
’గోవుల రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’
గోవుల రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్‌రావు సూచించారు.
హైదరాబాద్ : గోవులను సంరక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి ఉండేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్‌రావు సూచించారు. లవ్ ఫర్ కవ్ పౌండేషన్, ప్రాణిమిత్ర రమేష్‌జాగిర్ధార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి గోవుల సంరక్షణ కోసం చట్టాలు పటిష్టం చేయాలని గవర్నర్‌కు విన్నవించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి రిధేష్‌జాగిర్ధార్ మాట్లాడుతూ....గోవుల సంరక్షణ కోసం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశంలోని మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రులను, గవర్నర్‌లను కలిసి వారికి గోవుల ప్రాధాన్యం, రక్షణ, సంక్షేమం కోసం విన్నవిస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రజాప్రతినిధి సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో గోమాతను పెంచుకుని వాటికి నిత్యపూజలు, నైవేధ్యాలు సమర్పిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.