former governor
-
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్‌రాం మేఘ్వాల్: రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్‌కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
చెన్నై సౌత్ బరిలో తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను చెన్నై సౌత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. -
మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై
సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు. గవర్నర్‌గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు. -
Raghuram Rajan: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్ ఎకానమీ ప్రస్తుతం ఉద్యోగాల కల్పనలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న సమస్యల్లో ఉద్యోగాల కల్పన ప్రధానమైందని ఆయన అన్నారు. నైపుణ్యాల పెంపు ద్వారా మానవ వనరుల అభివృద్ధి తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా రాజన్ పనిచేస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ లాంబా, తాను (రాజన్) సంయుక్తంగా రాసిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ అనే పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ భారత్ ఎకానమీ గురించి కీలక విశ్లేషణ చేశారు. ‘‘భారత్ ప్రస్తుతం ఒక క్రాస్ రోడ్ వద్ద ఉంది‘ అన్న ముగింపు అభిప్రాయంతో ముగిసిన పుస్తకం గురించి వివరించిన సందర్భంగా రాజన్ ఏమన్నారంటే... ► భారతదేశం అతిగొప్ప బలం 140 కోట్ల జనాభా. అయితే ఈ జనాభాకు సంబంధించి ‘మూలధనం’ ఎలా బలోపేతం చేయాలన్నది ప్రశ్న. దేశం అభివృద్ధి పథంలో పయనించే ప్రతి స్థాయిలో ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. ► ప్రైవేట్ రంగ ఉద్యోగాల విషయంలో ‘రిజర్వేషన్ల’ ఆందోళనలు ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు తమ నివాసితులకు మాత్రమే ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ప్రయతి్నస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన ధోరణి. ఇలాంటి ధోరణి పోవాలి. దీనివల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశం మొత్తం విస్తరించడానికి వీలవుతుంది. ► గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ కలి్పస్తే రాబోయే ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో దేశంలో భారీ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పించడానికి 10 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ► భారత్ మానవ ‘మూలధనాన్ని’ మెరుగుపరుచుకుంటే... అవసరమైన ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి. శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరుస్తే, కంపెనీలు భారతదేశానికి వస్తాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు లభించడం లేదని కంపెనీలు తరచూ చెబుతుండడాన్ని మనం గమనిస్తున్నాం. ► సామాన్యునికి సైతం సైవలు అందేలా పాలనా సంస్కరణలు జరగాలి. ప్రత్యేకించి పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి సారించాలి. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మదింపు సరిగా జరగాలి. భారత్ తన బలహీనతలపై కాకుండా బలాలపై ఆధారపడిన మార్గాన్ని ఆవిష్కరించాలి. -
ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత: పలువురి సంతాపం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ (92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అద్భుతమైన వ్యక్తిత్వం , ప్రజా సేవకుడు, సంక్షోభ సమయాల్లో అపారమైన సహకారాన్ని అందించిన వెంకటరమణన్ మరణం విచారకరం అంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతాపం వెలిబుచ్చారు. ఆత్మకు శాశ్వత శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు. ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేశారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి , ఇంధనానికి కూడా ప్రధాన కృషి చేసారనీ. 60వ దశకం మధ్యలో హరిత విప్లవానికి నాంది పలకడంలో కీలక పాత్ర పోషించిన సి.సుబ్రమణ్యంకు కీలక సహాయకుడిగా పనిచేశారన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు అనుబంధం ఉంది, చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చాలా నేర్చుకున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. Very sad to hear about the demise of Shri S.Venkitaramanan, former Governor of the RBI. He was an outstanding personality and public servant. Made immense contribution during periods of crisis. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) November 18, 2023 కాగా వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్ లో జన్మించారు. తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1953లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరారు. 1968లో, అమెరికా కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్లో మరొక మాస్టర్స్ డిగ్రీని చేశారు. 1990 - 1992 వరకు ఆర్బీఐ 18వ గవర్నర్‌గా పనిచేశారు.1985 నుండి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టక ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. వెంకటరమణన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు (గిరిజా వైద్యనాథన్, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి , సుధా వైద్యనాథన్.) ఉన్నారు. One of India's most brilliant civil servants who left his mark, especially in the field of finance, has just passed away in Chennai at the age of 92. S. Venkitaramanan was RBI Governor at a most crucial time of our economic history during 1990-92. Apart from this he made major… — Jairam Ramesh (@Jairam_Ramesh) November 18, 2023 -
భావి తరాలకు చరిత్ర తెలియాలి
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో యాటా సత్యానారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకర్’. ఈ సినిమా ΄ోస్టర్ లాంచ్ ఈవెంట్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంగా ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బలంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్స్ సైన్యంగా ఏర్పడి, ఆకృత్యాలు చేశారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఇలాంటి చరిత్రతో రూ΄÷ందిన ‘రజాకర్’ చిత్రాన్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు. ‘‘ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్‌కు వచ్చింది సెప్టెంబరు 17న. ఈ చరిత్ర తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్. ‘‘రజాకార్’ సినిమా చూడక΄ోతే మన బతుక్కే అర్థం లేదు’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘తెలంగాణవాదిగా నా హక్కుగా, భారతీయుడిగా భావించి ఈ సినిమా చేశాను’’ అన్నారు నారాయణ రెడ్డి. -
ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా! మహారాష్ట్ర మాజీ గవర్నర్
మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్ 80 ఏళ్ల భగత్ సింగ్ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్‌కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. (చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు) -
బీజేపీలోకి సి.రాజగోపాలచారి ముని మనవడు
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ అయిన సి.రాజగోపాలాచారి ముని మనవడు సీఆర్ కేశవన్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణభారతంలో మరింతగా పుంజుకునేందుకు కృషిచేస్తున్న పార్టీలోకి నేతలు చేరుతుండటం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బలూనీల నేతృత్వంలో ఆయన బీజేపీలో చేరారు. ‘ ప్రజామోదంతో పాలిస్తూ అవినీతిరహిత, సమ్మిళ ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోదీపై గౌరవంతో పార్టీలో చేరాను’ అని బీజేపీలోకి వచ్చిన సందర్భంగా కేశవన్ వ్యాఖ్యానించాను. తమిళనాడుకు చెందిన కేశవన్ తొలినాళ్లలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వీకేసింగ్ పరోక్షంగా విమర్శించారు. ‘ సి.రాజగోపాలాచారి దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక ఆయన చేసిన త్యాగాలు మరుగునపడేలా, చరిత్ర గర్భంలో కలిసిపోయేలా కొందరు కుట్ర పన్నారు. దేశం కోసం తాము మాత్రమే కష్టపడ్డామని కేవలం ‘ఒక్క కుటుంబం’ మాత్రం ప్రకటించుకుంది’ అంటూ గాంధీల కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో కేశవన్ బీజేపీ వాణిని గట్టిగా వినిపిస్తారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. -
రేటు పెంపు కొనసాగించక తప్పదు
కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సమర్‌కాంతి పాల్ స్మారక ప్రసంగంలో రంగరాజన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే. ► ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా. ► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి. ► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి. ► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే. ► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం మంచిదే, కానీ... శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయడ్డారు. -
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ కన్నుమూత
న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలియజేసింది. జనరల్ రోడ్రిగ్స్ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు ఇక లేరు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలను చుట్టుముట్టేస్తోంది. రాజకీయ, సినీ, ఆర్థిక ..ఇలా అన్ని రంగాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్, భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు ఎం. నరసింహం(94) కరోనాతో కన్నుమూశారు. దీంతో పలువురు ఆర్థిక రంగ నిపుణులు, పరిశ్రమ పెద్దలు నరసింహం మృతిపై సంతాపం ప్రకటించారు. కోవిడ్ సంబంధిత అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించినట్లు ఆర్బిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ కేడర్ నుండి నియమించబడిన తొలి, ఇప్పటివరకు ఉన్న ఏకైక ఆర్బీఐ గవర్నర్ నరసింహం. 1977 మే - నవంబర్ మధ్య ఏడు నెలల స్వల్ప కాలపరిమితిలో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ప్రపంచ బ్యాంకులో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, తరువాత ఐఎంఎఫ్‌లో కూడా తన ప్రతిభను చాటారు. 1991 లో ఆర్థిక వ్యవస్థ కమిటీ, బ్యాంకింగ్ రంగ సంస్కరణల కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా నరసింహం పనిచేశారు. నరసింహం నేతృత్వంలోని రెండు కమిటీలు (నరంసింహం కమిటీలు 1991, 1997) ఆధునిక బ్యాంకింగ్ పరిశ్రమ, భారతదేశ బ్యాంకింగ్ రంగంపై విమర్శనాత్మక ప్రభావాన్ని చూపాయి. ఈ కమిటీల కొన్ని ముఖ్య సిఫారసులు బ్యాంకింగ్ రంగ స్వయంప్రతిపత్తికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ పాత్రను సంస్కరించడం లాంటి కీలక సంస్కరణలకు నాంది పలికాయి. ఈ నేపథ్యంలోనే నరసింహంను భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడిగా భావిస్తారు. చదవండి : Apple Event 2021: ఆపిల్ లవర్స్ ఎదురుచూపులు కోవిడ్ వారియర్స్‌కు భారీ ఊరట -
మాజీ గవర్నర్ కన్నుమూత
బెంగళూరు: జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన జస్టిస్ రమా జోయిస్ (89) కన్నుమూశారు. బెంగళూరులో అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆయన మృతికి ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్రమంతులు, కర్నాటక ముఖ్యమంత్రి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కన్నా ముందు రమా జోయిస్ న్యాయమూర్తిగా, చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. పంజాబ్, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఆయన సేవలను గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు గవర్నర్ బాధ్యతలు అప్పగించింది. 1932 జూలై 27వ తేదీన కర్నాటకలోని శివమొగ్గలో రమా జోయిస్ జన్మించారు. 1959లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. అంచలంచెలుగా ఎదుగుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వర్తించారు. చాలా రచనలు చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పదిలపర్చేందుకు కృషి చేశారు. In the demise of Justice Rama Jois, the nation has lost a noted jurist who made rich contribution in the courts, Parliament and administration. A fierce opponent of the Emergency, he was a renowned writer and authority on Indian jurisprudence. Condolences to his family & friends. — President of India (@rashtrapatibhvn) February 16, 2021 అత్యవసర పరిస్థితి కాలంలో రమా జోయిస్ అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి జైల్లో ఉన్నారు. ఆ పరిచయం కొనసాగింది. పదవీ విరమణ అనంతరం 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం రమా జోయిస్ను గవర్నర్‌గా నియమించింది. జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు అతి కొద్దికాలం మాత్రమే గవర్నర్‌గా కొనసాగారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన రాసిన ఎన్నో రచనలు భావి న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆయన మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను కీర్తించారు. Justice (Retd.) M. Rama Jois was a towering intellectual and jurist. He was admired for his rich intellect and contributions towards making India’s democratic fabric stronger. Saddened by his demise. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti. — Narendra Modi (@narendramodi) February 16, 2021 -
బీజేపీలోకి ఏపీ మాజీ గవర్నర్?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసి, అత్యంత అవమానకరమైన పరిస్థితుల మధ్య ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎన్డీ తివారీ.. ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన తివారీ, తన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవడం కోసమే బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన తన కుమారుడు రోహిత్ తివారీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు. ఎలాగైనా అతడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సముచిత స్థానం కల్పించాలన్నది వృద్ధ తివారీ ఆశ. కానీ, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం రోహిత్ తివారీకి టికెట్ ఇవ్వడానికి ససేమిరా అందని, దాంతో ఆయన బీజేపీ వైపు దృష్టిపెట్టారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాకపోయినా, ఉత్తరాఖండ్‌లో అయినా తన కొడుక్కి ఓ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించలేదు. దాంతో ఒక అవకాశం ఉంటుందని తివారీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ అయినా ఆయనను ఆదరిస్తుందా.. లేదా అన్న విషయం ఇంకా తెలియట్లేదు.