సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ నెలకొంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరో వైపు, మ్యాచ్‌ను అడ్డుకుంటామంటూ వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో స్టేడియం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు.
ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.
ఇదీ చదవండి: ఉప్పల్‌లో గెలుపెవరిదో!
వరంగల్ వైపు నుంచి ఎల్‌బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment