టారు. పదవీ ప్రమాణం చెల్లదు : దివాకరన్ అసెంబ్లీలో తగిన మెజార్టీలేని ఎడపాడి ప్రభుత్వంలోకి డిప్యూటీ సీఎం, మంత్రిగా గవర్నర్ చేయించిన పదవీ ప్రమాణ స్వీకారం చెల్లదని శశికళ సోదరుడు దివాకరన్ అన్నారు. కుంభకోణంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎడపాడి సంఖ్యా బలాన్ని గుర్తించడంలో గవర్నర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. స్పీకర్ ధనపాల్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు తమ వర్గం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఎడపాడి ప్రభుత్వం కూలిపోకుండా ఎవరూ ఆపలేరని అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పుహలేంది అన్నారు. -
పళనిపై అవిశ్వాసం పెట్టండి
పుదుచ్చేరి/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. అన్నాడీఎంకేలోని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామికి మద్దతు ఉపసంహరించగా ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయిన విషయంపై వీరివురూ చర్చించనున్నారు. ప్రభుత్వం నిలబడాలంటే పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆయనవైపు 112 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా పళనిస్వామిని ఆదేశించాలని గవర్నర్‌ను డీఎంకే ఇప్పటికే కోరడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ కూడా పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు విద్యాసాగర్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. పళనిస్వామి మాత్రం విశ్వాస పరీక్ష పెట్టినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదని ధీమాతో ఉన్నారు. ఈ దశలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలసి అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అరియలూరులో జరిగిన ఈ సభలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ పార్టీని ఎవ్వరూ ధ్వంసం చేయలేని ఓ కోటగా జయలలిత మలిచారని అన్నారు. -
గవర్నర్ ను కలిసిన తంబిదురై
చెన్నై : పళనిస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలన్న నినాదాన్ని ప్రతిపక్షాలు అందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఆదివారం రాజ్‌భవన్ వైపు పరుగులు తీశారు. ఇన్చార్జి గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావుతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. దీన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినదిస్తూ ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు నిన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేసి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పట్టుబట్టారు. మరోవైపు ప్రతిపక్షాల డిమాండ్ వ్యవహారం సోమవారం కోర్టులో విచారణకు, అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తంబిదురై ఉదయాన్నే రాజ్ భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర గంటసేపు జరిగిన ఈ భేటీలో డీఎంకే ఆరోపణలకు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే కుట్రలు చేస్తున్నదని, ఆ పార్టీ ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం లేదన్నట్లు తెలుస్తోంది. అవన్నీ పగటి కలలు అనంతరం తంబిదురై మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దెనెక్కాలని స్టాలిన్ పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో మాట్లాడిన గొంతు తమది కాదు అని ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేవలం ఓ సీడీని పట్టుకుని విచారణకు పట్టుబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చబోమని స్పష్టం చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లు సుపరి పాలన అందించి ప్రజల మెప్పును పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
అసెంబ్లీలో మళ్లీ బలపరీక్ష జరపాలి
- గవర్నర్‌కు ప్రతిపక్ష డీఎంకే వినతి - అనుకూల నిర్ణయం వస్తే అన్నాడీఎంకే పని ఢమాల్! చెన్నై: ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకే పోరాటాన్ని ఉధృతం చేసింది. అక్రమ మార్గంలో విశ్వాసపరీక్ష నెగ్గిన పళని స్వామికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేత స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఎమ్మెల్యేల బృందం శనివారం ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసింది. అసెంబ్లీలో మరోసారి బలపరీక్ష నిర్వహించాలని వినతిపత్రం అందించింది. గవర్నర్‌తో భేటీ అనంతరం తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘పళని స్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని గవర్నర్‌కు ఇచ్చాం. అసెంబ్లీలో మరోసారి బలపరీక్ష జరిగేలా ఆదేశాలివ్వాల్సిందిగా కోరాం’ అని స్టాలిన్ తెలిపారు. అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై డీఎంకే దూకుడుగా వెళుతోంది. ముడుపుల వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ శుక్రవారం సభలో పట్టుపట్టింది. అందుకు స్పీకర్ ధన్పాల్ అంగీకరించకపోవడంతో సభను స్థంభింపజేసే ప్రయత్నం చేసింది. స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే శరవణన్ మాత్రం వీడియోలోని గొంతు తనదికాదని వాదిస్తున్నారు. (తప్పక చదవండి: ఇదిగో సాక్ష్యం) -
ఓయూ మట్టిలోనే మహత్మ్యం ఉంది
ఎంతోమంది మహానుభావులను కన్నతల్లి - నా జీవితానికి దారి చూపింది ఓయూనే.. - మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు - ఉల్లాసంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: ఎంతో మంది మహానుభా వులను, పోరాటయోధులను, ప్రముఖులను, మేధావులను కన్నతల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయం అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. ఉస్మానియా మట్టిలోనే ఎంతో మహత్మ్యం ఉందని పేర్కొ న్నారు. జీవితంలో ఎంతో సంఘర్షణకు గురైంది కూడా వర్సిటీలోనే. ఈ సంఘర్షణలో నా జీవితానికి దిశానిర్దేశాన్ని అందజేసిన గొప్ప తల్లి ఉస్మానియానే’ అని చెప్పారు. విభిన్న భావజాలాలు, సిద్ధాంతాల మధ్య ఒక స్పష్ట మైన కార్యాచరణను ఎన్నుకునేందుకు అవ కాశం కలిగించింది ఓయూనే అని పేర్కొ న్నారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది వారోత్స వాల్లో భాగంగా గురువారం ఓయూ అలుమ్ని అసోసియేషన్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యా ర్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి, తమిళనాడు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ టి.మీనాకుమారి, ఉస్మానియా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శ్యామ్మోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. నూరేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎన్నో ఘనకీర్తులను సాధించిం దని అన్నారు. స్వాతంత్య్రోద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉస్మానియా త్యాగాల బాటలో నడిచిందని, ఎన్నో గొప్ప పోరాటాలు చేసిందని గుర్తు చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో చిందిన అమరుల రక్తం సుగంధమై, సువర్ణమై, విజయ బావుటాగా ప్రపంచమంతటా ఎగిసిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తానూ పోలీసు దెబ్బలు తిన్నానని చెప్పారు. ఓయూ విద్యార్థులకు ప్రపంచ దేశాలు తలుపులు తెరిచి సాదరంగా స్వాగతం పలి కాయని, ఉస్మానియా నుంచి అందుకున్న డిగ్రీ పట్టానే పాస్‌పోర్టు, వీసాల కన్నా విలువైనదిగా భావించాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఓయూను సమున్నతంగా నిలిపేందుకు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన 200 వర్సిటీల్లో ఓయూ స్థానాన్ని పొందేందుకు పూర్వ విద్యార్థుల సమాఖ్య కృషి చేయాలని, అందుకు తన వంతు సహకారం అందజేస్తానని విద్యాసాగర్‌రావు ప్రకటించారు. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: జైపాల్‌రెడ్డి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సి టీ విద్యార్థిగా, విద్యార్థి సంఘం నాయకుడిగా తన రాజకీయ జీవితానికి ఇక్కడే పునాదులు పడ్డాయని చెప్పారు. విద్యార్థులు సామాజిక స్పృహను, చైతన్యాన్ని కలిగి ఉండాలని, నిరంతరం జ్ఞాన తృష్ణతో ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలు ఎంత ముఖ్యమో.. తెలుసుకోవాలనే తపన కూడా అంతే ముఖ్యమన్నారు. ఎంతో గొప్పగా జరుగుతున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అపశకునంగా కనిపిస్తోందని విచా రం వ్యక్తం చేశారు. జస్టిస్ మీనాకుమారి మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన గొప్ప వ్యక్తులు ఈ వర్సిటీలో చదువుకున్నారని, ఎంతోమంది మహిళలు సైతం ఇక్కడ చదువుకుని ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని చెప్పారు. అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని 100 మారుమూల గ్రామాలను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేయను న్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ తెలిపారు. వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు: దత్తాత్రేయ కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఉస్మానియా అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు అందజేసిందన్నారు. త్వరలోనే వర్సిటీలో ఒక ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌ను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎంపీ నిధుల కింద వర్సిటీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. -
టెన్షన్.. టెన్షన్
♦ ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు ♦ గవర్నర్ విద్యాసాగర్‌రావు రాక ♦ ప్రభుత్వ తీరుపై రహస్య చర్చలు ♦ మంత్రులకు పన్నీర్‌సెల్వం గాలం ♦ శశికళ వద్దకు దినకరన్ పరుగు అధికార పార్టీ, ప్రభుత్వం రెండూ టెన్షన్లో పడిపోయాయి. ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు, దినకరన్‌కు సమన్లు ఒకటి తరువాత ఒకటిగా పడుతున్న దెబ్బలతో కుదేలైపోతున్నాయి. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆకస్మిక ఆగమనం వారిని మరింత ఆందోళనకు గురిచేయగా, ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార పార్టీని పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది. గవర్నర్ రాక రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ నుంచి సమన్లు ఎదుర్కొంటున్న విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని కొందరు మంత్రులే డిమాండ్ చేస్తున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు. శశికళ వద్దకు దినకరన్ పరుగు రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు, రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పన్నీర్ ఆహ్వానం... మంత్రులు ఓకే అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రెండాకుల చిహ్నం ఎవరికి అనే అంశంపై ఢిల్లీలో విచారణ జరుగుతున్నదని తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే ఇరువురూ రాజీనామా చేయాలని శశికళ, దినకరన్‌లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుండి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్‌సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్‌సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు. -
గవర్నర్‌తో పళని భేటీ
► వెన్నంటి దినకరన్ ► ఎమ్మెల్యేల్లో గుబులు ► బెదిరింపుల హోరు ► చెన్నైలోనే మెజారిటీ శాతం మంది తిష్ట ► భద్రత పెంపు ► పళని నెత్తిన అత్తికడవు –అవినాశి పథకం ► అమలుకు యువత ఏకం సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. సభలో డీఎంకే సృష్టించిన వీరంగాలను వివరించారు. ఆయన వెన్నంటి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఉన్నారు. ఇక, ఓటింగ్‌లో చిన్నమ్మ శశికళ విధేయుడికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. బెదిరింపుల హోరు పెరగడం, ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదన్న ఆందోళనతో వారి ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.అసెంబ్లీ వేదికగా సాగిన రణరంగం నడుమ బల పరీక్షలో కే పళనిస్వామి నెగ్గారు. ఆయనకు 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినట్టు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. విశ్వాస పరీక్షలో తాను నెగ్గడంతో మర్యాద పూర్వకంగా ఆదివారం ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తో మంత్రులు జయకుమార్, సెంగోట్టయన్, దిండుగల్ శ్రీనివాసన్, సెవ్వూరు రామచంద్రన్, విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి, తంగమణి కలిసి అర్ధగంట పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా సభలో బలపరీక్షను అడ్డుకునే విధంగా డీఎంకే వ్యవహరించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల్లో ఆందోళన రాష్ట్ర ప్రజానీకం మాజీ సీఎం పన్నీరుకు మద్దతుగా ఓటు వేయాలని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చింది. అయితే, సభలో అందుకు విరుద్ధంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వ్యవహరించారు. ఓటింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సభలో రాద్ధాంతం సాగుతున్నా, పళనిస్వామికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఓటు వేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టిన తదుపరి ఎమ్మెల్యేల్ని అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కొన్నిచోట్ల అయితే, ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలకు బెదిరింపు లు పెరిగాయి. నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆయా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లకుండా పరిస్థితి సద్దుమణిగిన అనంతరం వెళ్లేందుకు నిర్ణయించారు. చెన్నైలోని తమ క్వార్టర్స్‌లో దక్షిణ తమిళనాడుకు చెందిన మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు తిష్ట వేశారు. ఇక, స్పీకర్ ధనపాల్ ఇంటికి భద్రతను మూడంచెలు పెంచారు. పళని నెత్తిన అత్తికడవు పశ్చిమ తమిళనాడు నుంచి సీఎంగా అవతరించిన పళనిస్వామికి అక్కడి ప్రజల నుంచి తీవ్ర సంకట పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అమలుకు నోచుకోని అనేక పథకాలను తెరమీదకు తెచ్చే పనిలో ప్రజలు పడ్డారు. ప్రజలకు, ప్రజాసంఘాలకు యువజనం మద్దతుగా నిలవడంతో జల్లికట్టు తరహాలో పశ్చిమ తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉద్యమాలు రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈరోడ్, తిరుప్పూర్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు లక్ష్యంగా నిర్ణయించిన అత్తి కడవు– అవినాశి పథకం అమలు లక్ష్యంగా పోరుబాటకు ఆదివారం శ్రీకారం చుట్టడం గమనార్హం. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం కావడంతో, ఆయన మీద ఒత్తిడి తెచ్చి మరీ పథకాలను అమలు చేయడానికి యువత పరగులు తీసే పనిలో పడ్డారు. -
తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు!
బలపరీక్ష సమయంలో సభలోకి రావడంపై వివాదం ► పళని విశ్వాస పరీక్షపై సమగ్ర నివేదిక సమర్పించండి ► తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశం ► స్టాలిన్ , పన్నీర్ ఫిర్యాదుల నేపథ్యం సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. వాస్తవానికి అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలపై అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఆదివారం ఉదయమే ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలు వేర్వేరుగా తనతో భేటీ అయ్యి ఇచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సభలో ప్రతిపక్ష సభ్యులు లేకుండా జరిగిన ఓటింగ్‌పై వివరాలు అందజేయాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు శనివారం నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు సభలోకి రావడం వివాదానికి తెరతీసింది. ముందస్తు వ్యూహం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దించారనే డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. స్టాలిన్ తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ పై దాడిని వివరించడంతో పాటు బలపరీక్షలో పళనిస్వామి గెలుపును రద్దు చేయాలని, మరోమారు బల పరీక్షకు ఆదేశించాలని విన్నవించారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం గవర్నర్‌ను కలసి అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, స్పీకర్ వ్యవహరించిన తీరును వివరించారు. పళనిస్వామి గెలుపు చెల్లదంటూ ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీఎం పళని స్వామి కూడా ఆదివారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో డీఎంకే పనిగట్టుకుని వీరంగాన్ని సృష్టించిందని విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. 22న డీఎంకే దీక్షలు స్టాలిన్ మీద జరిగిన దాడిపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం అయ్యారు. ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోరనున్నామని స్టాలిన్ తెలిపారు. మెరీనా తీరంలో నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి నిరసన దీక్ష నిర్వహించారంటూ ఇద్దరు డీఎంకే ఎంపీలు, స్టాలిన్ తో పాటు 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు. ఐపీఎస్‌ల గుర్తింపు! తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎస్ అధికారులు ప్రవేశించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. శనివారం నాడు డీఎంకే సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు తరలించేందుకు మార్షల్స్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్షల్స్ యూనిఫామ్‌లో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లుగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో తేలినట్టు తెలిసింది. సభలో ప్రవేశించిన 9 మంది ఐపీఎస్ అధికారులను గుర్తించినట్టు కూడా తెలిసింది. ముందస్తు పథకం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దింపారని, ప్రతిపక్ష నేత స్టాలిన్ పై దాడి కూడా పథకం ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. శనివారం నాటి పరిణామాలపై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. మార్షల్స్ యూనిఫామ్ ధరించి పలువురు ఐపీఎస్ అధికారులు సభలో ప్రవేశించారని, అదికూడా స్పీకర్ సభలో లేని సమయంలో ప్రవేశించారని తెలుస్తోంది. వీరిలో చెన్నైలో అసిస్టెంట్, డిప్యూటీ, సహాయ కమిషనర్లుగా పనిచేస్తున్న శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్ కుమార్, ఆర్.సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌లను గుర్తించినట్లు తెలిసింది. సభలో చెలరేగిన గందరగోళం నేపథ్యంలో ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇలావుండగా కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉన్న గవర్నర్ ముంబైకి బయలుదేరి వెళ్లారు. -
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
-
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు. నిన్న బలపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
రిసార్ట్‌లో శశకళ వర్గీయుల సంబరాలు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో శశికళ శిబిరం కళకళలాడుతోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరినా గవర్నర్ వేచిచూడటం, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు సెల్వం వర్గంలోకి చేరుతుండటం, ఇంతలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడటం, బెంగళూరు పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లడంతో ఆమె వర్గీయులు ఢీలాపడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్.. పళనిస్వామిని ఆహ్వానించడంతో శశికళ వర్గీయులకు కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది. కాగా పళనిస్వామి అప్పుడే సీఎం అయినట్టు కాదని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లేదని పన్నీరు సెల్వం వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరిబలమెంత అన్నది అసెంబ్లీలో బలపరీక్షలో తేలనుంది. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
ఈ రోజే గవర్నర్ నిర్ణయం తమిళనాట ఉత్కంఠ
-
ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు (గురువారం) ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ విధేయుడు పళనిస్వామిని ఆహ్వానిస్తారని భావిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం కోసం తమిళనాట సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్న (బుధవారం) తొలుత పళనిస్వామి, ఆ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇద్దరూ గవర్నర్‌తో సమావేశమయ్యారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా అవకాశం ఇవ్వాలని ఇద్దరూ గవర్నర్‌ను కోరారు. దీంతో సంఖ్యారీత్యా పళనిస్వామికి ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున గవర్నర్ ఆయన్నే ఆహ్వానిస్తారని విశ్వసనీయ సమాచారం. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినందువల్ల గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలని రాజకీయనాయకులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఊహించని, అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఎంపీలు, ప్రజల మద్దతు లభిస్తున్నా.. ఆయన ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రావడం లేదు. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే.. ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
తమిళనాడులో వీడని ప్రతిష్టంభన
-
గవర్నర్ కీలక నిర్ణయం!
-
వీడని ఉత్కంఠ
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేదెవరో అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా రాజ్‌భవన్ చుట్టూ రాజకీయం సాగింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన కె పళనిసామి మరో మారు వేర్వేరుగా గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. గార్డెన్ నుంచి బయలు దేరి అమ్మ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం చిన్నమ్మ శశికళ బెంగళూరు కోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె శిబిరం తీవ్ర విషాదంలో మునిగింది. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో రాజకీయ పోరు ఉత్కంఠ భరితంగానే సాగుతోంది. చిన్నమ్మ శశికళకు జైలు శిక్ష పడడం ఆమె శిబిరాన్ని ఢీలా పడేలా చేసింది.అయినా, సేనలకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చిన చిన్నమ్మ శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. అక్కడున్న మద్దతుదారులు చిన్నమ్మకు ఎదురైన కష్టాన్ని తలచుకుని ఉద్వేగానికి గురయ్యారు. తన కంట నీరు సుడులు తిరుగుతున్నా, బయటకు రానివ్వకుండా, మద్దతుదారులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చిన్నమ్మ చేశారు. చివరకు సెలవంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. నేరుగా మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్ద, రామాపురం తోట్టంలోని ఎంజీఆర్ ఇంటి వద్ద కాసేపు మౌనంగా కూర్చున్నారు. అక్కడి నుంచి ఆమె బెంగళూరుకు పయనం అవుతున్న వేళ, మద్దతు దారుల హృదయాలు బరువెక్కాయి. కంటి నుంచి నీటి ధార పొంగింది. ముందుగా, చిన్నమ్మ జైలుకు వెళ్లనుండడంతో పార్టీ పరంగా తమకు పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారో అని మద్దతుదారులు ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా టీటీవీ దినకరన్ తెర మీదకు రావడం ఆ శిబిరానికి ఊరట. దినకరన్ చేతిలో అధికారం: అధికారం తన విధేయుడు పళనిసామి చేతికి చేరిన పక్షంలో, జైలు నుంచే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు తగ్గ వ్యూహంతో చిన్నమ్మ బెంగళూరుకు బయలు దేరి వెళ్లారు. తన సోదరి వనిత వాణి కుమారుడు టీటీ దినకరన్ చేతిలో పార్టీని ఉంచడం, సర్వాధికారాల్ని అప్పగించి వెళ్లడంతో ఇక, శశికళ కుటుంబ రాజకీయ హవా చిన్నమ్మ శిబిరంలో మరింతగా పెరిగినట్టే. అదే సమయంలో దినకరన్‌కు చిన్నమ్మ శిబిరంలో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మున్ముందు ఈ శిబిరంలో ఆసక్తికర మలుపులకు అవకాశాలు ఎక్కువే. ఇక, ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ, కిడ్నాప్‌నకు గురయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించినానంతరం చిన్నమ్మ శిబిరంపై కేసుల మోత మోగించే పనిలో పోలీసులు పడటం గమనార్హం. పన్నీరు శిబిరంలో సందడి కరువు: చిన్నమ్మ శిబిరంలోఉద్వేగ భరిత వాతావరణం చోటు చేసుకుంటే, గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరంలో సందడి కరువు అయింది. నిన్నటి వరకు పెద్ద సంఖ్యలో మద్దతు దారులు తరలి రాగా, బుధవారం సంఖ్య తగ్గింది. సినీ నటి గౌతమి అక్కడికి వచ్చిన పన్నీరు మద్దతు పలికారు. ముఖ్య నేతలతో పన్నీరు సమాలోచనలో బిజీబిజీ అయ్యారు. కూవత్తూరులో ...: కూవత్తూరులోని క్యాంప్ ఆవరణలో మధ్యాహ్న సమయంలో హై టెన్షన్ వాతావరణం కాసేపు నెలకొంది. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పోలీసు బలగాలు క్యాంప్ వైపుగా దూసుకు రావడంతో శిబిరాన్ని ఖాళీ చేయిస్తారా..?అన్న ఉత్కంఠ తప్పలేదు. చిన్నమ్మ శిబిరంలోని ఎమ్మెల్యేలు కిడ్నాప్‌నకు గురయ్యారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో, అందుకు తగ్గ చర్యలు ఏదేని చేపట్టనున్నారా అన్న ప్రశ్న బయలు దేరింది. చివరకు ఉత్కంఠ వీడినా, చిన్నమ్మకు విశ్వాసంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి, తాము ఆనందంగా, స్వతంత్రంగా ఉన్నామని, తమను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. గవర్నర్ నుంచి పిలుపు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రాజ్ భవన్ చుట్టూ: అన్నాడీఎంకే రాజకీయ సమరం రాజ్‌భవన్ చుట్టూ సాగింది. తమను ఆహ్వానిస్తారా...తమను ఆహ్వానిస్తారా..? అన్న ఎదురు చూపుల్లో రెండు శిబిరాలు సాయంత్రం వరకు నిమగ్నమయ్యాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా న్యాయ నిపుణులతో గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్ రావు సంప్రదింపుల్లోనే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సాయంత్రం పళనిస్వామి గవర్నర్‌తో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా ఎలాంటి నిర్ణయాలు, హామీలు గవర్నర్ నుంచి రాలేదు. తదుపరి ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, మంత్రి పాండియరాజన్ రాజ్‌భవన్‌లో అడుగు పెట్టడంతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అయితే, ఇవన్నీ కేవలం భేటీలుగా మిగిలినా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలక మలుపులు తిరిగేనా అన్న చర్చ బయలు దేరింది. కొన సాగుతున్న ఉత్కంఠకు తెర పడేది ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో రాజకీయ వర్గాలు, రాష్ట్ర ప్రజలు నిమగ్నమయ్యారు. -
వీడని ప్రతిష్టంభన
తమిళ సీఎం పీఠంపై వీడని చిక్కుముడి - రాజ్‌భవన్‌లో రాజకీయ బంతి - గవర్నర్‌తో పన్నీర్, పళనిస్వామి భేటీ - పళనిని పిలుస్తారా? సభను సమావేశ పరుస్తారా? - గవర్నర్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ - శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్ కేసు - ఇది తగదంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ సాక్షి ప్రతినిధి, చెన్నై తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరి రెండు రోజులైనప్పటికీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్నవారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమే పార్లమెంటరీ సంప్రదాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే పార్టీలోని ఇరువర్గాలు పోటీ పడుతున్నప్పుడు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలపరీక్షకు అవకాశమివ్వవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా సోమవారం ఇదే సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు సీఎం పదవికై పోటా పోటీగా పావులు కదుపుతున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి బుధవారం రాత్రి వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా పళనిస్వామి గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. మరోవైపు కువత్తూరులో ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారని శశికళ, పళనిస్వామిలపై కేసు నమోదైంది. దీనిపై తమిళనాడు డీజీపీని హెచ్చరించాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. పళనిస్వామి సీఎం అయ్యాక భద్రతా కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడుకు తరలించాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ పళనిస్వామిని పిలుస్తారా? లేక ప్రత్యేక సమావేశం నిర్వహించి బలపరీక్షకు అవకాశమిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రెండు శిబిరాల్లోనూ ఆందోళన శశికళ జైలు కెళ్లగానే పన్నీర్‌సెల్వం వైపు ఎమ్మెల్యేల క్యూ కడతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పన్నీర్ ఇంటివద్ద బుధవారం జనం బాగా పలుచబడ్డారు. సినీనటి గౌతమి మాత్రమే పన్నీర్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో మంగళవారం వరకు చెదరని చిరునవ్వుతో పదే పదే మీడియాకు ముందుకు వచ్చిన పన్నీర్‌సెల్వం బుధవారం ఒక్కసారి కూడా ఇంటినుంచి బైటకు రాలేదు. ఆయన అనుచరులు సైతం నీరసపడిపోయినట్లు కనిపించారు. పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటని పన్నీర్ ఆలోచనలో పడినట్లు సమాచారం. మరోవైపు శశికళ ఉన్నంతవరకు హుషారుగా వ్యహరించిన కువత్తూరు రిసార్టులోని ఎమ్మెల్యేలు ఆమె జైలు కెళ్లడంతో డీలాపడిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి, శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా గవర్నర్ జాప్యం చేయడంపై ఆందోళన నెలకొంది. రిసార్టులోని ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు జారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి సెంగొట్టయ్యన్ బుధవారం కువత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించేవరకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు బైటకు వచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంపోజిట్ బలపరీక్ష అంటే? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరినప్పుడు, ఎవరికి బలముందో స్పష్టత లేనప్పుడు గవర్నర్ శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలాన్ని నిరూపించుకునే అవకాశమిస్తారు. సభకు హాజరైన వారిలో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. బలపరీక్ష వాయిస్ ఓట్, డివిజన్ ఓట్ ద్వారా జరగవచ్చు. డివిజన్ ఓట్ కోరినప్పుడు బ్యాలెట్ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇద్దరిలో ఎవ్వరికీ మెజారిటీ దక్కని పక్షంలో స్పీకర్ ఓటు వేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్, జగదాంబికాపాల్ ఇరువురూ ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీపడినప్పుడు కాంపోజిట్ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని, వారంలోగా సభను సమావేశపరిచి బలపరీక్షకు అవకాశమివ్వాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం గవర్నర్‌కు సూచించిన విషయం తెలిసిందే. శశికళ, ఎడపాడిపై కిడ్నాప్ కేసు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులపై కువత్తూరు పోలీసులు శశికళ, ఎడపాడి పళనిస్వామిలపై మూడు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. శశికళ నిర్వహిస్తున్న కువత్తూరు క్యాంప్ నుంచి ఈనెల 13వ తేదీన తప్పించుకు వచ్చిన మదురై పశ్చిమ ఎమ్మెల్యే శరవణన్ డీజీపీకి ఒక ఫిర్యాదు చేశారు. శశికళ తరఫు వ్యక్తులు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి కువత్తూరులో దాచిపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై డీజీపీ, కాంచీపురం ఎస్పీ ఆదేశాల మేరకు శశికళ, పళనిస్వామిలపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రెండాకుల చిహ్నం ఎవరికి? పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన పక్షంలో రెండాకుల చిహ్నం ఏ వర్గానికి దక్కుతుందని అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ పార్టీలో కీలకపదవుల్లో కొన్ని నియామకాలు, తొలగింపులు చేశారు. అయితే తాత్కాలిక ప్రధాన కార్యదర్శికి నియామకాలు చేసే హక్కులు లేవని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. వైరివర్గాల్లో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా ఇద్దరు, కోశాధికారిగా ఇద్దరు ఉన్నారు. పార్టీ నియమావళి ప్రకారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఎన్నికల కమిషన్‌కు అందిన ఫిర్యాదు పరిశీలనలో ఉంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందోనని రెండు శిబిరాల్లో చర్చించుకుంటున్నారు. -
సస్పెన్స్ సీరియల్
-
గవర్నర్ కీలక నిర్ణయం!
చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు సభలో కాంపొజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహించనున్నారు. అసెంబ్లీలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే శాసనసభ పక్షనేత పళని స్వామి బల నిరూపణకు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది. పళనిస్వామి తన వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో బుధవారం రాత్రి గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీయ్యారు. సమావేశమనంతరం అన్నాడీఎంకే నేత జయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు. 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినట్లు చెప్పారు. పన్నీర్ వెంట ఎమ్మెల్యేలు లేరని..అలాంటప్పుడు బలపరీక్ష ఎందుకని జయ్‌కుమార్ ప్రశ్నించారు. పన్నీర్ వర్గం కూడా ఎమ్మెల్యేల సంతకాల లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో పన్నీర్ సెల్వం వర్గం భేటీయ్యారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. గవర్నర్‌తో పళనిస్వామి భేటీ చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
గవర్నర్‌తో పళనిస్వామి భేటీ
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి మరోసారి కలిశారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని పళనిస్వామి కోరారు. ఆయన వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా ఆయన గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరారు. కాగా మరికాసేపట్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా గవర్నర్‌ను కలవనున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు సెల్వంకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం!
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మంత్రి పళనిస్వామికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని సమాచారం. గవర్నర్ ఈ రోజే ఈ విషయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళను దోషిగా ప్రకటించాక.. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా అసెంబ్లీలో బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా గవర్నర్‌ను కోరినా ఆయనకు తగినంత ఎమ్మెల్యేల బలం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్.. పళనిస్వామికి అవకాశం ఇస్తారని సమాచారం. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
పళనిస్వామికే మెజార్టీ ఉంది...
-
పళనిస్వామికే మెజార్టీ ఉంది...
చెన్నై : అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికే మెజార్టీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి కోరారు. రాష్ట్రంలో విపక్షాల కుట్రలు సాగవని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆమె బుధవారమిక్కడ అన్నారు. కాగా పళనిస్వామి మంగళవారం సాయంత్రం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందచేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గవర్నర్ నిర్ణయం కోసం అన్నాడీఎంకేతో పాటు తమిళనాడు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ ఇవాళ బెంగళూరు పరప్పణ అగ్రహార కోర్టులో లొంగిపోనున్నారు. -
గవర్నర్ ముందు నాలుగు దారులు!
ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆశలు ఆవిరయ్యాయి. ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఇ.పళనిసామిని నియమించింది. మరోవైపు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమాగా ఉన్నారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్‌రావు మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే... 1. ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అంటే.. పన్నీర్‌సెల్వం, పళనిసామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా విద్యాసాగర్ నిర్దేశించవచ్చు. 2. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసనసభను గవర్నర్ కోరవచ్చు. 3. ఒకవేళ ఇరు వర్గాల వారూ.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు. 4. ఇక నాలుగోది, చాలా కీలకమైన మార్గం.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసం రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది. - 1998లో ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబికాపాల్, కళ్యాణ్సింగ్లలో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్‌సింగ్ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎవరీ పళనిస్వామి..?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలుశిక్ష పడటంతో ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు ఈ విషయం తెలియజేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. పళనిస్వామి గురించి తెలుసుకోవాలంటే.. పన్నీరు సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. జయలలిత బతికున్నరోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా పళనిస్వామి ఉండేవారు. అలాగే చిన్నమ్మ శశికళకు కూడా నమ్మినబంటు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ.. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని భావించినట్టు సమాచారం. అయితే అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పళనిస్వామి చిన్నమ్మకు మద్దతుగా నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరు తెరపైకి వచ్చింది. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
-
గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు
-
గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా
చెన్నై: శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిస్టార్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో.. సంబరాలు చేసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు వెళ్లారు. సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు ర్యాలీగా గోల్డెన్ బే రిస్టార్కు వెళ్లారు. రిసార్ట్ బయటే సెల్వం మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్‌లో శశికళతో పాటు ఆమె వర్గం ఎమ్మెల్యేలు, అన్నా డీఎంకే పార్టీ నేతలు ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. రిసార్ట్ బయట పన్నీరు సెల్వం వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయగా.. లోపల ఉన్న ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లబోమని చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రిసార్ట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. పన్నీరు సెల్వం వర్గీయులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు
న్యూఢిల్లీ: అన్నా డీఎంకేలో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత విషయమని, తమిళనాడు పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయ తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు. జైట్లీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకుండా పోయింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్ విద్యాసాగర్ రావు సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు!
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించడంపై ప్రతిపక్ష పార్టీ డీఎంకే శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షనేత స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'అక్రమాస్తుల కేసులో చివరికి న్యాయమే గెలిచింది. ఎంత కాలం గడిచినా చివరికి న్యాయమే గెలుస్తుందని ఈ కేసు తీర్పు మరోసారి నిరూపించింది. అక్రమాలకు పాల్పడి ప్రజల్లో కలిసిపోయి స్వేచ్ఛగా తిరగలేరని రాజకీయ నేతలు గుర్తుంచుకోవాలి' అని స్టాలిన్ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వెంటనే స్పందించాలని ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావును ఈ సందర్భంగా స్టాలిన్ కోరారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రాజకీయ సంక్షోభానికి తెరదించాలన్నారు. ప్రత్యక్షంగా తమ మద్ధతు తెలపకపోయినా.. పరోక్ష రాజకీయాలు నడుపుతూ పన్నీర్ సెల్వానికి మద్ధతిస్తూ.. శశికళకు వ్యతిరేకంగానే డీఎంకే శ్రేణులు వ్యవహరిస్తూ వచ్చాయి. శశికళతో పాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని కూడా సుప్రీంకోర్టు తాజా తీర్పులో దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
గవర్నర్ కు ముందే తెలుసా?
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. శశికళతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా నిర్ధారించింది. దీంతో తమిళ రాజకీయ డ్రామాకు నేటితో తెరపడనుంది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శశికళ వర్గానికి సుప్రీం తీర్పు మింగుడు పడటం లేదు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 5న సీఎం పదవికి పన్నీర్ రాజీనామా చేసినా గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం శశికళకు చాన్స్ ఇవ్వకపోవం వెనక ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. వాస్తవానికి పన్నీర్ రాజీనామా తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు తనకుందని తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ విద్యాసాగర్ రావును నేరుగా కలిసి అన్నాడీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ విజ్ఞప్తి చేశారు. దాంతో పాటుగా రెండు పర్యాయాలు ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాశారు. అయినా విద్యాసాగర్ రావు నుంచి ఆమెకు స్పందన కరువైంది. దీన్నిబట్టి చూస్తే గవర్నర్ కు జరగబోయే పరిణామాలు ముందే తెలిసినందు వల్లే తన నిర్ణయాన్ని వాయిదావేస్తూ వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని వెల్లడించకుండా జాప్యం చేస్తూ తెలివిగా వ్యవహరించారని, ఇందులో భాగంగానే కేంద్ర సలహా కోరారన్న వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని త్వరగా తెరదించాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో గతవారం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో వెలువడే తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను అంగీకరించినా శశికళకు మాత్రం ప్రమాణ స్వీకారం చేసి.. మెజార్టీ నిరూపించుకునే చాన్స్ మాత్రం ఇవ్వక పోవటం.. ఆయనకు ఈ కేసులో తీర్పు ఎలా రానుందో ముందే తెలిసి ఉండొచ్చునని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిర్దోషిగా తేలితే మాత్రం ప్రమాణ స్వీకారానికి శశికళను ఆహ్వానించేవారని, అలాంటి పరిస్థితులు లేవని తీర్పు వచ్చే వరకు తన నిర్ణయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు వాయిదా వేస్తూ వచ్చారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
వారంలోగా బలపరీక్ష!
గవర్నర్‌కు అటార్నీ జనరల్ సూచన సాక్షి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు వారం రోజుల్లో ముగింపు పడనుంది. ముఖ్యమంత్రి పీఠంకోసం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తలపడుతున్న నేపథ్యంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు వారం రోజులుగా నిర్ణయం ప్రకటించని విషయం తెలిసిందే. శశికళకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా ఆమె సంతకాలతో కూడిన పత్రాలు సమర్పించినప్పటికీ, ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నేపథ్యంలో గవర్నర్ తర్జన భర్జన పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఆయన సోమవారం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని రోహత్గీ సూచించినట్లు తెలిసింది. అప్పుడు శాసనసభ సాక్షిగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరివైపు ఉన్నారో స్పష్టమవుతుందని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్, కల్యాణ్సింగ్ల మధ్య ఇలాంటి వివాదమే నెలకొన్నప్పుడు సభలో బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన తెలిపారు. మరోవైపు శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. ఆ తీర్పును అనుసరించి గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా వారం రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడి, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోతుందని భావిస్తున్నారు. -
గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్?
-
గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్?
చెన్నై: తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి.. ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు న్యాయ సలహా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, సభలో ఎవరికి మెజార్టీ ఉంటే వారినే సీఎంను చేయాలని గవర్నర్‌కు సూచించినట్టు సమాచారం. అసెంబ్లీలో ఎవరికి మెజార్టీ ఉంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది సభ సాక్షిగా తేలాలని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాసాగర్ రావుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహిస్తే పారదర్శకంగా, ప్రజాస్వామ్యంగా జరుగుతుందని అటార్నీ జనరల్ భావిస్తున్నారు. కాగా సభలో బలపరీక్షకు సంబంధించి గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేదా అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మెజార్టీ నిరూపించుకోమని ఆమెకు చెబుతారా అన్నది తేలాల్సివుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గవర్నర్ తొలుత పన్నీరు సెల్వంకే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. గవర్నర్ త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ వర్గీయులు తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సంచలన ప్రకటన చేసిన పన్నీరు సెల్వం.. సభలో బలప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. మరోవైపు అన్నాడీఎంకే శాసన సభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో తమిళనాట రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు'
బెంగళూరు : తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదంటూ స్పష్టీకరించిన వెంకయ్యనాయుడు మరోసారి ఆ విషయంపై స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ అధినేతగా తన బాధ్యతలను నిష్ఫక్షపాతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి విషయాలు ఆయన్ని ప్రభావితం చేయడం లేదన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని, అక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉన్న ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ నేతలే ఓ సరియైన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తమిళ సంక్షోభాన్ని త్వరగా ముగించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఓ వైపు నుంచి ఆయనపై ఒత్తిడి నెలకొంటోంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పటికే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై స్పందించిన వెంకయ్యనాయుడు ఎలాంటి పక్షపాతం లేకుండా గవర్నర్ వ్యవహరిస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. పన్నీర్‌సెల్వం రాజీనామా చేయడానికి బీజేపీ కారణం కాదని స్పష్టీకరించారు. బీజేపీ తమిళ అసెంబ్లీలో ఓ సభ్యురాలు కాదని, తమకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఎలాంటి అవకాశమూ లేదన్నారు. బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్లో వెంకయ్యనాయుడు ఆదివారం పాల్గొన్నారు.. -
గవర్నర్‌కు శశికళ మరో లేఖ
-
గవర్నర్‌కు శశికళ మరో లేఖ
చెన్నై: తన శిబిరం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారుతుండటం, వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరుతుండటంతో ఆందోళన చెందుతున్న శశికళ.. గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ కోరారు. తనకు మెజార్టీ నిరూపించుకునే అవకావం ఇవ్వాలని ఆమె మరోసారి విన్నవించారు. శనివారం శశికళ ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా తాను ఏకగీవ్రంగా ఎన్నికయ్యానని, ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరిన విషయాన్ని శశికళ లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 5వ తేదీన తమకు ఎమ్మెల్యేల జాబితాతో లేఖను సమర్పించానని, 9వ తేదీన వ్యక్తిగతంగా కలసినపుడు మరోసారి జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరానని రాశారు. అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆమోదించారని గుర్తు చేశారు. ఈ రోజు తమను కలిసేందుకు తనకు, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. తమిళనాడు ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని గవర్నర్‌కు శశికళ లేఖ రాశారు. -
తమిళనాడు రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు
-
గవర్నర్ నిర్ణయం ఎవరికి చేటు? ఎవరికి సీటు?
-
గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు?
ఆలస్యమైతే పన్నీర్‌కు లాభం వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళకు ఉపయుక్తం న్యూఢిల్లీ: తమిళ రాజకీయ చదరంగంలో సీఎం కుర్చీకోసం సాగుతున్న గేమ్ క్లైమాక్స్‌కు చేరింది! ముఖ్యమంత్రి పీఠంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూర్చుంటారా? లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని పదవి వరిస్తుం దా? ఇప్పుడిది రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ నిర్ణయానికి తీసుకునే కాలవ్యవధి కూడా ఇద్దరి జాతకాలను తారుమారు చేయగలదని పలువురు విశ్లేషిస్తున్నారు. గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళకు లాభిస్తుందని, ఆచితూచి అడుగులేస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్తే నిర్ణయంలో జాప్యం జరుగుతుందని, తుదకు అది పన్నీర్‌కే ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ‘విచక్షణ’ ఎటువైపో...?: ఆర్టికల్ 163(2) గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలను కట్టబెట్టింది. తమిళనాడులో తాజా పరిస్థితిపై ఒక అవగాహనకు వచ్చిన గవర్నర్ తన విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ విచక్షణా ధికారానికి కూడా పరిమితులు ఉంటాయంటూ కిందటేడాది అరుణా చల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. 2016 జనవరి 14 నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను ఒక నెల ముందుగానే (2015 డిసెంబర్ 16న) జరపాలన్న ఆయన నిర్ణయాన్ని కొట్టివేసింది. ‘‘మెజారిటీ ఎమ్మెల్యేలున్న ఒక పార్టీ తమ నేతను ఎన్నుకుంటే రాజ్యాంగం ప్రకారం ఆ ఎన్నికైన నేతతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో తన విచక్షణ మేరకు గవర్నర్ కొన్ని రోజులు ఈ ప్రక్రియను ఆపొచ్చు. ‘ఫలానా కారణం చేత నేను మరికొన్ని రోజులు వేచి చూస్తా..’ అని చెప్పే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంది. అయితే అది రాజ్యాంగబద్ధమా? కాదా? అన్నది ఇప్పటిదాకా తేలలేదు’’ అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే.. శశికళకు ఉపయుక్తంగా ఉంటుంది. గవర్నర్ తన విచక్షాధికారాన్ని వినియోగించుకోకుండా నిలువరించే అధికారం ఎవరికీ లేదు. అవసరమైతే నిర్ణయం తర్వాత దానిపై కోర్టుకు వెళ్లొచ్చు. గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని శశికళ భావిస్తుండగా.. ఎంత ఆలస్యమైతే అంత మంచి దని సెల్వం చూస్తున్నారు. ఆ ఆర్టికల్ ఏం చెబుతుంది?: ‘‘రాజ్యాంగానికి లోబడి గవర్నర్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన విచక్షణాధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు’’ అని ఆర్టికల్ 163(2) చెబుతోంది. ‘రాజ్యాంగానికి లోబడి’ అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నందున ఆయన తీసుకునే నిర్ణయం..రాజ్యాంగ పరీక్షకు నిలవాల్సి ఉంటుందంటున్నారు న్యాయనిపుణులు. ‘‘ఒక పార్టీలోని అంతర్గత సంక్షోభాలు, కీచులాటలతో సంబంధం లేకుండా గవర్నర్ వ్యవహరించాలి. పార్టీ విషయా లతో సంబంధం లేకుండా ఆయన నిర్ణయం తీసుకోవాలి’’ అని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తమిళనాడులో గవర్నర్ తన విచక్షణ మేరకు తీసుకోబోయే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటే మాత్రం కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని నిపుణులు విశ్లేషిస్తు్తన్నారు. -
తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు
శశికళకు మద్దతు ఇస్తామన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్న సీనియర్లు ∙ఢిల్లీకి చేరిన రాజకీయం రాహుల్‌తో సమాలోచన సాక్షి, చెన్నై: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు అన్నాడీఎంకేలో సాగుతున్న సంక్షోభం తమిళ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. మెజారిటీ తగ్గిన పక్షంలో చిన్నమ్మ శశికళకు మద్దతిస్తామంటూ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునా వుక్కరసుర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యల్ని తమిళ కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. వ్యవహారం ఢిల్లీకి చేరడంతో నేతలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ముందు పంచాయితీ పెట్టారు. ప్రస్తు తానికి తటస్థంగా వ్యహరించడం మంచిదన్న రాహుల్ సూచనకు అంగీకరించారు. చిన్నమ్మకు మద్దతు ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా ఓట్లు వేయా లని తిరునావుక్కరసర్ గురువారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహాన్ని రేపాయి. టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకే ఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కేఆర్.రామస్వామి, సీనియర్ ఎమ్మెల్యే వసంత కుమార్ ఆయన వ్యాఖ్యలను దుయ్య బట్టారు. మిత్రపక్షం డీఎంకేతో కలసి వ్యూహాలకు పదునుపెట్టాలే గానీ, ఏకపక్ష నిర్ణయాలు తగదని హెచ్చరించడంతో నేతల మధ్య మాట ల తూటాలు పేలాయి. వ్యవహారం ముద రడంతో పంచాయితీ శుక్రవారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ పిలుపుతో చిదంబరం, ఈవీకేఎస్, కేఆర్.రామస్వామి, తిరునావుక్కరసుర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాహుల్ సమాలోచన ఢిల్లీలో నేతలతో రాహుల్‌గాంధీ తమిళ రాజకీయ పరిస్థితులపై సమాలోచించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. తటస్థంగా వ్యవహరించడం మంచిదన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సూచననే తన అభిప్రాయంగా రాహుల్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీఎంకే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాలన్న ప్రతిపాదనను ఈవీకేఎస్ రాహుల్ ముందు ఉంచినట్టు ఆయన మద్దతుదారులు పేర్కొం టున్నాయి. పన్నీర్ వెనుక బీజేపీ హస్తం ఉన్నందున, శశికళకు మద్దతుగా నిలవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కలసి పనిచేయ డానికి వీలుంటుందన్న అభిప్రాయాన్ని తిరునావుక్కరసుర్ వ్యక్తం చేసినట్టు సమాచా రం. అధిష్టానం నుంచి వచ్చే సూచనలు, సమాచారాల మేరకు ప్రతి ఒక్కరూ స్పందిం చాలని, అంతవరకు ఎవ్వరూ మాట్లాడవద్దం టూ రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన తిరునావుక్కరసుర్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని ముందుకు సాగడం గమనార్హం. కేడర్‌తో కెప్టెన్ మంతనాలు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శుక్రవారం అత్యవ సరంగా సమావేశం అయ్యారు. పెరంబ లూరులో పార్టీ కోశాధికారి ఇళంగోవన్, నిర్వాహక కార్యదర్శి పార్థసారథిలతోపాటు అందుబాటులో ఉన్న జిల్లాల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పన్నీరుకు మద్దతుగా స్పందించాలని ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు ఆ పార్టీ నేతల ఒకరు పేర్కొన్నారు. -
నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ స్పష్టీకరణ జయలలిత తరహాలోనే పాలన అందిస్తా.. పన్నీర్‌సెల్వం పచ్చిద్రోహి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఉంటూ, ‘అమ్మ’ అండతో ఎదిగిన పన్నీర్‌సెల్వం పచ్చి ద్రోహిగా వ్యవహరిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నిప్పులు చెరిగారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నందున తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె పలు అంశాలపై స్పందించారు. గవర్నర్‌ను నమ్మాను ‘‘ఈ నెల 5వ తేదీన అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావే శంలో నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నిక య్యా. తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసా గర్‌రావు ఆ రోజు ఊటీలో ఉన్నట్లు తెలిసింది. నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని ఊటీలోని గవర్నర్ క్యాంప్ కార్యాల యానికి ఫ్యాక్స్ ద్వారా పంపాను. అయితే, ఆయన ఊటీ నుంచి ముంబైకి వెళ్లిపోవడంతో అక్కడి రాజ్‌భవన్‌కు తీర్మాన ప్రతిని మరోసారి పంపించాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సిందిగా నన్ను ఆదేశించడంలో జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయం ఉందని నేను ఊహించలేదు. చట్టప్రకారం, ప్రజాస్వామ్య పద్ధతిలో గవర్నర్ వ్యవహరిస్తారని నమ్మాను. అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు నన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్ను కున్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని నమ్మకంతో ఎదురు చూశాను’’ అని శశికళ చెప్పారు. పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే ‘‘మీకు అండగా మేమున్నామని అసెంబ్లీలో పన్నీర్‌సెల్వంను ఉద్దేశించి డీఎంకే సభ్యులు అన్నప్పుడు.. పూర్తి మెజారిటీతో మేము అధికారంలోకి వచ్చాం, మీ అండ మాకు అవసరం లేదని ఆయన బదులివ్వకుండా నింపాదిగా కూర్చున్నారు. పన్నీర్‌సెల్వం మళ్లీ అధికారంలోకి వస్తారని ప్రతిపక్ష నేత స్టాలిన్ అంటున్నారు. పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేకు చెందిన వ్యక్తి అని ప్రతిపక్ష డీఎంకే భావించడం లేదు. మీకు అండగా మేమున్నామని అసెంబ్లీలో అన్నప్పుడే పన్నీర్‌సెల్వం వెనుక డీఎంకే ఉందని రుజువైంది. ఈ సంఘటన తరువాతే నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. డీఎంకే పట్ల జయలలిత ఎలా వ్యవహరించేవారో నేను సైతం అలాగే ఉంటున్నాను’’ అని చిన్నమ్మ వివరించారు. అమ్మ మరణంపై ఉద్దేశపూర్వక రాద్ధాంతం ‘‘ఆసుపత్రిలో ‘అమ్మ’కు జరిగిన చికిత్సపై డీఎంకే నేతలు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 75 రోజులపాటు ఆసు పత్రిలో ఉన్న జయను ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అక్కడి వైద్యులకు తెలుసు. నా గురించి అవాకులు చవాకులు పేలే వారిని పట్టించుకోకుండా మనస్సాక్షి ప్రకారం నడుచు కుంటున్నాను. ‘అమ్మ’ను దూరం చేసుకుని జీవించడం ఎంతటి దుర్లభమో నాకు తెలుసు. ఇన్నాళ్లూ మాతో ఉన్న పన్నీర్‌సెల్వం ఇప్పుడు ‘అమ్మ’కు జరిగిన చికిత్సపై విచారణ కమిషన్ వేయాలని కోరడం బా«ధాకరం. ‘అమ్మ’కు గుండెపోటు వచ్చిన రోజు కూడా ఫిజియో థెరపీ చేశారు. ఆ రోజున ‘అమ్మ’ టీవీ చూస్తున్నారు, 29వ తేదీన ఇంటికి తీసుకెళ్లాల ని నిర్ణయించుకున్నాను. అయితే ఈలోగా మరణం సంభవించింది. జయలలిత మరణం పై విచారణ కమిషన్ వేయాలని కోరినందుకు నాకు బాధలేదు, ‘అమ్మ’కు పన్నీర్ చేస్తున్న పచ్చి ద్రోహమే నన్ను బాధిస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని నమ్మకంగా చెబుతున్నాను. తమిళనాడు ప్రజలకు జయలలిత ఏమి చేయాలని ఆశించా రో.. నేను కూడా అదే తరహా పాలన అందిస్తా ను. ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతున్నం దున కోర్టు అంశాలపై నేనేమీ వ్యాఖ్యానించ ను’’ అని శశికళ పేర్కొన్నారు. మమ్మల్ని బంధించలేదు: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై: తమను ఎవరూ నిర్బంధించలేదని శశికళ శిబిరంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుS తెలిపారు. తాము బస చేసిన రిసార్ట్ వద్ద కొందరు ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మమ్మల్ని ఎవరూ బంధించలేదు. మమ్మల్ని శశికళ దాచిపెట్టారంటూ ప్రతిపక్ష డీఎంకే అసత్యాలు ప్రచారం చేస్తోంది. బెదిరింపులు వస్తుండడం వల్లే సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నాం’’ అని వెల్లడించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎత్తుకు పైఎత్తు
ఎమ్మెల్యేలు@శశివిలాస్.. పన్నీర్ మసాలా పబ్లిక్ హిట్ తమిళనాడులో క్షణక్షణానికీ మారుతున్న రాజకీయ సమీకరణలు - మధుసూదనన్‌పై చిన్నమ్మ వేటు - ప్రిసీడియం చైర్మన్‌గా సెంగోట్టియన్ నియామకం - ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు పన్నీర్ తీవ్ర ప్రయత్నాలు - కోర్టు ఆదేశంతో శిబిరాలను విచ్ఛిన్నం చేసే యత్నం - శశికళ ఎన్నిక చెల్లదంటూ ఈసీకి మధుసూదనన్ ఫిర్యాదు - గవర్నర్ రాజ్యాంగాన్ని అమలు చేయక తప్పదని చిన్నమ్మ ధీమా - అసెంబ్లీని సమావేశ పరచాలని గవర్నర్‌కు స్టాలిన్ వినతి - ఎటు వైపు మొగ్గాలో తేల్చేందుకు కాంగ్రెస్ నేతలకు రాహుల్ పిలుపు - శాంతిభద్రతల అంశంపై సీఎస్, డీజీపీతో గవర్నర్ సమీక్ష - తమిళనాడులో తొలగని ఉత్కంఠ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి చర్యలు, ప్రతి చర్యలు... సవాళ్లు, ప్రతి సవాళ్లు... ఎత్తులు, పైఎత్తులు... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం తలపడుతున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం రాజకీయాన్ని మరింత రసవత్తర స్థాయికి చేర్చారు. శశికళ ప్రమాణ స్వీకారం కోసం మద్రాసు యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పన్నీర్ తొలగింపచేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన అన్నాడీఎంకేను ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబం చేతుల్లో పడనీయబోమని ప్రకటించారు. అమ్మ జయలలిత చీరలాగిన డీఎంకేతో అంటకాగుతున్న పన్నీర్ సెల్వం పచ్చి ద్రోహి అని శశికళ దీటుగా ధ్వజమెత్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను కచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పన్నీర్ శిబిరంలో చేరిన ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్‌ను పార్టీ నుంచి బహిష్కరించి... ఆయన స్థానంలో మాజీమంత్రి సెంగోట్టియన్‌ను నియమించారు. ఇందుకు ప్రతి చర్యగా మధుసూదనన్ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికే చెల్లదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేశామని ప్రకటించారు. పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం (జయలలిత ఇల్లు)ను అమ్మ స్మారకమందిరంగా మార్చుతామని వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే అంశంపై తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా... శశికళ వర్గం ఎమ్మెల్యేల శిబిరాన్ని మార్చేసింది. తమను ఎవరూ నిర్బంధించలేదని కొందరు అనుకూల ఎమ్మెల్యేలతో మాట్లాడించింది. ప్రస్తుత సంక్షోభానికి ఒకటి, రెండు రోజుల్లో ముగింపు పడి తామే అధికారం చేపడతామని శశికళ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్‌తో సమీక్షించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత తీవ్రమైంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం సలహా మేరకే గవర్నర్ వ్యవహరించే అవకాశమే ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడటం భవిష్యత్ పరిణామాలకు సూచకంగా కనిపిస్తోంది. రప్పిస్తారా? కాపాడుకుంటారా? రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, సినీ తారలు తనకు అండగా నిలిచినా... ఇతర రాజకీయ పార్టీలు తననే బలపరుస్తున్నా ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నతంకాలం తానేం చేయలేనని పన్నీర్‌కు తెలుసు. అందుకే శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తేవడానికి ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారంటూ హైకోర్టులో తన మద్దతుదారులతో పిటిషన్ వేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. పన్నీర్ దూకుడును గమనించిన శశికళ వర్గం ఎమ్మెల్యేలెవ్వరూ చేజారకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. పిటిషన్‌పై స్పందించిన చెన్నై హైకోర్టు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అనే అంశంపై సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, చెన్నై పోలీసుకమిషనర్, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని అవకాశంగా తీసుకుని పోలీసు బలంతో ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు పన్నీర్ అధికార అస్త్రం ప్రయోగించారు. అయితే ఈ విషయం తెలియడంతో చిన్నమ్మ మద్దతుదారులు వాయువేగంతో తమ ఎమ్మెల్యేలను మరో శిబిరానికి తరలించారు. ఈస్ట్ కోస్టు రోడ్డులోని గోల్డన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వెళ్లబోయిన మీడియాను చిన్నమ్మ నియమించిన బౌన్సర్లు అడ్డుకున్నారు. శశికళకు అత్యంత నమ్మకస్తులైన 11 మంది శాసనసభ్యులను మాత్రం రిసార్ట్స్ నుంచి రెండు కిలోమీటర్ల దూరానికి తీసుకుని వచ్చి తాము ఎలాంటి నిర్బంధంలో లేమనీ, స్వేచ్ఛగా ఉన్నామని మాట్లాడించి తీసుకుని వెళ్లారు. తన ప్రయత్నం సఫలం కాకపోవడంతో పోలీసు బలగాలను ప్రయోగించి ఒకటి రెండు రోజుల్లో వారిని బయటకు తీసుకు రావడానికి పన్నీర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా శశికళ కూడా చాలా గట్టి ఏర్పాట్లు చేశారు. పన్నీర్ వెనుక డీఎంకే ఉందని శశికళ మద్దతుదారులు పెద్ద ఎత్తున రాజకీయ దాడికి దిగారు. రహస్య శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించి పరోక్షంగా వారి మీద ఒత్తిడి పెంచడానికి పన్నీర్ వర్గం స్కెచ్ గీసింది. ఇందులో భాగంగానే శుక్రవారం వేలూరు జిల్లా ఆరణి శాసనసభ్యుడు, దేవాదాయ శాఖ మంత్రి సేపూరు రామచంద్రన్ ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఆరణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలోని అంటూరు ఎమ్మెల్యే బాలసుబ్రమణి కిడ్నాప్‌కు గురయ్యారని అక్కడి పన్నీర్ మద్దతుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రకమైన ఒత్తిడి వస్తుందని ముందే ఊహించిన చిన్నమ్మ మద్దతుదారులు ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించే సమయంలోనే వారి మొబైల్ ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్ చేసేశారు. తెర మీదకు స్టాలిన్, రాహుల్ అన్నా డీఎంకేలో సంక్షోభం వారి అంతర్గత వ్యవహారమని చెబుతూ వచ్చిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం రాత్రి తెర మీదకు వచ్చారు. గవర్నర్‌ను కలసి అసెంబ్లీని సమావేశపరచి, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని డిమాండ్ చేయడం ద్వారా పరోక్షంగా పన్నీర్‌కు మేలు చేసే ఎత్తుగడ వేశారు. పన్నీరే కాకుండా ప్రధాన ప్రతిపక్షం కూడా శాసనసభను సమావేశ పరచాలని కోరిందని గవర్నర్ చెప్పుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ అంశం గురించి శశికళ వర్గం తన మీద రాజకీయ దాడి చేయకుండా ఉండేందుకు పన్నీర్ సెల్వం పూర్తి స్థాయి సీఎంగా పనిచేయలేక పోయారని చిన్న విమర్శ చేశారు. మరోవైపు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కూడా పెరంబలూరులో పార్టీ వర్గాలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పన్నీర్‌కు మద్దతుగా స్పందించాలని పలువురు కార్యదర్శులు సూచించగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్లు తెలిసింది. శశికళకు మద్దతిస్తామంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరుసు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పిలిపించి తటస్థంగా ఉండాలని సూచించారు. శాసనసభలో ఎనిమిదిమంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ చిన్నమ్మ వైపు మళ్లకుండా పన్నీర్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగలిగారని తెలుస్తోంది. అయితే చిన్నమ్మ వర్గం సైతం కాంగ్రెస్ మద్దతుకోసం ప్రయత్నాలు చేస్తోంది. తేల్చని గవర్నర్.. తీవ్రమైన ఉత్కంఠ ముఖ్యమంత్రి సీటు దక్కించుకునేందుకు పడుతున్న పన్నీర్, శశికళతో మాట్లాడి వారి వాదనలు, అభిప్రాయాలు విన్న ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు 24 గంటలు గడిచినా తన నిర్ణయం ఏమిటో ప్రకటించలేదు. శశికళ మీద ఉన్న అక్రమాస్తుల కేసు, న్యాయ సలహాలు తీసుకోవడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకునే పేరుతో ఆయన శుక్రవారంకూడా ఈ సంక్షోభానికి ముగింపు పలకలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర బీజేపీ పన్నీర్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నందువల్ల కేంద్రం నుంచి పన్నీర్ బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని సందేశం వస్తే గవర్నర్ దాన్ని అమలు చేస్తారా? లేక రాజ్యాంగాన్ని కాపాడడానికి స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారా? అన్నాడీఎంకే సంక్షోభానికి ఏ విధమైన ముగింపు పలుకుతారనే విషయం అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజల్లోను తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు శశికళను ఇప్పట్లో సీఎం చేయడం సరైందని కాదని గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికలో పొందుపరచినట్లు కొన్ని తమిళ, తెలుగు టీవీ చానళ్లలో కథనాలు ప్రసారం కావడం కలకలం సృష్టించింది. అయితే ఈ కథనాలు, ప్రచారాలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. -
తమిళనాడు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా?
చెన్నై: గడిచిన నాలుగురోజులుగా సాగుతోన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు గవర్నర్ తెరదించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాట టెన్షన్ తారాస్థాయికి చేరింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించాలన్న శశికళ అభ్యర్థనను తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సి.విద్యాసాగర్‌రావు తిరస్కరించినట్లు, ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో గవర్నర్ స్పష్టమైన అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. దీంతో చిన్నమ్మ వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతోన్న ఇద్దరు నేతల(శశికళ, ఓ.పన్నీర్ సెల్వం)తో గురువారం భేటీ అయిన గవర్నర్, శుక్రవారం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ సమావేశం నిర్వహించారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోనూ, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తోనూ మాట్లాడారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించిన గవర్నర్.. శుక్రవారమే కేంద్ర హోం శాఖకు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. ఆ నివేదికలోనే.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించబోనని గవర్నర్ పేర్కొన్నట్లు తెలిసింది. శశికళకు షాక్ ఇచ్చే విధంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొన్నట్లు తెలిసింది. శశికళ అక్రమ ఆస్తుల కేసుపై వచ్చే వారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటం, చట్టసభలో సభ్యురాలు కాకపోవడం వల్లే బలనిరూపణకు ఆమెకు అవకాశం ఇవ్వకూడదని గవర్నర్ భావిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. సాధారణంగా చట్టసభకు ఎంపిక కానివారితో మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ప్రమాణం చేయిస్తే, ఆరు నెలలలోగా వారు ఏదోఒక అసెంబ్లీ లేదా మండలి స్థానం నుంచి గెలవవాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (1) ప్రకారం చట్టసభలో సభ్యులుకాని వ్యక్తులకు శాసనసభలో బలం నిరూపించుకునే(ముఖ్యమంత్రి అయ్యే) అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై గవర్నర్దే తుది నిర్ణయం. దీనికి సంబంధించి ఆర్టికల్ 164(4)పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే నడుచుకోవాలని గవర్నర్ విద్యాసాగర్‌రావు భావిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అబ్బే! నివేదికరాలేదే.. ఒక జాతీయ చానెల్ ప్రసారం 'నివేదిక' వార్తలు దావానలంలా మారి, దుమారం రేపుతుండటంతో కేంద్ర హోంశాఖ, తమిళనాడు రాజ్భవన్లు రంగంలోకి దిగాయి. 'అసలు అలాంటి నివేదిక ఏదీ గవర్నర్‌గారు కేంద్రప్రభుత్వానికి పంపనేలేదు' అని రాజ్‌భవన్ పౌరసంబంధాల అధికారి(పీఆర్వో) శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. అటు కేంద్ర హోం శాఖ కూడా 'తమిళనాడు గవర్నర్ నుంచి నివేదిక రాలేదు'అని తేల్చిచెప్పింది. దీంతో తమిళనాట ఉత్కంఠ కొనసాగుతూనేఉంది.. సంబంధిత కథనాలు చదవండి.. శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు! అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా? (మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!) గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. -
కాసేపట్లో గవర్నర్ ప్రకటన
-
కాసేపట్లో గవర్నర్ ప్రకటన
చెన్నై: తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిపై ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశముంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యాసాగర్ రావు.. చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. పన్నీరు సెల్వం రాజీనామా, ఆ తర్వాత అధికార అన్నా డీఎంకేలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటు విషయంపై గవర్నర్ చర్చించారు. ఎమ్మెల్యేలను శశికళ వర్గం బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించిందని పన్నీరు సెల్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతకుముందు గవర్నర్ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమావేశమయ్యారు. శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. దీంతో క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు డీజీపీ బయల్దేరారు. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత గవర్నర్ వారి అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముంది. గవర్నర్ నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తనతో శశికళ వర్గం బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిందని, ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గవర్నర్‌ను కోరాగా.. తనకే ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శశికళ గవర్నర్‌కు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై గవర్నర్ రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా లేక బలనిరూపణకు పన్నీరుకు అవకాశం ఇస్తారా లేక రాష్ట్రపతి పాలనకు సిఫారు చేస్తారా అన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం
-
మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రమే తమిళనాడును రక్షించగలరని ఆయన మద్దతుదారులు చెప్పారు. సెల్వం వర్గీయులు శుక్రవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పన్నీరు సెల్వంతో పాటు పొన్నుస్వామి, సీనియర్ నేతలు, మద్దతుదారులు పాల్గొన్నారు. జయలలిత వారసత్వాన్ని కొనసాగించే సత్తా సెల్వానికే ఉందని, అమ్మ ఉన్నప్పుడే ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరూ డబ్బుల కోసం శశికళ వెంట వెళ్లవద్దని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నుస్వామి కోరారు. పార్టీ ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని విన్నవించారు. ఆమ్మ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పొన్నుస్వామి కోరారు. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
నాకు 5 రోజులు సమయం ఇవ్వండి: సెల్వం
చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధీమాగా ఉన్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారని, ఆ జాబితాను చూపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారని, ఎమ్మెల్యేలను బలవంతంగా క్యాంపునకు తరలించారని, తనకు 5 రోజులు సమయం ఇస్తే ఎమ్మెల్యేల మద్దతును కూడగడతానని పన్నీరు సెల్వం తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును కోరినట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం గవర్నర్‌ను పన్నీరు సెల్వం కలిసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌తో సెల్వం దాదాపు 15 నిమిషాలు సమావేశమయ్యారు. శశికళ వర్గం ఎమ్మెల్యేలను బందీలుగా చేసిందని గవర్నర్‌కు సెల్వం ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనకు 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలియజేస్తూ, వారి సంతకాలతో కూడిన జాబితాను శశికళ గవర్నర్‌కు పంపిన సంగతి తెలిసిందే. సెల్వం ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎమ్మెల్యేల విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తనను కలిసిన శశికళతో కూడా ఈ విషయంపై మాట్లాడినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే.. సెల్వం అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కొంత సమయం కావాలని గవర్నర్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలామంది ఎమ్మెల్యేల సంతకాలను శశికళ ఫోర్జరీ చేశారని, పన్నీరు సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన మద్దతుదారుడు, అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ చెప్పారు. శశికళ వర్గం పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచిందని ఆరోపించారు. తమదే నిజమైన అన్నాడీఎంకే అని చెప్పారు. శశికళ శిబిరం నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 235 ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 118 సభ్యులు ఉండాలి. అన్నాడీఎంకే ప్రస్తుతం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో శశికళ, పన్నీరు సెల్వం వెంట ఎంతమంది ఉన్నారన్నది తేలాల్సివుంది. ఇక సెల్వానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
శశి వర్గం సంతకాలు సరిచూడాలి: గవర్నర్
-
శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి: గవర్నర్
తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతున్న వీకే శశికళ సమర్పించిన సంతకాలు సరైనవో కావో చూడాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భావిస్తున్నారు. దాదాపు అరగంట పాటు తన వాదన వినిపించడంతో పాటు, పది అంశాలతో కూడిన ప్రజంటేషన్ కూడా ఇచ్చిన శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతా కలిసి తనను ఎలా శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారో కూడా గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకంటే ముందుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం గవర్నర్‌ను కలిశారు. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని ఆమె కోసం వదులుకున్న వాడిగా పేరున్న సెల్వం.. ఎమ్మెల్యేలతో ఖాళీ కాగితం మీద శశికళ సంతకం చేయించుకున్నారని, ఆ తర్వాత దానిమీద తనకు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించారు. కొన్ని సంతకాలు ఫోర్జరీ కూడా చేసినట్లు ఆయన అంటున్నారు. దాంతో ఈ విషయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంతకాలన్నింటినీ సరి చూడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నాయకులను దగ్గర పెట్టుకుని సంతకాలు సరిచూడాలని, మరీ అవసరమైతే ఫోర్జరీ ఆరోపణలు సరైనవా కావా అన్న విషయం ఖరారు చేసుకోడానికి ఫోరెన్సిక్ నిపుణులకు కూడా పంపాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తనకు పార్టీలో ఎంత మద్దతు ఉందో నిరూపించుకోడానికి ఐదు రోజుల గడువు కావాలని పన్నీర్ సెల్వం గవర్నర్‌ను కోరారు. దానికి అభ్యంతరం తెలిపిన శశికళ, తనకు మొత్తం 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అందువల్ల తనకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కల్పించాలని కోరారు. అయితే.. 134 మందిలో పన్నీర్ సెల్వం వెంట కనీసం ఐదారుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సంఖ్య తప్పవుతుంది. అందుకే సంతకాల అంశాన్ని పన్నీర్ రేపినట్లు తెలుస్తోంది. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
చిన్నమ్మకే ఛాన్స్.. కానీ!
-
చిన్నమ్మకే ఛాన్స్.. కానీ!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేక ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావు.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళకు ఆహ్వానం పంపనున్నారు. అయితే కొంత సమయం కావాలని శశికళకు గవర్నర్ చెప్పినట్టు సమాచారం. పన్నీరు సెల్వం అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని గవర్నర్ చెప్పినట్టు తెలుస్తోంది. తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని పన్నీరు సెల్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గురువారం గవర్నర్‌ను కలిసినపుడు కూడా బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని పన్నీరు సెల్వం కోరారు. నిన్న రాత్రి శశికళ కూడా గవర్నర్‌ను కలిశారు. ఆమెతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శశికళ కోర్టు కేసుల గురించి గవర్నర్ ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జయలలిత, శశికళపై ఉన్న అక్రమాస్తుల కేసులో త్వరలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో పాటు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేయడం, అన్నా డీఎంకేలో చీలిక రావడం, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలన్న శశికళపై కోర్టు కేసులు ఉండటంతో తమిళనాడులో అనిశ్చితి ఏర్పడింది. సంబంధిత కథనాలు చదవండి.. గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
రసవత్తరంగా..
► వేడెక్కిన రాజకీయం ► శశి వర్సెస్ పన్నీరు ► అధికారంలో చిక్కేదెవ్వరికో ► గవర్నర్ నిర్ణయం ఎటో అన్నాడీఎంకేలో అధికార వార్ రసవత్తరంగా మారింది. రాజకీయం వేడెక్కడంతో శశి వర్సెస్ పన్నీరు మధ్య సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు నిర్ణయం ఎలా ఉంటుందో, అధికార పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయోనన్న ఉత్కంఠ రెట్టింపు అయింది. సాక్షి, చెన్నై : అన్నాడిఎంకేలో అపద్దర్మ సీఎం పన్నీరు సెల్వం సృష్టించిన అలజడి తాత్కాళిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పోయేస్ గార్డెన్ వేదికగా చిన్నమ్మ రాజకీయ చక్రం తిప్పుతున్నా, గ్రీన్ వేస్రోడ్డు వేదికగా ఊహించని రీతిలో పన్నీరు ట్విస్టులు ఇస్తుండటం రాజకీయ సమరాన్ని వేడెక్కించి ఉన్నది. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలను చిన్నమ్మ సేన బలవంతంగా తమ క్యాంప్‌లో ఉంచితే, పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న ప్రిసీడియం చైర్మన్ మదుసూదనన్ ను తన వైపుకు తిప్పుకుని రాజకీయ ఎత్తుగడలో ఓ మెట్టు పైకి పన్నీరు చేరడం గమనార్హం. ఇక, రెండో రోజు గురువారం అన్నాడిఎంకేలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా సాగాయి. అన్నాడిఎంకేలో వేడెక్కిన శశి వర్సెస్ పన్నీరు సమరంలో రేసు గుర్రంగా అవతరించే వారెవ్వరో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. పన్నీరు ఇంటా మద్దతు జోరు...: తొలి రోజు బుధవారం పన్నీరుకు మద్దతుగా సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా, రెండో రోజు ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉండొచ్చన్నభావన సర్వత్రా నెలకొంది. మన్నార్గుడి సేనల నిఘా నీడ నుంచి తప్పించుకుని పలువురు ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాశంకు వచ్చే అవకాశాలతో అందరి దృష్టి అటు వైపుగా మరలింది. గ్రీన్ సే రోడ్డులో ఉదయాన్నే హడావుడి పెరిగింది. ఎక్కడికక్కడ భద్రతను సైతం పోలీసులు పెంచారు. పన్నీరుకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో నేతలు దూసుకొచ్చారు. వస్తున్న నేతలు ఎ వరోనని ఆత్రూతతో కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఎగబడింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు పన్నీరుతో భేటీ అవుతూ వచ్చారు. అయితే, చిన్నమ్మ శిబిరానికి గట్టి షాక్ ఇచ్చే రీతిలో పన్నీరు వేసిన ఎత్తుగడం పోయేస్ గార్డెన్ లో టెన్షన్ వరణాన్ని నింపింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ప్రిసీడియం చైర్మన్ మదు సూదనన్ పన్నీరు ఇంటి మెట్లు ఎక్కడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ వర్గాలకు నిత్యం అందుబాటులో ఉండే మదుసూదనన్ రాక పన్నీరు శిబిరంలో బలాన్ని కల్గించినట్టు అయింది. కాగా, పన్నీరుకు మద్దతుగా నిలిచిన గౌండంపాళయం ఎమ్మెల్యే ఆరు కుట్టిని అభినందిస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఊత్తంకరై మహిళా ఎమ్మెల్యే మనోరంజితం నాగరాజ్‌ను అక్కడి మహిళా లోకం అభినందనలతో ముంచెత్తుతున్నాయి. ఇక, పన్నీరు , మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ల తనయులు సైతం రంగంలోకి దిగి మద్దతు సేకరణలో నిమగ్నం కావడం ఆహ్వానించ దగ్గ విషయం. పన్నీరుకు మద్దతుగా యువ శక్తి జల్లికట్టు తరహా ఉద్యమాన్ని సాగించే అవకాశాల ప్రచార నేపథ్యంలో మెరీనా తీరం మళ్లీ పోలీసుల భద్రతా వలయంలోకి చేరింది. పోయేస్ గార్డెన్ లోనూ తగ్గని జోరు : పన్నీరు ఇంట మద్దతు జోరు పెరిగినా, పోయేస్ గార్డెన్ కు అదే స్థాయిలో మద్దతు హోరెత్తడం గమనార్హం. చిన్నమ్మకు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చే నాయకులు పన్నీరుకు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోశారు. చిన్నమ్మ ఫోటోలను చేతబట్టి మద్దతు నినాదాల్ని హోరెత్తించారు. మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతిలు పోయేస్ గార్డెన్ ప్రవేశ మార్గం వద్ద మీడియాకు ఎప్పటికప్పుడుసమాచారాల్ని అందిస్తూ వచ్చారు. తమ చిన్నమ్మ సీఎం పగ్గాలుచేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ రాకతో రెట్టింపు ఉత్కంఠ : పన్నీరుకు ప్రజా మద్దతు, మాజీల మద్దతు హోరెత్తుతున్నా, మెజారిటీ ఎమ్మెల్యేలు చిన్నమ్మ చేతిలో ఉండటంతో అధికారం చిక్కేదెవ్వరికో అన్న చర్చ రెట్టింపు అయింది. గవర్నర్ (ఇన్ ) సీహెచ్ విద్యా సాగర్ రావు ముంబై నుంచి చెన్నైలో అడుగు పెట్టడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. రాజ్ భవన్ వద్ద హడావుడి పెరిగింది. అపద్దర్మ సీఎం పన్నీరు సెల్వం ఇన్ చార్జ్ గవర్నర్‌తో భేటీ కావడం, అంతా మంచే జరుగుతుందని మద్దతు దారులకు భరోసా ఇచ్చే ప్రకటన చేయడంతో ఆ శిబిరంలో మరింతగా జోష్...పెరిగి ఉన్నది. ఇక, పన్నీరు తదుపరి చిన్నమ్మ శశికళ గవర్నర్‌తో భేటీ కావడం ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలతో ఇక, గవర్నర్ సిహెచ్ విద్యా సాగర్‌రావు మున్ముందు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. శుక్ర లేదా, శనివారాల్లో అధికారం లక్ష్యంగా సాగుతున్న సమరంలో ఏదేని స్పష్టత వచ్చేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. -
ముందు సెల్వం, తర్వాత శశికళ..
చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసేందుకు పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ సిద్ధమవుతున్నారు. గవర్నర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని వీరిద్దరూ కోరనున్నారు. ముందుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు విద్యాసాగర్ రావును పన్నీర్ సెల్వం కలవనున్నారు. రాత్రి 7.30 గంటలకు గవర్నర్ తో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ కానున్నారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను ఆయన కోరే అవకాశముంది. మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షాన ఉన్నందున ముఖ్యమంత్రిగా తనకే అవకాశం ఇవ్వాలని శశికళ అభ్యర్థించనున్నారు. -
దూకుడు పెంచిన పన్నీర్
-
దూకుడు పెంచిన పన్నీర్
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. ప్రస్తుతం ఎటూ ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారు కాబట్టి, తనకున్న అన్ని అవకాశాలను వదలకుండా వాడుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిందన్న విషయం తెలిసి.. అంతకంటే ముందే ఆయనను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేరుగా విమానాశ్రయానికే వెళ్లి విద్యాసాగర్‌రావును కలవాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్‌కు స్వాగతం పలికే అవకాశం ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి.. అక్కడే ఆయనను కలిసి తన వాదన వినిపించడం, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా వీలైతే అక్కడే ఇచ్చేయడం ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక పార్టీ ప్రిసీడియం చైర్మన్ (గౌరవాధ్యక్షుడు) మధుసూదనన్ తమవైపు రావడం, తనకు మద్దతివ్వడం పట్ల పన్నీర్ సెల్వం సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని సంరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. శశికళ ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, సీనియర్ నాయకుడైన మధుసూదనన్‌ను సైతం ఆమె బెదిరించారని చెప్పారు. ఎమ్మెల్యేలంతా తమతోనే వస్తారని, పార్టీని కాపాడకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని అన్నారు. జయలలితను కూడా శశికళ మోసం చేశారని, పార్టీని ప్రభుత్వాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ ముఖ్యమంత్రి అయితే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని, ఆమె సీఎం కాకుండా సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు. పదవి కోసం శశికళ చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
-
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న శశికళా నటరాజన్‌కు అనుకోకుండా పెద్ద షాక్ తగిలింది. అత్యంత జాగ్రత్తగా బస్సులలో ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటళ్లు, రిసార్టులకు తరలించి.. వాళ్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నా, అందులోంచి ఉన్నట్టుండి 43 మంది మిస్సయ్యారు. వీళ్లంతా పన్నీర్ సెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం. తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. తన వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదవి చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న శశికళకు ఇది అనుకోని షాక్ అయ్యింది. ప్రభుత్వం నిలబడాలంటే 233 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో కనీసం 117 మంది మద్దతు అవసరం అవుతుంది. ఉన్న 130 మందిలోంచి 43 మంది వెళ్లిపోతే ఇక ఆమె వద్ద మిగిలేది 80-90 మంది మధ్య మాత్రమే. అలాంటప్పుడు ఆమె ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసినా, సభలో బలం నిరూపించుకోలేక వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలన, శాంతిభద్రతల గురించి చర్చించడానికే సీఎస్, డీజీపీలను పిలిపించినట్లు చెబుతున్నా.. నిజానికి ఎమ్మెల్యేల క్యాంప్ ఎక్కడ, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ విభాగం ఏమంటోందో తెలుసుకోడానికే పన్నీర్ వాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది. ఇక గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చెన్నై రాజ్‌భవన్‌కు వస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు రాజకీయ నాయకులను కలుస్తారో లేదోనన్నది అనుమానంగానే ఉంది. ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ ఇచ్చి, మిగిలినది తాను సభలో నిరూపించుకుంటానని చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ముందుగా డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులను పిలిపిస్తారు. ఆ తర్వాత తనవద్ద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసుకుంటారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు సాయంత్రం తర్వాత మరింత వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నేడు చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్‌రావు
-
ముంబైకి పన్నీరు సెల్వం!
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో పరిణామాణాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ అధినేత్రి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన పన్నీర్ సెల్వం ముంబైకి పయనం కానున్నారు. గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావుతో ఆయన భేటీ కానున్నారు. తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని... ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని పన్నీరు సెల్వం మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ముంబైకి పయనం కావాలని నిర్ణయించడం కీలకంగా మారింది. గవర్నర్ తో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన నివాసంలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగిపోయారు. శశికళను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. -
దీప మద్దతిస్తానంటే తీసుకుంటా: పన్నీర్
► గవర్నర్ తమిళనాడు రాగానే కలుస్తా ► కేంద్రం మద్దతిస్తామంటే తప్పకుండా తీసుకుంటా ► అమ్మ నన్ను రెండుసార్లు సీఎం చేశారు చెన్నై జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతిస్తానంటే తప్పకుండా తీసుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉంటారని తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమిళ ప్రజలకు అండగా ఉందని, తమిళ ప్రజలకు ఎవరు మద్దతిచ్చినా దాన్ని తాము అంగీకరిస్తామని పన్నీర్ సెల్వం చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్తానని, తమిళనాడులో ప్రతి నగరానికీ వెళ్లి తాను అనుకుంటున్న విషయాలు ప్రజలకే చెబుతానని అన్నారు. తన బలమేంటో అసెంబ్లీలో తప్పకుండా నిరూపించుకుంటానని తెలిపారు. గవర్నర్ ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఆయన తిరిగి రాగానే తాను ఆయనను కలుస్తానని కూడా వివరించారు. జయలలిత 16 సంవత్సరాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆమె తనను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని, ఇదంతా అమ్మ కోరిక మాత్రమేనని, తాను ఆమె అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు. -
తమిళనాడులో కేంద్రం జోక్యమా.. లేదు: వెంకయ్య
తమిళనాడులో పరిస్థితులను ఆ రాష్ట్ర గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. అధికారుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి లోబడి మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో పరిణామాలపై న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడదలచుకోలేదని, తమిళనాడు వ్యవహారంలో ఎవరినీ కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని ఆయన చెప్పారు. గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని, అలాగే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ మీద కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు. -
తమిళనాడులో కేంద్రం జోక్యమా.. లేదు: వెంకయ్య
-
చిన్నమ్మ ముహూర్తం పెట్టుకున్నా..!
జయలలితకు అనునిత్యం నీడలా వెన్నంటి ఉంటూ.. ఆమె మరణం తర్వాత కూడా అంతా తానై వ్యవహరించిన చిన్నమ్మ శశికళకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నక్షత్రం, జాతకాలను బట్టి మంగళవారం ఉదయం 8.45-9.30 మధ్యలో ప్రమాణస్వీకారం చేయించాలని ముందు అనుకున్నారు. ఇందుకోసం మద్రాస్ యూనివర్సిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయి అక్కడే ఉండిపోయారు. ఆయన చెన్నై రాకపోవడంతో ఇక ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్నమ్మ శశికళ ప్రమాణాన్ని వాయిదా వేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. (చదవండి: శశికళ ప్రమాణంపై సందిగ్ధత) ఒకవైపు సెంథిల్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో పాటు జయలలిత-శశికళ మీద ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం లాంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ న్యాయసలహాకు వెళ్లారు. ఒకవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించిన గవర్నర్, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, సొలిసిటర్ జనరల్ తదితరులను కలివారు. వాళ్ల సలహా తీసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్రమాణస్వీకారం చేయించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వచ్చి, శిక్ష పడితే ఆమె వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుందని.. అది అంత మంచి పరిణామం కాదు కాబట్టి కొన్నాళ్లు వేచి ఉంటేనే మంచిదని సూచించారంటున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయారు. ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష డీఎంకే కూడా వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఉన్నందున రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున శశికళకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకూడదని కూడా ఆయన అంటున్నారు. -
చిన్నమ్మ ముహూర్తం పెట్టుకున్నా..!
-
ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్
-
శశికళ ప్రమాణంపై సందిగ్ధత
-
గవర్నర్ కోసం ఎదురుచూపు
► 9న ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ► ఏ పదవీ వద్దంటున్న పన్నీర్‌సెల్వం ► ఆరుగురు మంత్రులకు ఉద్వాసన? అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ రాష్ట్ర గవర్నర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకోగానే ఆయన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంగా పన్నీర్‌సెల్వం, ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాలు జయ మృతి చెందిన తరువాత కేవలం 20 రోజుల్లోనే జరిగిపోయాయి. ఇంతలోనే అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. సీఎం కుర్చీలో పన్నీర్‌సెల్వం సర్దుకునేలోగా పదవీచ్యుతులయ్యారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ పార్టీ తీర్మాన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరాల్సి ఉం ది. శశికళ ఎంపిక కాగానే పిలుపు రావడంతో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 9వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేలా శశికళ సిద్ధమవుతున్నా రు. ఢిల్లీ నుంచి గవర్నర్ రాగానే కలిసేందుకు శశికళ సిద్ధంగా ఉన్నారు. పన్నీర్‌సెల్వం మనస్తాపం సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టగానే మంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకోవడం అనివార్యమని తెలుస్తోంది. సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కుర్చీలో శశికళ కూర్చోవడంపై పన్నీర్‌సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్న తేని జిల్లా పోడి నియోజకవర్గంలో ప్రజలు శశికళపై ఆగ్రహం వ్యక్త చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉండగా సీఎం పదవిని కోల్పోయిన పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. సన్నిహితులతో బాధను పంచుకుంటూ తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని అందుకున్న శశికళ కంగారు పడ్డారు. పన్నీర్‌సెల్వం అస్త్రసన్యాసానికి దిగితే ప్రజల్లోనూ, పార్టీలోనూ తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి పన్నీర్‌సెల్వంను బుజ్జగించే పనిలో పడ్డారు. పన్నీర్‌సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తున్నట్లు సమాచారం పంపారు. అయితే శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకునేది లేదని పన్నీర్‌సెల్వం భీష్మించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అందరూ ఖాయమని భావిస్తున్న తరుణంలో బెర్తు కోసం సెంగోట్టయ్యన్, రంగస్వామి, సెంథిల్ బాలాజీ సహా పలువురు ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల వేట ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఆరు నెలల్లోగా శశికళ ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉండగా నియోజకవర్గ వేటలో పడ్డారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై ఆర్కేనగర్లో శశికళపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా ఆర్కేనగర్ నుంచి జయ మేనకోడలు దీప పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా దక్షిణ తమిళనాడులోని సురక్షితమైన నియోజకవర్గాలను శశికళ అన్వేషిస్తున్నారు. ఆండిపట్టి లేదా ఉసిలంబట్టి నియోజకవర్గాలను ఆమె పరిశీలిస్తున్నారు. పోయెస్‌గార్డెన్ కు సీఎం కళ జయలలిత మరణం తరువాత పోయెస్ గార్డెన్ లోని ఆమె నివాసం వద్ద పోలీసు బందోబస్తును దాదాపుగా తగ్గించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత మరికొంత పెంచారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన రెండు రోజుల్లో శశికళ సీఎం కాబోతున్న తరుణంలో సోమవారం మళ్లీ బందోబస్తును పెంచారు. బందోబస్తులో ఉన్న పోలీసులతో గార్డెన్ కు మళ్లీ సీఎం కళ వచ్చింది. గార్డెన్ ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ప్రజలను పోలీసులు కట్టడి చేయడం ప్రారంభించారు. -
