భావి తరాలకు చరిత్ర తెలియాలి | Pan India film Razakar First look launch by Former Maharashtra Governor Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

భావి తరాలకు చరిత్ర తెలియాలి

Published Sun, Jul 16 2023 4:41 AM | Last Updated on Sun, Jul 16 2023 4:41 AM

Pan India film Razakar First look launch by Former Maharashtra Governor Vidyasagar Rao - Sakshi

విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, విద్యాసాగర్‌రావు, బండి సంజయ్‌

బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో యాటా సత్యానారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకర్‌’. ఈ సినిమా ΄ోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంగా ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటిష్‌ ప్రభుత్వం చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

అతనికి బలంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్స్‌ సైన్యంగా ఏర్పడి, ఆకృత్యాలు చేశారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఇలాంటి చరిత్రతో రూ΄÷ందిన ‘రజాకర్‌’ చిత్రాన్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు. ‘‘ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్‌కు వచ్చింది సెప్టెంబరు 17న. ఈ చరిత్ర తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు బండి సంజయ్‌. ‘‘రజాకార్‌’ సినిమా చూడక΄ోతే మన బతుక్కే అర్థం లేదు’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘తెలంగాణవాదిగా నా హక్కుగా, భారతీయుడిగా భావించి ఈ సినిమా చేశాను’’ అన్నారు నారాయణ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement