
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా ఇదే చెప్పారు అని అన్నారు.
కాగా, సీహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండో రాజధానిపై పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలి. బంగారు తెలంగాణ ఆకాంక్షకు రెండో రాజధాని తోడ్పడుతుంది. భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని.. రాజ్యాంగంలో కూడా ఈ అంశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, బేగంపేట్, రాజ్‌భవన్ రూట్లలో..
Comments
Please login to add a commentAdd a comment