శశికళ ప్రమాణంపై సందిగ్ధత
ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిన గవర్నర్ విద్యాసాగరరావు ► న్యాయ సలహా తీసుకోవడానికేనన్న మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు ► శశికళ ప్రమాణాన్ని అడ్డుకోవాలని సుప్రీంను ఆశ్రయించిన ఎన్ జీఓ ► ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన మద్రాస్ యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, చెన్నై/ముంబై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. మంగళవారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు సోమవారం ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై రాకుండా ముంబై వెళ్లిపోవడంతో శశికళ ప్రమాణం స్వీకారం వాయిదా పడుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. శశికళతో ప్రమాణం చేయించే విషయంలో న్యాయ సలహా తీసుకోవడానికి గవర్నర్ ఢిల్లీ వెళ్లినట్లు మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో వారంలోగా తీర్పునిస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో గవర్నర్ ఏమి చేయబోతున్నారు అనే విషయంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఒక వేళ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత.. ఆ కేసులో ఆమె దోషిగా సుప్రీం తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల్లో భాగం గా వ్యూహాత్మకంగానే శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారనే వారు విశ్లేషిస్తున్నారు. మరోపక్క సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని చెన్నైకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ సుప్రీంకోర్టును పిల్ ద్వారా ఆశ్రయించింది. ఈ పిల్‌ను మంగళవారం సుప్రీం కోర్టు విచారించనుంది. ఇంకోపక్క శశికళ ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయించిన మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియాన్ని వేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడే జయలలిత కూడా ప్రమా ణ స్వీకారం చేశారు. ఇక సీఎం పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. (చదవండి: సీఎంగా శశికళ ప్రమాణాన్ని అడ్డుకోండి) ఏ పదవీ వద్దు: పన్నీర్ సెల్వం సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శశికళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పన్నీర్‌సెల్వం నియోజకవర్గం ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉండగా సీఎం పదవిని కోల్పోయిన పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు సన్నిహితులతో తెలిపారని సమాచారం. శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకునేది లేదని పన్నీర్‌సెల్వం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు శశికళ సిద్ధమవుతున్నారని సమాచారం. గవర్నర్ రాగానే కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత పోటీ చేయడానికి నియోజకవర్గాలను ఆమె అన్వేషిస్తున్నా రు. జయ ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్లో శశికళపై తీవ్ర వ్యతిరేకత ఉంది. (జయలలిత మృతిపై అపోలో సంచలన ప్రకటన) -
కట్టు తెంచుకున్న జల్లికట్టు
-
ఒకే సెల్ఫోన్లో రెండు సిమ్‌లు
ఏపీ, తెలంగాణలపై మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్య రాజాం: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఒకే సెల్ఫోన్లో రెండు సిమ్‌లు లాంటివని మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాల గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యా నించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో తెలుగుభాషను కాపాడుకోవాలన్నారు. 12వ తరగతి వరకూ తెలుగు భాషలోనే పాఠ్యాంశాలను బోధిస్తే బాగుంటుందని ఆయన ప్రభుత్వాలకు సూచించారు. మాధ్యమిక స్థాయి వరకూ తెలుగులో బోధన చేస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావ్యవస్థలోనూ, సమాజంలోనూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు ప్రపంచం చెప్పుకునేలా శాటిలైట్‌ను ప్రయోగిం చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ విద్యాసంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
కట్టు తెంచుకున్న జల్లికట్టు
• తమిళనాడు ఆర్డినెన్స్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం • నేడు ఆటను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం • సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటున్న నిరసనకారులు • అప్పటి వరకు మెరీనా బీచ్ నుంచి కదలబోమని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుకుని తిరిగి పూర్వవైభవంతో సందడి చేయనుంది. ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానుంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభిస్తారు. ఆట కోసం 350 ఎద్దులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జల్లికట్టు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడం, బంద్‌తో రాష్ట్రం స్తంభించడంతో.. తమిళనాడు ప్రభుత్వ ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్రం శుక్రవారం ఆమోదించడం తెలిసిందే. మెరీనా బీచ్‌లో నిరసనలో ప్లకార్డు చేతపట్టుకున్న చిన్నారి జంతుహింస నిరోధక చట్టం–1960లోని ప్రదర్శన జంతువుల(పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం ఈ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనికి రాష్ట్రపతి తెలిపిన ఆమోదం శుక్రవారం రాత్రి తమకు చేరిందని, ఆటపై నిషేధం తొలగినట్లేనని సీఎం తెలిపారు. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ శాశ్వత పరిష్కారమని, దీని స్థానంలో బిల్లును, జంతుహింస నిరోధక చట్టానికి సవరణను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఆట విషయంలో మద్దతిచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఫోన్లోనూ కృతజ్ఞతలు తెలిపారు. ఆగని నిరసనలు ఆర్డినెన్స్‌పై జల్లికట్టు మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కావాలని, అంతవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వత పరిష్కారం లభించేంతవరకు బీచ్ నుంచి కదలబోమని అక్కడున్న 2 లక్షల మంది ఉద్యమకారులు చెప్పారు. జల్లికట్టుకు మద్దతుగా వళ్లువర్‌కోట్టంలో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ నిరాహార దీక్ష చేశారు. అన్ని యత్నాలూ చేస్తున్నాం: మోదీ తమిళ ప్రజల సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. సుసంప్ననమైన తమిళనాడు సంస్కృతిని చూసి గర్వపడుతున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పెటాకు సూర్య నోటీసులు జల్లికట్టుకు తాను మద్ధతు ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థ (పెటా) నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు సూర్య స్పందించారు. జల్లికట్టు పోరాటానికి సూర్య వంత పాడటం ఆశ్చర్యంగా ఉందని, తన సినిమా ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నారని సంస్థ నిర్వాహకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సూర్య తన న్యాయవాది ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపారు. -
విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగించాలి
- ఇంటర్ వరకు మాతృభాషలోనే బోధన చేయాలి - సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి - విశ్వవిద్యాలయాల్లో సైన్స్ పరిశోధనను ప్రోత్సహించాలి - తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సూచన యూనివర్సిటీ క్యాంపస్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కల్పించాలని, సైన్స్ టీచర్లు ఈ బాధ్యత తీసుకోవాలని, ఇంటర్ వరకు మాతృభాషలోనే బోధన జరగాలని తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ ప్రైజ్‌లు సాధించే శాస్త్రవేత్తలకు రూ. 100 కోట్ల నగదు బహుమతి అందిస్తా మని ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. మనదేశంలో పుణే, ముంబై ఐఐటీ, మద్రాస్‌లోని సత్యభామ వర్సిటీకి చెందిన విద్యార్థులు ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించారని, ఎస్వీయూ నుంచి ఎందుకు ఉపగ్రహాలను ప్రయోగించలేకపోయారని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఎస్వీయూ విద్యా ర్థులు కూడా ఉపగ్రహాలను ప్రయోగించాలని, ఆ దిశగా ప్రభుత్వం వనరులు సమకూర్చాలని సూచించారు. మనదేశంలో ప్రధాన సమ స్యలైన పేదరికం, ఆకలి, అభద్రత, వ్యాధులకు సంబంధించిన నివారణపై శాస్త్రవేత్తలు పరి శోధనలు కొనసాగించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పరిశోధనలు ప్రోత్సహిస్తే నోబెల్ బహుమతులు సాధించ వచ్చని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు ప్రాధాన్యత పెంచాలని, ప్రతి విశ్వవిద్యాలయం ఏడాదికి ఒకసారి సైన్స్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు. అత్యంత ఖరీదైన బహుమతి గెలుచుకోండి నోబెల్ సాధించే ఏపీకి చెందిన శాస్త్రవేత్తకు రూ. 100 కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటిం చారని, ప్రపంచంలో ఎక్కడా ఇంతఖరీదైన నగదు బహుమతి లేదని కేంద్ర మంత్రి వై.సుజనా చౌదరి పేర్కొన్నారు. బహుమతి సాధించే అంశం(బంతి) శాస్త్రవేత్తల కోర్టులోనే ఉందని, గట్టి ప్రయత్నం చేసి సాధించాలని పిలుపునిచ్చారు. ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగిన సైన్స్ కాంగ్రెస్‌కు 6 మంది నోబెల్ శాస్త్రవేత్తలు వచ్చారని, అనేక అంశా లపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ 104వ సైన్స్ కాంగ్రెస్ ఎస్వీయూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా, బొజ్జల, ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు, ఎస్వీయూ వీసీ దామోదరం, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఉన్నత విద్యామండలి ముఖ్య కార్యదర్శి సునీతాదావ్రా పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో విజ్ఞాన జ్యోతిని వచ్చే ఏడాది సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించే ప్రొఫెసర్ అచ్చుత సమంతాకు అందజేశారు. డీఆర్డీవోకు బహుమతి ఎస్వీయూలో సైన్స్ కాంగ్రెస్ సంబంధించి నిర్వహించిన మెగా ఎగ్జిబిషన్లో అన్నిటికన్నా ఎక్కువ ఆకట్టుకున్న డీఆర్ డీవో ప్రదర్శనకు బహుమతి లభించింది. డీఆర్డీవో సంస్థ అగ్ని, శౌర్య, ఆకాశ్ తదితర క్షిపణులతోపాటు పలురకాల అంతరిక్ష నౌకలు, మిస్సైల్స్‌ను ప్రదర్శిం చింది. వీటికి ఎక్కువ మంది ఆదరణ లభించడంతో ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్త నాగేశ్వరరెడ్డి అవార్డు అందుకు న్నారు. ఈయన ఎస్వీయూ పూర్వ విద్యార్థి కావడం విశేషం. అలాగే ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డీఎస్టీ, విట్, నిట్, జీఐఎస్, మినస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎఫ్ఎస్ఎస్ఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు కూడా పలు అవార్డులు అందుకున్నాయి. -
’గోవుల రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’
హైదరాబాద్ : గోవులను సంరక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి ఉండేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్‌రావు సూచించారు. లవ్ ఫర్ కవ్ పౌండేషన్, ప్రాణిమిత్ర రమేష్జాగిర్ధార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి గోవుల సంరక్షణ కోసం చట్టాలు పటిష్టం చేయాలని గవర్నర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి రిధేష్జాగిర్ధార్ మాట్లాడుతూ....గోవుల సంరక్షణ కోసం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశంలోని మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి వారికి గోవుల ప్రాధాన్యం, రక్షణ, సంక్షేమం కోసం విన్నవిస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రజాప్రతినిధి సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో గోమాతను పెంచుకుని వాటికి నిత్యపూజలు, నైవేధ్యాలు సమర్పిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. -
విద్యాసాగర్‌రావుకే ఇక పూర్తి బాధ్యత?
చెన్నై : తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఇక, పూర్తి బాధ్యతలు అప్పగించేనా అన్న ప్రశ్న మొదలైంది. ఇందుకు తగ్గ కసరత్తులు ఢిల్లీలో సాగుతున్నట్టుగా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇక, హిజ్ ఎక్సలెన్సీ అన్న పదాన్ని వాడొద్దు అని, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అంటూ విద్యాసాగర్‌రావు ఆదేశాలతో రాజ్‌భవన్ ప్రకటన జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసినానంతరం ఇన్చార్జ్ గవర్నర్‌గా బాధ్యతల్ని విద్యాసాగర్‌రావు స్వీకరించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్‌గా పూర్తి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, ఇన్చార్జ్గా తమిళనాడు గవర్నర్‌గా అదనపు భారాన్ని తన భుజాన విద్యాసాగర్‌రావు మోస్తూ వచ్చారు. అయితే, ఇక్కడ పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాల్సిన అవసరం ఉండడంతో, పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆచరణలో సాధ్యమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ పేరు ఖరారైనట్టుగా ప్రచారం కూడా సాగింది. అయితే, ఇతరులకు కొత్తగా పూర్తి బాధ్యతల్ని అప్పగించడం కన్నా, ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పూర్తి బాధ్యతల్ని అప్పగించే దిశలో ఢిల్లీ స్థాయిలో కసరత్తులు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, పూర్తి స్థాయిలో గవర్నర్ పగ్గాలు విద్యాసాగర్‌రావుకు అప్పగించినట్టే అన్నట్టుగా తమిళ మీడియా వార్తలు, కథనాలను వెలువరించే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ వార్తలు, కథనాలకు బలం చేకూరే రీతిలో రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడడం గమనార్హం. సాధారణంగా గవర్నర్ పేరుకు ముందుగా హిజ్ ఎక్సలెన్సీ అన్న పదాన్ని ఉపయోగించడం జరుగుతూ వస్తున్నది. అయితే, ఇక ఆ పదాన్ని ఉపయోగించ వద్దు అని, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అన్నట్టుగా ఆ ప్రకటన వెలువడడం విశేషం. ప్రభుత్వ వ్యవహారాలు, కార్యక్రమాలు సంబంధించిన లేఖలు తదితర అంశాల్లో గౌరవనీయులు అని వాడితే చాలు అని సూచించడం గమనార్హం. -
తమిళనాడు పాలనపై గవర్నర్ ఆరా
* ఇద్దరు సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో భేటీ * జయ ఆరోగ్యంపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్న రాహుల్ సాక్షి, చెన్నై: తమిళనాడులో రోజువారీ సాధారణ పరిపాలనపై ఇద్దరు రాష్ట్ర సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం చర్చించారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై ఆరా తీశారు. రెండు వారాలుగా జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో భేటీ జరిగింది. జయ ఆరోగ్యంపై సమావేశమయ్యారా? లేక సీఎం మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తారా? అని ఊహాగానాలు వచ్చాయి. వాటికి తెరదించుతూ... రాష్ట్రంలో దైనందిన పాలన, ప్రభుత్వ వ్యవహారాలపై గవర్నర్ ఆరాతీశారంటూ రాజ్‌భవన్ తెలిపింది. పరిపాలనా వ్యవహారాలపై గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శి పి.రామమోహనరావు వివరించారని, ఇతర అంశాలూ చర్చకు వచ్చాయని ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్‌ను ఒంటరిగా కలసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... సాయంత్రం మంత్రులతో పాటు మరోసారి కలిశారు. జయ ఆరోగ్యం గురించి ఆమె విధేయుడు, మంత్రి పన్నీర్‌సెల్వం, మరో మంత్రి పళనిస్వామిల్ని గవర్నర్ వాకబు చేశారు. జయ ఆస్పత్రిలో చేరాక సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో గవర్నర్ చర్చలు జరపడం ఇదే తొలిసారి. కావేరిపై ఏర్పాటైన సాంకేతిక బృందం గురించి మంత్రుల్ని గవర్నర్ ప్రశ్నించారని రాజ్‌భవన్ పేర్కొంది. అండగా ఉంటాం..రాహుల్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారమిక్కడి అపోలో ఆస్పత్రికి వెళ్లి జయ ఆరోగ్యంపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. జయకు తనతో పాటు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సీఎం కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారన్నారు. -
ఉత్కంఠ
• రాజ్‌భవన్‌లో రాష్ట్ర మంత్రులు • గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు • రెండుసార్లు వెళ్లిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు • కావేరీ వివాదంపైనేనని రాజ్‌భవన్ వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ అది చెన్నైలోని గిండి. అక్కడే రాష్ట్ర గవర్నర్ నివసించే రాజ్‌భవన్. ప్రశాంత వాతావరణం. అకస్మాత్తుగా పోలీసుల హడావుడి. రాజ్‌భవన్ వద్ద సెక్యూరిటీ అలర్ట్. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు కారు రాక. 35 నిమిషాల తరువాత సీఎస్ నిష్ర్కమణ. యథావిధిగా ప్రశాంతం. సాయంత్రం 6.10 గంటల వేళ మళ్లీ పోలీసుల హడావుడి. రాజ్‌భవన్ ప్రవేశద్వారంలో పోలీసుల మోహరింపు. ఎవరొస్తున్నారోనని ఎదురుచూపులు. మంత్రులు పన్నీర్ సెల్వం, ఎడపాడి పళనిస్వామితోపాటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు రాజ్‌భవన్‌లోకి మళ్లీ ప్రవేశం. 30 నిమిషాలపాటు సమాలోచనలు. ఇక అంతే పుకార్లు షికారు చేశాయి. అమ్మ అనారోగ్యంపై ప్రభుత్వం అప్రమత్తమైంది.. కాదు సీఎంకు సుస్తీ చేసినందున ఉప ముఖ్యమంత్రి పదవిని సిద్ధం చేయనున్నారు.. అదేం లేదు మంత్రి వర్గాన్ని పునర్వవ్యస్థీకరించి తాత్కాలికంగా సీఎం పదవిని సీనియర్ మంత్రికి అప్పగిస్తారు...ఇలా సుమారు ఐదు గంటలపాటు ఉత్కం ఠ భరిత వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో రాజ్‌భవన్ ఒకప్రకటన చేయనుంది, అప్పటి వరకు ఓర్పు వహించండని ఓదార్పు మాటలు. అపోలో ఆసుపత్రిలో సీఎం జయలలిత గత 16 రోజులుగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా గవర్నర్‌తో మంత్రులు, ప్రధాన కార్యదర్శి సమావేశం కావడం నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. కావేరీ కోసమే.. కావేరీ జలాల వివాదంపై చర్చించేందుకు హైలెవల్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించినట్లు శుక్రవారం రాత్రి రాజ్‌భవన్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కావేరీ అంశంతోపాటూ సీఎం జయలలిత ఆరోగ్యం గురించి గవర్నర్ వాకబు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఎడతెగని ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రపతి పాలనకు పరిశీలన: స్వామి సూచన తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. ఆరునెలల పాటూ రాష్ట్రపతి పాలన విధించిన పక్షంలో జయలలిత సరైన వైద్యసహాయాన్ని అందుకుని సంపూర్ణఆరోగ్యంతో బైటపడగలరని ఆయన పేర్కొన్నారు. -
ఆస్పత్రిలోనే అమ్మ...
-
ఆస్పత్రిలోనే అమ్మ!
మరికొన్నాళ్లు చికిత్స అవసరం - జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాల వివరణ - తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలో అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు - ఆస్పత్రిలో జయను పరామర్శించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై: పదిరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత (68) కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. జ్వరం, డీ హైడ్రేషన్ సమస్యలతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన జయ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు, పార్టీ కార్యాలయం ఏ ప్రకటన చేయకపోవటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే శనివారం సాయంత్రం జయను పరామర్శించిన తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, వైద్యుల సంరక్షణలో ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా రెండ్రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసింది. ‘వైద్యుల చికిత్సకు సీఎం బాగానే స్పందిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించాం. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంటే అన్నీ కుదురుకుంటాయి. త్వరలోనే జయ పూర్తిస్థాయిలో కోలుకుంటారు’ అని అపోలో సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. మరోవైపు, లండన్ నుంచి వచ్చిన ఇంటెన్సిటివ్ నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బేల్ నేతృత్వంలో వైద్యుల బృందం జయకు చికిత్సనందిస్తోంది. సర్కారు అంతా ఆస్పత్రి వద్దే..: సీఎం ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వెల్లువెత్తటంతో ఆస్పత్రి వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలతోపాటు అభిమానులు క్యూ కట్టారు. మంత్రులు, పార్టీ కీలక నేతలు, సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులంతా ఆస్పత్రి వద్దే ఉన్నారు. ఆస్పత్రి వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆస్పత్రి నుంచే పాలన..: జయ వైద్యుల సంరక్షణలో కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి పి. వళరమతి తెలిపారు. ‘అమ్మ బాగానే ఉన్నారు. చికిత్స పొందుతూనే ఆస్పత్రి నుంచే పాలనను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులనూ ప్రకటించారు. కొందరు గిట్టనివారు అమ్మ ఆరోగ్యంపై అనవసరంగా పుకార్లు పుట్టిస్తున్నారు’ అని తెలిపారు. వారం రోజులుగా అపోలో ఆస్పత్రి నుంచే సర్కారు అధికారిక ప్రెస్నోట్లు విడుదలవుతున్నాయి. జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలను గమనిస్తున్నట్లు తెలిసింది. డాక్టర్లు మాత్రం జయ పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి చేరవేస్తున్నారు. అయితే జయను పరామర్శించి వచ్చిన నేతలు మాత్రం.. ఆమె కోలుకుంటున్నారని.. త్వరలోనే ఆరోగ్యంగా పోయెస్ గార్డెన్‌కు వస్తారని ప్రకటిస్తున్నారు. డాక్టర్లు సూచించినట్లుగా కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నాడీఎంకే ప్రతినిధి రామచంద్రన్ తెలిపారు. జయ కోలుకుంటున్నారు: గవర్నర్ జయలలితను ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పరామర్శించారు. జయ ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గవర్నర్ పరామర్శించటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 35 నిమిషాల సేపు ఆసుపత్రిలోనే ఉన్న గవర్నర్‌కు అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి.. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్సను వివరించారు. ‘జయలలిత కోలుకుంటున్నారు. ఆమెకు అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తిగా ఉంది’ అని రాజ్‌భవన్ నుంచి విడుదలైన ప్రకటనలో గవర్నర్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారా? జయలలిత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. రాజకీయ సమస్యలు, కోర్టు కేసులు, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడూ జయ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని తమిళనాడు సర్కారు కోర్టును కోరింది. చాలా కాలంగా అమ్మ మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఉదయం నుంచి టెన్షన్.. టెన్షన్ పదిరోజులుగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నా.. శనివారం మాత్రం చెన్నైలో హైడ్రామా నడిచింది. శనివారం మధ్యాహ్నం నుంచి అమ్మను సందర్శించేందుకు ఆస్పత్రికి వీఐపీలు పెద్ద సంఖ్యలో రావటంతో అభిమానుల్లో ఆందోళన రెట్టింపైంది. దీంతోపాటు మీడియాలో రకరకాల వార్తలు రావటంతో ఆస్పత్రికి అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల తాకిడి పెరిగింది. అమ్మ ఆరోగ్యంపై వదంతులను ప్రచారం చేస్తున్న పలువురిపై పోలీసులు కేసులు పెట్టారు. ఫ్రాన్స్‌లోని తమిళచ్చి అనే ఓ యువతి.. ఫేస్బుక్లో పెట్టిన అభ్యంతరకరమైన పోస్టుతో.. ఆమెపై సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. జయ ఆరోగ్యంపై పదిరోజుల్లో 3 బులెటిన్లే విడుదలవటం, రెండ్రోజులుగా ఆస్పత్రి వర్గాలుఏమీ చెప్పకపోవటంతో అమ్మ అభిమానుల్లో ఆందోళన ఎక్కువైంది. దీంతో వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు రేయింబవళ్లు ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. -
జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్ రావు శనివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలిత కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు ఈ ప్రకటన వెలువరించారు. జయలలిత త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు. (తమిళనాట సర్వత్రా ఉత్కంఠ!) జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి చైర్మన్ పత్రాప్ రెడ్డి తనకు వివరించారని గవర్నర్ తెలిపారు. జయలలితకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రకటనతో జయలలిత ఆరోగ్యంపై ఆమె అభిమానుల్లో ఆందోళన కొంత తగ్గింది. -
గవర్నర్ కు మర్యాదపూర్వక ఆహ్వానం..
చెన్నైః తమిళనాడు, పుదుచ్చేరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ అలోక్ భట్నాగర్.. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ఓ మర్యాదపూర్వక సమావేశానికి ఆహ్వానించినట్లు రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. అలాగే తాత్కాలిక గవర్నర్ గా నియమితులైన సీ హెచ్ విద్యాసాగర్ రావును అభినందించేందుకు ఆర్కాట్ ప్రిన్స్ నవాబ్ మొహమ్మద్ అబ్దుల్ అలి సైతం ఆహ్వానించినట్లు మరో ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు గవర్నర్ గా ఉన్న కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగియడంతో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు నియమితులైన విషయం తెలిసిందే. -
కథను నమ్మి తీశారు
‘‘ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తీసిన తీరు అభినందనీయం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది’’ అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. నూతన నటీనటులతో మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకంపై నిశాంత్ పుదారి దర్శకత్వంలో పుదారి అరుణ నిర్మించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఇటీవల ప్రముఖ గాయని పి.సుశీల చేతుల మీదుగా ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం తొలి కాపీని దర్శక-నిర్మాతలు విద్యాసాగర్ రావుకు చూపించారు. ‘‘పాటలన్నీ బాగున్నాయి. కథను నమ్మి ఈ చిత్రం తీశారు. మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’ అని విద్యాసాగర్ రావు అన్నారు. ‘‘మార్చి 4న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బివి అమర్నాథ్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
విద్యాసాగర్‌రావు ఉనికి పుస్తకావిష్కరణ
-
విద్యాసాగర్‌రావు 'ఉనికి' పుస్తకావిష్కరణ
హైదరాబాద్ : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు రచించిన 'ఉనికి' పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత జానారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ చేతుల మీదగా పుస్తకం తొలి ప్రతిని ప్రణబ్ అందుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ విద్యాసాగర్‌రావుతో తనకు 30 ఏళ్ల స్నేహం ఉందని, ఆనాడు ప్రతిపక్షంలో విద్యాసాగర్‌రావు హుందాగా వ్యవహరించారన్నారు. 'ఉనికి' పుస్తకంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, అయితే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు పలువురు హాజరు కావటమే ఉనికికి ఓ 'ఉనికి' ఏర్పడిందని సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు. పలు పత్రికల్లో తాను రాసిన వ్యాసాలను సంకలనం చేసి ఈ పుస్తకం వేయటం జరిగిందన్నారు. -
రైతు కన్నీళ్లు తడుస్తాం..
- రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ విద్యాసాగర్‌రావు - కేంద్రం రూ. 2 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు వెల్లడి - ఘనంగా అవతరణ దినోత్సవం - అమరులకు ప్రముఖుల నివాళి సాక్షి, ముంబై: అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 కోట్ల ప్యాకేజీ మంజూరు చేసిందని గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాథలైన వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు. ఇందుకోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. గ్రామాల్లోని ప్రజల సహకారంతో వర్షపు నీటిని భద్రపరచుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నాసిక్‌లో జరిగే కుంభమేళాకు వచ్చే లక్షలాది భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిమగ్నమైందని వివరించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దివంగత మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ పేరుతో ‘ప్రమోద్ మహాజన్ కౌసల్య వికాస్ యోజన’ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మేయర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. అమర వీరులకు ఘన నివాళి రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘన నివాళి అర్పించారు. అమరవీరుల స్తూపానికి ప్రముఖ రాజకీయ నేతలంతా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నగరంలోని హుతాత్మ చౌక్(అమరవీరుల స్మృతి చిహ్నం) వద్ద మేయర్ స్నేహల్ అంబేకర్, బీజేపీ, శివసేన మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే సునీల్ తట్కరే, ప్రకాశ్ బిన్సాలే, పార్టీ ముంబై మహిళా శాఖ అధ్యక్షురాలు చిత్ర వాఘ్, సంజయ్ తట్కరే తదితర నాయకులు, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు అశోక్ చవాన్, శివసేన నాయకురాలు నీలం గోర్హే, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠావలే తదితరులు నివాళులర్పించారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, ముంబై: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ ప్రసంగించారు. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మద్దతు కోసం వేచి చూడకుండా రూ. నాలుగు వేల కోట్ల ఇందుకోసం కేటాస్తామన్నారు. కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రం శాశ్వత పరిష్కారాలు ఎంచుకుందని, ఇందుకోసం ‘జల్యుక్త్ శివార్’ యోజన పథకాన్ని చేపడుతున్నామని, 2019 తర్వాత కరవు ప్రాంతం ఉండదన్నారు. మైక్రో నీటి పారుదలకు ప్రాధాన్యం ఇస్తామని, తద్వారా సాగుక్షేత్రం పెరుగుతుందన్నారు. ప్రతి ఏటా సుమారు అయిదు వేల గ్రామాలకు కరవు నుంచి విముక్తి కలిగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా 2015-16లో గ్రామీణ ప్రాంతాల్లో 14.15 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డ్ నుంచి రూ. 450 కో ట్ల రుణం తీసుకుంటామన్నారు. 1200 ఎకారల్లో టెక్స్టైల్ హబ్ అయిదు లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించే విషయమై పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అమరావతి నాంద్‌గావ్ పేట్లో 1200 ఎకరాల స్థలంలో టెక్స్టైల్ హబ్ నిర్మిస్తామన్నారు. మరాఠీ భాష భవనం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం నిర్మాణం కోసం ఇందు మిల్లు స్థలాన్ని కేంద్రం నుంచి పొందేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నామన్నారు. లండన్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసాన్ని అంతర్జాతీయ స్మారకంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దివంగత ప్రజా నాయకుడు గోపీనాథ్ ముండేకు ఔరంగాబాద్‌లో, రాజ్‌మాతా జిజావు స్మారకాన్ని ఆమె జన్మస్థలం సిందఖేడ్ రాజాలో స్మారకాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసి చుట్టుపక్కల 600 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో ‘నైనా’ పేరుతో అత్యాధునిక నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. పుణే, ముంబైలలో సీసీటీవీ కెమెరాలను అమర్చే పనులు జరుగుతున్నాయని, ముంబైలో 90 వారాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం పూర్తవుతుందని చెప్పారు. -
బడ్జెట్ సమావేశాలు
సాక్షి ముంబై: అనుకున్నట్టే బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అయితే కొద్దిసేపటికే ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. అనంతరం దివంగత ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్, దివంగత సీనియర్ కమ్యూనిస్ట్ నేత గోవింద్ పాన్సరే, దివంగత శివసేన ఎమ్మెల్యే బాలా సావంత్ తదితరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ అసెంబ్లీ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్ర గవర్నర్ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి వల్ల రైతులు విలవిల్లాడుతోంటే.. వారికి కనీస మద్దతు లభించలేదని విపక్ష సభ్యులు విమర్శించారు. సీనియర్ కమ్యూనిస్టు నేత గోవింద్ పాన్సరే హత్య కేసులో ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ‘అమ్హీ సారే పాన్సరే’ (మేమందరం పాన్సరేలం) అంటూ నినాదాలు చేశారు. పాన్సారే హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇచ్చిన తేనేటి విందును బహిష్కరించిన విపక్షాలు... మొదటి రోజు దూకుడుతో వ్యవహరించాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చండి... -అజిత్ పవార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు పూర్తి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు, వడగళ్ల వర్షం, పాన్సరే హత్యతో పాటు ముస్లిం రిజర్వేషన్ రద్దు, ధన్గర్ రిజర్వేషన్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి.... -ధనంజయ్ ముండే గత మూడు నెలల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వంపై 302 సెక్షన్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వీరంగం సృష్టిస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం పడకలు కూడా లేవని ఆయన ఆరోపించారు. టామీ ఫ్లూ టాబ్లెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని..ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని విమర్శించారు. -
గవర్నర్‌ను కలసిన ముంబై టీఆర్ఎస్, టీజేఏసీ నేతలు
- పలు సమస్యలు పరిష్కరించాలని వినతి - సానుకూలంగా స్పందించిన విద్యాసాగర్‌రావు సాక్షి, ముంబై: రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ముంబై టీ-జేఏసీ, టీఆర్ఎస్ ప్రతినిధులు రాజ్‌భవన్‌లో కలసి పలు అంశాలపై చర్చించారు. మహారాష్ట్ర కాంగార్ వెల్ఫేర్ బోర్డులో తెలుగు నాకా కార్మికుల రిజిస్ట్రేషన్ కావడం లేదనీ, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని టీఆర్ఎస్ ముంబై శాఖ అధ్యక్షుడు బి.హేమంత్ కుమార్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్మికుల రక్షణ కోసం ఐడీ కార్డులు, స్కిల్డ్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి వలస జీవులు తెచ్చుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను గుర్తింపునిచ్చి, స్థానిక కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని హేమంత్‌కుమార్ కోరారు. వీటన్నిటిపై సానుకూలంగా స్పందించిన సీహెచ్ విద్యాసాగర్ రావు ముంబై నాకా కార్మికుల రిజిస్ట్రేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నాకా కార్మికులకు ముంబై-భీవండీలో రక్షణ కరవైందని, వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంటీజేఏసీ వైస్ చెర్మైన్ కె.నర్సింహగౌడ్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బొల్లె, సుంక అంజయ్య మాదిగ, ఎంటీజేఏసీ చెర్మైన్ మూల్ నివాసి మాల, కన్వీనర్లు గాజుల మహేష్, కె.సురేష్ రజక్, ఎన్.లక్ష్మన్ మాదిగ, టీ.రాములు గంగపుత్ర, ఎం.శ్రీనివాస్ బెస్త, బోగ సుదర్శన్ పద్మశాలి, కొమ్ము అంజన్న, ఉప్పు భూమన్న, సిరిమల్లె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
బోధనా పద్దతుల్లో మార్పుతేవాలి: గవర్నర్
ముంబై: నిర్లక్ష్యానికి గురవుతున్న ఉన్నత విద్యలో సమూల మార్పులు తేవాలని, వినూత్న రీతిలో పిల్లలతో మమేకమై ఉపాధ్యాయులు బోధించాలని గవర్నర్ సి. విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. ఇక్కడి కేసీసీ కళాశాల డైమండ్ జూబ్లీ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘గత రెండు దశాబ్దాలుగా మనం వాణిజ్య, వర్తక వ్యాపారాల్లో ప్రపంచీకరణ చూశాం. కాని, ఇప్పటి వరకు ప్రపంచీకరణ ఫలితాలను ఉన్నత విద్యలో చూడలేకపోయాం. ముఖ్యంగా పరిశోధనలు, బోధనా పద్ధతుల్లో ఎన్నో లోపాలున్నాయి’ అని విద్యాసాగర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా మహారాష్ట్రలోని విద్యా సంస్థలు పరిశోధనాత్మకంగా ఉండేలా బోధనా పద్ధతులు ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. పిల్లల్లో సామాజిక దృక్పథం ఏర్పడేలా ప్రోత్సహించి వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరా రు. కార్యక్రమంలో పాల్గొన్న బారిష్టర్ రాం జఠ్మలానీ, ప్రకాశ ఝా, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, సినీ ప్రముఖులు అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, బోమన్ ఇరానీ, విద్యా బాలన్ తదితరులకు విద్యాసాగర్ రావు జ్ఞాపికలు అందజేశారు. -
ముంబై మారథాన్‌కు భారీస్పందన
జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు సాక్షి, ముంబై: నగరంలో ఆదివారం ఉదయం జరిగిన స్టాండర్డ్ చాటర్డ్ మారథాన్‌లో ఇథోపియా దేశానికి చెందిన అథ్లెట్లు విజయకేతనం ఎగురవేశారు. ఏకంగా ఐదు పతకాలు పురుష, మహిళ అథ్లెట్లు దక్కించుకున్నారు. ఈసారి ముంబై మారథాన్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రారంభం నుంచి ఉత్కంఠ నెలకొంది. ఇథోపియా, కేనియా దేశాల మధ్య గట్టి పోటీ కనిపించింది. ఈ మారథాన్‌ను అజాద్మైదాన్వద్ద ఏర్పాటుచేసిన వేదికపై రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు జెండా చూపించి ప్రారంభించారు. ఫుల్ మారథాన్‌లో పురుష విభాగంలో కాంస్య (బ్రాంజ్) పతకం మినహా మిగతా ఐదు పతకాలు (పురుష విభాగంలో రెండు, మహిళా విభాగంలో మూడు) ఇథోపియా అథ్లెట్లు దక్కించుకున్నారు. మొత్తం 42 కి.మీ. దూరాన్ని (పురుష విభాగంలో) ఇథోపియాకు చెందిన తేజ్ఫాయే అబేరా 2.9.46 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. అలాగే డెరేజ్ డెబెలెన్ 2.10.31 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. కేనియాకు చెందిన బ్ల్యూక్ కిబెట్ 2.10.57 సెక్లన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఫుల్ మారథాన్‌లో 42 కి.మీ. దూరాన్ని (మహిళ విభాగం) డిన్కేష్ మెకాష్ 2.30 నిమిషాల్లో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచి 41వేల డాలర్ల బహుమతిని చేజిక్కించుకున్నారు. గత ఏడాది నిర్వహించిన మారథాన్‌లో కూడా ఆమె ఇలాగే మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన కుమేషీ సిచాలాకు 2.30.56 సెకన్ల సమయం పట్టగా మూడో స్థానంలో నిలిచిన మార్టీ మెగారాకు 2.31.45 సెకన్ల సమయం పట్టింది. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైపై ఇప్పటికే ఉగ్రవాదుల దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో మారథాన్‌లో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. క్విక్ రెస్పాన్స్ టీం, బాంబు నిర్వీర్యృబందం, రాష్ట్ర భద్రత దళాలను నియమించారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి మార్గదర్శనంలో మారథాన్ వెళ్లే రహదారి వెంబడి అడుగడుగున పోలీసులను మోహరించారు. ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)కు కూతవేటు దూరంలో ఉన్న ఆజాద్‌మైదాన్ నుంచి ఆదివారం ఉదయం ముంబై మారథాన్ ప్రారంభమైంది. బాంద్రా నుంచి తిరిగి (42 కి.మీ.) ఆజాద్మైదాన్కు చేరుకుంది. ఇందులో ఫుల్, ఆఫ్ మారథాన్ ఉండగా సుమారు నాలుగు వేలకుపైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అథ్లెట్లు సుమారు 150 వరకు ఉండగా 290 మంది వికలాంగులు ఉన్నారు. మిగతా వారిలో ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, పలువురు సినీ నటీ, నటులు, బుల్లి తెర నటులు, సీనియర్ సిటిజన్లు, ముంబై పోలీసు శాఖకు చెందిన సిబ్బంది ఉన్నారు. -
ముంబై ఎప్పటికీ ‘మహా’భాగమే
అసెంబ్లీలో సీఎం ఫడ్నవిస్ నాగపూర్: మహారాష్ట్ర నుంచి ముంబై మహానగరాన్ని ఎవరూ ఎప్పటికీ విడదీయలేరని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై సోమవారం సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నగరం త్వరితంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే తాను ప్రధాని నేతృత్వంలో ముంబై కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని సూచించానే తప్ప వేరే ఉద్దేశమేదీ లేదని వివరించారు. ఏ శక్తీ రాష్ట్రం నుంచి ముంబైని వేరుచేయలేదని ఆయన ఉద్ఘాటించారు. రైల్వే, గృహ నిర్మాణ తదితర శాఖలకు చెందిన ఫైళ్లతో పాటు నగరానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒకవేళ ప్రధాని నేతృత్వంలో కమిటీ ఏర్పడితే, వీటి అనుమతులు శీఘ్రగతిలో లభించే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని రోజుల కిందట సీఎం మాట్లాడుతూ.. ‘ముంబై దేశ ఆర్థిక రాజధాని.. ఈ నగరం అభివృద్ధి కుంటిపడితే, దేశాభివృద్ధి కుంటుపడినట్లే. ప్రస్తుతం నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర సంస్థల మధ్య సమన్వయం సాధించడం అవసరం. ఈ నేపథ్యంలో ముంబై అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ముంబై అభివృద్ధి కమిటీని ఏర్పాటుచేయడం ఎంతైనా అవసరం..’ అని అన్న విషయం తెలిసిందే.ఇదిలాఉండగా, బీఎంసీలో పనిచేస్తున్న పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి గృహ నిర్మాణ పథకం అమలు చేసేందుకు యోచిస్తున్నామని సీఎం ఫడ్నవిస్ తెలిపారు. అలాగే సెక్రటేరియట్ స్థాయి అధికారుల వద్ద నుంచి అధికారాల వికేంద్రీకరణ చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 19న శివాజీ మెమోరియల్‌కు భూమిపూజ.. ముంబై తీరంలో నిర్మించతలపెట్టిన శివాజీ స్మారకానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భూమిపూజ నిర్వహించనున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ స్మారక నిర్మాణానికి సంబంధించి ఎన్నో యేళ్లుగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అనుమతులు సాధిస్తామని చెప్పారు. అలాగే ముంబైలోని ఇందూ మిల్స్‌లో అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత డీఎఫ్ ప్రభుత్వం దీనికోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ, అనుమతులు సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అలాగే కోస్టల్ రోడ్ సాధించడంలోనూ మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఫైళ్లకూ అనుమతులు సాధించేందుకు కృషిచేస్తుందని హామీ ఇచ్చారు. పుణేను రాష్ట్ర ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని వివరించారు. అలాగే వివిధ నగరాల్లో నీటి సమస్య పరిష్కారానికి కూడా త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. -
కరువు కోరల్లో మరాఠ్వాడా
సాక్షి, ముంబై: మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావుతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్షనాయకుడు ఏక్నాథ్ షిండే సహా ఆ పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మరాఠ్వాడాలో కరువు పీడిత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలతో కలిసి రెండు రోజుల పాటు మరాఠ్వాడా ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ బృందం మరాఠ్వాడాలోని బాధితులతో ప్రత్యక్షంగా భేటీ వారి బాధలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురువారం ఉదయం గవర్నర్‌ను కలిసి మరాఠ్వాడా కరువు పరిస్థితిపై నివేదిక సమర్పించారు. ఆ ప్రాంతంలో కరువు రావడం వరుసగా ఇది మూడో సంవత్సరమని, అక్కడి ప్రజలు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారని వివరించారు. వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో మొత్తం 8,536 గ్రామాలు ఉండగా అందులో 8004 గ్రామాల్లో కరువు తాండవిస్తోందని, వారందరికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని గవర్నర్‌కు విన్నవించారు. రైతులు తీవ్రంగా నష్టపోవడ ంవల్ల మరాఠ్వాడాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. విద్యార్థులందరి ఫీజులు, 10,12 తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు, రైతుల రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులకు నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరే విధంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. నష్టపోయిన రైతులకు తక్షణం ఎకరానికి కనీసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 183 నీటి ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలని, ఆ ప్రాంతానికి చెందాల్సిన నీటిని వెంటనే ఉజనీ, జైక్వాడి డ్యాంల నుంచి విడుదల చేయాలని కోరారు. కాగా, శివసేన విజ్ఞప్తికి గవర్నర్ స్పందిస్తూ త్వరలో మరాఠ్వాడా ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యక్షంగా రైతులతో భేటీ అయ్యి సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలూ విభేదాలు పక్కనబెట్టి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
పవర్లూమ్ సమస్యను పరిష్కరించండి
భివండీ, న్యూస్‌లైన్: పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును భివండీకి చెందిన పద్మశాలీ సంఘాలు కోరాయి. రాజ్ భవన్లో సోమవారం మధ్యాహ్నం భివండీకి చెందిన పద్మశాలీ సంఘాల సభ్యులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్థిరపడిన పద్మశాలీల్లో అధిక శాతం మంది పవర్లూమ్ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన పవర్లూమ్ ప్యాకేజీ కేవలం జైన్, మైనార్టీ, బడుగు కులాల వారికే లబ్ధిచేకూర్చేలా ఉందని, ఎస్బీసీలకు ఏమాత్రం ప్ర యోజనం కలిగించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్బీసీలకు చెందిన పద్మశాలీలకు కూడా ఈ ప్యాకేజీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భివండీలో తెలుగు ప్రజలు స్థిర పడిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తెలుగు పాఠశాలలు, ఆశ్రమశాల, కార్మికులకు ప్రత్యేక వైద్యశాలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా విన్నవించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అసంఘట్ పవర్లూమ్ విభాగ చైర్మన్, భివండీ పద్మనగర్ పవర్లూమ్ వివర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ పురుషోత్తం, అఖిల పద్మశాలి సమాజం కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, యెల్లె సాగర్ తదితరులు ఉన్నారు. -
‘సహకార’ నిబంధనల సరళీకరణ
ముంబై: రాష్ట్రంలో సహకార గృహ నిర్మాణ సంఘాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించనున్నట్లు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల్లో దీర్ఘకాలిక విధానాలను ప్రభుత్వం రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. విధానసభలో బుధవారం గవర్నర్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటివిధానాన్ని రూపొందించనున్నామన్నారు. అలాగే అడవులు, వన్యప్రాణ సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. విదర్భ, సహ్యాద్రి ఏరియాల్లోని పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు పునరావాస చర్యలను ముమ్మరం చేస్తామన్నారు. అలాగే ఆ ప్రాంతంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు తగిన కార్యాచరణ చేపడతామని గవర్నర్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ స్మార్ట్ సిటీలను అభివృద్ధిచేస్తామని స్పష్టం చేశారు. ముంబై మహానగరంలో రవాణావ్యవస్థను పటిష్టంచే యడానికి రోడ్లు, రైల్వే వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు కృషిచేస్తామన్నారు. ‘2022 వరకల్లా అందరికీ ఇళ్లు’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. మాడా, ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో, నాగపూర్ అభివృద్ధి ట్రస్ట్ వంటి ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ సంస్థల ద్వారా బహుళ అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి దిశలో శీఘ్రగతిన అడుగులు వేసేలా తమ ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. మరాఠీ మీడియం పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరాఠీ మీడియంనుంచి చాలా మంది పిల్లలు ఇంగ్లిష్ మీడియం వైపు తరలిపోతున్నట్లు సర్వేల్లో తేలిన నేపథ్యంలో మరాఠీ మీడియం పాఠశాలల్లోనే ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు పెంచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మాతృభాషలో విద్య ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే అందరికి నాణ్యమైన విద్యను అందించడం తమ లక్ష ్యమని వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలల స్థాయిని మదించేందుకు ‘స్టేట్ ఎక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్’ను ఏర్పాటుచేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. నాణ్యమైన ఉన్నతవిద్యను వీలైనంతమంది ఎక్కువమందికి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రెండు కొత్త ఐఐఐటీలు, ఒక ఐఐఎంను స్థాపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రను, శివాజీ కాలం నాటి ప్రాభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించే కోటల సంరక్షణకు కమిటీని నియమించనున్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాష్ట్రంలో సాంస్కృతిక, కళా రంగాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. -
మహారాష్ట్రలో అయిదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్!
-
మహారాష్ట్రలో అయిదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్!
ముంబై: మహారాష్ట్రలో అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు. శాసనసభలోకి వస్తున్న గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ ఘటనలో విద్యాసాగర్ రావు ఎడమ చేతికి గాయమైంది. ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచితంగా ప్రవర్తించిన అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు కూడా గాయపడినట్లు రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ బోండ్రే, అమర్ కాలే, రంజిత్ కాంబ్లే, విజయ్ వాడెట్టివార్, అబ్దుల్ సత్తార్లు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆయన తెలిపారు. క్షమాపణలు చెప్పడంతో ఈ సమస్య పరిష్కారం కాదని ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. ** -
తెలంగాణకు సంపూర్ణసహకారం
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు * సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం * సానుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నిస్తా.. * ఊరూరా గోదావరి జలాలు రావాలి.. ప్రజల కష్టాలు తీరాలి * కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యాసాగర్‌రావుకు ఘనంగా పౌర సన్మానం * ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై చొరవ చూపాలని కోరిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఊరూరా గోదావరి జలాలు రావాలి. ప్రజల కష్టాలు తీరాలి. సముద్రం లేదనే లోపాన్ని దూరం చేసుకునేలా గోదావరి నదిని నౌకాయానికి వీలుగా తీర్చిదిద్దాలి. ఈ రెండు సుసాధ్యమే. గోదావరి నీటితో తెలంగాణ లబ్ధి పొందేలా మహారాష్ట్ర గవర్నర్‌గా నాకున్న అధికారాలను వినియోగిస్తాను. అక్కడి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తాను’’ అని ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారమిక్కడ ఆయనకు పౌర సన్మానం నిర్వహించింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ తదితరులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగరరావు మాట్లాడుతూ... ఎంతో విలువైన గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులు సాఫీగా పూర్తయ్యేందుకు వీలుగా.. మహారాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌గా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ పౌరసన్మానం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ‘‘ఇప్పుడు కొందరు నేతలు వింతగా వ్యవహరిస్తుంటారు. ఆ మధ్య కేసీఆర్ సింగపూర్ వెళ్తే... ఓ నేత నాదగ్గరకొచ్చి ‘అన్నా... కేసీఆర్ ఆరోగ్యం బాగోలేనట్టుంది. అందుకే విదేశాలకెళ్తున్నారు. గతంలో కేసీఆర్ కాళ్లు బాగా ఊపుతుండేవారు.. ఈ మధ్య బాగా తగ్గించారు.. అది అనారోగ్య లక్షణమేమో’ అని అన్నాడు. ఆయనకేం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడని నేను చెప్పి పంపా’’ అని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఇలా యద్భావం తద్భవతే అన్న తరహాలో నేతలు ఆలోచించొద్దంటూ చమత్కరించారు. అధిష్టానాన్ని ఒప్పించిన నేత: కేసీఆర్ సుదీర్ఘకాలం కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్‌రావు పాత్ర అమోఘమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొనియాడారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవటంలో కృషి చేసిన వారిలో ఆయన కూడా ఒకరని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ నేత మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ కావటం అభినందనీయమని, ఆయనను సత్కరిస్తే తెలంగాణ తనకు తాను సత్కరించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. కరెంటు విషయంలో చర్చించేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా విద్యాసాగరరావు తనకు సహకరించారని, ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించేలా చొరవచూపుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజకీయాల్లో జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్న విద్యాసాగరరావు నేటి తరం నేతలకు ఆదర్శప్రాయుడని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఘనంగా రన్ ఫర్ యూనిటీ
సాక్షి, ముంబై: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్కవారం ఉదయం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ‘రన్ ఫర్ యూనిటీ’ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుంచి ప్రారంభమై మెరైన్ డ్రైవ్‌లోని పార్శీ జింఖానా వద్ద ముగిసింది. రెండు కి.మీ.మేర సాగిన ఈ కార్యక్రమంలో బజ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రావ్‌సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబరు 31వ తేదీని ‘రాష్టీయ ఏక్తా దివస్’ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా గవర్నర్ దేశ ఐక్యతను, శాంతి, భద్రతలను కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని కార్యక్రమానికి హాజరైన వారిచేత ప్రమాణం చేయించారు. అలాగే ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికి చేరవేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. -
దళితుల హత్యపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశం సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలోని జావ్‌ఖేడ గ్రామంలో ఇటీవల ముగ్గురు దళితులు హత్యకు గురైన ఘటనపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శనివారం రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ దయాల్‌ను ఆదేశించారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. ఈ విషయమై గవర్నర్ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే ఈ అంశమై రాజ్‌భవన్‌లో ఆర్పీఐ (ఏ) డెలిగేషన్ నాయకులతో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇలాంటి సంఘటనలను మున్ముందు సహించేది లేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3.75 లక్షల నష్టపరిహారం చెల్లించాలని గవర్నర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల విషయమై త్వరలోనే విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఇదిలా వుండగా ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు శనివారం గవర్నర్‌ను కలిసి దళితుల హత్యపై సీఐడీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చోటుచేసుకొని దాదాపు నాలుగు రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టులు చేయలేదని ఆరోపించారు. ముగ్గురు దళితులు (సంజయ్ జాధవ్, జయశ్రీ జాధవ్, సునీల్ జాధవ్)లను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆఠవలే డిమాండ్ చేశారు. అహ్మద్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం ఇది దళితులపై జరిగిన నాలుగవ అతి పెద్ద ఘటనగా రాందాస్ పేర్కొన్నారు. అహ్మద్‌నగర్ జిల్లాను ఎట్రాసిటీ-ప్రోన్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబానికి రూ.15 లక్షల నష్ట పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
విద్యాసాగరరావుకు బీజేపీ సన్మానం
-
మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తారా?
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుండీ పెట్టడం సరికాదని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తామనడం అవమానకరమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విరాళాల కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ వద్ద, సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో హుండీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలొద్దనే పొత్తు’
హైదరాబాద్: కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణలో తాము పొత్తుకు సిద్ధపడ్డామని బీజేపీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగరరావు వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని కావద్దన్న ఉద్దేశంతో అవకాశవాద పార్టీలు, మతతత్వ పార్టీలు తీవ్రంగా కుట్రపన్నుతున్నాయని, ఈ దిశలో ఆయన ప్రధాని అయ్యేందుకు వీలుగా ఈ పొత్తులు ఉపయోగపడతాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తె లుగుదేశం పార్టీతో తమ అధినాయకత్వం పొత్తుల అంశంపై చ ర్చిస్తోందని, అది రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరే ప్రాథమిక సూత్రం పొత్తులవద్ద పనిచేస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
బిల్లు పెడితే అండగా ఉంటాం: విద్యాసాగరరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు విషయంలో సీఎం కిరణ్ కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో వ్యవహరించినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు ప్రశ్నించారు. శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు బీజేపీపై అనుమానాలు వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో బిల్లును పార్లమెంట్లో పెడితే బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
'రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం'
హుస్నాబాద్: తెలంగాణ భూములు.. నీళ్లపై గవర్నర్, సీమాంధ్రుల పెత్తనం వద్దని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని భూములపై గవర్నర్‌కు అధికారం ఇవ్వాలని కొందరు కోరుతున్నారని, సీమాంధ్రులు అక్రమించుకున్న భూములు చట్టపరంగా పేదలకు పంపిణీ జరగాలంటే ఎవరి పెత్తనమూ ఉండవద్దని అన్నారు. తెలంగాణపై ఇతరులు పెత్తనం చెలాయిస్తే ఉద్యమాలు, త్యాగాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు అమరుల త్యాగాలను అవమానపరచడమేనని అన్నారు. 1948 నుంచి భూములపై అంక్షలు ఉన్నా సీమాంధ్రులు వాటిని ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 85 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు సామాజికన్యాయం జరగాలంటే ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పడాలన్నారు. రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఇవ్వాలన్నారు. సీమాంధ్ర డిపాజిట్లను బ్యాంకుల్లో భద్రపరుచుకుని తెలంగాణపై జాయింట్ చెక్‌పవర్ కావాలంటున్నారని ఆయన విమర్శించారు. -
ఉండవల్లి, కిరణ్‌వి పచ్చి అబద్ధాలు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీఎం కిరణ్ అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగరరావు ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములుకు, ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేద ని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చెప్పారు. పొట్టి శ్రీరాములు మరణించే నాటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదని.. పొట్టి శ్రీరాములు, సర్దార్ పటేల్ రాష్ట్రాన్ని ఎలా సమైక్యంగా ఉంచారో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణ విలీనం కోసం 1953 ఏప్రిల్ 11న అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం వీగిపోయిన విషయం తెలిసి కూడా వారిద్ద రూ అబద్ధాలు చెబుతున్నారని, దానిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని విద్యాసాగర్‌రావు చెప్పారు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నారు. ఉండవల్లి, కిరణ్ రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారని, వారి తీరు చూస్తోం టే కొత్త రాజ్యాంగాన్నే రాసేట్టుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాగా.. గుజరాత్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి దేశంలోని 6 లక్షల 50 వేల గ్రామాల నుంచి మట్టి, పాత ఇనుమును సేకరిస్తున్నట్టు వివరించారు. అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల ఫోటోలను కూడా విగ్రహ ప్రాంగణంలో పెడతారని చెప్పారు. డిసెంబర్ 15న దేశవ్యాప్తంగా ఏక్తా రన్ (సమైక్యతా పరుగు)ను నిర్వహిస్తున్నామని, దానిని ఆ రోజు ఉదయం 8 గంటలకు గుజరాత్ సీఎం మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. -
టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదు: బీజేపీ
రామచంద్రాపురం: తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, కావాలనే కొందరు బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్కు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాము టీడీపీతో పొత్తు పెట్టుకోలేదని, పెట్టుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోల్పోతున్నట్టుగా ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి సరైన చిత్తశుద్ధిలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవ్వరూ అడ్డుకోలేరని, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించిందన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేవరకు నమ్మకం లేదన్నారు. -
తెలంగాణను అడ్డుకునే కుట్ర: విద్యాసాగర్‌రావు
కరీంనగర్, న్యూస్‌లైన్: సీమాంధ్ర పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో వేలాది మంది ఆత్మబలిదానాలు చేశారని, తొమ్మిదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు అందరూ తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయాలు వెల్లడించారని చెప్పారు. పాలక, ప్రతిపక్షాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రచార సాధనాలు చేస్తున్న హడావుడితో తెలంగాణ ప్రజల్లో ఆందోళనలు నెలకొనే ప్రమాదముందని, విపరీత ప్రచారాలు నిలిపివేయాలని కోరారు.